indiramma house
-
ఇందిరమ్మ ఇళ్ల యాప్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
-
సొంత జాగా.. రేషన్ కార్డూ ఉండాల్సిందే?
సాక్షి, హైదరాబాద్: సొంత జాగా ఉన్న వారికే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. రేషన్‌కార్డు కూడా ఉన్నవారినే పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తోంది. గత మార్చిలో ఈ పథకాన్ని భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారికంగా ప్రకటించారు. కానీ, ఆ వెంటనే పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి వచి్చంది. అధికారికంగా ఇందిరమ్మ పథకాన్ని లాంచ్ చేసే సమయంలో జారీ చేసిన ఉత్తర్వులో.. సొంత జాగా ఉండాలన్న అంశాన్ని స్పష్టంగా వెల్లడించింది. సొంత జాగా లేని నిరుపేదలకు స్థలం ఇచ్చి మరీ ఇల్లు నిర్మించి ఇస్తామని తొలుత ప్రకటించిన ప్రభుత్వం, ఈ సంవత్సరానికి మాత్రం సొంత జాగా ఉన్నవారికే కేటాయించాలని నిర్ణయించింది. ఇప్పుడు దానితోపాటు రేషన్‌కార్డుతో కూడా ముడిపెట్టాలని భావిస్తోంది. ఈ నిబంధన వల్ల.. రేషన్‌కార్డు లేనివారిలో వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదం ఉంటుందన్న విషయాన్ని కూడా గుర్తించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దారిద్య్ర రేఖ(బీపీఎల్)కు దిగువ ఉన్న వారికే ఇళ్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంటోంది. బీపీఎల్‌ను ధ్రువీకరించేది రేషన్‌కార్డే అయినందున, అది ఉన్నవారికే ఇళ్లు మంజూరు చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించే నాటికి దీనిపై నిర్ణయం తీసుకోనుంది. ప్రజాపాలనలో వచి్చన దరఖాస్తులు 80 లక్షలుగత డిసెంబరు, ఈ సంవత్సరం జనవరిలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇళ్ల కోసం 80 లక్షల దరఖాస్తులు అందిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తులను ప్రాథమికంగా పరిశీలించగా, వాటిల్లో రేషన్‌కార్డు లేనివారికి సంబంధించినవి ఏకంగా 30 లక్షలు ఉన్నట్టు తేలింది. దీంతో వాటన్నింటిని పక్కన పెట్టేశారు. ప్రస్తుతానికి మిగతా దరఖాస్తులనే పరిశీలిస్తున్నట్టు తెలిసింది. దసరా ముందు రోజు ఇందిరమ్మ కమిటీ మార్గదర్శకాలను వెల్లడిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటి ఆధారంగా కమిటీ సభ్యులను నియమించింది. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ బీజేపీ ఎమ్మెల్యే హైకోర్డులో వేసిన పిటిషన్ ఆధారంగా కేసు నడుస్తోంది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో.. దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకు దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రారంభం కాలేదు. ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో ఈ దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరగనుంది. ఈ సందర్భంగానే, దరఖాస్తుదారులకు సొంత జాగా ఉందా లేదో పరిశీలించటంతోపాటు రేషన్‌కార్డు వివరాలు కూడా సేకరించాలని భావిస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా రేషన్‌కార్డు అంశాన్ని వెల్లడించనప్పటికీ, మొదటి దఫా ఇళ్ల నిర్మాణంలో రేషన్‌కార్డు తప్పనిసరి అన్నవైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. రేషన్‌కార్డు వివరాలను జత చేయని పక్షంలో.. లబ్ధిదారులు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారేనని ఎలా ధ్రువీకరించారని కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. -
ఇందిరమ్మ ఇళ్ల విచారణ ఏమైంది?: చాడ
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల అవినీతిపై వేసిన సీఐడీ విచారణ ఏమైందని, అసలు సీఐడీ ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చిందా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. అవినీతికి పాల్పడిన దొంగలెవరనేది ప్రజలకు తెలపాలని ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. ఎంసెట్ లీక్ వెనక శ్రీ చైత న్య, నారాయణ కాలేజీలున్నట్లు వార్తలు వస్తున్నందున, ఈ గుట్టూ బయట పెట్టాలన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల స్కాంపై ఛార్జ్ షీట్
సాక్షి, హైదరాబాద్ : ఇందిరమ్మ ఇళ్ల స్కాంలో జరిగిన అవకతవకలపై సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్లు ఎప్పుడెప్పుడు నిర్మించారన్న దానిపై స్పష్టత కోరుతూ విజిలెన్స్ అధికారులకు ఓ లేఖ రాసింది. 9 జిల్లాల్లో 36 గ్రామాల్లో 3 వేల ఇళ్ల నిర్మాణాల్లో భారీగా గోల్మాల్ జరిగినట్లు గుర్తించిన సీఐడీ అధికారులు విజిలెన్స్ నివేదిక రాగానే ఛార్జీషీట్ దాఖలు చేయనున్నారు. మూడు వేల ఇళ్ల నిర్మాణాల్లో దాదాపు 11 కోట్ల రూపాయల నిధులు పక్కదోవ పట్టినట్లు సీఐడీ అధికారులు తేల్చారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. -
అబద్ధాల కేసీఆర్‌ను తరిమికొట్టండి
మోర్తాడ్/భీమ్‌గల్:(బాల్కొండ): అబద్దపు మాటలతో గద్దెనెక్కిన సీఎం కేసీఆర్‌ను తరిమికొట్టాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. టీపీసీసీ బస్సుయాత్రలో భాగంగా సోమవారం భీమ్‌గల్‌లో నిర్వహించిన బహిరంగసభలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని టీఆర్ఎస్ అడ్డుకుందని, డబుల్బెడ్రూం ఇళ్ల ఆశ చూపి ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇల్లు కట్టించిలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు మంజూరు చేయడంతో పాటు అదనపు గది, టాయిలెట్లు నిర్మింపజేస్తామన్నారు. గల్ఫ్ బాధితులకుం అండగా ఉంటాం.. గల్ఫ్ దేశాలకు వలసపోయే వారికి స్థానికంగానే ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ వాటిని మరిచిందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. నాలుగేళ్లలో వందల మంది గల్ఫ్ దేశాల్లో మృతి చెందారని, ఇప్పటివరకు ఏ ఒక్కరికి సాయం అందించలేదన్నారు. కువైట్‌లోని మన కార్మికులు స్వదేశానికి వచ్చేందుకు సాయం కోసం ఎదురు చూస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చినా.. ఏ ఒక్కరికీ సాయం చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్ఎస్ కుంతి యా నాయకత్వంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం కువైట్‌కు వెళ్లి తెలంగాణ కార్మికులకు అండగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గల్ఫ్ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామన్నారు. పెట్టుబడి సాయం జిమ్మిక్కే.. రైతుకు పెట్టుబడి సాయం కేసీఆర్ ఎన్నికల జిమ్మిక్కే అని ఉత్తమ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీతో పాటు పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. వరి, జొన్న, మొక్కజొన్న పంటలకు క్వింటాలుకు రూ.2 వేలకు తగ్గకుండా ఎర్ర జొన్నలకు క్వింటాలుకు రూ.3 వేలకు తగ్గకుండా, పసుపు, మిర్చి పంటలకు రూ.10 వేల మద్దతు ధర అందిస్తామని హామీ ఇచ్చారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.10 లక్షల చొప్పున వడ్డీలేని రుణం అందిస్తామన్నారు. రూ. లక్ష చొప్పున రివాల్వింగ్ ఫండ్ కేటాయించి మహిళా సంఘాలను బలోపేతం చేస్తామన్నారు. భీమ్‌గల్ ప్రాంతానికి ప్రాణహిత చేవెళ్ల ద్వారా గోదావరి జలాలను తీసుకొస్తామన్నారు. కేసీఆర్ జర్నలిస్టులను కూడా మోసగించారని, హెల్త్‌కార్డ్‌లు ఆసుపత్రులలో తిరస్కరణకు గురవుతున్నాయన్నారు. తాము అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ఇళ్లు కేటాయిస్తామన్నారు. మాజీ విప్ అనిల్ అధ్యక్షతన జరిగిన సభలో శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి, కిసాన్ కేత్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండ రెడ్డి, నాయకులు మహేష్‌కుమార్ గౌడ్, అరికెల నర్సారెడ్డి, రాజారాం యాదవ్, తాహెర్, మోహన్‌రెడ్డి, సురేందర్, చంద్రునాయక్, జితేందర్ పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ప్లాట్ల రద్దుపై పెల్లుబికిన నిరసన
చొప్పదండి: ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను టీఆర్ఎస్ ప్రభు త్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేం ద్రంలో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ఓ లబ్ధిదారుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. సోమవారం లబ్ధిదారులు మూకుమ్మడిగా ప్రధాన రహదారిపై రెండుగంటలకుపైగా రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వీరికి కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. చొప్పదండిలోని బీసీ కాలనీ సమీపంలో అప్పటి సీఎం వైఎస్సార్ నిరుపేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు 14 ఎకరాలు కొనుగోలు చేశారు. అందులో 291 మందికి గుంట చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చి పట్టాలు పంపిణీ చేశారు. డబుల్ బెడ్రూం నిమిత్తం నిర్మాణాలు లేని స్థలాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీంతో లబ్ధిదారుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. రెండురోజుల క్రితం మంత్రి ఈటల రాజేందర్ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనకు రాగా లబ్ధిదారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వైఎస్సార్ ఇచ్చిన పట్టాలే తమకు కావాలని బాబు అనే బాధితుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుబోయాడు. -
కొంపముంచారు
నిలిచిన ఇందిరమ్మ ఇళ్లు 4,277 బిల్లులు చెల్లించకపోవడంతో ఆందోళన పాకల్లో చలికి వణుకుతున్న లబ్ధిదారులు ప్రభుత్వంపై ఆగ్రహం ‘ఇందిరమ్మ ఇల్లిచ్చారు... ఉన్న గుడిసెను పీకేస్తే మిద్దె కట్టుకోవచ్చు. సొంత మిద్దెలో ఉండాలన్న ఏళ్ల నాటి కల త్వరలో తీరనుంది. అందులో ఎంచక్కా ఆనందంగా ఉండొచ్చు. ఇక వరదల బాదర బందీలేమీ ఉండవు’ ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు మొదట్లో ఉబ్బితబ్బిబ్బు అయ్యారు. ఉన్న గుడిసెను పీకేసి తీరా నిర్మాణం ప్రారంభించాక అసలు సంగతి తెలిసింది. ప్రభుత్వ మాయలో పడి ఎంతగా చితికిపోయామోనని మధనపడుతున్నారు. నందిగామ రూరల్ : మండలంలో ఇందిరమ్మ లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉన్న గుడిసెలను పీకేసి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన వారికి ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. బిల్లులు రాకపోవడంతో పలు దశల్లో నిర్మాణాలు నిలిచిపోయాయి. దీంతో ఇళ్లను ప్రారంభించిన లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. బిల్లుల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల అప్పులు చేశామని, నిర్మించిన దశలకు బిల్లులు వస్తాయో, రావో కూడా అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదవారంటే ప్రభుత్వానికి అలుసని, అందువల్లే బిల్లుల చెల్లింపుపై దృష్టి పెట్టడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు చెల్లించాలని లబ్ధిదారులు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల వివరాలు మండలానికి 2006 నుంచి ఇప్పటి వరకు ఫేజ్ 1, 2, 3లలో మొత్తం 8,625 ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో కేవలం 4,348 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 4,277 ఇళ్లు పలు నిర్మాణ దశల్లో నిలిచిపోయాయి. వీటికి సంబంధించిన రూ.90,36,100 లక్షల బిల్లులు నిలిచిపోయాయని అధికారులే చెబుతున్నారు. గుడిసెల నుంచి పాకల్లోకి... ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకునేందుకు ఉన్న ఇంటిని పడవేసిన కొందరు లబ్ధిదారులు చిన్నచిన్న పాకలను తాత్కాలికంగా ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. కొందరైతే వర్షానికి తడుస్తూ చలికి వణుకుతూ వాటిల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఏడాది గడుస్తున్నా బిల్లులు చెల్లించకపోవడంతో మొండి గోడలతో ఇందిరమ్మ ఇళ్లు వెక్కిరిస్తున్నాయి. లబ్ధిదారులకు అధికారుల లెక్కల ప్రకారం 7 నెలలుగా బిల్లులు నిలిచిపోయాయి. ఉన్న ఇల్లు పీకేశాం 8 నెలల క్రితం మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. దాన్ని నిర్మించుకునేందుకు ఉన్న ఇంటిని పడే శాం. ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు బేస్ మట్టాల స్థాయిలో నిలిచింది. ఒక్క బిల్లూ ఇవ్వలేదు. పాకలో ఉంటున్నాం. ప్రస్తుతం చలికి ఇబ్బంది పడుతున్నాం. - పత్తిపాటి సుశీల పాకే గతైంది ఇందిరమ్మ ఇల్లు మంజూరైందా కదా అన్న సంతోషంతో ఉన్న ఇంటిని పడవేసి లక్ష రూపాయల ఖర్చుతో కొత్త ఇల్లు నిర్మాణం మొదలుపెట్టాం. ఏడాది నుంచి బిల్లు రాలేదు. మా కుటుంబంలో ఐదుగురం. అప్పటి నుంచి పక్కనే పాక ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది. - దుడ్డు భాగ్యమ్మ ఆధార్ అనుసంధానం చేస్తున్నాం నందిగామ ప్రాంతంలో 7 నెలలుగా లబ్ధిదారులకు బిల్లులు నిలిచిపోయాయి. పలు స్టేజీల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఆధార్ వివరాలను సేకరించి వాటిని ఆన్లైన్లో అనుసంధానం చేస్తున్నాం. ప్రస్తుతం మండలంలో రూ.90,36,100 లక్షల బిల్లులు నిలిచిపోయాయి. ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు లబ్ధిదారులకు అందజేస్తాం. - ఎన్వీఎస్ ప్రకాశరావు, హౌసింగ్ ఏఈ నందిగామ -
భూదందాకు దన్ను
బొల్లారంలో రూ.26 కోట్ల భూ కుంభ కోణం సాక్షి ప్రతినిధి సంగారెడ్డి: బొల్లారం పారిశ్రామిక వాడలో ‘ఇందిరమ్మ’ ఇళ్ల పేరిట జరిగిన భూ దందాలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఈ వ్యవహారంతో సంబంధమున్న కొంత మంది నేతలు రూ.26 కోట్లకు పైగా సొమ్ములు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. పదేళ్ల నుంచి నిరాటంకంగా కొనసాగుతున్న ఈ అవినీతి భూ భాగోతం... నారాయణరావు భూ కుంభకోణాన్ని గుర్తుకు తెస్తోంది. అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులే నేతలకు అండదండలు అందిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మూడు దశాబ్దాల క్రితం పటాన్చెరు నియోజకవర్గంలో వందలు, వేల ఎకరాలు కబ్జా చేసి సుమారు 20 ఏళ్ల పాటు నారాయణరావు నడిపిన అవినీతి భూ భాగోతం మరోసారి పునరావృతమవుతోంది. అప్పట్లో ఆ కుంభకోణంపై సభా సంఘం నియమించిన సంఘటన మరువక ముందే కాసులు కురిపించే బొల్లారం పారిశ్రామిక వాడలో మరో భూ మాయాజాలం వెలుగులోకి వచ్చింది. జిన్నారం మండలం బొల్లారంలో పదేళ్ల క్రితం 284 సర్వే నంబర్లో సుమారు 35 ఎకరాల భూమిని నిరుపేదల ఇళ్లకోసం ఇందిరమ్మ పథకం కింద ప్రభుత్వం 1,075 మంది లబ్ధిదారులను గుర్తించింది. అయితే కొంతమంది స్థానిక కాంగ్రెస్ నాయకులు ఒక గ్రూప్‌గా ఏర్పడి భూ దందాకు తెరలేపారు. 308 మందిలబ్ధిదారులకు పట్టాలిచ్చి, మిగతావాటిని తమ వద్దనే పెట్టుకొని డిమాండ్ కనుగుణంగా రూ.1 లక్ష నుంచి 2 లక్షల వరకు అమ్ముకున్నారు. రిజిస్ట్రేషన్ల మాయజాలం... కోట్ల రూపాయల కుంభకోణం సర్వేనంబర్ 284లో ఉన్న 35 ఎకరాల భూమి ఉండగా, ఇందులో కాలనీ డెవలప్మెంట్, రోడ్లు, పార్కుల కోసం స్థలాన్ని తీసివేయగా ఒక్కో ఎకరానికి ఎంతలేదన్న 3 వేల గజాల భూమి మిగులుతుంది. ఈ లెక్కన 35 ఎకరాల్లో 1.05 వేల గజాల భూమిని ప్లాట్లుగా మార్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఒక్కో వ్యక్తికి 60 గజాల భూమి ఇవ్వాలి. ఈ లెక్కన చూస్తే 1.05 వేల గజాల భూమిని 1,750 మంది లబ్ధిదారులకు ఇవ్వొచ్చు. పారిశ్రామిక వాడలో ఒక్కో ప్లాట్‌ను రూ.1 లక్ష నుండి 2 లక్షల వరకు డిమాండ్ పలుకుతోంది. దీంతో కొంతమంది నాయకులు ముఠాగా ఏర్పడి ప్లాట్లను కబ్జాచేసి అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక్కో ప్లాట్‌కు సగటున రూ.1.50 లక్షల చొప్పున విక్రయించినా మొత్తం 1,750 ప్లాట్లకు రూ.26 కోట్లపై చిలుకు డబ్బు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఒక్కో ప్లాట్‌ను రెండు, మూడుసార్లు రిజిస్ట్రేషన్ చేస్తూ ఇద్దరి ముగ్గురు పార్టీలకు విక్రయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకసారి ఇంటి నిర్మాణంకోసం ఉచితంగా ఇచ్చిన భూమిని కనీసం పదేళ్ల వరకు అమ్ముకునే అవకాశం లేదు. కానీ ఇక్కడ మాత్రం అధికారులను ఆమ్యామ్యాలకు అలవాటుచేసిన నేతలు తమ అక్రమ దందాను యథేచ్ఛగా కొనసాగించారనే ఆరోపణలున్నాయి. అక్రమ దందాకు అందరి అండదండలు ఈ అక్రమ దందాకు నాయకుల నుంచి మొదలు కొని అధికారుల వరకు అందరి అండదండలున్నాయనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ అక్రమ భూ బాగోతంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు నామమాత్రంగా విచారణ చేసి చేతులు దులుపుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి భూ దందాను అడ్డుకొని నిరుపేదలకు న్యాయం జరిగేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. -
ఇళ్లు అమ్ముకున్నారు!
‘ఇందిరమ్మ’ ఇంటి బాగోతం - అక్రమాల్లో హౌసింగ్ సిబ్బందిదే కీలక పాత్ర - రుద్రారంలో 50 ఇళ్లు అమ్ముకున్న ఘనులు - సీఐడీ విచారణలో వెలుగుచూసిన వాస్తవం - రెండు రోజుల తర్వాత రికార్డుల పరిశీలన : సీఐడీ డీఎస్పీ సాక్షి, కరీంనగర్ : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముడుపోయాయి.. సాక్షాత్తూ గృహనిర్మాణ శాఖ అధికారులే ఈ అవినీతికి తెరలేపారు. ఒకరి పేరిట ఇల్లు మంజూరు చేసిన అధికారులు అనర్హులకు ఇళ్లు నిర్మించి ఇచ్చారు. లబ్ధిదారులకు రూ.5వేల నుంచి రూ.10వేలు ఇచ్చి.. అనర్హుల నుంచి డబ్బులు వసూలు చేశారు. మల్హర్ మండలం రుద్రారం గ్రామంలో 50 ఇళ్లు ఇలాంటివే ఉన్నాయని సీఐడీ అధికారులు తేల్చారు. ఈ అక్రమాలు 2004 నుంచి 2009 వరకు ఇందిరమ్మ ఒకటో, రెండో విడతల్లో చోటు చేసుకున్నాయి. అప్పటి డీఈఈ గ్రామంలో తిరిగి ఇల్లు మంజూరు చేస్తానని, వచ్చిన బిల్లులో సగం డబ్బులు వసూలు చేశాడని బాధితులు ఇటీవలే సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయూన్ని అధికారులు సీఐడీ ఐజీ చారుసిన్హా దృష్టికి తీసుకెళ్లారు. అక్రమాలు 1500 పైనే.. గత నెల 14 నుంచి మల్హర్ మండలం రుద్రారం, పెగడపల్లి (మహాముత్తారం), రెడ్డిపల్లి, కొండపాక (వీణవంక) గ్రామాల్లో సీఐడీ డీఎస్పీ మహేందర్, సీఐ రెండు బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టారు. వీటి పరిధిలో మంజూరై.. నిర్మాణం పూర్తయిన ఇల్లు మొత్తం 2,708 ఉన్నాయి. శుక్రవారం వరకు రుద్రారంలో 398 ఇల్లు మినహా సీఐడీ అధికారులు అన్ని ఇళ్లపై విచారణ పూర్తి చేశారు. అందులో 1,500 పైచిలుకు ఇళ్లలో అక్రమాలు జరిగినట్టు నిర్ధారించారు. రెడ్డిపల్లిలో 556 ఇళ్లు నిర్మిస్తే..480 ఇళ్లు, కొండపాకలో 334 ఇళ్లకు గాను 220 ఇళ్ల బిల్లుల చెల్లింపు అక్రమమని తేలింది. రికార్డుల పరిశీలన.. ఇందిరమ్మ ఇళ్లపై సీఐడీ విచారణకు నెల రోజులు అరుుంది. రుద్రారంలో మిగిలిన 398 ఇళ్ల విచారణ రెండ్రోజుల్లోగా పూర్తి చేసేందుకు సీఐడీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరిగిన అధికారులు ఆ తర్వాత కార్యాలయంలో రికార్డులు పరిశీలించాలని నిర్ణయించారు. రికార్డులు పరిశీలనలో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలుండడంతో గృహనిర్మాణ శాఖాధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటి వరకు తాము చేపట్టిన విచారణలో సగానికి పైగా ఇందిరమ్మ నిర్మాణాల్లో అక్రమాలు జరిగినట్టు తేలిందని సీఐడీ డీఎస్పీ మహేందర్ చెప్పారు. రుద్రారంలో ఓ డీఈఈపై స్థానిక ప్రజలు ఫిర్యాదు చేశారని ఆ విషయాన్ని పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. జిల్లా అంతటా విచారణ పూర్తయ్యే వరకు కొన్ని నెలలు పట్టే అవకాశాలున్నాయని.. విచారణలో ఎవరి తప్పు వెలుగులోకి వచ్చినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ముగిసిన సీఐడీ విచారణ రెడ్డిపల్లి(వీణవంక) : ఇందిరమ్మ ఇళ్లలో అవినీతిపై సీబీసీఐడీ చేపట్టిన విచారణ ముగిసింది. గత నెల 14న సర్వే ప్రారంభించిన అధికారులు రెండు విడతలుగా తనిఖీ చేశారు. రెడ్డిపల్లిలో 556 ఇళ్లు, కొండపాకలో 334 ఇళ్లు ఇందిరమ్మ పథకంలో మంజూరయ్యాయి. సీఐడీ డీఎస్పీ మహేం దర్, సీఐలు ప్రకాశ్, వెంకటనర్సయ్య శుక్రవారం రెండుబృందాలుగా విడిపోయి ఇంటింటి సర్వే చేశారు. 80 ఇళ్లు తనిఖీ చేశారు. ఇందులో ఒకే ఇంటికి మూడు బిల్లులు పొందగా, సింగరేణి ఉద్యోగులు, ఇల్లు కట్టకున్నా బిల్లులు పొందినట్లు బట్టబయలైంది. 556 ఇళ్లకుగాను 450 ఇళ్లలో అవినీతి జరిగినట్లు తేలింది. అక్రమాలకు పాల్పడినవారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని డీఎస్పీ మహేందర్ తెలిపారు. -
ఇందిరమ్మ ఇళ్లపై నిఘా
సాక్షి, అనంతపురం : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవినీతిని వెలికి తీసి.. అర్హులకే బిల్లులు మంజూరు చేసే విధంగా జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా జియో ట్యాగింగ్ అనే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. 2005-06 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు.. అంటే గడిచిన పదేళ్లలో ఇందిరమ్మ పథకంతో పాటు ‘రచ్చబండ’లో జిల్లాకు 4,07,779 ఇళ్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణాల్లో చాలా వరకు అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం లోటు బడ్జెట్‌తో పుట్టెడు కష్టాల్లో ఉన్న టీడీపీ ప్రభుత్వం.. వాటి నుంచి గట్టెక్కేందుకు సంక్షేమ పథకాల్లో లొసుగులను వెతికి పట్టుకుంటూ నిబంధనలు కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగా గృహ నిర్మాణ పథకాల్లోనూ అక్రమాల వెలికితీతకు సిద్ధమవుతోంది. జూలై 31న హైదరాబాద్‌లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రితో పాటు ఆ శాఖ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన హౌసింగ్ పీడీల సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ‘జియో ట్యాగింగ్’ అనే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా నిజమైన లబ్ధిదారులకే బిల్లులు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు మొదటి వారం నుంచి ఈ విధానాన్ని అమలులోకి తేవడానికి చర్యలు ప్రారంభించారు. ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇళ్లలో పూర్తయినట్లు చెబుతున్న 1,90,510 ఇళ్లలో చాలా వరకు దొంగ బిల్లులు చేసినట్లు విమర్శలున్నాయి. కొన్ని చోట్ల హౌసింగ్ అధికారులే నిధుల్ని కాజేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇంతకు ముందున్న ఇళ్లను చూపి బిల్లులు పొందడం, ఇంటి పేరుతో ప్రహరీలు, పశువుల శాలలు, అతిథి గృహాలు, అంతస్తులు నిర్మించుకోవడం, పాత ఇంటికి మరమ్మతులు చేయించుకోవడం వంటి అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం ఆధారాలను కూడా సేకరించింది. బోగస్ రేషన్ కార్డులతో కూడా అక్రమాలకు పాల్పడినట్లు తేల్చింది. జిల్లాలో దాదాపు ఐదు వేల ఇళ్లు బోగస్‌గా గుర్తించింది. ఇకపై ఇలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు చేపట్టాలని హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం ‘జియో ట్యాగింగ్’ విధానం ద్వారా గృహ నిర్మాణాలను పర్యవేక్షించనున్నారు. జియో ట్యాగింగ్ అంటే... భూమిపై నిర్ధిష్టంగా ఒక ప్రాంతాన్ని గుర్తించటాన్ని ‘జియో ట్యాగింగ్’ అంటారు. ప్రతి ప్రదేశానికి నిర్ధిష్టమైన అక్షాంశం, రేఖాంశం ఉంటాయి. గృహ నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేయగానే వాటి అక్షాంశం, రేఖాంశం నమోదయ్యేలా ఫొటోలు తీస్తారు. వీటికి, దశల వారీగా పూర్తి చేసిన నిర్మాణాలకు అక్షాంశాలు, రేఖాంశాలు సరిపోలితేనే బిల్లులు మంజూరు చేస్తారు. లేదంటే బోగస్‌గా నిర్ధారిస్తారు. హౌసింగ్, రెవెన్యూ సిబ్బంది ప్రతి రోజూ క్షేత్ర స్థాయిలో పర్యటించి ఫొటోలు తీసి సర్వర్‌కు అప్లోడ్ చేస్తారు. అలాగే వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను ఆర్డీఓ, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేకాధికారి, ఈఈల ఆధ్వర్యంలో తనిఖీ చేస్తారు. ఎంతమంది అర్హులుగా ఉన్నారు..ఎంత మంది లేరన్న వివరాలను సేకరించి సర్వర్‌కు అప్లోడ్ చేస్తారు. ఇంతకు ముందు లబ్ధిదారులు గృహ నిర్మాణాల వద్ద వివిధ దశలకు సంబంధించి ఫొటోలు దిగి బిల్లులు పొందేవారు. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. జియో ట్యాగింగ్ విధానంలో భాగంగా ఇంటి నిర్మాణంలో ప్రతి దశను ఫొటోలు తీసి సెంట్రల్ సర్వర్‌కు పంపుతారు. ఆ ఫొటోలు అవే ఇంటివని తేలాక బిల్లులు చెల్లిస్తారు. అక్రమాలు నిగ్గు తేల్చేందుకే... ఇందిరమ్మ పథకంలో దాదాపు ఐదు వేల ఇళ్లను నకిలీ రేషన్‌కార్డులతో కాజేసినట్లు ఆరోపణలున్నాయి. దాదాపు రూ.30 కోట్ల అవినీతి జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ అక్రమాలను నిగ్గుతేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జియో ట్యాగింగ్ విధానం ద్వారా అక్రమాలు వెలికితీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. కొద్దిరోజుల్లోనే విచారణ ప్రారంభం కానుంది. విచారణకు సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. -
అవినీతి గూళ్లు
‘ఇందిరమ్మ’ ఇళ్లలో స్వాహాపర్వం - అధికారులు తేల్చింది రూ.18 కోట్లే - రికవరీ రూ.20 లక్షలు మాత్రమే - అక్రమాలపై సీబీసీఐడీ విచారణ - అక్రమార్కుల గుండెళ్లో గుబులు సాక్షి, కరీంనగర్: ఇల్లు లేని పేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహనిర్మాణ పథకంలో అడుగడుగునా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. లబ్ధిదారుల ఎంపిక మొదలు బిల్లు మంజూరు వరకు అధికారులు, దళారులు పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. అధికారాన్ని అదునుగా చేసుకుని కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు బినామీ పేర్లతో ఇళ్లు మంజూరీ చేయించుకుని బిల్లులు కాజేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలతో కొందరు దళారులు ఇల్లు ఉన్నవారికే లబ్ధి చేకూర్చారు. మరికొందరైతే ఏకంగా పాత ఇళ్లకే సున్నం వేయించి సర్కారు ఖజానాకు కన్నం వేయించిన సంఘటనలు జిల్లాలో వెలుగులోకి వచ్చాయి. ఇలా వేలాది ఇళ్లు పునాదులు కూడా తవ్వకుంటే బిల్లులు డ్రా చేశారు. జిల్లావ్యాప్తంగా రూ.70 కోట్లకు పైనే నిధులు దుర్వినియోగమయ్యాయి. కానీ.. ఇప్పటివరకు రూ.18 కోట్ల మేర కే అవినీతి జరిగినట్టు అధికారులు విచారణలో తేల్చారు. ఇందులో కేవలం రూ.20 లక్షలు మాత్రమే అక్రమార్కుల నుంచి రికవరీ చేసినట్టు హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 9,80,789 ఇళ్లు ఉండగా, ఇందులో నివాసయోగ్యమైనవి 2,91,248 వరకు ఉన్నాయి. శిథిలావస్థదశలో.. వసతులు లేని మిగిలిన ఇళ్లలో ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారు. ఇందిరమ్మ మూడు విడతల్లో జిల్లాకు 2.90 లక్షల ఇళ్లు మంజూరు కాగా, ఇందులో 55వేల ఇళ్లు కూడా పూర్తి కాలేదు. కొన్ని నిర్మాణ దశలో ఉండగా, చాలాచోట్ల అసలు పునాదులే తవ్వలేదు. జిల్లాల్లో 57 మండలాలు, 1207 గ్రామాలుంటే.. ఇప్పటివరకు ఏడువందల గ్రామాల్లో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులున్నాయి. అధికారులు వందకు మించి గ్రామాల్లో విచారణ చేపట్టలేదు. మంథనిలో అధికం.. జిల్లావ్యాప్తంగా మంథని నియోజకవర్గంలోనే అధికంగా నిధులు దుర్వినియోగమైనట్టు ఆరోపణలున్నాయి. అప్పటి అధికార పార్టీ నేతలు పలు గ్రామాల్లో ఉన్న ఇళ్ల సంఖ్యకన్నా ఎక్కువ ఇళ్లు మంజూరు చేయించుకుని బిల్లులు మింగినట్టు తెలుస్తోంది. ఈనెల 25న జిల్లా పరిషత్ సమావేశమందిరంలో ‘మన జిల్లా-మన ప్రణాళిక’ సమావేశంలో అవినీతి విషయం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కాటారం జెడ్పీటీసీ సభ్యుడు, గత ప్రభుత్వంలో జిల్లా మంత్రి అనుచరుడే గృహనిర్మాణాల్లో అవినీతిని ప్రస్తావించారు. గతంలో కాటారం, మహాముత్తారం, మహదేవపూర్ మండలాల్లో రూ.50 కోట్ల అవినీతి జరిగిందని లెక్కతేల్చారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను కోరారు. స్పందించిన మంత్రి విచారణకు హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని మరుసటి రోజే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన సీఎం నాలుగు వేల మంది సిబ్బందితో రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు విచారణ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కేసును సీబీసీఐడీకి అప్పజెప్పడం జిల్లాలో చర్చనీయాంశమైంది. అక్రమాలపై సమగ్రంగా, పకడ్బందీంగా విచారణ జరిపిస్తే జిల్లాలో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. కాగా.. ఈ అక్రమ వ్యవహారం దళారులతో పాటు అధికారులను కలవరానికి గురిచేస్తోంది. గతంలో గ్రామాల్లో పలువురు ప్రజాప్రతినిధుల సహకారంతో విలేజ్ ఆర్గనైజర్(వీవో)లు బిల్లులు చెల్లించకుండా డబ్బులు కాజేశారు. పనుల ప్రగతి చూసి బిల్లులు మంజూరు చేయాల్సిన వర్క్ ఇన్స్పెక్టర్లు ఇళ్లు లేకున్నా నిధులిచ్చేశారు. నిధుల దుర్వినియోగంపై గతంలో ఎన్నోసార్లు హౌసింగ్ అధికారులు విచారణ కూడా చేపట్టారు. కానీ అప్పట్లో ప్రజాప్రతినిధుల ఒత్తిడి కారణంగా అక్రమార్కులపై చర్యలకు వెనుకడుగు వేశారు. తాజాగా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. -
కడ‘గండ్లు’ పూడేదెప్పుడో
అధ్వానంగా చెరువు కట్టలు, తూములు, సప్లైచానెళ్లు పట్టించుకోని అధికారులు పలమనేరు, న్యూస్‌లైన్: చెరువుల మరమ్మతు కోసం ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. గతంలో తెగిన చెరువు కట్టలు, సప్లయ్ చానెళ్లు ఇంతవరకు మరమ్మతులకు నోచుకోలేదు. కొద్దిమేర వర్షాలు పడుతున్నా నీరు నిల్వ ఉండే పరిస్థితి లేక రైతులు లబోదిబోమంటున్నారు. పలమనేరు నియోజకవర్గంలో 19 పెద్ద చెరువులు, 892 చిన్న చెరువులు, కుంటలు ఉన్నాయి. వాటిలో కొన్ని రెండేళ్ల క్రితం కురిసిన వర్షాలకు తెగిపోయాయి. మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఈ దఫా వర్షాలు కురిసినా చుక్కనీరు నిల్వ ఉండే పరి స్థితి లేదు. గతంలో ఇందిరమ్మ పథకంలో 150 చెరువుల మరమ్మతు పనులు చేపట్టారు. పనులు నాసిరకంగా ఉన్నాయంటూ అర్ధాంతరంగా ఆపేయడంతో వాటి పరిస్థితి ఎటూ కాకుండా పోయింది. వర్షాలు కురిసి నీరు చేరితే తెగిపోయే పరిస్థితిలో ఉన్నాయి. చెరువులకు వరద నీటిని తీసుకొచ్చే సప్లయ్ చానెళ్లు చాలావరకు పూడిపోయాయి. మిగిలినవి ఆక్రమణకు గురయ్యాయి. తద్వారా ఎంత వర్షం కురిసినా చుక్క నీరు రాని పరిస్థితి ఏర్పడింది. పలమనేరు మండలంలో 114 చెరువులుండగా వీటిలో 43కు కట్టలు బలహీనంగా ఉన్నాయి. నాలుగు చెరువు కట్టలకు గండిపడి మూడేళ్లవుతున్నా పట్టించుకునే దిక్కులేకుం డా పోయింది. చాలా చెరువులకు మొరవలు ధ్వంసమయ్యాయి. సప్లయ్ చానెళ్లు కబ్జాకు గురయ్యాయి. గంగవరం మండలంలో కొన్నేళ్లుగా వర్షాలు పడకపోవడంతో చెరువుల్లో చుక్క నీరులేదు. దీనికితోడు సప్లయ్ చానెళ్లు ఆక్రమణకు గురయ్యాయి. మన్నార్నాయనిపల్లె చెరువుకు గతంలో గండిపడినా మరమ్మతుకు నోచుకోలేదు. పెద్దపంజాణి మండలంలో 259 చెరువులుండగా చెన్నారెడ్డిపల్లె, వీరప్పల్లె, సొలింపల్లె, బేరుపల్లె, పెనుగొలకల గ్రామాల్లోని చెరువులకు గండ్లు పడ్డాయి. వాటికి నామమాత్రంగా మరమ్మతు చేసి చేతులు దులుపుకున్నారు. బెరైడ్డిపల్లె మండలంలో 150 చెరువులున్నాయి. 15 మినహా మిగిలిన వాటిలో సప్లై చానెళ్లు ఆక్రమణకు గురయ్యాయి. మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. చెరువు స్థల మూ ఆక్రమణకు గురైంది. వి.కోట వుండలంలో 183 చెరువులుండగా కీలపల్లె, చింతల ఎల్లాగరం, బైరుపల్లె చెరువులు ఆక్రవుణకు గురయ్యూరుు. పది చెరువు కట్టలు బలహీనంగా ఉన్నాయి. పీఆర్ చెరువుల పరిస్థితి మరీ అధ్వానం గతంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఉండి ఇరిగేషన్ శాఖకు బదిలీ అయిన చెరువులు చాలావర కు అధ్వానంగా ఉన్నాయి. వీటి గురించి పట్టించుకునేవారే కరువయ్యారు. నియోజకవర్గంలోని చెల్లెమ్మ చెరువు, సర్కార్పెద్దచెరువు, కౌండిన్యా ఆనకట్ట, ఆరె మ్మ, కన్నికల, నాయిని, దండపల్లె, బెరైడ్డిపల్లె పెద్దచెరువులు, పాతపేట చెరువు, బైరుపల్లె, ఎల్లాగరం, కీలపల్లె, బ్రాహ్మణపల్లె, చలమంగళం, మాడి చెరువుల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ఇరిగేషన్ ఈఈ సత్యనారాయణప్పను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఏపీసీబీ టీఎంపీ, వర్డల్బ్యాంక్ నిధుల ద్వారా కొన్ని చెరువులకు మరమ్మతులు చేస్తున్నామన్నారు. త్రిబుల్ఆర్(రిపేర్స్ రెన్నివేషన్ అండ్ రిస్టోరేషన్) ద్వారా కొన్నింటికి, ఉపాధి హామీ ద్వారా 80 చెరువులకు త్వరలోనే పనులు చేపడతామని తెలిపారు. -
కట్టకుంటే ఇల్లు గాయబ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో దాదాపు 50 వేల ఇందిరమ్మ ఇళ్లు రద్దు కానున్నాయి. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంపై అవగాహ న కల్పించినప్పటికీ, వివిధ కారణాలతో వారు పనులు మొదలు పెట్టలేదు. దీంతో సదరు ఇళ్లను రద్దు చేసి, కొత్తవారికి కేటాయించాలని గృహ నిర్మాణ సంస్థ అధికారులు యోచిస్తున్నారు. ఇప్పటికే రెండుమూడు సార్లు నోటీసులు కూడా జారీ చేశారు. 31,341 వేల ఇంది రమ్మ ఇళ్లను లబ్ధిదారులు ఇప్పటి వరకు ఇంకా ప్రారంభించలేదు. 21,387 ఇళ్లు మంజూరైనప్పటికీ, సంబంధిత బ్యాంకులలో లబ్ధిదారులు తమ ఖాతాలను ప్రారంభించలేదు. దీంతో ఇవి నమోదుకే పరిమితమయ్యాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ వ్యయ రుణాన్ని రూ. 70 వేలు, ఎస్సీ, ఎస్టీలకైతే రూ. లక్ష వరకు పెంచినప్పటికి ని ఇళ్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. సత్వరమే నిర్మాణాలు చేపట్టాలని అధికారులు సూచించినా వారు ఆసక్తి చూప డం లేదు. అందుకే అధికారులు రద్దు నిర్ణయం తీసుకున్నారు. లక్ష్యానికి దూరంగా లక్ష్యానికి దూరంగా ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కొనసాగిం చేందుకు జిల్లా గృహ నిర్మాణ సంస్థ తీవ్ర కసరత్తు చేస్తోంది. మండల స్థాయి అధికారులకు టార్గెట్లు విధిం చి ఇళ్ల నిర్మాణంపై ఒత్తిడి పెంచుతోంది. 2013-14 సంవత్సరంలో జిల్లాలో 19,621 ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణం చేపట్టాలని గృహ నిర్మాణ సంస్థ అధికారులకు నిర్దేశించగా ఇప్పటి వరకు 7,836 ఇళ్లు పూర్తి చేశారు. 2006 నుంచి 1,95,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 1,19,691 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశలలో ఉన్నాయి. సామగ్రి పంపిణీకి రంగం సిద్ధం సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లను సాధ్యమైన మేర కు పూర్తి చేయాలని యోచిస్తోంది. ప్రజల్లో సానుభూ తిని పొందేందుకు స్లాబుదశలో ఉన్న ఇళ్ల నిర్మాణం కోసం సామగ్రిని పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు జిల్లా గృహ నిర్మాణశాఖ సిబ్బంది సంబంధిత లబ్ధిదారుల నుంచి అంగీకారపత్రాలను సేకరిస్తున్నారు. జిల్లాలో రూప్లెవల్లోనే నిలిచిపోయిన ఇళ్లు 5,576 వరకు ఉన్నాయి. ఈ ఇళ్ల నిర్మాణం కోసం అవసరమయ్యే సిమెంట్, స్టీల్, ఇటుక తదితర మెటీరియల్‌ను అందిచేందుకు అన్నివిధాలుగా అధికార గణం చర్యలు చేపట్టనుంది. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక లబ్ధిదారులకు బిల్లులు అందజేసేటప్పుడు పంపిణీ చేసిన సామగ్రికి సంబంధించిన డబ్బులు మినహాయిం చుకుంటారు. -
గృహభారం
సాక్షి, మంచిర్యాల: ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అన్నారు పెద్దలు. పెళ్లి విషయమేమో గాని ఇల్లు కట్టడం కష్టమే. తరచూ పెరుగుతున్న సిమెంట్ ధరలు.. నిలకడగా ఉండని స్టీల్ రేటు.. ఇసుక కొరత.. వీటితోపాటు కూలీల డిమాండ్. ఇన్ని సమస్యలు అధిగమించి ఇళ్ల నిర్మాణం చేయాలంటే ఆయా యజమానులకు పెనుభారమవుతోంది. తాజాగా సిమెంట్ ధర బస్తాకు రూ.20 నుంచి రూ.30 పెరగడం.. ఇసుక కొరతగా ఉండడంతో భవనాల నిర్మాణాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. వీటి ప్రభావం ఇందిరమ్మ లబ్ధిదారులపైనా పడింది. మొన్నటి వరకు మండలాల్లోనే సిమెంటు సరఫరా చేసిన ప్రభుత్వం తాజాగా సబ్డివిజన్లవారీగా గోదాములు ఏర్పాటు చేసి సిమెంటు ఇస్తుండటంతో లబ్ధిదారులపై రవాణా భారం పడుతోంది. నిర్మాణదారులకు సి‘మంట’ సిమెంట్ ధరలు పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.90 పెరిగింది. దీంతో నిర్మాణ పనులు చేపట్టాలనుకుంటున్న వారు తమ నిర్ణయాన్ని విరమించుకుంటున్నారు. ఇప్పటికే పనులు ప్రారంభిం చిన వారు రెండస్తులు వేసుకోవాలనుకుని ఒక అంతస్తుతోనే సరిపెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఏ కంపెనీ సిమెంట్ బస్తా తీసుకున్న రూ.260 నుంచి రూ.290 ఉంది. దీనికి తోడు నిర్మాణాల్లో కీలకమైన స్టీల్ ధరలు విపరీతంగా పెరిగాయి. గతేడాది ఇనుము ధర క్వింటాలుకు రూ.45,500 ఉండగా ప్రస్తుతం రూ. 56,600 చేరింది. కొరతగా ఇసుక.. ప్రభుత్వం ఇసుక రవాణాపై ఆంక్షలు విధించడంతో జిల్లాలో కొరత ఏర్పడింది. కొందరు ట్రాక్టర్ యజమానులు మాఫియాగా ఏర్పడి ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు. ప్రజల నుంచి విపరీతంగా డబ్బులు తీసుకుంటున్నారు. గతంలో ట్రాక్టర్ ఇసుకకు రూ.600 నుంచి రూ.800 తీసుకుంటే.. ప్రస్తుతం రూ.1000 నుంచి రూ.1,500 తీసుకుంటున్నారు. మరోపక్క సరఫరా చేస్తున్న ఇసుక నాణ్యత లేకపోవడంతో చాలా మంది నిర్మాణ పనులు నిలిపేశారు. ఇందిరమ్మ లబ్ధిదారులకూ ఇబ్బంది.. జిల్లాలో మూడు విడతలుగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. రెండో విడతలో 1,00,964 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటివరకు ఒక్క ఇంటి నిర్మాణము పూర్తి కాలేదు. 2,994 నిర్మాణాలు ప్రారంభం కాలేదు. కనీసం పునాది స్థాయి వరకు జరగ ని నిర్మాణాలు 5,228 ఉంటే.. బేస్మెంట్ స్థాయిలో 7,255, లెంటల్ లెవల్లో 3,780, రూఫ్ లెవల్ 8,940, స్లాబ్ లెవల్లో 72,767 నిర్మాణాలున్నాయి. మూడో విడతలో 72,225 ఇళ్లు మంజూరు కాగా 15,809 నిర్మాణాలు ఆరంభం కాలేదు. బేస్మెంట్ వరకు జరగ ని నిర్మాణాలు 5,090, బేస్మెంట్ స్థాయిలో 6,280, లెంటల్ లెవల్లో 2,716, రూఫ్ లెవల్ 6,074, స్లాబ్ లెవల్లో 34,459 నిర్మాణాలున్నాయి. లబ్ధిదారులపై రవాణా భారం ప్రభుత్వం లబ్ధిదారులకు బేస్మెంట్ నిర్మాణానికి 10 బస్తాలు.. నిర్మాణం పూర్తయితే 10, రూఫ్ లెవల్లో 20, ఆర్సీ స్లాబ్ కోసం 10 బస్తాలు విడతలుగా మంజూరు చేస్తుంది. మరోపక్క మొన్నటి వరకు ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆయా మండలాల్లోనే సిమెంటు సరఫరా చేసి.. వారికి కేటాయించే బిల్లుల నుంచి ఒక్కో బస్తాకు రూ.185 విధించేది. తాజాగా సబ్డివిజన్లలో గోదాములు ఏర్పాటు చేసి సిమెంట్ బస్తాలు పంపిణీ చేస్తోంది. దీంతో 10, 20 బస్తాల కోసం మండల కేంద్రాల నుంచి సబ్‌డివిజన్ ప్రాంతానికి వచ్చి సిమెంట్ తీసుకెళ్లడం లబ్ధిదారులకు రవాణా భారమైంది. కనీసం మండలాల్లో మార్కెట్లో బస్తా సిమెంట్ రూ.260 కొనుగోలు చేద్దామనుకుంటే ఒక్కో బస్తాకు రూ.185 మాత్రమే ఇస్తామని అధికారులు చెప్పడంతో ఏం చేయాలో తోచక ఇందిరమ్మ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క ఇసుక, స్టీల్ కొరతతో ఇందిరమ్మ గృహ నిర్మాణాలు నత్తనడకన సాగేందుకు కారణమని చెప్పవచ్చు. -
19న డీఆర్సీ
విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి: జిల్లా అభివృద్ధి సమీక్ష మండలి(డీఆర్సీ) సమావేశం ఈనెల 19న నిర్వహించనున్నారు. సహకారశాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డిని జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఇటీవల సీఎం నియమించారు. డీ డీఆర్సీ సమావేశం జరిగి దాదాపు ఏడాదవుతోంది. వెంటనే సమావేశం నిర్వహించాలని మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఇన్చార్జ్ మంత్రిని కోరారు. ఇన్చార్జ్ మంత్రి కోటాలో ఇందిరమ్మ ఇళ్లు, ఇతర పనుల మంజూరు అంశం చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉంది. దీనికి తోడు వచ్చే నెలలలో అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో సమావేశం నిర్వహించి వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించుకోవాలని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ఈనెల 19న ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమావేశం జరుగుతుందని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఇందుకు సంబంధించిన సమాచారం, నివేదికలు సిద్ధం చేయాలని ఇన్చార్జ్ మంత్రి ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రతిపక్షంతో పాటు స్వపక్ష సభ్యులు సైతం నీలం తుపాను నష్టపరిహారం పంపిణీ, ఇటీవల వచ్చిన పైలిన్, లెహర్ తుపానుల వల్ల జరిగిన పంట, ఇతర ఆస్తి నష్టం అంచనాలపై సమగ్రంగా కసరత్తు చేసి సవివరణ నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. -
ఇందిరమ్మ ఇళ్లు,రేషన్‌కార్డులకు ఎట్టకేలకు మోక్షం?
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం ఎట్టకేలకు ముహుర్తం ఖరారు చేసింది. ఈ నెల 11 నుంచి 26వ తేదీ వరకు జరిగే రచ్చబండ కార్యక్రమంలో రేషన్‌కార్డులను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఏళ్ల తరబడి కార్డుల కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తుదారుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తర్వాత కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి రాష్ట్ర సర్కారు ఫుల్స్టాప్ పెట్టింది. అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ సర్వే పేరిట అడ్డగోలుగా కార్డులను ఏరివేసింది. సర్వేలో శాస్త్రీయత లోపించడంతో అర్హుల కార్డులకు కూడా కోత పడింది. ఆ తర్వాత ఆధార్ కార్డుల జారీతో ప్రభుత్వం కొత్త కార్డుల జోలికి వెళ్లలేదు. ఈ క్రమంలోనాలుగేళ్ల నుంచి నూతన కార్డుల జారీని నిలిపివేయడంతో జిల్లావ్యాప్తంగా సుమారు లక్ష దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయి. 2వ విడత రచ్చబండ లో జిల్లావ్యాప్తంగా 1,32, 340 మంది కొత్త కార్డులకు అర్జీలు పెట్టుకోగా, వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన యంత్రాంగం 74, 198 మాత్రమే అర్హమైనవిగా తేల్చింది. అదే సమయంలో రచ్చబండ తర్వాత వివిధ రూపాల్లో వచ్చిన 29, 572 అర్జీలలో స్పష్టతలేని ఐదు వేల దరఖాస్తులను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో సుమారు లక్ష మంది దరఖాస్తుదారులు కొత్త కార్డుల కోసం వేచిచూస్తున్నారు. కార్డుల జారీకి అర్హులుగా తేల్చిన లబ్ధిదారుల వివరాలను పూర్తిగా కంప్యూటరీకరించిన పౌరసరఫరాల శాఖ.. ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే వీటిని పంపిణీకి తెరలేపేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే వారంలో జరిగే రచ్చబండలో వీటిని లబ్ధిదారులకు అందజేయాలని భావిస్తోంది. 40వేల మందికి సొంతింటి భాగ్యం! ఇక ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు కూడా మార్గం సుగమమైంది. వచ్చే ఎన్నికల్లో లబ్ధిపొందాలని భావిస్తున్న అధికార పార్టీ ఎన్నికల వేళ కొత్త ఇళ్ల నిర్మాణానికి పచ్చజెండా ఊపుతోంది. రచ్చబండ 1, 2వ విడతలలో వచ్చిన దరఖాస్తులను వడపోసిన గృహనిర్మాణ శాఖ.. వాటిని ఆన్లైన్లో పొందుపరిచింది. జిల్లావ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాల్లో 77వేల మంది ఇందిరమ్మ గృహాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తహసీల్దార్, ఎంపీడీఓ, ఏఈ(హౌసింగ్) నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను ఎంపిక చేసింది. వీటన్నింటినీ కంప్యూటర్లో అప్లోడ్ చేసిన యంత్రాంగం.. వీటిలో దాదాపు 37వేల మందికి జిల్లా ఇన్చార్జి మంత్రి కోటా (జీఓ 33, 44) కింద మోక్షం కలిగించింది. జిల్లాలోని తొమ్మిది గ్రామీణ నియోజకవర్గాలకు రెండు వేల చొప్పున ఇళ్లను మంజూరు చేసిన సర్కారు.. రెండు దఫాల్లో 36వేల ఇళ్ల నిర్మాణాలకు నిధులు విడుదల చేసింది. అలాగే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన విచక్షణాధికారంతో మేడ్చల్‌కు రెండు వేల ఇళ్లు, మహేశ్వరం సెగ్మెంట్‌కు వేయి ఇళ్లను అదనంగా మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో పెండింగ్ జాబితా సగానికి తగ్గింది. కేవలం 40వేల మంది దరఖాస్తుదారులు మాత్రమే ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల ‘క్యూ’లో ఉన్నారు. వీరందరికీ ఈసారి రచ్చబండలో సొంతింటి భాగ్యం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జిల్లా గృహానిర్మాణశాఖ కూడా లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. -
‘కాలనీ’ కష్టాలు
సాక్షి, కొత్తగూడెం: ఇందిరమ్మ ఇళ్ల పథకం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లాలో పలు ఇందిరమ్మ కాలనీలు ఏర్పాటు చేసినా.. వాటిలో వసతులు కల్పించడంలో విఫలమైంది. దీంతో లబ్ధిదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. మంచినీరు, డ్రెయినేజీ సమస్యలు పరిష్కరించాలని వారు ఆందోళన చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఇందిరమ్మ పథకం మొదటి, రెండో దశల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం 25 కాలనీలను తీసుకుంది. ఇందులో ఖమ్మం డివిజన్లో 19, ఇల్లెందు డివిజన్లో 2, కొత్తగూడెం డివిజన్లో 4 ఉన్నాయి. అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వడం ఈ పథకం ఉద్దేశం. అంతేకాకుండా ఆయా కాలనీల్లో మంచినీరు, విద్యుత్, సీసీ రోడ్లు, డ్రెయినేజీ వంటి సౌకర్యాలు కల్పించాలి. కానీ ఏళ్లు గడుస్తున్నా ఈ కాలనీల్లో పూర్తిస్థాయిలో వసతులు లేవు. కాలనీ ఏర్పాటులో ముందుగా విద్యుత్ సౌకర్యం కల్పించాల్సి ఉండగా, ఇళ్ల నిర్మాణం పూర్తయినా ఆ సౌకర్యం లేదు. దీంతో కాలనీల్లో అంధకారం నెలకొంది. కనీసం మంచినీటి వసతి కూడా లేకపోవడంతో ఈ ఇళ్లలో నివాసం ఉండేవారు సుదూర ప్రాంతాలకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. లబ్ధిదారుల అవసరాల నిమిత్తం ఆయా కాలనీల్లో చేతి పంపులు కూడా వేయలేదు. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు వేసినా.. వైర్లు లాగడంలో ట్రాన్స్‌కో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులను ఇన్ని సమస్యలు పట్టిపీడిస్తున్నా.. పరిష్కరించాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. సాగుతున్న పనులు.. ఖమ్మం నగర సమీపంలో ఉన్న వెంకటగిరి ఇందిరమ్మ కాలనీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 2008లో ఇక్కడ ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. ఇంటి స్థలం ఇవ్వడంతో లబ్ధిదారులు అప్పోసప్పో చేసి ఇళ్లు నిర్మించుకున్నా ఇప్పటి వరకు ఈ కాలనీల్లో పూర్తి స్థాయిలో కరెంట్, మంచినీటి వసతి లేదు. దీంతో కొంతమంది ఆ ఇళ్లను వదిలేసి ఖమ్మం నగర శివారు ప్రాంతంలో అద్దెకు ఉంటూ కూలికి వెళ్తున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి వసతి అంటూ ఏళ్లుగా పనులను సాగదీస్తుండడం గమనార్హం. ఇప్పటికి ఐదేళ్లు పూర్తయినా ఈ కాలనీల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. డ్రైనేజీలు లేక ఇళ్ల పరిసర ప్రాంతాలు మూరికి కూపాలుగా మారి దోమలు స్వైర విహారం చేస్తుండడంతో కాలనీవాసులకు విషజ్వరాలు ప్రబలుతున్నాయి. అయినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తమను పట్టించుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా.. కాలనీల్లో వసతులు కల్పించాలని ప్రతి గ్రీవెన్స్‌డేలో మొరపెట్టుకుంటున్నా ఫలితం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. గ్రీవెన్స్‌డేలో ఎక్కువగా ఇందిమర్మ ఇళ్ల బిల్లులు చెల్లించడం లేదని, కాలనీల్లో సమస్యలు పరిష్కరించాలని వినతులు అందుతున్నాయి. ఈ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. దీంతో లబ్ధిదారులు మళ్లీ గ్రీవెన్స్బాట పడుతున్నారు. ఖమ్మం సమీపంలో ఉన్న కాలనీ పరిస్థితే ఇలా ఉంటే.. జిల్లాలోని మిగతా కాలనీల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా మౌలిక వసతులు కల్పించాల్సిన ఆయా శాఖల ముఖ్య అధికారులు మాత్రం తమ పరిధిలో అన్ని పనులు సవ్యంగా సాగుతున్నాయని ఎవరికి వారు చెపుతున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్పందించి అధికారులపై ఒత్తిడి తేకుంటే ఇక ఈ కాలనీలు లబ్ధిదారులు నివాసం ఉండడానికి వీలు లేకుండా శిథిలావస్థకు చేరుకునే ప్రమాదం ఉంది. -
ఇల్లు రాసుకోండి.. పైసల్ తీసుకోండి!
సిద్దిపేట, న్యూస్‌లైన్: పేదలు మరీ ముఖ్యంగా బడుగూ, బలహీన వర్గాల్లో సొంత గూడంటూ లేని వారి కోసం ప్రభుత్వం గృహ నిర్మాణ సంస్థ ద్వారా పక్కా ఇళ్లు కట్టిస్తోంది. గత సంవత్సరం వరకు ఒక్కో ఇల్లుకు రూ.42 వేలు చెల్లించింది. స్టీలు, సిమెంటు, ఇసుక వంటి ప్రధాన సామగ్రి ధరలకు రెక్కలు రావడంతో ఆ మొత్తాన్ని దాదా పు రెట్టింపు చేస్తూ సవరించింది. రాయితీ గృహాలకు పెంచిన ఆర్థిక సహాయాన్ని ఈ ఏడాది నుంచి అమలు చేస్తోంది. సిద్దిపేట నియోజవకర్గంలోని సిద్దిపేట అర్బన్, రూ రల్, చిన్నకోడూరు, నంగునూరు మండలాల్లో కలిపి ‘ఇందిరమ్మ ఇల్లు’ పేరిట మొత్తం రెండు వేల పక్కా గృహాలను సర్కారు ఈ ఆర్థిక సంవత్సరానికిగాను మంజూరు చేసింది. ‘అదనం’లోనే అక్రమాలు! గత ఏడాదిలో జీఓ నంబర్ 171 ద్వారా అదనపు ఇళ్లను గృహ నిర్మాణ శాఖ మంజూరు చేసింది. వాటిల్లో కొన్నిచోట్ల అక్రమాలు కూ డా ‘అదనం’గానే జరిగాయని తెలుస్తోంది. చి న్నకోడూరు మండలం రామంచలో ఓ వ్యక్తిని లబ్ధిదారుగా జాబితాలో పేర్కొన్నారు. నిజానికి అతడు ఆ ఊరిలోనే నివాసం ఉండడం లేదు. అక్కడాయనకు ఇల్లు కూడా లేదు. ఆ గ్రామానికి శనివారం వెళ్లి వాకబు చేసిన ‘న్యూస్‌లైన్’కు ఈ విషయం ప్రాథమికంగా నిర్ధారణ అయింది. అలాంటి అక్రమ లబ్ధిదారుడికి విడతలవారీగా రూ.42 వేలు చెల్లించినట్లు తెలుస్తోంది. అలా...మూడు దఫాలుగా బిల్లులు ఇచ్చినట్లు సమాచారం. చివరి ఇన్స్టాల్మెంటు గత ఫిబ్రవరి 11న విడుదల చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కొందరికి కల్పతరువు. నియోజవకర్గంలోని కొన్ని గ్రామాల్లో పలుకుబడిగల కొందరు వ్యక్తులకు గృహ నిర్మాణ శాఖ కల్పతరువుగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరు అధికారులతో చేతులు కలిపి...తమ విలాసవంతమైన జీవన వ్యయానికి వీలునుబట్టి బినామీ/బోగస్ పేర్లతో పక్కా గృహాలు నిర్మించినట్లు రికార్డులు సృష్టింపజేసి యథేచ్ఛగా డబ్బులు కాజేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది బహిరంగ రహస్యేమనని, సదరు అధికారులు, వ్యక్తులను ఎవరూ ఏమీ చేయలేరని కొందరు స్థానికులు ‘న్యూస్‌లైన్’తో పేర్కొనడం గమనార్హం. గృహ నిర్మాణాల్లో అక్రమాల బాగోతం ఆరోపణలపై చిన్నకోడూరు హౌసింగ్ ఏఈ మహేందర్ వివరణ కోసం ‘న్యూస్‌లైన్’ శని, ఆదివారాల్లో పలుమార్లు ప్రయత్నించింది. ఆయన సెల్‌ఫోన్ స్విచాఫ్ అని వచ్చింది. మా దృష్టికి రాలేదు... పక్కా ఇళ్లల్లో అక్రమాలు జరిగినట్లు మా దృష్టికి రాలేదు. అసలు అలా జరిగేందుకూ ఆస్కారమే లేదు. అలాంటివి ఎక్కడైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. చర్యలు తీసుకుంటాం. డబ్బులు రికవరీ చేస్తాం. అయినా...చిన్నకోడూరుకు సంబంధించి మీరు (న్యూస్లైన్ను ఉద్దేశిస్తూ) ఏఈని అడగాల్సింది. -సత్యనారాయణ, డీఈఈ, హౌసింగ్, సిద్దిపేట కొసమెరుపు..! డీఈఈని వివరణ కోసం ఫోన్లో ‘న్యూస్‌లైన్’ శనివారం సాయంత్రం సంప్రదించిన కొద్దిసేపట్లోనే సదరు అక్రమ లబ్ధిదారుడికి తెలిసిపోయింది. ఆయన క్షణాల్లోనే తేరుకొని గ్రామంలోనూ, ఇతరత్రా ఆరా తీయడం గమనార్హం. అంటే దీన్నిబట్టి కొందరు అధికారుల పాత్రపైనా అనుమానాలు మొలకెత్తుతున్నాయి. -
ఇందిరమ్మా.. బిల్లేదమ్మా?
' సుమారు రెండేళ్ల కిందట కట్టుకున్న కొత్త ఇంటి ఎదుట దీనంగా నిల్చున్న ఈమె పేరు కోల పద్మ. నర్సింహులపేట మండలంలోని పెద్దముప్పారం గ్రామం. పద్మకు భర్త వీరయ్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తలు వ్యవసాయ కూలీ పనులు చూసుకుంటారు. గుడిసెలో నివాసం ఉంటున్న వీరికి మూడేళ్ల కిందట ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని అధికారులు కాగితం పంపారు. గుడిసె పక్కనే ఉన్న ఖాళీ జాగాను కొనుక్కొని మూడేళ్ల కిందటే ఇంటి పనులు మొదలు పెట్టారు. పునాది, స్లాబ్, గోడలు.. ఇలా అధికారులు చెప్పినప్పుడల్లా ఫొటోలు దిగి బిల్లు కోసం ఇచ్చారు. ఇలా ఇచ్చి ఏడాదిన్నర దాటింది. అప్పటి నుంచి ఇందిరమ్మ బిల్లు కోసం తిరుగుతూనే ఉన్నారు. పైసలొస్తాయంటూ అధికారులు చెప్పడంతో అందినకాడల్లా అప్పులు తెచ్చారు. మొత్తానికి ఏడాది కిందట ఇల్లు పూర్తయింది. సుమారు రూ.1.80లక్షలు ఖర్చు చేశారు. ఇందిరమ్మ పథకం కింద రూ.65వేలు ఇస్తున్నామని ఇటీవలే అధికారులు చెప్పడంతో కొంత సంబరపడ్డారు. కానీ ఇప్పటికే బస్సు కిరాయిలు పెట్టుకుని కార్యాలయాల చుట్టూ తిరిగారు. అయినా బిల్లు మాత్రం రాలేదు. ‘‘ముగ్గురు ఆడపిల్లలు.. సొంతిల్లు ఉండాలని ధైర్యం చేసినం. సర్కారు కూడా ఇల్లు మంజూరు చేసింది. వేన్నీళ్లకు చన్నీళ్లు అన్నట్టు ఇల్లు కట్టుకున్నం. బిల్లు కోసం ఏడాది నుంచి ఇందిరమ్మ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నం. కూలీ పనులు చేస్తేనే పూట గడుస్తది. ఇప్పుడు చేస్తున్న పనిని ఇడిసిపెట్టి ఇంటి బిల్లు కోసం తిరుగుతున్నం. చివరకు కుటుంబ పోషణ, పిల్లల చదువుల కోసం చేసిన అప్పు పెరిగిపోయింది. ఇక చేసేది లేక కట్టుకున్న ఇంటిని అమ్ముకుందామనుకుంటానం.’’ - దంపతులు పద్మ, వీరయ్య వరంగల్, న్యూస్‌లైన్ : ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నా బిల్లులు మాత్రం రావడం లేదు. రెండు నెలలుగా బిల్లులు మళ్లీ పెండింగ్‌లో పడ్డాయి. బీబీఎల్, ఆర్ఎల్ వరకు 1.01 లక్షల ఇళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో కొ న్ని నిర్మాణాలు మూడేళ్ల కిందటే ప్రారంభించగా.. మరికొన్ని ఇటీవలే మొదలుపెట్టారు. సంబంధిత అ దికారులకు తీరిక లేకపోవడంతోనే వాటికి బిల్లులు రావడం లేదు. ఫలితంగా జిల్లాలో రూ.5కోట్ల వరకు ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లులు బాకీ పడ్డాయి. అధికారులకు టైం లేదట పనులు మొదలుపెట్టిన ఇళ్లను బీబీఎల్ వరకు ఈఈలు స్వయంగా పరిశీలించాలి. వారే తొలి బిల్లును విడుదల చేయాలి. కానీ.. ఎక్కువ గ్రామా లు ఉండటంతో వీటి గురించి పట్టించుకోవడం లేదు. ఈఈలకు ఇన్చార్జి మండలాలు ఉండటంతో వాటిని తిరిగి పరిశీలించే సమయం లేదంటూ చేతులెత్తేస్తున్నారు. దీంతో ఇళ్ల బిల్లులు అందక లబ్ధిదారులు అవస్థ పడుతున్నారు. వరంగల్ ఈఈ రమేష్ రూరల్, అర్బన్, నర్సంపేట డివిజన్లకు ఈఈగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జనగామ ఈఈ రాజశేఖర్‌కు జనగామ, మహబూబాబాద్, ములుగు డీఈ వసంతరావుకు అక్కడే ఈఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రతీ డివిజన్‌కు ఈఈలు లేకపోవడం, క్షేత్రస్థాయిలో మండలాల నుంచి అధికారులు సకాలంలో జాబితా పంపించకపోవడంతో బిల్లులకు ఆలస్యమవుతోంది. బిల్లులేవీ..? సుమారు 21వేల ఇళ్లకు బిల్లులు సిద్ధం చేసిన అధికారులు వాటిని ప్రభుత్వానికి పంపించారు. కానీ అక్కడి నుంచి బ్యాంకులకు నగదు బదిలీ చేయకపోవడంతో లబ్ధిదారులు నిత్యం ఎదురుచూస్తున్నారు. ఒకవేళ బ్యాంకు ఖాతాల్లో జమ చేశారా.. అనే ఆశతో వాటి చుట్టూ తిరుగుతున్నారు. కానీ ప్రభుత్వం సీమాంధ్ర ఉద్యమంతో లింకు పెట్టడం, దీంతో గృహ నిర్మాణ విభాగంలో ఫైల్ కదలడం లేదంటూ బిల్లులను నిలిపివేశారు. జిల్లాలో సుమారు లక్ష మంది లబ్ధిదారులకు రూ.5కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉంది. కొసమెరుపు కాగా, అర్హులైన లబ్ధిదారులకు బిల్లులివ్వని అధికారుల విషయం ఇక్కడే బయటపడుతోంది. ఏడాది కాలంగా బిల్లులు రావడం లేదని మొత్తుకుంటున్న కోల పద్మ స్వగ్రామంలోనే రూ.30లక్షల అవినీతి వెలుగుచూసింది. నర్సింహులపేట మండలం పెద్దముప్పారంలో ఇళ్లు నిర్మించకుండానే కొందరు బిల్లులు తీసుకున్నారని, స్థానిక నాయకులు బిల్లులు స్వాహా చేశారని, దీనిపై సర్వే చేయడంతోపాటు కేసు నమోదు చేసి, నిధులు రికవరీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇల్లు నిర్మించుకున్న పద్మకు మాత్రం రూపాయి విడుదల కాలేదు. అన్ని నిబంధనలున్నా బిల్లులు రాని లబ్ధిదారులు ఇప్పుడు లక్షల్లో ఉన్నారు. -
‘ఇందిరమ్మ’ చెల్లింపులపై సర్కారు చిన్నచూపు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సర్కారు చిన్నచూపు చూస్తోంది. ఇళ్ల నిర్మాణం పూర్తయిన బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తోంది. గృహ నిర్మాణశాఖ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందిరమ్మ, రచ్చబండ కింద మూడు విడతలుగా మంజూరై ఇళ్లకు బిల్లులు నిలిచాయి. అప్పులు చేసి ఇళ్లను నిర్మించుకున్న లబ్ధిదారులు రోడ్డెక్కుతున్నారు. గృహనిర్మాణ సంస్థ లెక్కల ప్రకారం జిల్లాలో రూ.42 కోట్ల మేర బిల్లులు నిలిచాయి. లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. నిలిచిన నిర్మాణాలు ఇందిరమ్మ, రచ్చబండ, ఆర్అండ్ఆర్ పథకాల కింద జిల్లాకు 3,30,961 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 2,75,735 ఇళ్లు గ్రౌండింగ్ కాగా, ఇప్పటివరకు 2,03,705 ఇళ్లు పూర్తయినట్లు గృహనిర్మాణ సంస్థ రికార్డులు చెప్తున్నాయి. 25,949 ఇళ్లు పునాది, 9,214 లెంటల్ లెవెల్, 25,702 రూప్ లెవెల్, 1,27,258 ఇళ్లు వివిధ నిర్మాణ దశలో ఉన్నాయి. ఇందిరమ్మ మొదటి విడతలో 93,386 ఇళ్లు మంజూరైతే అందులో 91,108 ఇళ్లు గ్రౌండింగై 76,070 ఇళ్లు పూర్తి చేయగా లక్ష్యంగా 83 శాతంగా ఉంది. రెండో విడతలో 1,05,895 ఇళ్లకు 73, 219 ఇళ్లు పూర్తి కాగా 75 శాతం, మూడో విడతలో 72,764 ఇళ్లకు 36,838 ఇళ్లు పూర్తయి 65 శాతం లక్ష్యం నెరవేరాయి. మొదటి విడత రచ్చబండ 16,411 ఇళ్లకు 8,494 పూర్తి కాగా 62 శాతం, రెండో విడత రచ్చబండలో 19,157కు 3,404 ఇళ్లు పూర్తి కాగా 46 శాతం లక్ష్యం నెరవేరింది. జీవో 44 కింద మంజూరైన 10,324 ఇళ్లలో 23 గ్రౌండింగ్ కాగా ఒకే ఇల్లు పూర్తయింది. మంపు బాధితులకు 3,647 ఇళ్లు మంజూరైతే అందులో 941 పూర్తి చేసిన అధికారులు 14 శాతంతో లక్ష్యాన్ని సరిపెట్టారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు కలిసిరాని పథకం ఇందిరమ్మతోపాటు వివిధ పథకాల కింద మంజూరైన 3,30,961 ఇళ్లలో 2,03,705 పూర్తి కాగా, పూర్తయిన ఇళ్లతోపాటు వివిధ స్థాయిల్లో ఉన్న వాటికి రూ.893.30 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే ఈ రెండు, మూడు నెలల్లో పూర్తయిన, అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు చెందిన లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు నిలిచాయి. బకాయిల వివరాలపై ‘సాక్షి’ ఆరా తీయగా కచ్చితంగా చెప్పలేమని గృహనిర్మాణ శాఖ అధికారులు చెప్పారు. ఆన్లైన్లోనే ఉంటాయని సెలవిచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఒకటి, రెండు మాసాల్లో నిలిచిన బిల్లులు సుమారు రూ.42 కోట్లకు పైగా ఉంటాయంటున్నారు. ఇందిరమ్మ పథకం కింద ఎస్సీ లబ్ధిదారులైతే రూ.లక్ష, ఎస్టీలైతే రూ.1.05 లక్షలు, బీసీ/ఇతరులకు రూ.80 వేలు చెల్లిస్తారు. పట్టణాల్లో నివసించే బీసీ/ఇతరులకైతే ఓ రూ.10 వేలు అదనంగా చెల్లిస్తారు. గృహనిర్మాణ శాఖ నిబంధనలకు ప్రకారం లబ్ధిదారులు ఏ కులానికి చెందిన వారైనా ఇళ్ల నిర్మాణ స్థాయిలను బట్టి అన్లైన్ ద్వారా బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇళ్ల నిర్మాణ ప్రగతి నివేదికలను ఆన్లైన్లో అనుసంధానం చేయడం, సిబ్బంది కొరత వల్ల బిల్లులు నిలిచాయని అధికారులు చెప్తున్నారు. అప్పు చేసి ఇళ్లు కట్టుకుంటే, బిల్లులు ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏమిటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.