Rajeev gandhi statue
-
రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య రాజకీయ రగడ
-
టచ్ చేసి చూడు: పొన్నం సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం ఎదుట దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై అనవసర రాజకీయాలకు తెరలేపొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. రాజీవ్ గాంధీ విగ్రహంపై పిచ్చి ప్రేరాపనలు చెయ్యద్దని మండిపడ్డారు. విగ్రహాన్ని కూల్చుతాం పేల్చుతాం అంటే ఎవరు చూసుకుంటూ కూర్చోరని పేర్కొన్నారు. అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండదని, దమ్ముంటే రాజీవ్ గాంధీ విగ్రహం పై చేయి వేసి చూడాలని సవాల్ విసిరారు. నేటి సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను, తెలంగాణ తల్లిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అవమానించదు.. అవమానించలేదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. తమకు తెలంగాణ తల్లిపై అభిమానం ఉంది కాబట్టే.. సెక్రటేరియట్ లోపల విగ్రహాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. బీఆర్కు చేతనైతే తమకంటే మంచి పనులు చేయాలని సూచించారు. 18 సంవత్సరాలకు యువతకు ఓటు హక్కును కల్పించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని తెలిపారు.కాగా తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాం ఏర్పాటుపై రాజీకాయ రగడ నెలకొంది. విగ్రహావిష్కరణపై కాంగ్రెస్, బీఆర్ మధ్య మాటల యుద్దం నడుతస్తోంది. సచివాలయం ఎదుట తాము తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని భావించామని, అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఏంటని మండిపడుతోంది. అంతేగాక బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని తెలిపింది. బీఆర్ఎస్ ప్రకటనపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. దమ్ముంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసి చూడాలని, ఏం జరుగుతోందో చుద్దాం అంటూ సవాల్ విసురుతున్నారు. -
తెలంగాణ తల్లిని అవమానిస్తారా? కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ సర్కార్ తెలంగాణ తల్లిని ఆవమానిస్తోందని ధ్వజమెత్తారు .తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు.….తుచ్ఛమైన, స్వార్థ రాజకీయాలకు తెరతీస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఎ క్స్ వేదికగా స్పందిస్తూ..‘తెలంగాణ తల్లిని అవమానిస్తారా ?తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా ?తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారా ?తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా?తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా ?తెలంగాణ మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా ?తెలంగాణ అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా ?తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు.….తుచ్ఛమైన.. స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారా ?నాలుగు కోట్ల ప్రజల గుండెచప్పుడైన.. “తెలంగాణ తల్లి” విగ్రహం పెట్టాల్సిన చోట..“రాహుల్ గాంధీ తండ్రి” విగ్రహం పెడతారా.. ??తెలంగాణ కాంగ్రెస్ ను క్షమించదు..!జై తెలంగాణ’ అంటూ పేర్కొన్నారు. కాగా సచివాలయానికి ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని డిమాండ్ చేస్తుంది.తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్న ప్రదేశంలో ఎవరి విగ్రహాలు పెట్టినా ఊరుకునేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలోనే తేల్చిచెప్పారు. సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మృతి చిహ్నం పక్కన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని.. ఆ స్మృతి చిహ్నం ప్రారంభోత్సవ సభలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. అందుకోసం సచివాలయం ముందున్న సిగ్నల్ పాయింట్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చి రోడ్డును వెడల్పు వేసిందని పేర్కొన్నారు. ప్రజలు పండుగ సంబురాల్లో ఉండగా విగ్రహావిష్కరణకు పూనుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. -
వైఎస్ విగ్రహాన్ని ఎందుకు కూల్చలేదు?
కదిరి, న్యూస్‌లైన్ : రాజీవ్‌గాంధీ విగ్రహం కూల్చిన వాళ్లు అక్కడే ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఎందుకు కూల్చలేదని జిల్లా ఎస్పీ శ్యాంసుందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం అనంతపురం జిల్లా కదిరిలో విలేకరులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో శాంతియుతంగా సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తుంటే ఓ రాజకీయ పార్టీ నాయకులనే టార్గెట్ చేసి, వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా.. ‘అలాంటిదేమీ లేదు.. అక్కడ రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలను ధ్వంసం చేసిన వారు అక్కడే ఉన్న వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేయలేదు. దీన్నిబట్టి ఒక పార్టీకి చెందిన వారే ఇదంతా చేశారని ఎవరికైనా అనుమానం వస్తుంది.. దీనిపై మీరేమంటార’ంటూ ఎదురు ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానమే కదా.. అందుకే సోనియా కుటుంబ సభ్యుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారనుకోవచ్చు కదా అని విలేకరులు సమాధానమిచ్చారు. ఎస్కే యూనివర్శిటీ వద్ద విధి నిర్వహణలో ఉన్న ఓ దినపత్రిక విలేకరి అశోక్‌కుమార్‌పై లాఠీచార్జ్ చేయడం ఎంతవరకు సమంజసం? అదీ మీరే స్వయంగా దాడికి దిగడం సబబేనా? అన్న ప్రశ్నలకు.. ‘ఆ విలేకరి ఎస్కే యూనివర్శిటీలో విద్యనభ్యసిస్తున్నాడు. ఆయన విలేకరి అనే విషయం మాకు తెలియదని వివరణ ఇచ్చారు.