అల్లాదుర్గం: అల్లాదుర్గంను సబ్‌డివిజన్ చేయాలని కోరుతూ మండల సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి జిల్లా కలెక్టర్‌కు పంపినట్లు ఎంపీపీ రాంగారి ఇందిర బుధవారం విలేకర్లకు చెప్పారు. ఈ నెల 23న మండల సర్వసభ్య సమావేశంలో సబ్‌డివిజన్ సాధన కమిటీ మెమొరాండం సమర్పించిందన్నారు. సభ్యుల ఆమోదంతో తీర్మానం చేసినట్లు తెలిపారు. సబ్‌డివిజన్ అయితే అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు.