cheruvu
-
అక్రమ కట్టడాలు జలమయం
-
మా చెరువు తప్పిపోయింది అప్పుడు అలా - ఇప్పుడు ఇలా
-
చెరువులో మునిగి ముగ్గురు విద్యార్థుల మృతి
మాక్లూర్: చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ఒడ్డేట్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహేశ్ (20), తిరుపతి(19), నరేశ్ (20), సాయితేజ, వినోద్‌లు శనివారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే చెరువులో మొరం కోసం తవ్విన లోతైన గుంతలు ఉన్నాయి. ఈ విషయం తెలియని మహేశ్, తిరుపతి, నరేశ్ చెరువులోకి దిగిన వెంటనే లోతైన గుంతల్లోకి జారి మునిగి పోయారు. ఒడ్డునే ఉన్న సాయితేజ, వినోద్ వెంటనే తేరుకుని గ్రామంలోనికి వెళ్లి సమాచారం ఇచ్చారు. పెద్దఎత్తున గ్రామస్తులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ముగ్గురూ మృతిచెందడంతో గజ ఈతగాళ్లతో ముగ్గురి మృత దేహాలను బయటకు తీయించారు. మృతుల తల్లిదండ్రులకు వారు ఒక్కొక్కరే సంతానం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుల్లో తిరుపతి 10వ తరగతి, నరేశ్, మహేశ్‌లు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. మాక్లూర్ ఎస్సై సుధీర్‌రావు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలాన్ని ట్రెయినీ ఐపీఎస్ అధికారి చైతన్యరెడ్డి, నార్త్‌జోన్ సీఐ సతీశ్ పరిశీలించారు. -
తండ్రిని కాపాడేందుకు వెళ్ళి.. కొడుకు కూడా అనంత లోకాలకు!
వనపర్తిటౌన్: వనపర్తి జిల్లా కేంద్రంలోని దళితవాడలో సంక్రాంతి పండుగ వేళ విషాదం నెలకొంది. సమీపంలోని చెరువులో బట్టలు ఉతికి, చేపలు పట్టేందుకు తండ్రీకొడుకు వెళ్లగా.. ప్రమాదవశాత్తు తండ్రి చెరువులో పడ్డాడు. అతడిని కాపాడేందుకు వెళ్లిన కుమారుడు సైతం చెరువులో గల్లంతై మృతి చెందాడు. ఎస్ఐ జయన్న, స్థానికుల వివరాల మేరకు.. వనపర్తి దళితవాడకు చెందిన గంధం శివాన్ (58), అతడి కుమారుడు రుషికేష్ (29) బట్టలు ఉతికేందుకుగాను స్థానిక నల్లచెరువుకు వెళ్లారు. చెరువులో బట్టలు ఉతకడంతో పాటు చేపల వేటకు గాలం వేశారు. ఈ క్రమంలో తండ్రి శివాన్ ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. గమనించిన కుమారుడు రుషికేష్ వెంటనే తన బాబాయ్‌కి ఫోన్‌చేసి ‘నాన్న చెరువులో జారిపడ్డాడు.. కాపాడేందుకు వెళ్తున్నా’నని చెప్పి ఫోన్ పెట్టేశాడు. కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న బాబాయ్‌కి తన అన్నాకొడుకు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని కొండపేట నుంచి గజ ఈతగాళ్లను రప్పించి, గాలింపు చర్యలు చేపట్టారు. మొదట తండ్రి శివాన్ మృతదేహం లభించగా.. సాయంత్రం రుషికేష్ మృతదేహం లభ్యమైంది. తండ్రీకొడుకు మృతితో దళితవాడలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ జయన్న తెలిపారు. -
చెరువు రక్షణకు 18 ఏళ్లు సరిపోలేదా?
సాక్షి, హైదరాబాద్: ‘రామంతాపూర్ చెరువు రక్షణకు సంబంధించి మీరు 2016లో రెవెన్యూ విభాగానికి ఒక లేఖ రాశారు. దాని తర్వాత కూడా గుర్తు చేశారు. ఎప్పుడు లేఖ రాశార న్నది మీకు కచ్చితమైన తేదీ తెలియదు. మరో ఇద్దరు ముగ్గురు బిల్డర్లు చెరువు పరిధిలో భవన నిర్మాణాలు చేపట్టా లని మీరు కోరుకుంటున్నారా? ఇలాంటి సమాధానా లిచ్చి మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. తీవ్ర అహసనంతో చెబుతు న్నాం.. మీ చట్టబద్ధమైన విధిని నిర్వర్తించనందుకు మీపై చర్య తీసు కోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తాం. ఈ పిటిషన్ 2005 నుంచి పెండింగ్‌లో ఉంది. 18 ఏళ్లు గడిచినా చెరువు రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంకా ఎన్నాళ్లు సమయం కావాలి. మీ పనిని మరొకరిపై నెట్టి తప్పించుకో లేరు. భవిష్యత్ తరాలకు తాగునీటికి సంబంధించిన అంశంలోనూ ఇంత నిర్లక్ష్యమా? ఉన్న జలవనరులను రక్షించు కోలేకపోతే భవిష్యత్ తరాలు క్షమించవు’ అని జీహెచ్ఎంసీ కమిష నర్‌పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. రామంతాపూర్ పెద్దచెరువును రియల్టర్లు, అక్ర మార్కులు ఆక్రమించకుండా అడ్డుకునేందుకు ఏం చర్యలు తీసుకున్నారని జీహెచ్ఎంసీ కమిష నర్ రొనాల్డ్ రోస్‌ను ప్రశ్నించింది. దీనిపై రెవెన్యూ ఉన్నతాధి కారులకు 2016లోనే లేఖ రాశామని, వివ రాలు ఇంకా అందలేదని ఆయన చెప్పారు. దీంతో జీహెచ్ ఎంసీ కమిషనర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం, అసహ నం వ్యక్తం చేసింది. తదు పరి విచారణకు కూడా హాజరు కావా లని తేల్చిచెప్పింది. ఈ పిటిషన్లో హెచ్ఎండీఏ కమిష నర్ ను ఇంప్లీడ్ చేయాలని రిజిస్ట్రీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణలోగా వివరాలు అందజేయండి.. హైదరాబాద్‌లో 532 చెరువులు క్షీణిస్తున్నాయని, 26 ఎకరాల్లోని రామంతాపూర్ పెద్దచెరువును డంపింగ్ యార్డుగా మారుస్తున్నారని, ఈ కారణంగా నీటికాలుష్యం పెరిగి దుర్వాసన వ్యాపిస్తోందని ఉస్మానియా ప్రొఫెసర్ డాక్టర్ కెఎల్ వ్యాస్ 2005లో లేఖ రాశారు. చెరువు సమీపంలో చెత్త వేయడంతో భూగర్భజలాలు కలుషితమవుతున్నా యని, తద్వారా వాతావరణం కలుషితమై, దుర్వాసనతో, దోమలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆ ప్రదేశంలో చెత్తను వేయకుండా జీహెచ్ఎంసీ అధికారు లకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ లేఖను హైకోర్టు విచా రణకు స్వీకరించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ హాజరుకావా లని గత విచారణ సందర్భంగా సీజే ధర్మాసనం ఆదేశించింది. దీనిలో భాగంగా మంగళవారం విచారణకు జీహెచ్ఎంసీ కమిషనర్ హాజరయ్యారు. అయితే ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు కమిషనర్ సరిగా సమాధానాలు ఇవ్వలేకపోవడంపై ప్రభుత్వ న్యాయవాది, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్‌పై కూడా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్‌లోని వివరాలను కమిషనర్‌కు వివరించడంలో వీరు విఫలమ య్యారని వ్యాఖ్యానించింది. ఇకపై న్యాయవాదులపై అధార పడకుండా, సబ్జెక్టుపై సిద్ధమై కోర్టుకు రావాలని ఆదేశించింది. రామంతాపూర్ పెద్దచెరువుకు కంచె ఎప్పుడు వేస్తారు.. చెత్తరహిత నీటి వనరుగా తీర్చిదిద్దడానికి, నీటి నిల్వ పెరిగేందుకు ఏం చర్యలు తీసుకున్నారు.. ఆక్రమణలను అరికట్టేందుకు ఏం చేస్తున్నారు.. చెత్తను వేయకుండా స్థానికులకు అవగాహన కల్పించడం.. చెరువు సరిహద్దులు రూపొందించడం.. మట్టి కోతను అరికట్టేందుకు పరీవాహక ప్రాంతాల్లో చెట్ల పెంపకాన్ని చేపట్టడం.. ఎఫ్టీఎల్ నిర్ధారణకు నోటిఫికేషన్ ఇవ్వడం.. వీటన్నింటిపై వివరాలు తెలుసుకుని అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
ఇదేం చోద్యం.. ఏకంగా చెరువు భూమినే తనఖా పెట్టేశారు!
పట్టాదారులమంటూ.. కోర్టు ఆదేశం ఉందంటూ పోలీసులు బందోబస్తుతో నాడెం చెరువు తూమును ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకోవడంతో ధ్వంసం చేయించిన వారు తోక ముడిచారు. ఆ తర్వాత బుల్డోజర్ను సీజ్ చేసి కారకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా మూడు నెలల క్రితం జరిగిన సంఘటన. తాజాగా హైదరాబాద్ చిక్కడపల్లిలోని ఓ బ్యాంకులో చెరువు భూమిని తనఖా పెట్టి రూ.12కోట్ల రుణం తీసుకోవడంతో నాడెం చెరువు పేరు తిరిగి తెరపైకి వచ్చింది. ఘట్కేసర్: చెరువులు, కుంటలు, జల వనరుల సంక్షరణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. కాని క్షేత్రస్థాయిలో పరిస్థితి వారి మాటలకు భిన్నంగా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా చెరువులు కబ్జా చేస్తున్న వారిపై చర్యలు లేకపోవడంతో చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నాయి. తాజాగా వెంకటాపూర్ నాడెం (నల్ల) చెరువులోని భూమిని తనఖా పెట్టి కొందరు రూ.12 కోట్ల రుణం తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. నాడెం చెరువుపై ఆధారపడి వెంకటాపూర్‌కు చెందిన 105 మంది ముదిరాజ్ మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. నీటిని తొలగించే అధికారం లేకున్నా... రెవెన్యూ రికార్డులో ఉన్న చెరువును అందులో ఉన్న నీటిని తొలగించే అధికారం నీటి పారుదల శాఖ అధికారులకే ఉంది. నాడెం చెరువులో నీరు లేదంటూనే చెరువులో చేపలు పట్టొందంటూ కొందరు కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. కోర్డు ఆర్డర్ ఉందని ఆగస్టు 3, 2022న పోలీస్‌బందో బస్తుతో చెరువు కల్వర్టును ధ్వంసం చేశారు. మత్స్యకారులు చెరువులోకి దిగితే కేసులు పెడతామని పోలీసులు బెదిరించారని మత్స్యకారులు గతంలో ఆరోపించారు. తక్షణమే రంగంలోకి దిగిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కోర్టు ఆదేశం చూపించాలని కోరడంతో తోక ముడుచుకున్నారు. పోలీసుల అండతోనే ధ్వంసం.. చెరువులో చేపలు పడితే కేసు పెడతామని గతంలో పోలీసులు బెదిరించారని మత్స్యకారులు పేర్కొన్నారు. పోలీసుల అండతోనే అక్రమార్కులు కల్వర్టు ధ్వంసం చేశారని అప్పట్లో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. మత్స్యకారుల నుంచి విషయం తెలుసుకున్న అధికారులు తూము ధ్వంసాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత అక్రమార్కులపై రెవెన్యూ, ఇరిగేషన్, రోడ్డు భవనాల శాఖాధికారులు ఘట్కేసర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఎన్ఓసీ ఇవ్వలేదు ఈ విషయమై తహసీల్దార్ విజయలక్ష్మి, ఇరిగేషన్ ఏఈ పరమేశ్‌ను వివరణ కోరగా బ్యాంకు రుణం కోసం మేము ఎటువంటి ఎన్ఓసీ ఇవ్వలేదని తెలిపారు. బ్యాంకు డాక్యూమెంట్లు చూస్తే కాని ఏమి చెప్పలేమని పేర్కొన్నారు. చెరువు విస్తీర్ణం 62 ఎకరాలు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ సర్వేనంబర్ 814, 816లో 62 ఎకరాల విస్తీర్ణంలో నాడెం చెరువును నీటి పారుదల శాఖ అధికారులు గుర్తించారు. ఘట్కేసర్ పరిసరాల్లో భూమి విలువ పెరగడంతో అక్రమార్కుల కన్ను చెరువుపై పడింది. రాజకీయ నాయకుల అండతో నీటిని తొలగించి చెరువు లేకుండా చేయాలని యత్నిస్తున్నారు. చెరువులోని భూమికి రుణం ఎలా ఇచ్చారు.? భూమి పరిశీలించకుండానే చెరువులో నీట మునిగిన భూమికి బ్యాంకు ఎలా రుణం ఇచ్చిందని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. లక్ష రుణం కోసం చెప్పులరిగేలా తిప్పుకునే బ్యాంకు అధికారులు నీటిలో ఉన్న భూమికి రుణం ఇవ్వడమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్ చేయండి: స్వామి వారి పేరు మార్చి... రికార్డులు ఏమార్చి!) -
పైపుల ద్వారా లోపలికి ప్రవేశించి.. సింగోజి చెరువులో..
సాక్షి, హైదరాబాద్: అది వన్యమృగాలు సంచరించే ప్రాంతం. పులులు, సింహాల సఫారీ కూడా అక్కడే ఉంది. ఈ ప్రదేశంలో జన సంచారం నిషేధం. కానీ.. నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో మాత్రం ఇక్కడ సంచరించేందుకు ఎలాంటి ఆంక్షల్లేవు. గతేడాది కురిసిన వర్షాలకు కూలిన జూ గోడను మళ్లీ కట్టకపోవడంతో జంతువులకే కాదు.. స్థానికులకు కూడా రక్షణ లేకుండా పోతోంది. రక్షణ గోడ లేకపోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు చేపల వేటకు జంతు ప్రదర్శనశాలలోకి ప్రవేశిస్తున్నారు. ఇక్కడ ఉన్న సింగోజి చెరువులో చేపలు వేట కోసం గోడ కూలిన ప్రాంతం నుంచి లోపలికి ప్రవేశిస్తున్నారు. కాగా.. సింగోజి చెరువులో భారీగా మొసళ్లు ఉన్నట్లు తేలింది. ఇటీవల ఓ మొసలి ఏకంగా గోడ కూలిన ప్రాంతం నుంచి నీటి ప్రవాహంలో బయటకు వచ్చి మూసీ నదిలో ప్రత్యక్షం కావడం గమనార్హం. జూ వెనుక భాగంలో.. ► గతేడాది భారీ వర్షాలకు జూ వెనుక భాగంలోని ప్రహరీ గోడ కూలిపోయింది. గోడను పునర్ నిర్మించకుండా కేవలం వరద నీరు బయటకు వెళ్లేలా కొన్ని పైపులు వేసి.. కల్వర్టు నిర్మించారు. దీంతో జూలోకి సులువుగా వెళ్లడానికి స్థానికులకు అవకాశమేర్పడింది. వానాకాలంలో విస్తారంగా కురిసిన వర్షాలకు జూలోని సింగోజి చెరువు నిండుకుండలా మారింది. ఇందులోకి చేపలు భారీగా వచ్చాయి. ఈ క్రమంలోనే జూ వెనుక కిషన్‌బాగ్, బహుదూర్‌పురా ప్రాంతాలకు చెందిన యువకులు ఈ చెరువులో చేపలు పట్టడానికి.. గోడ కూలిన వేసిన వేసిన పైపుల నుంచి జూలోకి ప్రవేశిస్తున్నారు. ► సింగోజి చెరువులో మొసళ్లు ఉన్న విషయాన్ని జూ అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో ఈ ప్రాంతం నుంచే లోపలికి ప్రవేశించిన ఒకరు పులిని చంపిన ఘటన నేర్పిన పాఠాలను కూడా జూ అధికారులు మరిచిపోవడం దారుణమని జంతు ప్రేమికులు అంటున్నారు. ఇదే జూలో ఎలుగుబంటి కూడా బయటకు రావడాన్ని గుర్తు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా జూ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వస్తోంది. బయటి వ్యక్తులను అడ్డుకుంటాం.. గోడ నిర్మాణ పనులను కాంట్రాక్టర్‌కు ఇచ్చాం. సకాలంలో పనులు పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేశాడు. గోడ కూలిన ప్రాంతం నుంచి వ్యక్తులను లోపలి రాకుండా నిఘా పెడతాం. – రాజశేఖర్, జూ క్యూరేటర్ -
ఏమై పోయాడో..? స్నానానికి దిగిన యువకుడు అదృశ్యం
గంట్యాడ: చెరువులో స్నానానికి దిగిన ఓ యువకుడు అదృశ్యం కాగా, మరో యువకుడిని స్నేహితులు రక్షించి ఆస్పత్రిలో చేర్పించారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బుడతనాపల్లి గ్రామానికి చెందిన కొంతమంది యువకులు బుధవారం ఉదయం మంచినీటి కొనేరులో స్నానానికి దిగారు. వారిలో వారాది సురేష్ మునిగిపోతుండడంతో స్నేహితులు గమనించి రక్షించి ఒడ్డుకు చేర్చి 108 అంబులెన్సులో విజయనగరంలోని తిరుమల ఆస్పత్రికి తరలించారు. అయితే వారితో పాటు స్నానానికి దిగిన కొంచాడ రామకృష్ణ కనిపించలేదు. చెరువులో ముగినిపోయాడమోనని గ్రామస్తులు వలల సాయంతో గాలించారు. అయినప్పటికీ జాడ తెలియరాలేదు. రామకృష్ణ చెరువులో మునిగిపోయాడా? లేదా సురేష్ మునిగిపోయాడనే భయంతో పారిపోయాడా? అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందనప్పటికీ సమాచారం మేరకు విచారణ చేపట్టారు. (చదవండి: విద్యార్థిని ఆత్మహత్య...కారణం అదేనా...) -
వల నిండా.. కొండచిలువలు
అల్లాదుర్గం (మెదక్) : చేపలు పట్టేందుకు వల వేస్తే రెండు కొండచిలువలు చిక్కాయి. అల్లాదుర్గం గ్రామానికి చెందిన గోండ్ల సాయిలు మంగళవారం అప్పాజీపల్లి చెరువులో చేపలు పట్టేందుకు వల వేయగా రెండు కొండచిలువలు చిక్కుకున్నాయి. మీటరున్నర పొడవున్న వీటిని తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలి వేసినట్లు సాయిలు తెలిపారు. (క్లిక్: మస్క్ మలన్‌తో మస్తు పైసలు) -
మది దోచే మల్కంచెరువు.. మన హైదరాబాద్‌లో..
సాక్షి, హైదరాబాద్: అహ్లాదపూరిత వాతావరణం.. రంగురంగుల పూలు.. ఆకర్షణీయమైన మొక్కల మధ్య వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ చేస్తూ ప్రజలు ఎంజాయ్ చేసేలా రాయదుర్గంలోని పురాతన మల్కం చెరువు ఇక పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో సేద తీరేందుకు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, హైదరాబాద్ నాలెడ్జిసిటీకి చేరువలో, పురాతన జాతీయ రహదారికి పక్కనే ‘రోడ్ సైడ్ లేక్’ కావడంతో మల్కంచెరువుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ సుందరీకరించారు. దీన్ని మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. ఆహ్లాదకరంగా పగలు.. విద్యుత్ వెలుగుల్లో రాత్రి వేళ ఈ చెరువు ప్రాంతం చూపరులను కట్టిపడేస్తోంది. (క్లిక్: మెడికల్ టూరిజానికి హబ్‌గా మారిన హైదరాబాద్) -
మూడెకరాల చెరువును చెరబట్టిన చంద్రబాబు పీఏ అండ్ కో
కుప్పం.. ఈ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది ముందుగా చంద్రబాబునాయుడు పేరే.. సొంతూరు చంద్రగిరిలో ఓడగొట్టినా.. వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించే రికార్డునిచ్చి.. ఓ విధంగా ఆయన పరువు నిలబెట్టిన ప్రాంతం కుప్పం. అయితే ఈ నియోజకవర్గాన్ని కనీసం పట్టించుకోని బాబు.. తాను అధికారంలో ఉండగా ఈ ప్రాంతాన్ని తన తాబేదార్లు, పీఏలకు అప్పజెప్పేశారు. దొరికిందే తడవుగా సదరు తాబేదార్లు ఇష్టారాజ్యంగా కుప్పాన్ని చెరబట్టేశారు. ఇందుకు ఉదాహరణే ఊరి నడి అంచున ఉన్న వెంకటరామయ్య చెరువు. నానుడిలో వెంకటప్పా చెరువుగా ప్రసిద్ధికెక్కింది. ఒకప్పుడు ఈ ప్రాంత రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న ఈ చెరువు ఇప్పుడు రియల్ వెంచర్‌గా మారిన ‘అ’క్రమం ఎలాగంటే.. సాక్షి ప్రతినిధి, తిరుపతి : తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లలో అమరావతి, విశాఖల్లో జరిగిన భూ కుంభకోణాల గురించి అందరికీ తెలిసిందే. రాజధాని నగరాలైన అక్కడే అలా జరిగితే మరి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో తమ్ముళ్లు చూస్తూ ఊరుకుంటారా..? అందులోనూ.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న కుప్పం ప్రాంతంలో కొన్నాళ్లుగా భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పక్క రాష్ట్రాల రియల్టర్లు కూడా ఆసక్తి చూపడంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఖాళీగా ఉన్న స్థలాలను కబ్జా చేసేశారు. భూములే కాదు చివరికి చెరువులను కూడా చెరబట్టేశారు. ఆ క్రమంలోనే కుప్పం బైపాస్ రోడ్ సమీపంలోని వెంకటప్పా చెరువును మింగేశారు. తప్పుడు సర్వే నంబర్లతో లే అవుట్లు సర్వే నం.226/2తో 3.58 ఎకరాల విస్తీర్ణం కలిగిన వెంకటప్పా చెరువు ఒకప్పుడు ఆ ప్రాంత రైతులకు జీవనాడి. అలాంటి చెరువుపై 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ నేతలు కన్నేశారు. చంద్రబాబు పీఏ మనోహర్ అండ ఉండడంతో తప్పుడు సర్వే నంబర్లతో ఈ చెరువును లే అవుట్‌గా మార్చేశారు. కుప్పం సమీపంలోని సీనేపల్లి గ్రామ పంచాయతీలో ప్లాన్ అప్రూవల్ చేసుకోవడం.. ఆ ప్లాన్‌తో కుప్పంలోని సర్వే నం.226/2లోని చెరువులో నిర్మాణం చేసుకోవడం.. ఇలా టీడీపీ నేతలు, మనోహర్ సన్నిహితులు మతిన్ హజరత్, నజీర్, మణి బినామీ పేర్లతో చెరువును ప్లాట్లుగా చేసి తెగనమ్మేశారు. అప్పటి కుప్పం అధికారులకు అంతా తెలిసినా ఏమీ తెలియనట్టే వదిలేశారు. దీంతో స్థానికులు, రైతులు అప్పటి మదనపల్లె్ల సబ్ కలెక్టర్ వెట్రి సెల్వి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన సబ్‌కలెక్టర్ 2017 ఆగస్టులో కుప్పం వచ్చి కబ్జాకు గురైన చెరువును పరిశీలించారు. అక్కడికక్కడే సర్వేకి ఆదేశించి.. హద్దులు ఏర్పాటు చేస్తుండగా.. అదే సమయంలో సదరు సబ్‌కలెక్టర్‌కు అమరావతి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. విధిలేని పరిస్థితుల్లో నామమాత్రపు సర్వే చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతే ఆ తర్వాత అక్రమ కట్టడాల జోరు పెరిగిపోయింది. కేసు హైకోర్టులో ఉన్నప్పటికీ ఆగని అక్రమ నిర్మాణాలు చెరువులో అక్రమ నిర్మాణాలపై స్థానికులు, రైతులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కబ్జాదారులే ముందుగా హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకువచ్చారు. కోర్టుకు వాస్తవాలు వివరించి స్టే వెకేట్ చేయించాల్సిన అధికారులు సరైన సమయంలో అప్పీల్‌కు వెళ్లకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. ఇక వివాదం కోర్టులో ఉన్న నేపథ్యంలో కనీసం నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు ఆ కేసు సాకుతో పట్టించుకోలేదనే చెప్పాలి. ఫలితంగా ఇప్పటికీ అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతూనే ఉంది. ఇటీవలే కుప్పం మండల టీడీపీ కోశాధికారి మణి బినామీ పేరిట అక్కడే మూడంతస్తుల బిల్డింగ్ నిర్మించేశారు. వాళ్లే కోర్టుకు వెళ్లే చాన్స్ ఇచ్చారు వాస్తవానికి అప్పట్లో చెరువు ఆక్రమణలను రెవెన్యూ అధికారులు వెంటనే తొలగించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. అక్రమ నిర్మాణాలు వెంటనే కూల్చకుండా కాలయాపన చేశారు. ఆక్రమణదారులు కోర్టుకు వెళ్లేలా కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారు. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాల కోసం వేచి చూస్తున్నాం. చెరువును రక్షించుకునేందుకు రెవెన్యూ వారితో కలిసి ఇరిగేషన్ శాఖాపరంగా చర్యలు చేపడుతుంది. – హరినాథరెడ్డి, ఇరిగేషన్ డీఈఈ చెరువులో రియల్ వెంచర్ దారుణం ప్రభుత్వ రికార్డుల్లో ఇప్పటికీ చెరువుగానే చూపిస్తున్న ఆ భూమిలో రియల్ వెంచర్ వేయడం దారుణం. ఇప్పటికైనా అధికారులు హైకోర్టులో కేసు అంటూ కుంటి సాకులు చెప్పకుండా రూ.కోట్ల విలువైన చెరువు భూమి, చుట్టుపక్కల భూములను పరిరక్షించాలి. ఇది ప్రజలకు సంబం«ధించిన ఆస్తిగా గుర్తించి అధికారులు చర్యలు తీసుకోవాలి. – నరేంద్ర ఆజాద్, చెరువు దురాక్రమణ నిజమే వెంకటప్పా చెరువు దురాక్రమణ వాస్తవమే. కచ్చితంగా అది ప్రభుత్వ స్థలమే. వేరే సర్వే నంబర్‌తో అప్రూవల్ తీసుకుని 2019కి ముందు అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టిన మాట నిజమే. అయితే ఈ రెండేళ్లుగా ఆ చెరువు ప్రాంతంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకున్నాం. హైకోర్టులో స్టే ఉండడంతో స్టే వెకేషన్ కోసం ప్రయతి్నస్తున్నాం. ఆ తర్వాత హైకోర్టు తీర్పు మేరకు వ్యవహరిస్తాం. వాస్తవానికి చెరువు ఆక్రమణలను అడ్డుకోవాల్సిన ప్రధాన బాధ్యత ఇరిగేషన్ అధికారులదే. ఆ శాఖ బాధ్యులు సరిగ్గా స్పందించాల్సిన అవసరం ఉంది. – సురేష్, తహసీల్దార్ చదవండి: అండ్రు అరాచకాలు: కొండను తవ్వేసి.. అడవిని మింగేసి.. -
వణికిస్తున్న మీర్పేట్ చెరువు
సాక్షి, మీర్పేట్: నగర శివారులోని మీర్పేట్–బడంగ్‌పేట్‌ల మధ్య ఉన్న పెద్ద చెరువు నివురుగప్పిన నీరులా ఉంది. చెరువు ప్రమాదకర స్థితిలో ఉందని, ఏ క్షణంలోనైనా కట్టకు గండిపడే మీర్‌పేట పరిధిలోని పెద్దచెరువుకు గండిపడితే.. ఆ నీరంతా ఆయా కాలనీల మీదుగా కింద ఉన్న మంత్రాల చెరువులోకి చేరుతోంది. ఇప్పటికే మంత్రాల చెరువు పొంగిపొర్లుతుండటంతో దానికింద ఉన్న మిథులానగర్, సత్యసాయి నగర్లు పూర్తిగా నీటమునిగాయి. మంత్రాల చెరువు నుంచి నీరంతా సందె చెరువులోకి చేరి అటు నుంచి కాలనీలను ముంచేస్తూ..జిల్లెలగూడ, మందమల్లమ్మ, వివేక్‌నగర్, కర్మన్‌ఘాట్, గ్రీన్పార్క్కాలనీల మీదుగా సరూర్‌నగర్ చెరువులోకి చేరుతోంది. సరూర్‌నగర్ చెరువులోకి ఒక్కసారిగా వరద నీటి ఉధృతి పెరిగితే..దాని కింద ఉన్న చాలా కాలనీలు నీటమునుగుతాయి. అందువల్లే ఇక్కడి ప్రజల బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇప్పటికే వారం రోజుల నుంచి వరదలో మగ్గిపోయి... ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా..పెద్దచెరువ రూపంలో మరో ప్రమాదం పొంచి ఉందనే వార్త వారిని వణికిస్తోంది. అధికారులు ఏం చర్యలు తీసుకుంటారోనని ఎదురుచూస్తున్నారు. ప్రమాదం లేకపోలేదని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆ చెరువు కింద ఉన్న కాలనీవాసుల్లో మరింత ఆందోళన మొదలైంది. ముందస్తు చర్యల్లో భాగంగా లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయిస్తుండటంతో ఇళ్లు, వాకిళ్లను వదిలేసి బతుకుజీవుడా అంటూ బాధితులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. రియల్ వ్యాపారుల మాటలు నమ్మి రూ.లక్షలు వెచ్చించి ఇళ్లను కొనుగోలు చేసి ప్రస్తుతం తాము భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 90 శాతం ఇళ్లు ఖాళీ... మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట–బడంగ్‌పేట మధ్యలో ఉన్న చెరువు పేరులోనే కాదు విస్త్రీర్ణంలోనూ చాలా పెద్దది. హరితహారంలో భాగంగా చెరువు కట్టకు భారీగా డ్రిల్లింగ్ చేశారు. మొక్కల కోసం తవ్విన ఈ గుంతల నుంచి వాటర్ లీకేజీ అవుతోంది. శిఖం భూములు చాలా వరకు కబ్జాకావడం, ఇంటి వ్యర్ధాలను కట్టకు లోపలి వైపు పోయడంతో చెరువు విస్త్రీర్ణం చాలా వరకు కుంచించుకుపోయింది. చిన్న పాటి వర్షానికి చెరువు పొంగిపొర్లుతోంది. ఫలితంగా కింద ఉన్న న్యూబాలాజీనగర్, జనప్రియనగర్, ఎంఎల్‌ఆర్‌కాలనీ, ఎస్ఎల్ఎన్ ఎస్‌కాలనీ, టీఎస్‌ఆర్‌కాలనీ, అయోధ్యనగర్‌లకు వరద పోటెత్తి నీటమునుగుతున్నాయి. అధికారుల హెచ్చరికలతో న్యూ బాలాజీనగర్ కాలనీలో 90 శాతం మంది, జనప్రియనగర్‌లోని క్వార్టర్లలో 20 శాతం మంది ఇప్పటికే తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. మిగిలిన కాలనీల్లోనూ చాలా వరకు ఇళ్లు ఖాళీ అయ్యాయి. ఇసుక బస్తాలతో పాటు కట్టపై మట్టిని పోసి ప్రమాదం జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ‘మాది విజయవాడ. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నా. హైదరాబాద్‌లో సొంత ఇల్లు కొనుక్కోవాలనేది నా జీవితాశయం. ఆ మేరకు 18 నెలల క్రితం హౌసింగ్ లోన్ తీసుకుని మీర్‌పేట న్యూ బాలాజీనగర్‌లో రూ.54 లక్షల వెచ్చించి ఇల్లు కొన్నా. కుటుంబ సభ్యులతో కలిసి ఇదే ఇంట్లో ఉంటున్నాం. పదిహేను రోజుల నుంచి వరద ఓ మోస్తరుగా ఉంది. మూడు రోజుల క్రితం భారీగా పోటెత్తింది. కాలనీలోని ఇళ్లను ముంచెత్తింది. ఇంట్లోకి భారీగా వరద చేరడంతో టీవీ, కంప్యూటర్, రిఫ్రిజిరేటర్, వాషింగ్‌మిషన్ సహా ఉప్పు, పప్పు, బియ్యం ఇలా నిత్యావసర వస్తువులన్నీ వరదనీటిలో మునిగిపోయాయి. ఉన్న ఫలంగా ఇల్లు వదిలేసి కట్టు బట్టలతో బయటికి రావాల్సి వచ్చింది. అటు బిల్డర్ చెప్పిన మాటలతోనే కాదు.. ఇటు వరదతోనూనిండా మునిగిపోయాం.’ ... ఇదీ న్యూ బాలాజీనగర్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రవికుమార్ ఆవేదన. నగర శివారు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లను కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరిదీ ఇదే వ్యథ. ప్రాణభయంతో వెళ్తున్నా చాలా రోజులుగా ఎంఎల్‌ఆర్‌కాలనీ ముంపులోనే ఉంది. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ ఇప్పటికే తడిసిపోయాయి. రూ.2 లక్షలకుపైగా నష్టం వాటిల్లింది. మురుగునీటి మధ్య ఇంట్లో ఉండలేక బయటకు రాలేక నరకం అనుభవిస్తున్నాం. ప్రస్తుతం పెద్దచెరువు కట్ట తెగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో చేసేదేమీలేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇంటిని వదిలి వెళ్తున్నా. ఇప్పటికే చాలా మంది ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. – రాజు, ఎంఎల్‌ఆర్‌కాలనీ పెద్ద చెరువు లీకేజీలను అరికట్టేందుకు ముందస్తుగా చర్యలు చేపట్టాం. కట్టపై నాలుగు చోట్ల ఇసుక బస్తాలను వేస్తున్నాం. ఇప్పటికే కింది కాలనీలను ఖాళీ చేయించాం. – బి.సుమన్‌రావు, కమిషనర్ -
‘మినీ’ని సుందరంగా తీర్చిదిద్దుతాం
సాక్షి, కౌడిపల్లి(నర్సాపూర్): కౌడిపల్లి పెద్దచెరువు మినీట్యాంక్‌బండ్‌పై అందమైన మొక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దుతామని డీపీఓ హనూక్ తెలిపారు. మంగళవారం కౌడిపల్లిని దత్తత తీసుకున్న ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్స్ సుజీంద్ర, దిలీప్‌దాస్‌తో కలిసి డీపీఓ హనూక్ మినీ ట్యాంక్‌బండ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలమేరకు ఎంఎస్ అగర్వాల్ కంపెనీ మండలాన్ని దత్తత తీసుకుందన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మినీ ట్యాంక్‌బండ్‌తో పాటు కౌడిపల్లి గ్రామంలో మొక్కలు నాటడంతోపాటు వాటికి రక్షణ కల్పిస్తుందన్నారు. ట్యాంక్‌బండ్‌ను అందంగా తీర్చిదిద్దేందుకు స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని అందులో భాగంగా మొక్కలు సైతం పెంచనున్నట్లు తెలిపారు. నాటిన మొక్కలకు రక్షణ చర్యలు చేపట్టి నీరు పోయడంతో పాటు కాపలా ఏర్పాటు చేస్తామన్నారు. కట్టపై అందంగా మొక్కల పెంపకం.. కట్టపై అందంగా కనిపించే పూల మొక్కలు నీడనిచ్చే మొక్కలు పెద్దగా పెరిగే వివిధ రకాల మొక్కలను నాటుతామని తెలిపారు. అనంతరం ఎంఎస్ అగర్వాల్ కంపెనీ ప్రతినిధి సుజీంద్ర మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలతో ట్యాంక్‌బండ్‌నూ పరిశీలించినట్లు తెలిపారు. అధికారులు సూచనలు ఖర్చు అంచనాలను కంపెనీకి సమర్పించిన అనంతరం పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కోటిలింగం, ఏపీఓ శ్యాంకుమార్, ఈసీ ప్రేంకుమార్, సర్పంచ్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఉపసర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, నాయకులు పిశ్కె శెట్టయ్య, చంద్రం దుర్గాగౌడ్ పాల్గొన్నారు. -
నీరు కరువు.. బతుకు బరువు
-కళావిహీనమైన శింగనమల చెరువు జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తోంది. భూగర్భ జలాలు అడుగంటి బోరు బావులు ఎండిపోయి పంటలు మాడిపోతున్నాయి. ప్రకృతి ప్రకోపం, పాలకుల నిర్లక్ష్యం వెరసి జిల్లా కరువుకు చిరునామాగా మారింది. నీటి పంపిణీలోనూ స్వార్థ రాజకీయాలు చోటుచేసుకోవడంతో వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు పంట నష్టాలతో హాహాకారాలు చేస్తున్నారు. జిల్లాలోని అతి పెద్ద చెరువుల్లో శింగనమల చెరువు రెండవది. దీని విస్తీర్ణం 2,600 ఎకరాలు. చెరువులోకి నీరు చేరితో దాదాపు 14 గ్రామాల్లో పచ్చదనంతో కళకళలాడతాయి. అలాంటిది తీవ్ర వర్షాభావం కారణంగా చుక్కునీరు లేక చెరువు కళావీహీనంగా మారింది. చెరువుపై ఆధారపడి జీవిస్తున్న పక్షులు కూడా ఆహారం కోసం అల్లాడుతున్న దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను ఆవేదనకు గురిచేస్తున్నాయి. -ఫొటోలు: వీరేష్, సాక్షి ఫొటోగ్రాఫర్ -
ఇద్దరిని మింగిన చెరువు
∙ఈతకు వెళ్లి యువకుల మృతి ∙ప్రాణం తీసిన సరదా ములుగు : ధర్మసాగర్ రిజర్వాయర్‌లో మునిగి యువకులు మృతిచెందిన సంఘటనను మరువక ముందే.. అదే తరహాలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. ములుగుకు చెందిన ఇద్దరు యువకులు లోకం చెరువులో ఈతకు వెళ్లి.. లోతైన గుంతలో మునిగి ప్రాణాలు వదిలారు. గాంధీ జయంతి సెలవుదినం కావడంతో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి మృ త్యువాత పడ్డారు. కన్నవారికి కడుపుకోతను మిగిల్చారు. వివరాల్లోకి వెళ్తే.. ములుగు మండల కేంద్రానికి చెందిన ఎండీ హుస్సేన్‌కు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు షంషుద్దీన్ (20) ఐటీఐ చేశాడు. స్థానికంగా సెల్షాప్ను నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఆదివారం గాంధీ జయంతి కావడంతో షంషుద్దీన్ షాపునకు వెళ్లకుండా ఎండీ అంకూస్, అహ్మదీ(మున్నా) దంపతుల కుమారుడు ఫయాజ్ (20), మరో స్నేహితుడు నాగరాజుతో కలిసి ఉదయం 10.30 గంటలకు లోకం చెరువులో ఈతకు వెళ్లాడు. మార్గం మధ్యలో మద్యం తాగారు. అనంతరం ఈత కొట్టేందుకు చెరువులోకి ఫయా జ్, షంషుద్దీన్ దిగారు. ఈత రాకపోవడంతో స్నేహితుడు నాగరాజు ఒడ్డునే కూర్చున్నాడు. కొద్దిసేపు జాలీగా ఈతకొట్టిన ఇద్దరు మిత్రులు, చెరువులో లోతుగా ఉన్న ప్రదేశంలో అకస్మాత్తుగా దిగబడసాగారు. ఈక్రమంలో ఒకరికొకరు సాయం అందించుకునే ప్రయత్నం చేశారు. ఒడ్డుకు చేరుకునేలోపు లోతులో మునిగిపోయారు. ఒడ్డుకు నిలబడిన స్నేహితుడు నాగరాజు కేకలు వేశాడు. అనంతరం స్నేహితుల బంధువులకు సంఘటనపై సమాచారం అందించాడు. ఎస్సై మల్లేశ్‌యాదవ్, మృతుల బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని జాలర్ల సాయంతో మృతదేహాలను వెలికితీయించారు. మృతదేహాలను ములుగు సివిల్ ఆసుపత్రి మార్చురీ గదిలోకి తరలించేందుకు వైద్యుడు మనోహర్ నిరాకరించారు. దీంతో ములుగు సర్పంచ్ గుగ్గిళ్ల సాగర్ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఆవరణలో ధర్నా చేశారు. కళ్ల ముందే మునిగిపోయారు.. - నాగరాజు, మృతుల స్నేహితుడు నాకు ఈత రాదు. దీంతో చెరువు ఒడ్డునే నిలబడ్డాను. షంషుద్దీన్, ఫయాజ్‌లు ఈత కొడుతూ మునిగిపోతున్న క్రమంలో వారిని కాపాడేందుకు ప్యాంట్, షర్ట్‌లను విసిరాను. వాటిని వాళ్లు అందుకోలేకపోయారు. నీటిలో మునిగిపోకుండా ఉండేందుకు ప్రయత్నించారు. కానీ అది సాధ్యపడక.. నా మిత్రులు ఇద్దరూ నా కళ్ల ముందే చెరువులో మునిగిపోయారు. ఎంతో బాధగా ఉంది. అదే చివరి చూపైంది.. – హుస్సేన్, మృతుడు షంషుద్దీన్ తండ్రి ‘‘నా కొడుకు కుటుంబానికి అండగా ఉంటాడనుకున్నా. ఏ రోజూ నా కొడుకును ఒక్కమాటా అనలేదు. ఏదో తన పని తాను చేసుకుంటున్నాడని అనుకున్నా. శనివారమే ఇంటర్లో తప్పిన సబ్జెక్టుకు సంబంధించిన సప్లిమెంటరీ పరీక్ష రాశాడు. ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయటికిపోతూ కనిపించాడు. అదే చివరి చూపవుతుందని కలలో కూడా అనుకోలేదు. ఒంటి గంట సమయంలో చెరువులో మునిగిపోయాడని తెలిసింది. ఈత వచ్చిన నా కొడుకు చెరువులో శవమైతడని అనుకోలేదు.’’ -
చెరువులో మునిగి మత్యకారుడు మృతి
సిరిసిల్ల టౌన్ : నాలుగు రోజుల క్రితం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు ఆదివారం చెరువులో శవమై తేలాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణ ంలోని బోయివాడకు చెందిన కూర రాములు(40) గురువారం ఉదయం చేపల వేటకు వెళ్లాడు. ఆరోజు రాత్రి వరకు ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం మధ్యాహ్నం దామెరకుంట చెరువు వద్ద రాములు సైకిల్, దుస్తులు ఉండటంతో ఈతగాళ్లు చెరువులో గాలించారు. అయినా జాడ కనిపించలేదు. చెరువులోని తామర పూల ఊబిలో చిక్కుకుని ఉంటాడని భావించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం రాములు మృతదేహం చెరువులో తేలియాడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి అక్కడే పోస్టుమార్టం చేయించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. రాములుకు భార్య అనిత ఉంది. -
చెరువును పరిశీలించిన జూలకంటి
మిర్యాలగూడ : మిషన్ కాకతీయ ద్వారా మరమ్మతులు చేపట్టిన చెరువులో ట్రాక్టర్‌తో దున్నుతున్నారని ఐలాపురం గ్రామానికి చెందిన రైతులు మంగళవారం ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం రైతులతో కలిసి సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి గ్రామంలోని చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఐలాపురం గ్రామం ఏర్పడిన నాటి నుంచి చెరువులో ఎక్స్ సర్వీస్‌మెన్‌కు ఎలా ఐదెకరాల భూమి పట్టా ఇచ్చారని అన్నారు. చెరువులో ట్రాక్టర్‌తో దున్నుతున్నారని, దాని వల్ల రైతులకు తీరని అన్యాయం జరగనున్నదని అన్నారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఇచ్చిన పట్టాను రద్దు చేయాలని కోరారు. చెరువును సందర్శించిన వారిలో సీపీఎం డివిజన్ కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు, రెహమాన్‌ఖాన్, రైతులు సాయన్న, గోప్యానాయక్, భిక్షం, సైదానాయక్, దీప్లానాయక్, శ్రీను, రంగా, లచ్చ, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. -
వాడవాడలా హరితహారం
ఎమ్మెల్యే దివాకర్‌రావు మంచిర్యాల రూరల్ : హరితహారం కార్యక్రమంలో భాగంగా మండంలోని హాజీపూర్, దొనబండ జీపీల్లో బుధవారం విస్తృతంగా మొక్కలు నాటారు. మండలంలోని హాజీపూర్ జీపీ పరిధిలోని ధర్మారం, దొనబండ గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మొక్కలు నాటారు. వాడవాడలా హరితహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హరితహారంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వాతావరణ కాలుష్యం నివారణకు, వర్షాలు సమృద్ధిగా కురవాలంటే వన సంపందను విరివిగా పెంచాలని కోరారు. భవిష్యత్‌లో రైతాంగానికి సాగునీరు కూడా అందాలంటే మొక్కల పెంపకంలో పొలం, చెరువు గట్లపై మొక్కలు నాటేలా చైతన్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ బేర సత్యనారాయణ, వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్, హాజీపూర్, దొనబండ సర్పంచులు ఆకుతోట సత్తమ్మ, జాడి సత్యం, ఉప సర్పంచులు బెడ్డల సత్తయ్య, దొమ్మాటి లచ్చన్న, ఎంపీటీసీలు బేతు రమాదేవి, మడావి సంధ్యారాణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొమ్మాటి సత్తయ్య, నాయకులు మాధవరపు రాజేశ్వర్‌రావు, సింగిల్ విండో చైర్మన్ కొట్టె సత్తయ్య పాల్గొన్నారు.