సాక్షి, హైదరాబాద్: బండి సంజయ్(Bandi Sanjay) ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వడం లేదని.. ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా?.. ఎలా ఇవ్వరో తామూ చూస్తామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇందిరమ్మపై అవహేళనగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.
10 నెలల కాలంలో జీఎస్టీ రూపంలో రూ.37 వేల కోట్ల రూపాయలు కేంద్రం వసూలు చేసింది. మరి కేంద్రం తెలంగాణకు ఇచ్చింది ఎంత? అంటూ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. దీన్ దయాల్ అంత్యోదయ, దీన్ దయాల్ గృహ జ్యోతి లాంటి పేర్లు పథకాలకు ఎందుకు పెట్టారు?. వీల్లేమైనా దేశం కోసం ప్రాణ త్యాగం చేశారా?. తెలంగాణ నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు ఒక్క రూపాయన్న కేంద్రం నుంచి అదనంగా తెచ్చారా?’’ అంటూ పోన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: ప్రధాని ఫొటో పెడితేనే నిధులు..
కాగా, కేంద్రం ఇచ్చే నిధులతో అమలయ్యే పథకాలకు ప్రధాని ఫొటోను వాడకుంటే తామే లబ్దిదారులకు నేరుగా నిధులు ఇచ్చేలా ఆలోచన చేస్తామంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘‘కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర పథకాలకు మళ్లిస్తున్నాయి. గతంలో నేను నిలదీయడం వల్ల వరంగల్, కరీంనగర్ స్మార్ట్‌సిటీ నిధులను గత ప్రభుత్వం విడుదల చేసింది. ఇకపై కేంద్ర నిధులతో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు, అలాగే రేషన్‌కార్డులపై సీఎంతోపాటు ప్రధాని ఫొటో తప్పకుండా ఉండాల్సిందే. లేకపోతే ఆయా పథకాలకు నిధులు నిలిపివేస్తాం’ అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment