
చెరువులో చేపలు పట్టేందుకు వల వేయగా రెండు కొండచిలువలు చిక్కుకున్నాయి.
అల్లాదుర్గం (మెదక్) : చేపలు పట్టేందుకు వల వేస్తే రెండు కొండచిలువలు చిక్కాయి. అల్లాదుర్గం గ్రామానికి చెందిన గోండ్ల సాయిలు మంగళవారం అప్పాజీపల్లి చెరువులో చేపలు పట్టేందుకు వల వేయగా రెండు కొండచిలువలు చిక్కుకున్నాయి. మీటరున్నర పొడవున్న వీటిని తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలి వేసినట్లు సాయిలు తెలిపారు. (క్లిక్: మస్క్ మలన్‌తో మస్తు పైసలు)