![Cm Revanth Reddy Meets Aicc President Mallikarjun Kharge](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/Revanthreddy_congress1.jpg.webp?itok=d3sOzmpP)
సాక్షి, ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం వివరించారు. ఈ అంశాలపై నిర్వహించే సభలకు రావాలని ఖర్గేను ఆహ్వానించారు.
కాగా, నిన్న (గురువారం) హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్‌ఆర్‌డీ)లో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. సుమారు ఐదుగంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో సీఎంతోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ, ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశాలు తదితర అంశాలపై చర్చించారు.
ఇదీ చదవండి: గీత దాటితే వేటే..!
సూర్యాపేటలో కులగణన సభకు రాహుల్ గాంధీని, మెదక్ ఎస్సీ వర్గీకరణ సభకు ఖర్గేను ఆహ్వానిస్తామని తెలిపారు. ఇక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వచ్చిన ఆదాయాన్ని ఏ విధంగా వ్యయం చేస్తున్న అంశాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్టు తెలిసింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నెన్ని నిధులిచ్చారనే అంశాన్ని కూడా భట్టి ఇందులో వివరించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment