రంగారెడ్డి జిల్లా తాండూరు మండల పరిధిలోని గొల్లచెరువు గ్రామంలో అతిసార ప్రబలింది. గ్రామంలోని 75 మంది అతిసార బారిన పడ్డారు.
తాండూరు : రంగారెడ్డి జిల్లా తాండూరు మండల పరిధిలోని గొల్లచెరువు గ్రామంలో అతిసార ప్రబలింది. గ్రామంలోని 75 మంది అతిసార బారిన పడ్డారు. దీంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో రోగులకు సరిపడ మంచాలు లేక ఓ మంచంపై ఇద్దరు రోగులను పడుకోపెట్టి వైద్యం అందిస్తున్నారు. దాంతో రోగులు తీవ్ర అసౌక్యం చెందుతున్నారు. అతిసార ప్రబలినా ... అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంతో... రోగుల కుటుంబ సభ్యులు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.