BRS MLA Pilot Rohith Reddy Controversy Video Viral - Sakshi
Sakshi News home page

వీడియో: కేజీఎఫ్‌ స్టైల్‌లో వీడియో: వివాదంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

Published Thu, Jul 13 2023 7:45 PM | Last Updated on Thu, Jul 13 2023 8:02 PM

BRS MLA Pilot Rohith Reddy Controversy Video Viral - Sakshi

సాక్షి, తాండూరు: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక, ఈ వ్యవహారంలో తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి కూడా ఉన్నారు. ఈ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి కీలకంగా మారడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు వై కేటగిరి సెక్యూరిటీని కల్పించింది. అయితే, రోహిత్‌ రెడ్డి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో​ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. తాండూరు  ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తనకు కేటాయించిన సెక్యూరిటీతో ఫొటో షూట్ చేయటం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. తన గన్‌మెన్‌లు, వై.సెక్యురిటీ సిబ్బందితో రోహిత్ రెడ్డి చేసిన వీడియో షూట్స్ సోషల్ మీడియాలో వైరల్‌ మారాయి. ఈ వీడియోలో ముందుగా రోహిత్ రెడ్డి కాషాయ వస్త్రాలు ధరించి నడుచుకుంటూ వస్తుండగా.. ఆయన వెనక నుంచి సెక్యూరిటీ సిబ్బంది ఒక్కొక్కరుగా బయటకు  వస్తుంటారు. బ్యాగ్రౌండ్‌లో  మ్యూజిక్ ప్లే అవుతుంది. ఈ క్రమంలో రెండు వైపులా సెక్యూరిటీ సిబ్బంది నడుస్తుండగా.. మధ్యలో రోహిత్ రెడ్డి నడుచుంటూ వస్తుంటారు. ఇక, ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇది కూడా చదవండి: అక్కడ వందల కోట్ల స్కాం జరిగింది: ఎంపీ అరవింద్‌ సంచలన కామెంట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement