సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం ఎదుట దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై అనవసర రాజకీయాలకు తెరలేపొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. రాజీవ్ గాంధీ విగ్రహంపై పిచ్చి ప్రేరాపనలు చెయ్యద్దని మండిపడ్డారు. విగ్రహాన్ని కూల్చుతాం పేల్చుతాం అంటే ఎవరు చూసుకుంటూ కూర్చోరని పేర్కొన్నారు.
అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండదని, దమ్ముంటే రాజీవ్ గాంధీ విగ్రహం పై చేయి వేసి చూడాలని సవాల్ విసిరారు. నేటి సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను, తెలంగాణ తల్లిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అవమానించదు.. అవమానించలేదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. తమకు తెలంగాణ తల్లిపై అభిమానం ఉంది కాబట్టే.. సెక్రటేరియట్ లోపల విగ్రహాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. బీఆర్‌కు చేతనైతే తమకంటే మంచి పనులు చేయాలని సూచించారు. 18 సంవత్సరాలకు యువతకు ఓటు హక్కును కల్పించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని తెలిపారు.
కాగా తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాం ఏర్పాటుపై రాజీకాయ రగడ నెలకొంది. విగ్రహావిష్కరణపై కాంగ్రెస్, బీఆర్ మధ్య మాటల యుద్దం నడుతస్తోంది. సచివాలయం ఎదుట తాము తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని భావించామని, అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఏంటని మండిపడుతోంది. అంతేగాక బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని తెలిపింది. బీఆర్‌ఎస్ ప్రకటనపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. దమ్ముంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసి చూడాలని, ఏం జరుగుతోందో చుద్దాం అంటూ సవాల్ విసురుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment