
గంట్యాడ: చెరువులో స్నానానికి దిగిన ఓ యువకుడు అదృశ్యం కాగా, మరో యువకుడిని స్నేహితులు రక్షించి ఆస్పత్రిలో చేర్పించారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బుడతనాపల్లి గ్రామానికి చెందిన కొంతమంది యువకులు బుధవారం ఉదయం మంచినీటి కొనేరులో స్నానానికి దిగారు. వారిలో వారాది సురేష్ మునిగిపోతుండడంతో స్నేహితులు గమనించి రక్షించి ఒడ్డుకు చేర్చి 108 అంబులెన్సులో విజయనగరంలోని తిరుమల ఆస్పత్రికి తరలించారు. అయితే వారితో పాటు స్నానానికి దిగిన కొంచాడ రామకృష్ణ కనిపించలేదు. చెరువులో ముగినిపోయాడమోనని గ్రామస్తులు వలల సాయంతో గాలించారు. అయినప్పటికీ జాడ తెలియరాలేదు. రామకృష్ణ చెరువులో మునిగిపోయాడా? లేదా సురేష్ మునిగిపోయాడనే భయంతో పారిపోయాడా? అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందనప్పటికీ సమాచారం మేరకు విచారణ చేపట్టారు.
(చదవండి: విద్యార్థిని ఆత్మహత్య...కారణం అదేనా...)
Comments
Please login to add a commentAdd a comment