సాక్షి, పెద్దశంకరంపేట(మెదక్): పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రచారసభను విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు విజయరామరాజు అన్నారు. ఆదివారం మండలంలోని బుజ్రాన్‌పల్లి, టెంకటి, జంబికుంట, దానంపల్లి, మల్కాపూర్, గొట్టిముక్కుల గ్రామాల్లో టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ తరపున ప్రచారం చేశారు. ఏప్రిల్ 3న అల్లాదుర్గంలో జరిగే కేసీఆర్ సభకు కార్యకర్తలు, నాయకులు హాజరుకావాలని కోరారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. సమావేశంలో మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు రాములు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు సురేష్‌గౌడ్, ఎంపీటీసీ సభ్యుడు మాణిక్‌రెడ్డి, మాజీ సర్పంచ్ జంగం శ్రీనివాస్, నాయకులు హరి, గోవర్దన్, పున్నయ్య, అంజయ్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment