Conclusion
-
ప్లాంట్‌పై అసెంబ్లీ తీర్మానం చేస్తాం: సీఎం జగన్
విశాఖపట్టణం: కేంద్రం నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్‌పై అనుకూలంగా బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఇప్పటికే ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు గుర్తుచేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై పరిరక్షణ కమిటీ ప్రతినిధులు విశాఖపట్టణంలో బుధవారం సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. సుమారు గంట 20 నిమిషాలు సీఎం జగన్ కార్మిక నాయకులతో మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రధానికి రాసిన లేఖతో పాటు విశాఖ ఉక్కు అవసరమైన గనులపై సుదీర్ఘంగా చర్చించారు. గతంలో ఓఎన్ఎండీసీతో గనులతో జరిగిన ఒప్పందంపై పునఃసమీక్ష ఇస్తామని సీఎం చెప్పారు. పొస్కో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు వచ్చే అవకాశాలు ఉండవని స్పష్టం చేశారు. పోస్కో ప్రతినిధులు కలిశారని, కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టమని సూచించినట్లు తెలిపారు. కుదరకపోతే శ్రీకాకుళం జిల్లా భావనపాడు కృష్ణపట్నం పోస్టుల వద్ద ఆ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే పోస్కోకు సహకరిస్తామని కార్మిక నాయకులతో సీఎం జగన్ తెలిపారు. దేవుని ఆశీస్సులతో స్టీల్ ప్లాంట్ విషయంపై కేంద్రం ఆలోచనలో మార్పు వస్తుందని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో ఇనుప ఖనిజం నిల్వలు లేవు, ఉన్నవి చాలా లోగ్రేడ్ గనులున్నాయని సీఎం జగన్ తెలిపారు. ఒడిశాలో ఈ ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయించాలని కోరినట్లు చెప్పారు. రుణాలను ఈక్విటీల రూపంలోకి మారిస్తే వడ్డీల భారం తగ్గుతుందని పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థ, దానిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు లేవని స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు తాము నిజాయతీగా, చిత్తశుద్ధితో ఉన్నామని తెలిపారు. పోస్కోవాళ్లు రాష్ట్రానికి రావడం వాస్తవం, నన్ను కలవడం వాస్తవమని, కడప, కృష్ణపట్నం, భావనపాడు చోట్ల ఫ్యాక్టరీ పెట్టమని వారిని కోరినట్లు సీఎం జగన్ వివరించారు. కార్మిక నాయకుల హర్షం సమావేశం అనంతరం కార్మిక సంఘ నాయకులు మీడియాతో మాట్లాడారు. గంటకుపైగా కొనసాగిన సమావేశంలో సీఎం జగన్ మాటలతో తమకు భరోసా వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ స్పందన ఉద్యమానికి ఊపిరి పోసినట్టు అయ్యిందని పేర్కొన్నారు. ప్రధానికి రాసిన లేఖతోపాటు విశాఖ ఉక్కుకు అవసరమైన గనులపై చర్చించినట్లు వివరించారు. విశాఖ ప్లాంట్‌పై ఇప్పటికే కేంద్రానికి లేఖలో సూచనలు చేసినట్లు తెలిపారు. తమ సమస్యలను సీఎం సానుకూలంగా విన్నారని కార్మిక నేతలు చెప్పారు. స్టీల్ ఉత్పత్తికి అంతరాయం కలగకుండా ఉద్యమం చేయండి అని తమకు సీఎం సూచించినట్లు కార్మిక నాయకులు వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల్లో స్టీల్ ప్లాంటుకు అనుకూలంగా తీర్మానం చేస్తామని సీఎం చెప్పడం శుభపరిణామని హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌తో సమావేశమైన వారిలో 14 మంది కార్మిక సంఘం నాయకులు మంత్రి రాజశేఖర్, సీహెచ్ నర్సింగ్ రావు, జేవీ సత్యనారాయణమూర్తి, వై.మస్తాన్ అప్ప, గంధం వెంకట్రావు, మురళీరాజు, జె.అయోధ్య రామ్, ఆదినారాయణ, కేఎస్ఎన్ రావు, బి.సురేశ్, కె.శ్రీనివాస్, బి.అప్పారావు, బి.పైడ్రాజు, వి.శ్రీనివాస్ ఉన్నారు. ఉన్నత జీవన ప్రమాణాలు అందివ్వడమే లక్ష్యం : సీఎం జగన్ -
మా ఊళ్లో మద్యం వద్దు !
మరికల్ (నారాయణపేట): గాంధీజీ కన్న కలలను సాకారం చేసేందుకు మండలంలోని మాధ్వార్ గ్రామస్తులు అడుగులు వేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం మంగళవారం గ్రామస్తులు తిర్మానం చేశారు. మద్య నిషేధ సమయంలో గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మకాలు చేపడితే రూ.40వేల జరిమానా విధిస్తామని సర్పంచ్ పుణ్యశీల తిర్మానించారు. మహిళా సర్పంచ్ ముందడుగు.. మరికల్ మండలం మాధ్వార్‌లో 845 కుటుంబాలు ఉండగా 3,568 మంది జనాబా ఉంది. ఇటీవల కాలంలో గ్రామంలో మద్యం సేవించి భవిష్యత్‌ను బుగ్గిపాలు చేసుకుంటున్న యువతను మార్చేందుకు మాహిళ సర్పంచ్ పుణ్యశీల ముందుగా నడుం బిగించారు. ఆమె పిలుపు అందుకున్న మిగితా ప్రజాప్రతినిధులు, యువకులు, గ్రామస్తులు, మహిళలు పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు తిర్మానించారు. ఇందుకు గ్రామస్తులు సైతం ముందుకు వచ్చి తమ సంసారాలు బాగుపడుతాయంటే ఇంతకంటే ఏం కావాలంటూ పంచాయతీ కార్యాలయం ఎదుట మద్యం నిషేదిస్తున్నట్లు ప్రతిజ్ఞా చేశారు. ఆగష్టు 15 తర్వాత మాధ్వార్‌లో ఎవరైన మద్యం అమ్మకాలు చేప్పడితే రూ. 40 వేలు జరిమాన విధిస్తామని తిర్మానం చేశారు. అంతలో ఏమైన మద్యం మిగిలివుంటే ఆగస్టు 14 వరకు విక్రయించుకోవాలని వారికి వెసులుబాటు కల్పించి మిగితా గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు. యువత పెడదారి పట్టొద్దనే నిర్ణయం యువత పెడదారి పట్టకుండా ఉండేందుకే గ్రామంలో మద్యం నిషేదించడం జరిగింది. ఇటీవల కాలంలో గ్రామంలో యువకులతో పాటు మహిళలు కూడా మద్యం సేవించి అలర్లకు కారణమవుతున్నారు. మాధ్వార్ గ్రామాన్ని ఒక ప్రశాంతమైన గ్రామంగా తీర్చేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. – పుణ్యశీల, సర్పంచ్, మాధ్వార్ -
మహిళలను వేధిస్తే ఊర్లో ఉండనివ్వం..
వనపర్తి: చిన్నపిల్లలు, మహిళలను మానసికంగా, శారీరకంగా వేధిస్తే.. గ్రామంలో ఉండే అర్హత కోల్పోతారని వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం తాడిపర్తి గ్రామ పంచాయతీలో బుధవారం సర్పంచ్ పద్మమ్మ తీర్మానం చేశారు. ఇటీవల తరుచూ.. మహిళలు, చిన్నపిల్లలపై చోటు చేసుకుంటున్న వరుస సంఘటనల దృష్ట్యా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో తాడిపర్తిలో మహిళలకు అందించాల్సిన పౌష్టికాహారం, సామర్థ్యం అనే అంశంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి గ్రామంలోని మహిళలతో పాటు సర్పంచ్ పద్మమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు గురించి ప్రస్తావన వచ్చింది. గ్రామస్తులంతా ఒక్కతాటిపై ఉండి మన గ్రామంలో ఇలాంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా ముందస్తుగా కఠిన నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలని ఆలోచించారు. వెంటనే ఉపసర్పంచ్ రామకృష్ణ, ఇతర వార్డుల సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రభుత్వ అధికారులను పిలిపించారు. చిన్న పిల్లలు, మహిళలపైగాని అత్యాచారానికి పాల్పడినా.. ప్రయత్నించినా.. అట్టి వారికి గ్రామంలో నివసించే స్థానం ఉండదని తీర్మానం చేశారు. ఈ రోజు నుంచే గ్రామ పంచాయతీ చేసిన ఈ తీర్మానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు, పక్కాగా అమలుచేస్తామని సర్పంచ్ ప్రకటించారు. మహిళలు, పెద్దలు, ఇతర గ్రామస్తులు పంచాయతీ చేసిన తీర్మానానికి సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. గ్రామంలో ఉన్న ఐక్యతను చూసిన ఆర్డీఎస్ సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్డీఎస్ ప్రతిని«ధి శ్రీవాణి, అంగన్వాడీ కార్యకర్తలు, వీఆర్ఓ, ఎఎన్ఎం తదితరులు పాల్గొన్నారు. -
మసూద్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టండి
ఐక్యరాజ్యసమితి: జైషే మహ్మద్ ఉగ్రసంస్థ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేయాలని పేర్కొంటూ నేరుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి ఫ్రాన్స్, బ్రిటన్లు మద్దతు తెలిపాయి. చాలా శక్తిమంతమైన భద్రతామండలిలో నేరుగా అమెరికా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మసూద్‌కు చెందిన ఆస్తులు జప్తు చేసేలా, అతడు ఎక్కడికీ ప్రయాణించకుండా నిషేధాజ్ఞలు విధించాలని అమెరికా కోరింది. దీనిపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ స్పందించారు. ‘బలవంతంగా తీర్మానాన్ని ముందుకు జరపడం ఆపాలి. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అమెరికాను కోరుతున్నాం’ అని అన్నారు. ఈ తీర్మానంపై ఎప్పుడు ఓటింగ్ జరుగుతుందనే విషయంపై స్పష్టతలేదని ఐరాస వర్గాలు చెబుతున్నాయి. 15 మంది (10+5) సభ్యులున్న భద్రతామండలిలో తీర్మానం పాస్ కావాలంటే తొమ్మిది ఓట్లు కావాలి. అయితే శాశ్వత సభ్య దేశాలైన చైనా, రష్యా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లు అడ్డుకుంటూ ఒక్క వీటో కూడా వేయొద్దు. అప్పుడే ఆ తీర్మానానికి ఆమోద ముద్ర పడుతుంది. ఈసారి కూడా ఎప్పటిలాగే చైనా తన వీటో అధికారంతో ఈ తీర్మానాన్ని అడ్డుకునే వీలుందని నిపుణులు చెబుతున్నారు. అల్‌ఖైదా ఉగ్రసంస్థతో మసూద్‌కు సంబంధాలు ఉన్నాయని, ఆర్థికంగా, ప్రణాళికలు రచించడంలో, ఆయుధాల సరఫరా చేయడంలో మసూద్ సహాయం అందిస్తున్నాడని, జైషేమహ్మద్‌కు సహాయసహకారాలు అందిస్తున్నాడని తీర్మానంలో అమెరికా పేర్కొంది. -
వీడియో ఫుటేజీకి సభ తీర్మానం అవసరం
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని ఈ నెల 12న గవర్నర్ ప్రసంగం నాటి వీడియో ఫుటేజీలను తీసుకునేందుకు శాసనసభ తీర్మానం అవసరమని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) గురువారం హైకోర్టుకు నివేదించారు. ఈ నేపథ్యంలో వీడియో ఫుటేజీలను సమర్పించేందుకు మరింత గడువు కావాలని కోరారు. ఈ నెల 22న ఫుటేజీని తమ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి ఈ విషయంపై అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారని ఆయన తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు వీడియో ఫుటేజీల సమర్పణకు ఈ నెల 27 వరకు గడువునిస్తూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తమను శాసనసభ నుంచి బహిష్కరించడంతో పాటు, నల్లగొండ, అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేస్తూ శాసనసభ కార్యదర్శి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలును నిలిపేయాలని కోరుతూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎ.సంపత్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
‘యూజ్లెస్ ఫెలోస్’అనడంపై యువత ఆగ్రహం
-
అల్లాదుర్గం సబ్‌డివిజన్ కోసం తీర్మానం
అల్లాదుర్గం: అల్లాదుర్గంను సబ్‌డివిజన్ చేయాలని కోరుతూ మండల సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి జిల్లా కలెక్టర్‌కు పంపినట్లు ఎంపీపీ రాంగారి ఇందిర బుధవారం విలేకర్లకు చెప్పారు. ఈ నెల 23న మండల సర్వసభ్య సమావేశంలో సబ్‌డివిజన్ సాధన కమిటీ మెమొరాండం సమర్పించిందన్నారు. సభ్యుల ఆమోదంతో తీర్మానం చేసినట్లు తెలిపారు. సబ్‌డివిజన్ అయితే అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. -
రేపు ప్రమాదరహిత వారోత్సవాల ముగింపు
తాండూరు: ప్రమాద రహిత వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తాండూరు ఆర్టీసీ డిపో మేనేజర్ కృష్ణమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితోపాటు ఆర్టీసీ ఈడీ, ఆర్ఎం, హైదరాబాద్ 1, 2, పికెట్, వికారాబాద్, పరిగి, తాండూరు డిపోలకు చెందిన అధికారులు పాల్గొంటారని ఆయన వివరించారు. -
ప్రత్యేక హోదాపై నేడు అసెంబ్లీలో తీర్మానం
సాక్షి, హైద రాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించటంతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయాలని కోరుతూ బుధవారం శాసనసభ ప్రత్యేకంగా తీర్మానం ఆమోదించనుంది. మంగళవారం జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఇప్పటి వరకూ కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు కృతజ్ఞతలు తెలుపుతారు. అదే సమయంలో విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తూ తీర్మానం చేయనున్నారు. ఈ మేరకు సీఎం ప్రకటన చేస్తారు. ఈ సందర్భంగా ప్రసంగించే ఏ నేత బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని మోదీపై ఎలాంటి విమర్శలు చేయొద్దని ముఖ్యమంత్రి సూచించారు. కేవలం కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నట్లుగానే నేతలు ప్రసంగించాలని, కేంద్రంపై ఒత్తిడి పెంచినట్లు, డిమాండ్ చేసినట్లు మాట్లాడవద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. -
మంత్రి కోరింది... ఒక్కరోజు..
స్పీకర్ సస్పెండ్ చేసింది రెండు రోజులు! సాక్షి, హైదరాబాద్: కాల్ మనీ సెక్స్ రాకెట్‌పై అసెంబ్లీలో గురువారం చర్చకు పట్టుబడుతూ నిరసన తెలిపిన ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యుల్లో బి.శివప్రసాదరెడ్డి, దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా)ను స్పీకర్ కోడెల శివప్రసాదరావు రెండురోజుల పాటు సస్పెండ్ చేశారు. అయితే, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన తీర్మానంలో మాత్రం ఒక రోజే అని పేర్కొన్నా ఎమ్మెల్యేలపై స్పీకర్ రెండు రోజుల సస్పెన్షన్‌ను విధించడం గమనార్హం. అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలిరోజే అధికార పక్షం ముందస్తు వ్యూహంతో ఈ చర్యకు దిగింది. స్పీకర్ కంటే ముందే చీఫ్ విప్, శాసనసభ వ్యవహారాల మంత్రి పదేపదే హెచ్చరికలు చేయడం, ఆ తర్వాత స్పీకర్ వారి పేర్లను ప్రస్తావించడం, ఆ వెంటనే తీర్మానం, సస్పెన్షన్ చకచకా జరిగిపోయాయి. ఇలా మొదలైంది... రెండో సారి వాయిదా అనంతరం తిరిగి 12.14 గంటల ప్రాంతంలో సభ ప్రారంభమైన వెంటనే కాల్ మనీపై చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్సీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఇంతలో సీఎం చంద్రబాబు మాట్లాడుతుండగా సభ్యులు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఆ తర్వాత బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు, మంత్రి యనమల, జి.సూర్యారావు మాట్లాడుతూ వైఎస్సార్సీపీపై అవాకులు, చెవాకులు పేలారు. ఈ దశలో స్పీకర్‌కు వైఎస్సార్సీపీ సభ్యుడు శ్రీధర్‌రెడ్డికి మధ్య వాగ్వాదం నడిచింది. సభలో నినాదాలు మిన్నంటడంతో ఎవరేమి మాట్లాడుతున్నారో అర్థం కాని గందరగోళం నెలకొంది. అప్పుడు యనమల జోక్యం చేసుకుంటూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తామని బెదిరించారు. ఈ దశలో ప్రతిపక్ష సభ్యులు ‘సెక్స్ రాకెట్ సీఎం డౌన్ డౌన్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఒక రోజా, రెండ్రోజులా? ఈ గొడవ మధ్యలోనే మంత్రి యనమల రామకృష్ణుడు సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ సభలో కెమెరాలకు ఆటంకం కలిగించినందుకు బి.శివప్రసాదరెడ్డి, డి.రామలింగేశ్వరరావును ఒక రోజు పాటు సస్పెండ్ చేయాల్సిందిగా కోరారు. దీన్ని స్పీకర్ మూజువాణీ ఓటుతో ఆమోదింపజేస్తూ ఆ ఇద్దర్నీ రెండు రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించి సభ నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరారు. అధికారపక్షం తీరుతో ప్రతిపక్ష సభ్యులు మరింత బిగ్గరగా నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. దీంతో స్పీకర్ కోడెల మధ్యాహ్నం 12.35 గంటల ప్రాంతంలో సభను శుక్రవారం ఉదయానికి వాయిదా వేశారు. తీర్మానానికి విరుద్ధంగా స్పీకర్ సస్పెండ్ చేయవచ్చా? శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల స్పష్టంగా ఒక్కరోజు సస్పెండ్ చేయమని తీర్మానాన్ని ప్రతిపాదిస్తే స్పీకర్ మాత్రం రెండు రోజులు చేయడం వివాదాస్పదమైంది. సభా నిబంధనల ప్రకారం సంబంధిత మంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, స్పీకర్ చర్చకు పెట్టి ఓటింగ్ నిర్వహించడం మాత్రమే చేయాలి. కానీ, గురువారం సభలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ విషయాన్ని ఆక్షేపించినా స్పీకర్ కార్యాలయం నుంచి ఎటువంటి వివరణ లేకపోయింది. -
వ్యాపారులతో ఇబ్బంది లేదని తీర్మానం
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పొదలకూరు : పట్టణంలోని పంచాయతీ స్థలంలో ఆక్రమణలకు పాల్పడి వ్యాపారాలు చేసుకుంటున్న వారితో ఎలాంటి ఇబ్బంది లేదని అత్యవసర సమావేశం ద్వారా పంచాయతీ తీర్మానాన్ని ఆమోదించినట్టు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో శనివారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ వ్యాపారుల దుకాణాలను ఉన్నఫళంగా తొలగిస్తే జీవనోపాధి కోల్పోతారనే ఉద్దేశంతో సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ, వార్డుసభ్యులు కలసి ఈ తీర్మానం చేసినట్టు చెప్పారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల రెవెన్యూ, పంచాయతీరాజ్, పంచాయతీ, ఆర్అండ్బీ అధికారులతో కొందరు వ్యాపారులకు ఆక్రమణలపై నోటీసులను అందజేసినట్టు తెలిపారు. మూడు వారాల్లో కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత వాదనలు వింటామని నోటీసులో పేర్కొన్నట్టు గుర్తుచేశారు. ఈ లోగా రెవెన్యూశాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి వ్యాపారులకు ఏడో నంబరు నోటీసు అందజేశారన్నారు. దీంతో సుమారు 300 మంది చిరువ్యాపారులు సర్వం కోల్పోయే అవకాశం ఉందన్నారు. వారి కుటుంబాలు వీధిన పడతాయన్నారు. అధికారులు సైతం చిరువ్యాపారుల జీవనవిధానాన్ని దెబ్బతీసే విధంగా హడావుడి చేయవద్దన్నారు. పంచాయతీ స్థలంలోని ఆక్రమణలు పంచాయతీ ఆధీనంలో ఉన్నందున సర్పంచ్, మెజారిటీ సభ్యులు కలసి ఆక్రమణలతో పంచాయతీకొచ్చినా ఇబ్బంది ఏమీ లేదని తీర్మానం చేసినట్టు తెలిపారు. పంచాయతీ, ఆర్అండ్బీ రోడ్డుమార్జిన్ వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలాలు చూపేవరకు ఆక్రమణలను తొలగించవద్దని తీర్మానంలో రాసుకున్నట్టు చెప్పారు. ఇదే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకుని వెళ్లనున్నట్లు తెలిపారు. మూడు దశాబ్దాలుగా చిరువ్యాపారాలు చేసుకుని జీవిస్తున్న వారికి తనతో పాటు, ఎంపీపీ, సర్పంచ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, వార్డుసభ్యులు అండగా ఉంటారన్నారు. చిరువ్యాపారులు వీధిన పడకుండా ఆదుకుంటామన్నారు. తీర్మానం ప్రతిని వ్యాపారులకు అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీపీ కోనం బ్రహ్మయ్య, సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ, ఉససర్పంచ్ సోమా అరుణ, వార్డు సభ్యులు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి పాల్గొన్నారు.