లంచం తీసుకుంటూ ఓ వీఆర్వో ఏసీబీ అధికారులకు చిక్కాడు.
విజయనగరం : లంచం తీసుకుంటూ ఓ వీఆర్వో ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా గోర్ల మండలం కెల్ల గ్రామంలో మంగళవారం జరిగింది. వివరాలు..కెల్ల గ్రామ వీఆర్వో కె. రామారావు రైతులకు పాస్ పుస్తకాలు అందించేందుకు రూ.10వేలు డిమాండ్ చేశాడు. దీంతో రైతులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం వీఆర్వోను పట్టుకున్నారు. వీఆర్వో ను అదుపులోకి తీసుకుని ,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(గోర్ల)