5 మంది ఫీల్డ్ అసిస్టెంట్లపై వేటు | field assistance removed due to irregularities in Employment Guarantee Scheme | Sakshi
Sakshi News home page

5 మంది ఫీల్డ్ అసిస్టెంట్లపై వేటు

Published Fri, Sep 26 2014 12:07 AM | Last Updated on Tue, Oct 2 2018 6:35 PM

field assistance removed due to irregularities in Employment Guarantee Scheme

తాండూరు రూరల్: ఉపాధి హామీ పథకంలో సిబ్బంది అవకతవకలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. గురువారం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో 7వ సామాజిక తనిఖీ బహిరంగ సభ జరిగింది. కార్యక్రమానికి డ్వామా జిల్లా అడిషనల్ పీడీ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా విజిలెన్స్ అధికారి రమేష్‌గుప్తాలు హాజరయ్యారు. ఉపాధి సిబ్బంది అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు నిర్ధారించారు. రూ.31,515ను రికవరీ చేస్తామని వారు చెప్పారు.

 5 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగింపు.. 

బినామీ పేర్లు సృష్టించి రూ.15 వేలు స్వాహా చేయడంతో చెన్‌గేస్‌పూర్ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ కతలప్పను తొలగించామని అధికారులు చెప్పారు.

చెంగోల్ గ్రామంలో రూ. 6 వేలు కాజేసిన ఫీల్డ్ అసిస్టెంట్ ఎల్లమ్మను తొలగించారు.  

ఒక్క దగ్గర పనిచేయాల్సి ఉండగా మరో దగ్గర కూలీలతో పని చేయించడంతో జినుగుర్తి ఫీల్డ్ అసిస్టెంట్ అనంతయ్య అధికారులు విధుల నుంచి విధుల నుంచి తొలగించారు. 

అల్లాపూర్‌లో పాత మరుగుదొడ్ల పేరు మీద డబ్బులు డ్రా చేసుకోవడంతో ఫీల్డ్ అసిస్టెంట్ గోపాల్‌పై వేటు పడింది.

 ఉద్దాండపూర్‌లో బినామీ పేర్లు సృష్టించి నిధులు స్వాహా చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ బసప్పను తొలగించినట్లు అధికారులు చెప్పారు. అనంతరం అడిషనల్ పీడీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ...సామాజిక తనిఖీల్లో అవకతవకలకు పాల్పడిన సిబ్బందిపై చర్యలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జగన్మోహన్‌రావు, వైస్ ఎంపీపీ శేఖర్, ఏపీఓ శారద, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement