భూమి విషయంలో కుటుంబసభ్యులతో జరిగిన వివాదంతో మనస్తాపానికి గురైన వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
తాండూరు (రంగారెడ్డి) : భూమి విషయంలో కుటుంబసభ్యులతో జరిగిన వివాదంతో మనస్తాపానికి గురైన వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో ఆమెతో పాటు మంచం మీద నిద్రిస్తున్న ఎనిమిది నెలల చిన్నారికి కూడా గాయాలు కావడంతో.. ఇద్దరూ మృతిచెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా తాండూరు మండలం అంతారం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన చుక్కమ్మ(28) ఇంట్లో గత రెండు రోజులుగా భూమి విషయమై అన్నదమ్ముల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపానాకి గురైన చుక్కమ్మ గదిలోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఒక్కసారిగా అంటుకున్న మంటలు మంచం మీద ఉన్న చిన్నారికి కూడా వ్యాపించడంతో తల్లీబిడ్డలు ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.