
సిద్దిపేట జిల్లా : సిద్ధిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 184 లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ‘ పేదల కోసం సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఎలా ఉన్నదో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఊళ్లలో కరెంట్ కష్టాలు మళ్లీ వచ్చాయి.
ప్రజలకు ఆశ చూపి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. పేద ప్రజల కోసం కేసీఆర్ ఎప్పుడూ ఆలోచించేవాడు. రేవంత్ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. సిద్ధిపేటకు రేవంత్ అన్యాయం చేస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు సిద్ధిపేట బాగా అభివృద్ధి చెందింది. మళ్లీ కేసీఆర్ రావాలి అని అందరూ అనుకుంటున్నారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది. అన్ని రంగాల్లో విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. సిద్ధిపేట అభివృద్ధి కోసం అసెంబ్లీలో కూడా కొట్లాడతా. కేసీఆర్ అన్ని ప్రాజెక్టులు నిర్మించాడు. బుద్ధి లేని ప్రభుత్వం రాష్ట్రాన్ని పరిపాలిస్తోంది’ అని హరీష్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment