సాక్షి, ఢిల్లీ: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కిషన్‌రెడ్డి నివాసానికి వచ్చిన సీఎం.. రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు తదితర ప్రాజెక్టులకు నిధుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. సింగరేణికి బొగ్గు గనులు తదితర అంశాలపై కేందమంత్రితో సీఎం చర్చించారు. అనంతరం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. విద్యారంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
కాగా, ఏఐసీసీ పెద్దలను కూడా సీఎం రేవంత్ కలిసే అవకాశముంది. కేబినెట్ విస్తరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేబినెట్‌లో చోటు కోసం అధిష్టానం పెద్దల చుట్టూ ఆశావహలు చక్కర్లు కొడుతున్నారు.
రంగారెడ్డి నుంచి తనకు అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ పెద్దలను ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కలిశారు. బీసీ వర్గం నుంచి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అవకాశం కోరుతున్నారు. ఆదిలాబాద్ నుంచి తనకు ఛాన్స్ ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ అడుగుతుండగా, మరో వైపు.. ఎస్సీ కోటాలో మంత్రి పదవి కోసం వివేక్ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
Comments
Please login to add a commentAdd a comment