తాండూరు: ప్రమాద రహిత వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తాండూరు ఆర్టీసీ డిపో మేనేజర్ కృష్ణమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితోపాటు ఆర్టీసీ ఈడీ, ఆర్‌ఎం, హైదరాబాద్ 1, 2, పికెట్, వికారాబాద్, పరిగి, తాండూరు డిపోలకు చెందిన అధికారులు పాల్గొంటారని ఆయన వివరించారు.