సిద్దిపేట జిల్లా గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే(Household Survey) ఇంటికే పరిమితమైందని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar). కేసీఆర్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు బయటకు వెల్లడించలేదన్న పొన్నం.. బీఆర్‌ఎస్ పార్టీ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు ాకార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో ాపాల్గొన్నారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే(Caste Census Survey)లో కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులు పాల్గొనలేదు. వీళ్లకు కులగణన గురించి, బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు, కులగణన సర్వే చేపట్టాలి. మా సర్వేలో బీసీల లెక్క తేలింది.. మా ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుంది. బీఆర్ఎస్, బీజేపీలు అనవసరమైన విమర్శలు మానుకొని బీసీలకు న్యాయం చేసేందుకు సహకరించాలి.సర్వేపై ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తాం’ అని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment