Sub-division
-
అల్లాదుర్గం సబ్‌డివిజన్ కోసం తీర్మానం
అల్లాదుర్గం: అల్లాదుర్గంను సబ్‌డివిజన్ చేయాలని కోరుతూ మండల సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి జిల్లా కలెక్టర్‌కు పంపినట్లు ఎంపీపీ రాంగారి ఇందిర బుధవారం విలేకర్లకు చెప్పారు. ఈ నెల 23న మండల సర్వసభ్య సమావేశంలో సబ్‌డివిజన్ సాధన కమిటీ మెమొరాండం సమర్పించిందన్నారు. సభ్యుల ఆమోదంతో తీర్మానం చేసినట్లు తెలిపారు. సబ్‌డివిజన్ అయితే అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. -
అన్నదాత వర్రీ..
కష్ట, నష్టాలను ఎదుర్కొని గత రబీ సీజన్ నుంచి గట్టెక్కిన అన్నదాతలు ప్రస్తుతం సార్వా సాగుకు వరుణదేవుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. వరి సాగు అదను దాటిపోతున్నా చాలినంత వర్షపాతం లేక దిగాలు చెందుతున్నారు. కొద్ది రోజుల కిందట కురిసిన వర్షాలకు ఆనందపడిన రైతులు అక్కడక్కడా వరి నారుమళ్లు పోశారు. ఆ తరువాత వరుణుడు ముఖం చాటేయడంతో మొలకెత్తిన నారుమళ్ల మాడిపోతున్నాయి. మంగళగిరి రూరల్ : మంగళగిరి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు, తాడికొండ, అమరావతి మండలాల్లో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో మొత్తం 54,206 హెక్టార్లకు 26,027 హెక్టార్లలో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. ప్రధానంగా పత్తి 21,464 హెక్టార్లలో సాగవుతుండగా 757 హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. మొక్కజొన్న 55, మిరప 44, పసుపు 457, చెరకు 182, కూరగాయలు 609, అరటి 1,446 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. పత్తి సాగుకు ప్రస్తుతం వర్షాభావ సమస్య లేదు. వరి సాగు చేసే రైతులే వర్షాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. వ్యవసాయ కార్యాలయాలు, ప్రభుత్వం కేటాయించిన దుకాణాల ద్వారా రైతులకు వరి విత్తనాలు విక్రయించారు. కొనుగోలు చేసిన విత్తనాలను కొద్ది రోజుల కిందట కురిసిన వర్షాలు, ఎత్తిపోతల పథకాలు, మోటారు బోర్లు, పంట కాలువల కింద నారుమళ్లు కట్టారు. మొలకెత్తిన వరినారుమళ్లు వర్షాభావ పరిస్థితుల కారణంగా తెగుళ్ల బారినపడటంతో పాటు ఎండిపోతున్నాయి. ఇప్పటికీ నారుపోయని రైతులు కొందరు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకోగా, మరి కొందరు సాగుపై ఆశలు వదులుకుని పొలాలన అలానే వదిలివేయడంతో బీళ్లుగా మారుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు ఇలానే కొనసాగితే సాగు అదను దాటిపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఒక జిల్లా పరిధిలో ఒకే సర్కిల్
ఖమ్మం అర్బన్ : ఇప్పటి వరకు ఒక రాష్ట్రం ఒకే కాల్వగా ఉన్న నాగార్జునసాగర్ ప్రధాన ఎడమ కాల్వ ఇక నుంచి రెండు రాష్ట్రాలు.. మూడు ముక్కలుగా మారబోతోంది. జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో సాగర్ ఎడమకాల్వ పరిధిలోని రెండు రాష్ట్రాల అయకట్టును కూడా విడగొట్టారు. దీని ప్రకారం కాల్వలను, సిబ్బందిని, కార్యాలయాలను సైతం కేటాయించారు. ఆ పనులన్నీ ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి. ఇక ఆయా రాష్ట్రాల పరిధిలో ఉన్న జిల్లాల్లో సైతం అయకట్టును విడగొట్టి ఒక జిల్లా పరిధిలో ఒకే సర్కిల్‌గా మార్చబోతున్నారు. అంటే ఖమ్మం, నల్లగొండ, కృష్ణా మూడు జిల్లాల్లో మూడు సర్కిల్లు ఏర్పాటు కానున్నాయి. దీంతోపాటు ఆ జిల్లాల్లో ఉన్న ఆయకట్టు ప్రకారం సెక్షన్, సబ్ డివిజన్, డివిజన్ కార్యాలయాలను సైతం ఏర్పాటు చేయబోతున్నారు. దానికి అవసరమైన నివేదిక కోసం ఆయకట్టు వివరాలు, ప్రస్తుతం ఉన్న కార్యాలయాల డేటాను నమోదు చేస్తున్నారు. గత రెండు రోజులుగా ఎన్నెస్పీ టేకులపల్లి (ఖమ్మం) ఎస్ఈ అప్పలనాయుడు, ఈఈలు, డీఈలతో పాటు సిబ్బంది లెక్కలు తీశారు. జిల్లాలో ఒకే సర్కిల్... ఎన్నెస్పీ కెనాల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు టేకులపల్లి సర్కిల్ పేరుతో(ఖమ్మం) కార్యాలయం కొనసాగుతోంది. నల్లగొండ జిల్లా పరిధిలోని కొంత ఆయకట్టు, కృష్ణా జిల్లాలోని కొంత ఆయకట్టు.. ఇలా మూడు జిల్లాల పరిధిలోని 5,49, 296 ఎకరాల భూమి ఈ సర్కిల్ పరిధిలో ఉండేది. ఇప్పడు జిల్లాల వారీగా సర్కిల్ మార్పులతో ఖమ్మం పరిధిలో 2, 51,800 ఎకరాల ఆయకట్టు మాత్రమే మిగిలి ఉంది. గతంలో నల్లగొండ జిల్లాలోని 20,681 ఎకరాలు, కృష్ణా జిల్లాలోని 2.70 లక్షల ఎకరాలు ఖమ్మం పరిధిలో ఉండేది. ఇప్పుడు ఇవన్నీ ఆయా జిల్లాల సర్కిల్ పరిధిలోకి వెళ్లనున్నాయి. ఇక గతంలో నూజవీడు డివిజన్ పరిధిలో ఉన్న జిల్లా ఆయకట్టు 13, 994 ఎకరాలు ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కలవనుంది. ఈ అయకట్టు ఖమ్మం జిల్లాకు చెందినప్పటికీ జోన్-3 పరిధిలో ఉండేది. ఇప్పుడు ఈమొత్తాన్ని జోన్- 2 పరిధిలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొం దిస్తున్నారు. జోన్-2 పరిధిలోకి వచ్చే భూములకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు విడుదల చేసేందుకు అధికారులు రూ. 20 కోట్లకు పైగా అంచనాలతో ప్రతిపాదనలు తయారు చేసి రాష్ట్రం విడిపోకముందే ప్రభుత్వానికి అందించారు. జిల్లాలో మొత్తం ఆయకట్టును ఒకే సర్కిల్ కార్యాలయం పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాత దాని ప్రకారం కార్యాలయాలు ఏర్పా టు చేస్తారు. గతంలో కృష్ణా, ఖమ్మం జిల్లాల పరిధిలో కలిసి ఉన్న ఆయకట్టుకు సెక్షన్ కార్యాలయాలు ఉండేవి. రాష్ట్రాలు విడిపోవడంతో జిల్లా ఆయకట్టును మినహాయించి ఆటువైపు ఉన్న ఎనిమిది సెక్షన్, ఒక సబ్‌డివిజన్ కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు. జిల్లాలో మరో మానిటరింగ్ సబ్ డివిజన్ కార్యాలయం..? జిల్లాలో ఉన్న ఆయకట్టు ప్రకారం 750 నుంచి1200 ఎకరాలకు ఒక సెక్షన్, 30 వేల నుంచి 40 వేల ఎకరాలకు ఒక సబ్ డివిజన్, లక్ష నుంచి 1.50 లక్షల ఎకరాలకు ఒక డివిజన్ కార్యాలయాల చొప్పున ఏర్పాటు చేయనున్నారు. నీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలను సైతం ఇదే తరహాలో తయారు చేయబోతున్నారు. దీంతో గతంలో ఉన్న నీటి సంఘాల్లో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటి వరకు ఎడమకాల్వ మొత్తానికి మానిటరింగ్ డివిజన్ కార్యాలయం ఖమ్మంలోనే ఉంది. దాని పరిధిలోనే ఐదు సబ్ డివిజన్ కార్యాలయాలు (మిర్యాలగూడెం, హూజూర్‌నగర్, నాయకన్‌గూడెం, టేకులపల్లి, తిరువూరులలో) ఉన్నాయి. అయితే రాష్ట్రం విడిపోవడంతో తిరువూరు సబ్ డివిజన్‌ను జగ్గయ్య పేటలో విలీనం చేశారు. దాని స్థానంలో ఖమ్మం జిల్లాలో కల్లూరు సబ్ డివిజన్ ఏర్పాటు చేస్తే నీటి పర్యవేక్షణతో పాటు పరిపాలన పరంగా వెసులుబాటు ఉంటుందని, దాని ప్రకారమే ఈ మార్పులకు శ్రీకారం చుట్టామని అధికారులు చెపుతున్నారు. -
నాణ్యత ప్రశ్నించాడని బదిలీ వేటు!
తాడిపత్రి, న్యూస్‌లైన్: అనంతపురం-భోగసముద్రం ఫోర్‌లేన్ రోడ్డు నిర్మాణం.. టెండర్ల దశ నుంచి పనుల ప్రారంభం వరకు అత్యంత వివాదాస్పదంగా మారింది. టెండర్ల ఖరారులో జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ఓ మంత్రి జోక్యం చేసుకోవడం వల్ల 2009లో ప్రారంభం కావాల్సిన పనులు ఆలస్యమయ్యాయి. రూ.200 కోట్ల అంచనా వ్యయంతో భోగసముద్రం నుంచి అనంతపురం వరకు ఎట్టకేలకు ఆరు నెలల క్రితం పనులు ప్రారంభించిన కంట్రాక్టర్ తనకున్న రాజకీయ అనుబంధంతో అనుకులంగా ఉన్న అధికారులను మాత్రమే సబ్‌డివిజన్‌లో పనిచేసే విధంగా చేసుకుంటున్నాడు. తన మాట వినని, అనుకూలంగా లేని వారిని ఏకంగా బదిలీ చేయించే పనిలో పడ్డాడు. ఇటీవల పనుల నాణ్యత విషయంలో అడ్డుచెప్పడంతోపాటు ఉన్నతాధికారులకు నివేదికలు పంపే విషయంలో విభేదించిన తాడిపత్రి డీఈఈ చంద్రశేఖర్‌రెడ్డిపై కక్ష పెంచుకున్నాడు. రాజకీయ పలుకుబడి ఉపయోగించి డీఈఈని అనంతపురానికి బదిలీ చేయిస్తూ ముఖ్యమంత్రి పేషీ నుంచి ఈ నెల 18న ఉత్తర్వులు (జీఓఆర్టీ 1147) జారీ చేయించాడు. తనకు కావాల్సిన, అనుకూలమైన, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్ జిల్లా గాలివీడులో డీఈఈ శ్రీరామమూర్తిని తాడిపత్రికి నియమించేలా అదేశాలు జారీ చేయించాడు. తనను అక్రమంగా బదిలీ చేశారని చంద్రశేఖరరెడ్డి ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో బదిలీని తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ విషయంపై ఈ రహదారి నిర్మాణ సంస్థ ఆర్.ఎస్.ఇన్ఫాస్ట్రక్చర్ ప్రతినిధి రామకృష్ణారెడ్డిని న్యూస్‌లైన్ సంప్రదించగా.. పరిపాలనాపరమైన కారణాలతోనే డీఈఈ బదిలీ అయ్యారని చెప్పారు. ఆయనపై తమకెలాంటి కక్షసాధింపు లేదన్నారు. -
ఐదుగురు దొంగల అరెస్ట్
వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ : జనగామ సబ్‌డివిజన్ పరిధిలో పలుదొంగతనాలకు పాల్పడిన నలుగురు దొంగల ముఠాతోపాటు మరో దొంగను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.20 లక్షల విలువచేసే బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. హన్మకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రూరల్ ఎస్పీ పాలరాజు నిందితుల వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా జమ్మికుంటకాలనీకి చెందిన ప్రవీణ్, జగద్గిరిగుట్టకు చెందిన రమేష్, విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన రాజు, కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌కు చెందిన లావుడ్యా తిరుపతి క్యాటరింగ్ టీమ్‌గా చలామణీ అవుతున్నారు. వీరిలో ప్రవీణ్, రమేష్ పాతనేరస్తులు. గతంలో ప్రవీణ్ 10 చోరీ కేసుల్లో నిందితుడు. ఇతడు ప్రస్తుతం సికింద్రాబాద్‌లో నివాసముంటున్నాడు. రమేష్ 40 దోపిడీ, చోరీ కేసుల్లో నిందితుడు. వీరిద్దరు ఆయూ కేసుల్లో జైలుకు వెళ్లారు. జైలులో పరిచయమైన వీరు విడుదలయ్యాక జగద్గిరిగుట్టలో క్యాటరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వారికి కుంచల రాజు, తిరుపతితో పరి చయం ఏర్పడింది. క్యాటరింగ్ ద్వారా వచ్చే డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో రాజు సలహా మేరకు నలుగురు ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలు మొదలుపెట్టారు. ఈ ముఠా సభ్యులు జనగామ సబ్‌డివిజన్ పరిధిలోని జనగామ, చేర్యాల, బచ్చన్నపేట, మద్దూరు, కొడకండ్ల, పాలకుర్తి పోలీస్స్టేషన్లతోపాటు మెదక్ జిల్లాలో చైన్‌స్నాచింగ్‌లు, తాళాలు పగులగొట్టి దొంగతనాలకు సంబంధించి 27 నేరాలకు పాల్పడ్డారు. ఇందులో చేర్యాలలో 9, బచ్చన్నపేటలో 10, మద్దూరులో 5, పాలకుర్తి, కొడకండ్లలో ఒక్కో చోరీ, మెదక్ జిల్లా పాపయ్యపేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకటి చొప్పున నేరాలు చేశారు. బుధవారం ఉదయం 6 గంట ల సమయంలో గుర్జకుంట క్రాస్‌రోడ్డు వద్ద చేర్యాల సీఐ జితేందర్ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండ గా ఈ నలుగురు తారసపడ్డారు. వారు హైదరాబాద్ నుంచి జనగామ వైపు రెండు మోటారు సైకిళ్లపై వెళ్తుండగా వారిని అనుమానించి తనిఖీ చేశారు. వారి వద్ద బంగారు, వెండి ఆభరణాలను గుర్తించారు. విచారించగా నిందితులు చేసిన చోరీలను వెల్లడించారు. జనగామ బస్టాండ్‌లో మరో నిందితుడు.... జనగామ మండలంలో దొంగతనాలకు పాల్పడుతున్న మరో నిందితుడిని పోలీసులు బుధవారం ఉదయం జనగామ ఆర్టీసీ బస్టాండ్ వద్ద పట్టుకున్నారు. అనుమానాస్పదంగా బస్టాండ్ పరిసర ప్రాంతాల్ల తిరుగుతుండ గా అతడిని తనిఖీ చేయగా బంగారు ఆభరణాలు గుర్తించి విచారించారు. విచారణ సందర్భంగా నిందితు డి నుంచి రూ.5 లక్షల విలువచేసే 17 తులాల బంగారం, 25 తులా ల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అతడు జనగామ పట్టణంలోని ధర్మకంచ గ్రామాని కి చెందిన సిరాసర్ శోభరాజ్‌గా విచారణలో వెల్లడైంది. చెడు వ్యసనాలకు అలవాటుపడి కూలీ డబ్బులు సరి పోక తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి చొరబడి దొంగతనా లు చేసేవాడని తేలింది. గతంలో పలుమార్లు చిల్లర దొంగతనాలు చేసిన శోభరాజ్ ఇటీవల జనగామ మండలంలో ఆరు చోరీలకు పాల్పడ్డాడు. కాగా నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనపరిచిన చేర్యాల సీఐ జితేందర్, జనగామ సీఐ నరేందర్, రూరల్ సీసీఎస్ సీఐ శ్రీనివాస్,ఎస్సైలు జోసఫ్, శ్రీనివాస్, ఏఎస్సై సాంబశివుడు, కానిస్టేబుళ్లు సారయ్య, సారంగపాణి, భద్రయ్య, విశ్వేశ్వర్, పాషా, హరి, సీసీఎస్ సిబ్బంది సంజీవరెడ్డి, ప్రసాద్‌ను రూరల్ ఎస్పీ పాలరాజు అభినందించారు. రూరల్ ఏఎస్పీ శ్రీకాంత్ పాల్గొన్నారు.