మట్కా నిర్వాహకులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి సూచించారు.
తాండూరు రూరల్ (రంగారెడ్డి) : మట్కా నిర్వాహకులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి సూచించారు. ఆమె శనివారం మధ్యాహ్నం తాండూరు సర్కిల్ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశమయ్యారు.
శుక్రవారం రాత్రి తాండూరులో పోలీసులు అరెస్టు చేసిన ఐదుగురిపై కేసులు పెట్టి, రిమాండ్‌కు తరలించాలని సూచించారు. అలాగే కాగ్నా నది నుంచి ఇసుక పర్మిట్లు మండల పరిషత్ అధికారులు జారీ చేస్తున్నందున పర్యవేక్షణ బాధ్యతలు కూడా వారే చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు. పర్మిట్లు దుర్వినియోగం కాకుండా చూసుకునే పని వారిదేనని ఎస్పీ అన్నారు.