చొప్పదండి: ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను టీఆర్‌ఎస్ ప్రభు త్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేం ద్రంలో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ఓ లబ్ధిదారుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. సోమవారం లబ్ధిదారులు మూకుమ్మడిగా ప్రధాన రహదారిపై రెండుగంటలకుపైగా రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వీరికి కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు.
చొప్పదండిలోని బీసీ కాలనీ సమీపంలో అప్పటి సీఎం వైఎస్సార్ నిరుపేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు 14 ఎకరాలు కొనుగోలు చేశారు. అందులో 291 మందికి గుంట చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చి పట్టాలు పంపిణీ చేశారు. డబుల్ బెడ్రూం నిమిత్తం నిర్మాణాలు లేని స్థలాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీంతో లబ్ధిదారుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. రెండురోజుల క్రితం మంత్రి ఈటల రాజేందర్ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనకు రాగా లబ్ధిదారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వైఎస్సార్ ఇచ్చిన పట్టాలే తమకు కావాలని బాబు అనే బాధితుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుబోయాడు.
Comments
Please login to add a commentAdd a comment