ఎమ్మెల్యేల రహస్య భేటీ వాస్తవమే: మంత్రి పొన్నం | Minister Ponnam Prabhakar Respond On Congress MLA Secret Meeting | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేల రహస్య భేటీ వాస్తవమే: మంత్రి పొన్నం

Published Mon, Feb 3 2025 5:42 PM | Last Updated on Mon, Feb 3 2025 6:13 PM

Minister Ponnam Prabhakar Respond On Congress MLA Secret Meeting

హైదరాబాద్‌:   పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రహస్య భేటీపై మంత్రి పొన్నం ప్రభాకర్‌(Ponnam Prabhakar) స్పందించారు. ఎమ్మెల్యేల రహస్య భేటీ వాస్తవమేనని పొన్నం తెలిపారు.  హైదరాబాద్‌ కోహినూర్‌ హెటల్‌లో భేటీ జరిగిందన్నారు. అయితే ఎమ్మెల్యేలు సమావేశం అవ్వొద్దా అంటూ ప్రశ్నించారు మంత్రి  పొన్నం.  మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా ఎమ్మెల్యేల రహస్య భేటీపై తనదైన శైలిలో స్పందించారు పొన్నం. ఎవరి హక్కుల  కోసం వాళ్లు పోరాటాలు చేస్తారని, ఎమ్మెల్యేల భేటీ అనేది తమ పార్టీ అంతర్గత అంశమన్నారు  మంత్రి పొన్నం.

కాగా, రెండు రోజుల క్రితం కొంతమంది కాంగ్రెస్‌(Congress)ఎమ్మెల్యేలు  రహస్యంగా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓ కేబినెట్‌ మంత్రి వ్యవహరిస్తున్న తీరుపై వీరు అసంతృప్తిగా ఉన్నారనే చర్చ నడిచింది. ఈ నేపథ్యంలోనే భవిష్యత్‌ కార్యాచరణపై ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారనే వార్తలు వచ్చాయి,.

మరోవైపు.. సోషల్‌ మీడియాలో కాంగ్రెస్‌ నేతలు పెట్టిన పోల్‌ అంశం కూడా తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ట్విట్టర్‌ వేదికగా కాంగ్రెస్‌ పెట్టిన పోల్‌.. ప్రభుత్వానికి షాక్‌ ఇచ్చింది. 70 శాతం బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా, 30 శాతం కాంగ్రెస్‌కు ఫేవర్‌గా ఓట్లు పడ్డాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోల్‌ రావడం హస్తం నేతలకు మింగుడు పడటం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో కొందరు కాంగ్రెస్‌ నేతలు దిక్కులు చూస్తున్నారనే చర్చ సైతం నడుస్తోంది.

తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌పై  బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ విరుచుకుపడిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను నేను గంభీరంగా, మౌనంగా చూస్తున్నా.. నాకు కొడితే వట్టిగా కొట్టుడు అలవాటు లేదు. నాలుగు రోజులు కానీయ్‌ అన్నట్లు చూస్తున్నా. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. కాంగ్రెస్‌ మెడలు వంచి భవిష్యత్తు కోసం కొట్లాడాలి. అలాగే, ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులం మనమే. తెలంగాణ   హక్కుల కోసం తెగించి కొట్లాడాల్సిందే అని కామెంట్స్‌ చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దీంతో, హస్తం నేతలు బీఆర్‌ఎస్‌ పంచన చేరే అవకాశాలు సైతం ఉన్నట్టు వార్తలు చక్కర్లు  కొట్టాయి.  ప్రస్తుతానికి ఎమ్మెల్యే రహస్య భేటీని కాంగ్రెస్‌ పార్టీ తమ అంతర్గత అంశమని పైకి చెబుతున్నా.. లోలోపల  ామాత్రం ఆలోచనలో పడినట్లే కనిపిస్తోంది. మరి  కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రహస్య భేటీ   ఏ టర్న్‌ తీసుకుంటుందో అనేది వేచి చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement