సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో దాదాపు 50 వేల ఇందిరమ్మ ఇళ్లు రద్దు కానున్నాయి. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంపై అవగాహ న కల్పించినప్పటికీ, వివిధ కారణాలతో వారు పనులు మొదలు పెట్టలేదు. దీంతో సదరు ఇళ్లను రద్దు చేసి, కొత్తవారికి కేటాయించాలని గృహ నిర్మాణ సంస్థ అధికారులు యోచిస్తున్నారు. ఇప్పటికే రెండుమూడు సార్లు నోటీసులు కూడా జారీ చేశారు. 31,341 వేల ఇంది రమ్మ ఇళ్లను లబ్ధిదారులు ఇప్పటి వరకు ఇంకా ప్రారంభించలేదు. 21,387 ఇళ్లు మంజూరైనప్పటికీ, సంబంధిత బ్యాంకులలో లబ్ధిదారులు తమ ఖాతాలను ప్రారంభించలేదు. దీంతో ఇవి నమోదుకే పరిమితమయ్యాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ వ్యయ రుణాన్ని రూ. 70 వేలు, ఎస్సీ, ఎస్టీలకైతే రూ. లక్ష వరకు పెంచినప్పటికి ని ఇళ్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. సత్వరమే నిర్మాణాలు చేపట్టాలని అధికారులు సూచించినా వారు ఆసక్తి చూప డం లేదు. అందుకే అధికారులు రద్దు నిర్ణయం తీసుకున్నారు.
లక్ష్యానికి దూరంగా
లక్ష్యానికి దూరంగా ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కొనసాగిం చేందుకు జిల్లా గృహ నిర్మాణ సంస్థ తీవ్ర కసరత్తు చేస్తోంది. మండల స్థాయి అధికారులకు టార్గెట్లు విధిం చి ఇళ్ల నిర్మాణంపై ఒత్తిడి పెంచుతోంది. 2013-14 సంవత్సరంలో జిల్లాలో 19,621 ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణం చేపట్టాలని గృహ నిర్మాణ సంస్థ అధికారులకు నిర్దేశించగా ఇప్పటి వరకు 7,836 ఇళ్లు పూర్తి చేశారు. 2006 నుంచి 1,95,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 1,19,691 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశలలో ఉన్నాయి.
సామగ్రి పంపిణీకి రంగం సిద్ధం
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లను సాధ్యమైన మేర కు పూర్తి చేయాలని యోచిస్తోంది. ప్రజల్లో సానుభూ తిని పొందేందుకు స్లాబుదశలో ఉన్న ఇళ్ల నిర్మాణం కోసం సామగ్రిని పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు జిల్లా గృహ నిర్మాణశాఖ సిబ్బంది సంబంధిత లబ్ధిదారుల నుంచి అంగీకారపత్రాలను సేకరిస్తున్నారు. జిల్లాలో రూప్‌లెవల్‌లోనే నిలిచిపోయిన ఇళ్లు 5,576 వరకు ఉన్నాయి. ఈ ఇళ్ల నిర్మాణం కోసం అవసరమయ్యే సిమెంట్, స్టీల్, ఇటుక తదితర మెటీరియల్‌ను అందిచేందుకు అన్నివిధాలుగా అధికార గణం చర్యలు చేపట్టనుంది. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక లబ్ధిదారులకు బిల్లులు అందజేసేటప్పుడు పంపిణీ చేసిన సామగ్రికి సంబంధించిన డబ్బులు మినహాయిం చుకుంటారు.
కట్టకుంటే ఇల్లు గాయబ్
Published Tue, Jan 14 2014 6:30 AM | Last Updated on Sat, Sep 15 2018 3:18 PM
Advertisement