vizayanagaram distirict
-
డయేరియా మరణాలపై సీఎం,డిప్యూటీ సీఎం రాజకీయాలా?.. బొత్స ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: విజయనగరం జిల్లా గుర్ల మండలంలో డయేరియా మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యం, మానవ తప్పిదమే కారణమని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని శాసన మండలి విపక్ష నేత, బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. డయేరియాతో మృతి చెందిన 16 మందికి వెంటనే ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, బాధిత గ్రామాలను తక్షణమే రెడ్ జోన్‌గా ప్రకటించి, యుద్ధ ప్రాతిపదికన పరిస్థితులన్నీ చక్కదిద్దాలని ఆయన డిమాండ్ చేశారు.డయేరియా మృతులపై ప్రభుత్వం గందరగోళ లెక్కలు చెబుతోందన్న మండలి విపక్షనేత, మరణాల సంఖ్యతో సీఎం, డిప్యూటీ సీఎం రాజకీయాలు చేస్తున్నారని ఆక్షేపించారు. జిల్లా కలెక్టర్ లెక్క మేరకు ఒక్కరు చనిపోగా, చంద్రబాబు లెక్క 8 మంది అని, పవన్‌కళ్యాణ్ లెక్క 10 మంది అని తెలిపారు. ఎందుకీ గందరగోళం? ఎందుకింత అస్పష్టత? అన్న బొత్స, పాలన చేతకాక, అధికారులపై పట్టు లేకనేనా? అని గట్టిగా నిలదీశారు.రుషికొండ నిర్మాణలపై పవన్‌కు బొత్స సవాల్గుర్ల పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, రుషికొండ ఎందుకెళ్లారని.. రుషికొండ భవనాలకు, డయేరియా వ్యాప్తికి ఏమిటి సంబంధం అని మండలి విపక్షనేత ప్రశ్నించారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే పవన్‌కళ్యాణ్ ఆరోపణలు చేస్తున్నారని, రుషికొండ నిర్మాణాలపై అనుమానాలు ఉంటే, నిరభ్యరంతంగా విచారణ చేయించుకోవచ్చని స్పష్టం చేశారు.ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై షర్మిల అసత్య ఆరోపణలు చేస్తున్నారన్న బొత్స, నాడు ఆ మొత్తం పిల్లల తల్లుల ఖాతాల్లో వేసేందుకు (డీబీటీ) ప్రభుత్వం సిద్ధమైతే, కోడ్ పేరుతో కోర్డును ఆశ్రయించింది ఇప్పటి పాలకులే అన్న విషయం షర్మిలకు తెలియదా? అని చురకలంటించారు.ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదా?గుర్ల మండంలో కలుషిత నీటి సరఫరాకు కూటమి ప్రభుత్వం రకరకాల కారణాలు చెబుతోందన్న మండలి విపక్షనేత.. 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయక నిర్వహణ లోపం అని ఒకసారి, ఫిల్టర్ పాయింట్స్ మార్చలేదని మరోసారి చెబుతూ, ఆ మరణాలపైనా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని గుర్తు చేశారు. డయేరియా వ్యాప్తి చెందిన ఆ ఏడెనిమిది గ్రామాల్లో వెంటనే ట్యాంకర్లతో మంచినీరు సరఫరా చేయడంతో పాటు, మెడికల్ క్యాంప్‌లు నిర్వహించి పరిస్థితులు చక్కదిద్దాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా ఘటనలు తలెత్తకుండా ఏ చర్యలు తీసుకోబోతున్నారో సీఎం చెప్పాలని కోరారు. డబ్బుల వసూళ్లకు కక్కుర్తిపడి నీటి సరఫరా పర్యవేక్షణను పూర్తిగా వదిలేశారన్న మండలి విపక్షనేత.. కూటమి నేతలు, అధికారులు వస్తే, నాలుగు నెలలుగా అక్కడి దారుణస్థితిని చూపిస్తానని సవాల్ చేశారు.మేం అడుగుతున్నదేంటి? మీరు చెప్పే సమాధానం ఏంటి?డయేరియా మరణాలపై తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే.. పవన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, ఈరోజు రుషికొండలో పర్యటించి, అక్కడి భవనాల కోసం రూ.500 కోట్లు ఖర్చు చేశామంటూ విమర్శిస్తున్నారని బొత్స గుర్తు చేశారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే, హైదరాబాద్‌లో సీఎం ఇల్లు, క్యాంప్ ఆఫీస్ నిర్మిస్తే, ఆ తర్వాత వచ్చిన వారు అక్కడి నుంచే పాలించారని ప్రస్తావించారు. అదే తరహాలో విశాఖ రుషికొండపై గత ప్రభుత్వ హయాంలో సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మిస్తే తప్పేమిటని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. -
సిక్కోలులో జన సంద్రం
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తొలి సూర్యకిరణాలు తాకే అరసవెల్లి సూర్యనారాయణమూర్తి సాక్షిగా జననేతను సిక్కోలు అక్కున చేర్చుకుంది. మంగళవారం విజయనగరం జిల్లాలో పర్యటన అనంతరం శ్రీకాకుళం జిల్లా అక్కివలసలోని రాత్రి బస శిబిరానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని పలుకరించేందుకు ఉదయం ఆరు గంటల నుంచే పరిసర గ్రామాలకు చెందిన పిల్లలు, పెద్దలు భారీ ఎత్తున తరలివచ్చారు. ప్రియతమ నేతను కళ్లారా చూడాలని, వీలైతే ఓ సెల్ఫీ తీసుకోవాలని ఉత్సాహం చూపారు.బుధవారం ఉదయం తిరిగి ప్రారంభమైన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 22వ రోజు సుమారు 64 కి.మీ. మేర సాగి టెక్కలి నియోజకవర్గం అక్కవరం బహిరంగ సభతో ముగిసింది. రాత్రి బస శిబిరం వద్ద శ్రీకాకుళం, విజయనగరం నుంచి వచ్చిన పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు సీఎం జగన్‌ను కలిశారు. సీఎం వారిని పేరుపేరునా పలకరిస్తూ యోగక్షేమాలు ఆరా తీసి దిశానిర్దేశం చేశారు.అనంతరం వేలాదిగా తరలి వచ్చిన అభిమానులతో అక్కివలస నుంచి ప్రారంభమైన యాత్ర ఆమదాలవలస కొత్తరోడ్డు, మడపాం, నిమ్మాడ, పొడుగుపాడు, కోటబొమ్మాళి జంక్షన్, కన్నెవలస, చమయ్యపేట వరకు సాగింది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం నేతలతో కలసి అక్కవరం బహిరంగ సభ ప్రాంగణం వద్దకు సీఎం చేరుకున్నారు. ‘సిద్ధం సిద్ధం.. సీఎం సీఎం’ అంటూ మిన్నంటిన నినాదాలతో సభా ప్రాంగణం సముద్ర హోరును తలపించింది. సీఎం మాట్లాడుతుండగా ఆకాశం మేఘావృతంఉదయం 10 గంటల ప్రాంతంలో ప్రారంభమైన యాత్రకు అక్కచెల్లెమ్మలు హారతులు పట్టారు. జగనన్న తెచ్చిన వలంటీర్లు, సచివాలయాలతో తమ పనులు సులభతరమైపోయాయని, కార్యాలయాలు చుట్టూ తిరిగే దుస్థితి తప్పిందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పొద్దున్నే ఇంటికి వచ్చి నిద్రలేపి మరీ పింఛన్ ఇస్తున్నారని, ఇంత మేలు చేసిన జగన్ బాబును చూడాలని వచ్చామని తమ ఆనందాన్ని పంచుకున్నారు.మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత వాతావరణం చల్లబడింది. సీఎం జగన్ అక్కవరం సభలో ప్రసంగిస్తుండగా మేఘాలు కమ్ముకున్నాయి. సభా ప్రాంగణంలో చినుకులు రాలడం, సమీపంలో వర్షం కురవడంతో హర్షాతిరేకాలు మిన్నంటాయి. జగన్ రాకతో తమ ప్రాంతం చల్లబడిందని, ఆయన అడుగుపెట్టిన చోట మంచే జరుగుతుందని చెప్పడానికి ఇదే నిదర్శనమని మహిళలు నినాదాలు చేశారు.♦ పుట్టుకతో వినికిడి లోపం కలిగిన తన కుమారుడు త్రిషాన్ రెండు చెవులకు 2022లో ఆరోగ్యశ్రీ ద్వారా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ ఉచితంగా చేయడంతో చిన్నగా మాట్లాడగలుగుతున్నట్లు శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం నర్సిపురం గ్రామానికి చెందిన చమల్ల శ్రీధర్ సీఎం జగన్ వద్ద ఆనందం వ్యక్తం చేశాడు. అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద ఆయన సీఎం జగన్‌కు కలిశారు. ♦ ‘మేమంతా సిద్ధం’ యాత్ర మడపాం టోల్గేట్ వద్దకు చేరుకునేసరికి అభిమానులతో కిక్కిరిసిపోయింది. భారీ క్రేన్‌తో తెచ్చిన నవరత్నాల పథకాల మాలతో సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. అక్కడ తనను కలసిన ఓ దివ్యాంగుడికి మూడు చక్రాల మోటార్ సైకిల్ అందజేస్తామని సీఎం జగన్ భరోసా వచ్చారు. వినికిడి లోపంతో బాధపడుతున్న ఓ బాధితురాలికి కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్స నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కుటుంబం అంతా జగనన్న అభిమానులంమా కుటుంబం మొత్తం జగనన్న అభిమానులం. జగనన్న పాదయాత చేసినప్పుడు నేను చదువకుంటున్నా. మా జిల్లాకు వచ్చినప్పుడు సెల్ఫీ కూడా తీసుకున్నా. ఇప్పుడు మా పాప రెండో తరగతి చదువుతోంది. జగనన్నను చూడాలని రాత్రి నుంచి మారాం చేయడంతో ఉదయం 7 గంటలకే అక్కివలస తీసుకొచ్చాం. జగనన్న చేపట్టిన విద్య, వైద్య సంస్కరణలు సామాన్యులకు ఎంతో మేలు చేస్తున్నాయి. వాటిని కళ్లారా చూస్తున్నాం. – పి.సంతోషిమణి, శ్రీకాకుళం మా తొలి ఓటు జగనన్నకే.. నాన్న అబ్దుల్ సలీమ్ ప్రైవేటు కాలేజీలో పనిచేస్తుండగా అమ్మ నసీమాబేగం గృహిణి. తక్కువ ఆదాయం ఉన్న మాలాంటి కుటుంబాలకు జగనన్న దేవుడు. మా అక్క, నా చదువు పూర్తిగా జగనన్న విద్యా దీవెనతోనే పూర్తయింది. ఇంటి స్థలం ఇచ్చి ఆర్థిక సాయం చేయడంతో సొంతిల్లు కట్టుకున్నాం. మా కుటుంబం ఆనందంగా ఉందంటే అది జగనన్న పుణ్యమే. మా అక్కకు, నాకు తొలిసారి ఓటు వేసే అవకాశం వచ్చింది. తొలి ఓటు ఫ్యానుకే వేస్తాం. జగనన్నను చూశాకే అక్కివలస నుంచి ఇంటికి వెళతా. – నజీమా, విజయనగరం -
ఏమై పోయాడో..? స్నానానికి దిగిన యువకుడు అదృశ్యం
గంట్యాడ: చెరువులో స్నానానికి దిగిన ఓ యువకుడు అదృశ్యం కాగా, మరో యువకుడిని స్నేహితులు రక్షించి ఆస్పత్రిలో చేర్పించారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బుడతనాపల్లి గ్రామానికి చెందిన కొంతమంది యువకులు బుధవారం ఉదయం మంచినీటి కొనేరులో స్నానానికి దిగారు. వారిలో వారాది సురేష్ మునిగిపోతుండడంతో స్నేహితులు గమనించి రక్షించి ఒడ్డుకు చేర్చి 108 అంబులెన్సులో విజయనగరంలోని తిరుమల ఆస్పత్రికి తరలించారు. అయితే వారితో పాటు స్నానానికి దిగిన కొంచాడ రామకృష్ణ కనిపించలేదు. చెరువులో ముగినిపోయాడమోనని గ్రామస్తులు వలల సాయంతో గాలించారు. అయినప్పటికీ జాడ తెలియరాలేదు. రామకృష్ణ చెరువులో మునిగిపోయాడా? లేదా సురేష్ మునిగిపోయాడనే భయంతో పారిపోయాడా? అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందనప్పటికీ సమాచారం మేరకు విచారణ చేపట్టారు. (చదవండి: విద్యార్థిని ఆత్మహత్య...కారణం అదేనా...) -
గ్యాస్ సిలిండర్‌కి ఎక్స్పైరీ తేదీ ఉంటుంది!..గడువు దాటితే ప్రమాదమే
బలిజిపేట: గ్యాస్ కనెక్షన్ కొనుగోలు చేసి వినియోగించడం ప్రస్తుతం ఎంత అవసరమో, దాని వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవడం అంతే ముఖ్యం. జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్లే. అందులో అత్యంత ముఖ్యమైనది గ్యాస్ సిలిండర్‌కూ కాలపరిమితి ఉంటుందని తెలియకపోవడమే. గ్యాస్ సిలిండర్‌కు ఉండే కాలపరిమితిని సాధారణంగా ఎవరూ గమనించరని, కాలపరిమితి దాటితే పెనుప్రమాదం ఉంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్ ఎక్స్పైరీ తేదీ ముగిసినా వినియోగిస్తే గ్యాస్ లీయయ్యే ప్రమాదం ఉందంటున్నారు. సరఫరా చేసే ప్రతి సిలిండర్‌పై ఎక్స్పైరీ సంవత్సరాన్ని, నెలను కోడ్ విధానంలో మెటల్ ప్లేట్‌పై వంటగ్యాస్ కంపెనీలు ముద్రిస్తాయి. సిలిండర్ మారుతున్నప్పుడల్లా ఎక్స్పైరీ గడువును చూసుకుని తీసుకోవడం, వినియోగించుకోవడం ఎంతో అవసరమని హితవు పలుకుతున్నారు. కాలపరిమితిని ఎలా గుర్తించాలంటే.. సిలిండర్ మెటల్ ప్లేటుపై ఆంగ్ల అక్షరంతో సంవత్సరం, నెల ఉంటుంది. దాని ప్రకారం అది ఏసంవత్సరం, ఏనెల తరువాత ఎక్స్పైరీ అవుతుందో తెలుస్తుంది. ఉదాహరణగా ఎ–24అని ఉంటే ఆ సిలిండర్ 2024 మార్చిలో ఎక్స్పైర్ అవుతుందని అర్థం. ఆంగ్ల అక్షరం త్రైమాసికానికి సూచిక. ఎ అక్షరం జనవరి నుంచి మార్చి వరకు, బి అక్షరం ఏప్రిల్ నుంచి జూన్ వరకు, సి అక్షరం జూలై నుంచి సెప్టెంబరు వరకు, డి అక్షరం అక్టోబర్ నుంచి డిసెంబరు వరకు అని గుర్తించాలి. గడువును గుర్తించాలి సిలిండర్ ఇంటి వద్దకు వచ్చిన వెంటనే మెటల్ ప్లేట్‌పై కోడ్ విధానంలో ఉండే ఎక్స్పైరీ గడువును గుర్తించి తీసుకోవాలి. అది నెల రోజులకు సమీపంలో ఉంటే అటువంటి సిలిండర్‌ను తీసుకోకూడదు. చిన్నచిన్న కుటుంబాలవారు, అతి తక్కువ వేతనం సంపాదించేవారు గ్యాస్ వినియోగం ఎక్కువ రోజులు చేస్తుంటారు. కనుక ఎక్స్పైరీ తేదీ లోపల వారి సిలిండర్ పూర్తయ్యే అవకాశాలు తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున అటువంటి సిలిండర్లతో ప్రమాదం సంభవించే ఆస్కారం ఉంది. అందుకు గడువును గుర్తించి సిలిండర్ తీసుకోవాలి. దానిస్థానంలో వేరే సిలిండర్ అడిగే హక్కు వినియోగదారునికి ఉంది. సిలిండర్‌కు పదేళ్ల గడువు సిలిండర్ తయారైన నాటి నుంచి పదేళ్ల వరకు దానికి గడువు ఉంటుంది. సిలిండర్‌ను ప్రత్యేకమైన ఉక్కుతో, లోపల భాగం సురక్షితమైన కోటింగ్‌తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్(బీఐఎస్) ప్రమాణాలతో తయారుచేస్తారు. బీఐఎస్ అనుమతుల తరువాతే సిలిండర్ మార్కెట్లోకి వస్తుంది. గడువు ముగిసేవి ఉండవు గ్యాస్ సిలిండర్లు గడువు ముగిసేవి ఉండవు. ముందే వాటిని కండెమ్ సరుకుగా తీసివేస్తారు. తయారై వచ్చిన వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి గ్యాస్ ఫిల్లింగ్ చేస్తారు. పకడ్బందీగా చర్యలు ఉంటాయి. హర్ష, గ్యాస్ ఏజెన్సీ యజమాని, పలగర, బలిజిపేట మండలం (చదవండి: రైతును శాస్త్రవేత్తను చేయడమే వైఎస్సార్ పొలంబడి లక్ష్యం) -
పంట భద్రుడై... ఆదర్శ రైతుగా నిలిచాడు
ఉపాధ్యాయ వృత్తికి అవసరమైన అర్హతలు కలిగిన ఓ పట్టభద్రుడు వ్యవసాయంపై దృష్టి సారించాడు. పదిమంది రైతులు సాగు చేస్తున్న పద్ధతికి భిన్నంగా ఆలోచించి వాణిజ్యపంట సాగు చేపట్టాడు. ఇంతవరకు పార్వతీపురం మన్యం జిల్లాలో కనీవినీ ఎరుగని డ్రాగన్ పండ్ల తోట పెంపకం చేపట్టి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. సాక్షి, పార్వతీపురం: ఈ ఫొటోలోని డ్రాగన్ తోట వేరే ఏ ప్రాంతంలోనిదో కాదు. సంప్రదాయంగా పండిస్తున్న వరి, మొక్క జొన్న, అరటి, పామాయిల్ పంటపొలాల్లోనిదే. ఈ వాణిజ్య పంటను ఓ యువరైతు పండిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ మండలం లుంబూరు గ్రామానికి చెందిన యువరైతు లండ ఏసుబాబు రెండెకరాల్లో డ్రాగన్ పంటను సాగుచేస్తున్నారు. ఈ తోట వేసి ఏడాది కావస్తోంది. ఇప్పుడిప్పుడే పూతదశకు రావడంతో, అక్కడక్కడ పిందెలు కాస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య ఈ రెండెకరాల పంటలో తొలిపూత వచ్చే అవకాశం ఉందని రైతు సాక్షికి వెల్లడించారు. ఈ పంట నుంచి తొలి పూతలో పెద్దగా దిగుబడి ఉండదని, రెండేళ్ల తరువాత ఎకరాకు 3 టన్నుల వరకూ డ్రాగన్ పండ్లు రానున్నాయని తెలిపాడు. నల్గొండలోని ప్రముఖ రైతు రాజారెడ్డి నర్సరీ నుంచి మొత్తం 3,000 మొక్కలు తీసుకొచ్చి సాగుచేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లో డ్రాగన్ పండ్లకు టన్ను ధర రూ.2 లక్షలు పైబడి ఉందని చెబుతున్నాడు. లీజు భూముల్లో సాగు పాలకొండ మండలంలోని లుంబూరు గ్రామం పక్కనే ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని ఈ యువ రైతు 20 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నాడు. ముళ్లపొదలు కూడా మొలకెత్తని ఈ భూమిని ఏడాదికి ఎకరాకు లీజు రూ.14 వేలు చొప్పున ఒప్పందం కుదుర్చుకుని డ్రాగన్ సాగు ప్రారంభించాడు. బీఎస్సీ బీఈడీ చేసిన ఈ రైతు పలుచోట్ల డ్రాగన్ పండ్లకు ఉన్న డిమాండ్‌ను గుర్తించి ఈ పంట సాగుతో లాభాలు వస్తాయనే ఉద్దేశ్యంతో ఏడాది క్రితం సాగు మొదలుపెట్టాడు. ఒక హెక్టార్లో డ్రాగన్ సాగుకు ప్రభుత్వం 30 శాతం మేర రాయితీతో విత్తన మొక్కలను అందిస్తున్న నేపథ్యంలో ఈయన కూడా ప్రభుత్వం నుంచి రూ. 30 వేల మేర రాయితీ పొందాడు. మొత్తం భూమిని సాగుకు అనుకూలంగా మార్చి బోర్లు తవ్వించి మోటార్లు ఏర్పాటు చేశాడు. సిమెంట్ స్తంభాలు, చక్రాలతో తోటకు అనుగుణంగా పందిళ్లు నిర్మించాడు. ఈ మొత్తం ఏర్పాట్లకు తోట పెంపకానికి ఇప్పటివరకూ ఎకరాకు రూ.5 లక్షల మేర ఖర్చయిందని రైతు ఏసుబాబు చెప్పాడు. ఒక స్తంభం నుంచి మరో స్తంభానికి మధ్య 8 నుంచి పది అడుగుల వ్యత్యాసంతో డ్రాగన్ మొక్కలు వేయగా ప్రస్తుతం అవి ఏపుగా పెరిగి సాగు ఆశాజనకంగా కనిపిస్తోంది. సేంద్రియ పద్ధతిలో సాగు యువరైతు సాగును సేంద్రియ పద్ధతిలో చేస్తున్నాడు. పేడగత్తెం, కుళ్లిన ఎండుగడ్డి, జీవా మృతాల ద్వారానే సాగు చేపట్టాడు. రసాయనిక ఎరువులను వినియోగించి, సాదారణ పంటలు సాగుచేసే రైతులకు ఏసుబాబు చేస్తున్న సాగు ఆదర్శంగా మారింది. బీడు భూమిలో రూ.10 లక్షలకుపైగా పెట్టుబడి పెట్టి సాగులోకి తీసుకు రావడంతో పాటు అధునాతన సాగును ప్రారంభించడంతో పలువురు రైతు ఏసుబాబును అభినందిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన పంట కావడంతో ఈ పండ్లకు మార్కెట్లో డిమాండ్ ఉంటుందని పాలకొండ ఉద్యానవనశాఖాధికారిణి టి.అమరేశ్వరి అన్నారు. ఈ వినూత్న సాగు చేసేందుకు పార్వతీపురం మన్యం జిల్లాలో యువరైతు ఏసుబాబు ముందుకు రావడం విశేషమని వెల్లడించారు. బాగుంటుందనే ఉద్దేశంతో.. వాణిజ్యపంటల సాగు ఆసక్తితోనే చేపట్టాను. నా స్నేహితుడి సాయం కూడా ఉంది. నిరుపయోగంగా ఉన్న ఈ ప్రాంతంలో లీజుకు తీసుకుని డ్రాగన్ తోటలు వేశాను. ప్రస్తుతం పూతదశకు చేరుకున్నాయి. ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాది బాగా పూత వస్తుంది. మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నాను. ఎల్. ఏసుబాబు, యువరైతు, లుంబూరు. -
హత్యచేసి కాల్చేశారు..!
డెంకాడ: డెంకాడ మండలం పెదతాడివాడ పంచాయతీ పరిధి (విజయనగరం–కుమిలి ఆర్అండ్బీ రోడ్డుకు సమీపం) దయాల్‌నగర్ సమీపంలో గుర్తుతెలియని మహిళపై పెట్రోల్ పోసి దహనం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ వయస్సు 18–21 మధ్య ఉంటుందని భావిస్తున్నారు. స్థానికులు డెంకాడ పోలీసులకు శనివారం ఉదయం సమాచారం అందించడంతో డీఎస్పీ అనిల్‌కుమార్, భోగాపురం సీఐ విజయానంద్, డెంకాడ ఎస్ఐ పద్మావతి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్పీ దీపికా ఎం.పాటిల్‌కు సమాచారం ఇచ్చారు. ఆమె సైతం నేర స్థలాన్ని నిశితంగా పరిశీలించారు. వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. క్లూస్ టీం, డాగ్‌స్వా్కడ్ పరిశీలన... మహిళ మృతదేహాన్ని, ఘటనా స్థలాన్ని క్లూస్‌టీం పరిశీలించింది. ఆధారాలు సేకరించింది. డాగ్ స్వా్కడ్ బేతనాపల్లి బస్సుషెల్టర్ వరకూ వెళ్లి ఆగింది. ఘటనకు సంబంధించిన వారు అక్కడ ఆగారా, లేదంటే బాధిత మహిళ అక్కడ వేచిఉందా అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విజయనగరం–కుమిలి రోడ్డులో అమర్చిన సీసీ కెమెరా పుటేజీలను పరిశీలిస్తున్నారు. మహిళను ఎక్కడో హత్యచేసి ఇక్కడి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువచ్చి దహనంచేసిన ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ.. గతంలోనూ ఎక్కడో హత్యచేసిన వ్యక్తిని ఇక్కడకు తెచ్చి పడేశారు. గుణుపూరుపేట డంపింగ్‌యార్డు సమీపంలో కూడా ఇలాంటి ఘటనే గతంలో చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో రాత్రివేళలో పెట్రోలింగ్‌ను పెంచుతామని ఎస్పీ తెలిపారు. రాత్రి సమయంలో కొందరు అనవసరంగా ఇక్కడ సంచరిస్తున్నట్టు గుర్తించామన్నారు. దీనిని నివారించేలా నిఘా పెంచుతామని చెప్పారు. (చదవండి: సారా ప్యాకింగ్ కేంద్రాలపై దాడులు) -
దారి చూపిన ప్రభుత్వం
పార్వతీపురం టౌన్: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో గల జాతీయ రహదారిపై గోతులతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగేది. గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన రహదారులను ఎమ్మెల్యే అలజంగి జోగారావు చొరవతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో పార్వతీపురం మండలం నర్సిపురం ప్రధాన రహదారిపై గోతుల వల్ల ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఏఐఐబీ నిధుల ద్వారా రూ.2 కోట్లు› మంజూరు చేసి కొత్తరోడ్డు వేయించడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తూ ఉత్సాహంతో ప్రయాణాలు చేస్తున్నారు. కొత్త రహదారితో తీరిన ఇబ్బందులు పార్వతీపురం–నర్సిపురం రహదారిలో గతంలో గుంతలతో అవస్థలు పడేవాళ్లం. ఎన్నో ప్రమాదాలు జరిగినా గత పాలకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే అలజంగి జోగారావు దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే స్పందించి రహదారి నిర్మాణం పూర్తిచేశారు. కొత్త రోడ్డు వేయడంతో ఇబ్బందులు తీరాయి. – గుంటముక్కల దుర్గారావు, 19వ వార్డు, పార్వతీపురం -
కొండబారిడి దంపుడు బియ్యానికి గుర్తింపు
కురుపాం: కురుపాం మండలానికి మారుమూలన ఉన్న కొండబారిడి గిరిజన మహిళల శ్రమకు ఫలితం దక్కేరోజు వచ్చింది. వ్యాపారం మరింత వృద్ధిచేసుకునే అవకాశం కలిగింది. గ్రామానికి చెందిన మహిళా సంఘాల సభ్యులు దంపుడు బియ్యాన్ని వ్యాపారంగా మలచుకున్నారు. 2019లో సత్యగాంధీ దంపుడు బియ్యం కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. గ్రామంలో సేంద్రియ పద్ధతిలో పండించిన ధాన్యాన్ని రోళ్లలో దంచి బియ్యంగా మలస్తున్నారు. కిలో ప్యాకెట్ల రూపంలో ఆర్డర్ల ప్రకారం ఉత్పత్తి చేస్తున్నారు. వినూత్న ఆలోచనతో ముందుకు సాగుతున్న మహిళల విజయగాథపై ఈ నెల 24న “దంపుడు బియ్యానికి కేరాఫ్ కొండబారిడి’ శీర్షికన “సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై పలువురు ప్రముఖులు స్పందించారు. మహిళల శ్రమను, కొత్త ఆలోచనను ప్రశంసించారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈనెల 26న తన ట్విట్టర్ ఖాతాలో “పార్వతీపురం మన్యం జిల్లాలోని కొండబారిడి మహిళలు దంపుడు బియ్యంతో వినూత్న వ్యాపారాన్ని మొదలు పెట్టారు. సభ్యులంతా కలిసి రోళ్లలో దంచిన బియ్యాన్ని విక్రయిస్తూ లాభం పొందుతున్నారు. గిరిజన మహిళలు ఒక ఉపాధి మార్గాన్ని సృష్టించుకుని మైదాన ప్రాంత ప్రజలకు సరఫరా చేయడం ప్రశంసనీయం’ అని పేర్కొన్నారు. దీనికి స్పందించిన గిరిజన సహకార సంస్థ చైర్పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఉద్యోగులను కొండబారిడి గ్రామానికి గురువారం పంపించారు. గిరిజన మహిళలకు గిట్టుబాటు ధర చెల్లించి దంపుడు బియ్యాన్ని కొనుగోలు చేసి విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్సుగా కొంత నగదును మహిళలకు చెల్లించినట్టు జీసీసీ అధికారులు తెలిపారు. జీసీసీ ఆధ్వర్యంలో కొండబారిడి దంపుడు బియ్యాన్ని మార్కెటింగ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని అధికారులు స్పష్టం చేశారు. (చదవండి: దంపుడు బియ్యానికి c/o కొండబారిడి) -
రీపోలింగ్ నిర్వహించాలి
సాలూరు: సాలూరు మండల పరిధిలోని కొఠియా వివాదాస్పద గ్రామాల గిరిజనులను ఓటేయకుండా అడ్డుకుని తిప్పిపంపిన ఎన్నికల అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు రీపోలింగ్ నిర్వహించాలని ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం నేరెళ్లవలస పోలింగ్ కేంద్రంలో తమను ఓటేయనీయకుండా అడ్డుకుని, ఎన్ని కల అధికారులు తిప్పి పంపించారని ఎమ్మెల్యేకు పలువురు గిరిజనులు ఫిర్యాదు చేశారు. మాజీ సర్పంచ్ బీసు ఆధ్వర్యంలో కలిసి తమ వేదన వినిపించారు. స్పందించిన ఎమ్మెల్యే వారితో కలిసి కాలినడకన తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడున్న ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి కనకారావుకు విషయాన్ని వివరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఒకరిద్దరు ఒడిశాలో ఓటేసినవారు పోలింగ్ కేంద్రాలకు వస్తే, అందర్నీ తిప్పి పంపించడం దారుణమన్నారు. గతంలో జరిగి న ఎన్నికల్లో ఒడిశాలో ఓటేసి, ఇక్కడ ఓటేసేందుకు వచ్చేవారని, అలాగే ఇక్కడ ఓటేసి, అక్కడకు కూడా గిరిజనులు వెళ్లేవారన్నారు. ఓటరు స్లిప్పులు, గుర్తింపు కార్డులతో వెళ్లినా ప్రిసైడింగ్ అధికారులు ఓటేయనీయకుండా అడ్డుకోవడం ఓటరు ప్రాథమిక హక్కును హరించడమేనన్నారు. టీడీపీ నాయకులతో కుమ్మక్కై కుట్ర చేశారని, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకుంటే సుప్రీంకోర్టుకు వెళతామని హెచ్చరించారు. విషయాన్ని రిటర్నింగ్ అధికారి సుబ్బారావుకు తెలిపేందుకు ఫోన్ చేస్తే ఆయన అందుబాటులోకి రాకపోవడంతో జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ వస్తోం దన్నారు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌కు ఫోన్ చేసినా స్పందన లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరురాష్ట్రాల వివాదం కారణంగా నలి గిపోతున్న అమాయక గిరిజనుల విషయంలో ఇలా వ్యవహరించడం తగదన్నారు. రాజన్నదొర వెంట పార్టీ రాష్ట్ర నాయకుడు జరజాపు ఈశ్వరరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు సూరిబా బు, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పువ్వల నాగేశ్వరరావు తదితరులున్నారు. -
ఎన్నికల... దౌర్జన్యకాండ
ఓటమి ఖాయమని నిర్థారణకు వచ్చేశారేమో... ఎక్కడికక్కడే అల్లర్లకు తెరతీశారు. ఐదేళ్లపాటు సాగించిన దౌర్జన్యకాండ సరిపోలేదనుకున్నారేమో... ఎన్నికల వేళ తెగ రెచ్చిపోయారు. కవ్వింపు చర్యలకు పాల్పడి అనేకచోట్ల పోలింగ్ కేంద్రాల్లో గొడవలకు దిగారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. పలుచోట్ల అన్యాయంగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. అంతేనా... రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు వెళ్లిన మహిళా ఎమ్మెల్యేపైనే ఏకంగా దాడికి తెగబడ్డారు. ఆమె భర్తపైనా దాడికి పాల్పడి వారి అనుచరులతో సహా ఓ గదిలో నిర్బంధించారు. సాక్షిప్రతినిధి, విజయనగరం: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని ఓటర్లు తమ ఓటుద్వారా గురువారం చూపించారు. టీడీపీ పూర్తిగా ఓటమి అంచుకు చేరిందని ఓటర్ల ఓటింగ్ సరళిని బట్టి ఆ పార్టీ వారికి సైతం అర్థమయ్యింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కుంచుకోవాలన్న కాంక్షతో అలజడులు సృష్టించేందుకు రంగం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా అనేక పోలింగ్ బూత్‌లలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. దొంగ ఓట్లు కూడా వేయించారు. అక్కడికీ శాంతించక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై దాడులు చేశారు. పోలింగ్‌కు వచ్చిన వారిని సైతం భయపెట్టి సెల్ఫోన్లు లాక్కుని వెనక్కి పంపించారు. ఇంత చేస్తున్నా తాము ఓటమి పాలౌతున్నామనే బాధనుంచి బయటపడలేకపోయిన తెలుగుదేశం పార్టీ నేతలు హత్యారాజకీయాలకు తెర తీశారు. రిగ్గింగ్‌ను అడ్డుకోబోతే... పోలింగ్ బూత్ నంబర్ 152లో టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతుందన్న సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శతృచర్ల పరీక్షిత్‌రాజు గురువారం మధ్యాహ్నం పరిశీలనకు వెళ్లారు. బూత్ వద్దకు చేరుకున్న ఆయన్ను స్థానిక టీడీపీ నేతలు అడ్డుకుని భౌతిక దాడి చేసేందుకు ప్రయత్నించారు. పరిస్థితిని గమనించిన పరీక్షిత్‌రాజు అక్కడినుంచి వెనక్కి వచ్చేశారు. ఈ విషయాన్ని సాక్షి ప్రతినిధి బోణం గణేష్‌కు పరీక్షిత్‌రాజు సమాచారం అందించారు. ఆ సమాచారాన్ని జిల్లా ఎస్సీ ఎ.ఆర్.దామోదర్‌కు తెలియజేశారు. అక్కడ రిగ్గింగ్ జరిగినందున పోలింగ్ నిలిపేసి రీపోలింగ్ జరపాలని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిని కోరేందుకు ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి తన భర్త పరీక్షిత్‌తో కలసి పోలింగ్ స్టేషన్‌కు మధ్యాహ్నం వెళ్లారు. ఆమె రాకను గమనించిన టీడీపీ నాయకులు, స్థానిక జెడ్పీటీసి భర్త డొంకాడ రామకృష్ణ వారిపై విరుచుకుపడ్డారు. ఈ హఠాత్ పరిణామానికి హతాశురాలైన ఎమ్మెల్యే దంపతులు అక్కడినుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వీలు పడలేదు. పథకం ప్రకారం అక్కడకు చేరుకున్న స్థానికులు, మహిళలు వారిపై దాడులకు తెగబడ్డారు. ఎమ్మెల్యేను గాయపరిచారు. ఎమ్మెల్యే అనుచరులు, అక్కడున్న కొంతమంది పోలీసులు ఎమ్మెల్యేను కాపాడేందుకు ప్రయత్నించి పరిస్థితి చేయిదాటిపోతుండడంతో తిరిగి పోలింగ్ బూత్‌లోకే పంపించేశారు. కేంద్రాన్ని వందలాది జనం చుట్టుముట్టి లోపలికి వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. అదే సమయానికి అక్కడకు చేరుకున్న సాక్షి ప్రతినిధి కూడా పోలింగ్ కేంద్రంలో చిక్కుకున్నారు. పోలింగ్ సిబ్బందితో పాటు మొత్తం 25 మంది వరకు పోలింగ్ కేంద్రంలో ప్రాణభయంతో తలుపులు వేసుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్సీ శతృచర్ల విజయరామరాజు తన సొంత తమ్ముడి కుమారుడు, కోడలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలిసి కూడా ఏమాత్రం వారిని రక్షించే ప్రయత్నం చేయకపోగా వారిపై దాడి చేసేలా టీడీపీ కార్యకర్తలను పురిగొల్పారు. ఇదే అదనుగా కార్యకర్తలు గొడ్డళ్లు, కర్రలు, కత్తులు పట్టుకుని పోలింగ్ కేంద్రంపై దాడికి యత్నించారు. సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ దామోదర్ కొంతమంది పోలీసు బలగాలను సంఘటనా ప్రాంతానికి పంపించారు. కాని ఎమ్మెల్యే దంపతులను హతమార్చాలనే ప్రణాళికతో ఉన్న టీడీపీ నేతలు ఇతర గ్రామాల నుంచి మరికొందరిని పోలింగ్ కేంద్రం వద్దకు హుటాహుటిన తరలించి ఆ ప్రాంతమంతా భయానక వాతావరణాన్ని సృష్టించారు. పరిస్థితి తీవ్రతను తెలుసుకున్న విశాఖ రేంజ్ డీఐజీ జి.పాలరాజు మరిన్ని బలగాలను పంపించాలని జిల్లా ఎస్పీ దామోదర్‌ను ఆదేశించారు. మరోవైపు విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు వెంటనే స్పందించి పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. అంతే గాకుండా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి సైతం తీసుకువెళ్లారు. పార్టీ పెద్దలు రాష్ట్ర డీజీపీకి విషయం తెలియజేసి ఎమ్మెల్యే దంపతులకు రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. పార్వతీపురం ఏఎస్పీ సుమిత్ గార్గ్ హుటాహుటిన మరిన్ని బలగాలను తీసుకుని సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఈ లోగానే ఎమ్మెల్యే దంపతులను, వారితో పాటు ఉన్నవారిని హతమార్చేందుకు టీడీపీ నాయకులు పురిగొల్పిన వారి వర్గీయులు పోలింగ్ కేంద్రం తలుపులు పగులగొట్టేందుకు ప్రయత్నించారు. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. గాలి, వెలుతురు లేని ఆ గదిలో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు కూడా ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు అవకాశం ఏర్పడలేదు. చాలా సమయం తరువాత ఏఎస్సీ రాకతో స్థానిక మీడియా, వైద్యులు చేరుకున్నారు. ఎమ్మెల్యేకు ప్రాదమిక చికిత్స అందించిన అనంతరం పోలీసు బలగాల భద్రత నడుమ వారిని, వారితో ఉన్న అనుచరులను రక్షించి క్షేమంగా ఇంటికి తరలించారు. సంయమనం పాటించాలి: ఎమ్మెల్యే చినమేరంగిలోని తమ ఇంటికి చేరిన ఎమ్మెల్యే దంపతులకు భారీ సంఖ్యలో వారి కార్యకర్తలు, అభిమానులు ఎదురొచ్చి తమ మద్దతు తెలిపారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వవద్దని తమపై ఏమాత్రం ప్రేమాభిమానాలు ఉన్నా సంయమనం పాటించాలని ఎమ్మెల్యే దంపతులు తమ కార్యకర్తలు, అభిమానులకు సూచించారు. పోలీసు, మీడియా ప్రతినిధులు అండగా ఉండబట్టే తాము ప్రాణాలతో బయటపడ్డామని ఈ సందర్భంగా వారు అన్నారు. తమపై హత్యాయత్నానికి జనాన్ని ఉసిగొల్పిన వారెవరినీ వదిలిపెట్టేది లేదని, చట్టపరంగా వారిని శిక్షించేలా పోరాడతామని స్పష్టం చేశారు. -
రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు
విజయనగరం జిల్లా: డెంకాడ మండలం మోదవలసలో శుక్రవారం టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. మోదవలస గ్రామంలో జన్మభూమి సభ కోసం అర్జీలు రాస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ క్రమంలో సురేష్, కాంతం అనే ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా వీరికి సహాయంగా ఆటోలో వస్తున్న వారిపై మార్గమధ్యలో మరో సారి టీడీపీ వర్గీయులు దాడికి దిగారు. దీంతో మరికొందరు గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారికి రక్షణగా ఉండి ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోవైపు గ్రామంలో సైతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
మహిళతో సహజీవనం.. భర్తకు దేహశుద్ధి
సాక్షి, విజయనగరం : కట్టుకున్న భార్యను పుట్టింటికి పంపి.. తనతో పాటు పనిచేస్తున్న మరో ఉద్యోగినితో సహజీవనం చేస్తున్న భర్తను.. భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ సంఘటన విజయనగరం పట్టణంలోని పద్మావతి నగర్ వసంతవిహార్ టౌన్ షిష్‌లో సోమవారం జరిగింది. స్థానికంగా నివాసముంటున్న వినోద్‌కుమార్, సునీత భార్య భర్తలు. ఏడాదిగా భార్యను పుట్టింటిలో వదిలిన వినోద్.. పెళ్లైన మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. భర్తపై అనుమానంతో ఆరా తీసిన భార్యకు అసలు విషయం తెలిసింది. దీంతో సునీత మహిళా సమాఖ్య సభ్యులతో కలిసి ఇంటి వద్దకు వెళ్లి భర్తకు, ప్రియురాలికి దేహశుద్ధి చేసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
విజయనగరం : లంచం తీసుకుంటూ ఓ వీఆర్వో ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా గోర్ల మండలం కెల్ల గ్రామంలో మంగళవారం జరిగింది. వివరాలు..కెల్ల గ్రామ వీఆర్వో కె. రామారావు రైతులకు పాస్ పుస్తకాలు అందించేందుకు రూ.10వేలు డిమాండ్ చేశాడు. దీంతో రైతులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం వీఆర్వోను పట్టుకున్నారు. వీఆర్వో ను అదుపులోకి తీసుకుని ,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (గోర్ల)