ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్‌పై ‘దేశం’ నేతల దాడి | Employment Field Assistants 'country' leaders attacked | Sakshi
Sakshi News home page

ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్‌పై ‘దేశం’ నేతల దాడి

Published Sun, Nov 20 2016 1:35 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM

ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్‌పై ‘దేశం’ నేతల దాడి - Sakshi

ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్‌పై ‘దేశం’ నేతల దాడి

దాడిలో కానిస్టేబుల్ కూడా..
అడ్డుకున్న వారిపై దుర్భాషలు
ఫిర్యాదు చేసిన ఫీల్డ్ అసిస్టెంట్  

 
లావేరు : ఉపాధి హామీ పథకంలో కొత్తకోట పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న రొక్కం అనిల్‌కుమార్‌పై అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు మేడబోరుున శ్రీరాంమూర్తి, రొక్కం సాంబమూర్తి, మేడబోరుున సంపత్‌కుమార్, టీడీపీ నేత కుమారుడైన పోలీస్ కానిస్టేబుల్ రొక్కం దినేష్‌కుమార్ శుక్రవారం దాడి చేసి గాయపరిచారు. అడ్డుకున్న కూలీలను దుర్భాషలాడారు. దీంతో అనిల్‌కుమార్ తనపై దాడి చేసిన వారిపై ఎస్‌ఐ రామారావుకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి కూలీలు తెలిపిన వివరాలు... కొత్తకోట గ్రామంలో అక్కురోడ్డు నుంచి లచ్చిరాజు చెరువు వరకు కొత్తగా మట్టి రోడ్డు  వేయడం కోసం 2015-16లో పంచాయతీ తీర్మానం చేస్తూ ఉపాధి నిధులు మంజూరు చేశారు.

అప్పట్లో పనులు కొంత మేరకు చేసి మధ్యలో నిలిపివేశారు. గ్రామానికి చెందిన ఎస్సీ ఉపాధి కూలీలు తమ వంద రోజుల పని దినాలు పూర్తి కాకపోవడంతో ఉపాధి పనులు కల్పించాలని ఇటీవల ఉపాధి అధికారులను కోరారు.దీంతో ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్‌కుమార్ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆ కూలీలతో  నిలిచిన పనులను గురువారం తిరిగి చేపట్టారు. శుక్రవారం కూడా పనులు చేసేందుకు వెళ్లగా గ్రామానికి చెందిన తెలుగుదేశం నేతలు మేడబోరుున శ్రీరాంమూర్తి, రొక్కం సాంబమూర్తి, మేడబోరుున సంపత్‌కుమార్, సాంబమూర్తి కుమారుడు అరుున హైదరాబాద్‌లో  కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రొక్కం దినేష్‌కుమార్ పనులు వద్దకు వచ్చి జిరారుుతీ భూముల్లో రోడ్డు వేస్తున్నారని పనులు నిలుపుదల చేయాలని కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్‌తో  వాగ్వివాదానికి దిగారు. జిరారుుతీ భూముల్లో పనులు చేయడం లేదని పీల్డ్ అసిస్టెంట్ చెప్పినా వారు వినిపించుకోలేదు.

దీంతో పనులను నిలుపుదల చేసి ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్‌కుమార్ కూలీల వద్ద మస్టర్లు వివరాలు నమోదు చేసుకుంటుండగా కానిస్టేబుల్ దినేష్‌కుమార్  తొలుత వచ్చి ఫీల్డ్ అసిస్టెంట్ కడుపులో కాలితో తన్నాడు. తరువాత మిగతా ముగ్గురు  నాయకులు అతనిపై దాడికి పాల్పడి కొట్టారు. వెంటనే అక్కడ ఉన్న కూలీలు  అడ్డుకోగా వారిని కానిస్టేబుల్, టీడీపీ నాయకులు తిడుతూ నానా దుర్భాషలాడారు. విషయం కొత్తకోటలో ఉన్న  ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబ సభ్యులుకు, వైఎస్సార్ సీపీ సాంసృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు రొక్కం బాలక్రిష్ణలకు తెలియడంతో వారు తన అనూయులతో ఘటనా స్థలానికి వచ్చారు. దీంతో తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీ నేతల మధ్య కొంతసేపు ఘర్షణ నెలకొంది.

ఎస్‌ఐకు ఫిర్యాదు
పీల్డ్ అసిస్టెంట్‌పై దాడి జరిగిన విషయం తెలుసుకొని లావేరు ఎస్‌ఐ సీహెచ్ రామారావు, హెచ్‌సీ రాంబాబు, ఉపాధి హామీ పథకం లావేరు మండల ఏపీవో శ్రీనివాసులనాయుడు, టీఏ రవి కొత్తకోట గ్రామానికి వెళ్లారు. కానిస్టేబుల్, టీడీపీ నాయకులు  చేసిన దాడి గురించి ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్‌కుమార్‌తో పాటు ఎస్సీ కూలీలు టి దుర్గాభవానీ, యాగాటి రమణమ్మ, చిన్నమ్మడు, లింగాల లక్ష్మి, కె.బోడమ్మలు పాటు పలువురు  ఎస్‌ఐ రామరావుకు వివరించారు. దాడికి పాల్పడిన టీడీపీ నాయకులకు చెందిన జిరారుుతీ భూములు లేవని, సంబంధం లేకపోరుునా టీడీపీ నాయకులు, కానిస్టేబుల్ జోక్యం చేసుకున్నారని ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పారు.  దాడికి పాల్పడిన కానిస్టేబుల్‌పై, టీడీపీ నాయకులపైన చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement