Bathing
-
శీతాకాలం : స్నానానికి వేడి నీళ్లా? చన్నీళ్లా?
వేసవి కాలంలో చన్నీటి స్నానం ఎంతో హాయినిస్తుంది. అయితే శీతాకాలం వచ్చింది అనగానే స్నానానికి దాదాపు అందరూ వేడి నీళ్లే వాడతారు. ఎందుకంటే చల్లనీటితో స్నానం చేస్తే జలుబు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలొస్తాయనే భయం కూడా దీనికి ప్రధాన కారణం. మరోవైపు కార్తీకస్నానాలు, అయ్యప్పమాల ధరించిన భక్తులు ఎంత చలిగా ఉన్నా సరే చన్నీటి స్నానాలే ఆచరిస్తారు. అసలు స్నానానికి ఏ నీళ్లు వాడితే మంచిది? తెలుసుకుందాం. అయితే ఏ కాలంలో అయినా స్నానానికి మరీ వేడినీళ్లు కాకుండా, గోరువెచ్చని నీళ్లు వాడాలి అనేది నిపుణుల మాట. రోజూ ఎక్కువ వేడి నీటి స్నానంతో చర్మానికి కొన్నిఇబ్బందులు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో ముందుగా వేడి నీటి స్నానం ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.వేడి నీటి స్నానం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?వేడి నీటి స్నానంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అలసట తీరుతుంది. చర్మానికి రక్త ప్రవాహం పెరుగుతుంది. శరీరంలో బీపీ తగ్గుతుంది. శరీర నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడితో కుచించుకు పోయిన కండరాలకు, ఎముకలకు వేడి నీటి స్నానంతో రిలీఫ్ లభిస్తుంది. హృదయ సంబంధ వ్యాధుల (గుండె జబ్బు) ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే హాట్ టబ్ బాత్, ఆవిరిస్నానంతో ఈ ప్రయోజనాలు మరింత మెరుగ్గా ఉంటాయంటున్నారు. అసలే శీతాకాలంలో చర్మంలో తేమ శాతం తక్కువగా చర్మం పొడిగా మారిపోతుంది. దీనికి వేడి నీటి స్నానం మరింత ఆజ్యం పోస్తుంది. సేబుమ్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుంది. చర్మంలోని సహజమైన ఆయిల్స్ తగ్గిపోతాయి. ఫలితంగా మంట, దురదలు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా సోరియాసిస్, ఎగ్జిమా, రోసాసియా లాంటి సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలి. జుట్టుకు చేటువేడి, వేడి నీళ్లతో తల స్నానం అస్సలు మంచిది కాదు. వెంట్రుకలు బలహీనంగా మారతాయి. జుట్టులోని కెరాటిన్, లిపిడ్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది.చన్నీటితో స్నానం వల్ల కలిగే లాభాలుమరీ గడ్డ కట్టేంత చల్లని నీరు కాకుండా, ఒక మాదిరి చన్నీటిస్నానం వల్ల శరీరానికి ఉపశమనం లభిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది కండరాల నొప్పిని తగ్గిస్తుంది. జుట్టు, చర్మానికి మంచిది. బరువు తగ్గడానికి సహాయపడుతుందని కూడా చెబుతారు. తలకు కూడా చల్ల నీటి స్నానం మంచిదే.నోట్: చిన్న పిల్లలకు, వృద్ధులకు, శ్వాసకోశ వ్యాధులు, ఉబ్బసం, ఇతర అనారోగ్యంతో ఉన్నవారికి చన్నీటి స్నానం మంచిది కాదు. ఏ వయసు వారికైనా గోరు వెచ్చటి స్నానం ఉత్తమం. అటు వాటు ఉన్నవారు, తట్టుకోగల శక్తిఉన్నవారు చన్నీటి స్నానం చేయవచ్చు. లేదంటే గోరు వెచ్చని నీటితో స్నానం బెటర్. స్నానానికి ముందు శరీరానికి నూనెతో మసాజ్ చేసుకుంటే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాగే స్నానం తరువాత మాయిశ్చరైజింగ్ క్రీమ్ వాడాలి. -
స్నానం చేయడు.. గంగాజలం చల్లుకుంటాడు.. నా కొద్దీ పెనిమిటి!
భార్యా భర్తలమధ్య విభేదాలు వచ్చినపుడు విడిపోవడం సహజం. ఇక ఇద్దరి మధ్యా సంబంధాలు ఒక కొనసాగలేవు అనుకున్నపుడు విడాకులకు దరఖాస్తు చేసుకుంటారు. ఈ వ్యవహారం ఒక్కోసారి పరస్పర అంగీకారంతో ఈజీగా అయిపోతుంది కూడా. అయితే విడాకులకు సంబంధించి కొన్ని విస్తుపోయే కేసులు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన విడాకుల కేసు పలువురిని ఆలోచనలో పడేసింది. విషయం ఏమిటంటే..ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో 40 రోజులకే తన భర్త నుంచి విడాకులు కావాలంటూ కోర్టు మెట్లెక్కింది. విడాకులు తీసుకోవడానికి కారణం తెలిస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే. తన భర్త రాజేష్ 40 రోజుల్లో ఆరు సార్లు మాత్రమే స్నానం చేశాడనీ, దీంతో అతని శరీరం నుంచే ఆ దుర్వాసనను భరించలేక పోతోంది. పైగా వారానికోసారి పవిత్రంగా భావించే గంగాజలాన్ని చల్లుకుంటాడట. ఇక అతనితో జీవించడం తన వల్ల కాదని కోర్టును ఆశ్రయించింది. పెళ్లయినప్పటి నుంచీ అదీ తాను బలవంతంగా చేయగా కేవలం ఆరు సార్లుమాత్రమే స్నానం చేశాడు. దీంతో రాజేష్ భార్య మహిళ కుటుంబ సభ్యులు భర్త రాజేష్ పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది విడాకులు కావాలని కోరింది.అలిగి పుట్టింటికి వెళ్లింది. అయితే ఫ్యామిలీ కౌన్సెలింగ్ తరువాత డైలీ స్నానం చేసేందుకు పరిశుభ్రంగా ఉండేందుకు రాజేష్ ఒప్పుకున్నాడు. కానీ ఆ మహిళ అతడితో ఉండడానికి ఇష్టం పడటం లేదు. దీంతో మరోసారి సెప్టెంబర్ 22న కౌన్సిలింగ్ కు రావాలని వెల్లడించారు అధికారులు.కాగా ఇలాంటి అరుదైన కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి కాదు. భర్త కుర్ కురే ప్యాకెట్ ఇవ్వలేదని విడాకులు కోరిన ఘటన ఇటీవల ఆగ్రాలో వచ్చిన సంగతి తెలిసిందే. -
అమ్మ వచ్చింది లేరా.. కన్నా! విషాదం..
ఖమ్మం: ఆడుకుంటూ వెళ్లి ఇంటి ఆవరణలోని నీటి సంప్‌లో ప్రమాదవశాత్తు పడిన చిన్నారి మృతి చెందాడు. వైరా మండలం కనకగిరి సిరిపురంలో సోమవారం రాత్రి వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కనకగిరి సిరిపురం గ్రామానికి చెందిన కూరకుల గోపి – భవాని దంపతులకు నాలుగేళ్ల కుమారుడు మణికంఠతో పాటు 16నెలల కుమారుడు యశ్వంత్ ఉన్నారు. గోపి ఆటోడ్రైవర్‌గా పని చేస్తుండగా కుటుంబ పోషణలో పాలుపంచుకునేందుకు భవాని వారం క్రితమే వైరాలోని ఒక బట్టల దుకాణంలో చేరింది. వీరిద్దరు పనులకు వెళ్తే పిల్ల లను చూసుకునేందుకకు నెమలి గ్రామానికి చెందిన భవాని తల్లి భద్రమ్మ వచ్చింది. రోజులాగే గోపి, భవానీ పనులకు వెళ్లగా భద్రమ్మ తన ఇద్దరు మనవళ్లు మణికంఠ, యశ్వంత్ ఆడుకుంటుండగా ఇంట్లో నిద్రించింది. ఆ సమయాన యశ్వంత్ ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ప్రమాదశాత్తు ఇంటి ముందు ఉన్న నీటి సంప్‌లో పడినట్లు తెలుస్తోంది. కాసేపయ్యాక భద్రమ్మ మనవడు యశ్వంత్ కోసం ఎక్కడ వెతికినా ఆచూకీ లేకపోవడంతో తన కుమార్తె, అల్లుడికి సమాచారం ఇచ్చింది. వారు చేరుకుని పరిసర ప్రాంతాలు, ఇంట్లో గాలిస్తుండగా యశ్వంత్ మృతిదేహం నీటి సంప్‌లో తేలియడుతూ కనిపించింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పనికి వెళ్లి రాగానే తనను ఎదురొచ్చే కుమారుడు విగతజీవిగా మారడంతో భవానీ ‘అమ్మ వచ్చింది లేరా.. కన్నా’ అంటూ విలపించిన తీరు స్థానికులను సైతం కంటతడి పెట్టించింది. ఇవి చదవండి: డీఎస్పీ అక్రమ సంబంధం.. ఇంటి ఎదుట భార్య ఆందోళన -
దయా హృదయం
నగర అరణ్యంలో తప్పిపోయి అయోమయంగా తిరుగుతోంది ఒక ఆవు దూడ. దాడి చేయడానికి కుక్కలు కాచుకొని కూర్చున్నాయి. ఈ దృశ్యాన్ని కారులో నుంచి చూసిన ఒక మహిళ కారు దిగింది. ఆ దూడను కారులో తన ఇంటికి తీసుకువెళ్లింది. దూడకు స్నానం చేయించి మేత పెట్టించింది. ‘ఈ దూడ మాదే’ అని ఎవరూ ఇంకా రాలేదుగానీ నెటిజనులు మాత్రం ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. ‘రోడ్డు మీద మనిషి చావుబతుకుల మధ్య ఉంటే కూడా ఆఫీసుకు టైమ్ అవుతుంది అంటూ పరుగులు తీసే జనాలు ఉన్న ఈ రోజుల్లో మీరు చేసిన మంచి పని మమ్మల్ని కదిలించింది’ అంటూ నెటిజనులు ఆమెను ఆకాశానికెత్తుతున్నారు. -
వేడి నీళ్లు Vs చన్నీళ్లు.. ఏ నీళ్లతో స్నానం చేస్తే మంచిది?
స్నానం వేడినీళ్లతో చేస్తే మంచిదా? లేక చన్నీళ్లతోనా? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. కొందరు కాలంతో సంబంధం లేకుండా వేడినీళ్ల స్నానానికి అలవాటు పడితే, మరికొందరేమో చన్నీళ్లకు అలవాటు పడతారు. వేడి నీళ్లతో స్నానం చేస్తే ఒళ్లు నొప్పులు తగ్గడంతో పాటు కండరాలు ఉత్తేజంగా ఉంటాయని కొందరు అనుకుంటారు. చల్లటి నీళ్లలతో స్నానం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. ఇంతకీ ఏ నీళ్లతో స్నానం చేస్తే మంచిది? మనం ప్రతిరోజు స్నానం చేసే సమయంలో మనకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటాం. దీని కారణంగా పలు సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కొందరు చన్నీళ్ల స్నానమే మంచిదంటారు. మరికొందరు వేడివేడి నీళ్ల వల్ల హానికారక క్రిములన్నీ తొలగిపోయి ఆరోగ్యం సమకూరుతుందనుకుంటారు. ఈ రెండూ అపోహలే. స్నానానికి నీళ్లు మరీ చల్లగా ఉండకూడదు. మరీ వెచ్చగా ఉండకూడదు. గోరువెచ్చని నీళ్లతో స్నానమే ఆరోగ్యం. ఇక బలహీనంగా ఉన్నవాళ్లు, వయసుపైబడిన వృద్ధులు మరీ ఎక్కువ చన్నీళ్ల స్నానం కాని, మరీ ఎక్కువ వేణ్ణీళ్లతో కానీ స్నానం చేయద్దు. ఒకవేళ మీరు మీ వృత్తిరీత్యా వేరే ఊళ్లలో ఉండటం వల్ల వేణ్ణీళ్లు పెట్టుకోవడం సాధ్యం కావడం లేదా? ఇలా మరీ చన్నీళ్ల స్నానమే చేయడం తప్పకపోతే... స్నానం చేసే వ్యవధిని వీలైనంత కుదించండి. అవి వేణ్ణీళ్లయినా, చన్నీళ్లయినా... వీలయినంత వరకు పొద్దున్నే ఏమీ తినకముందే స్నానం చేయడం మంచిది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల స్నానానికి ముందే తినాల్సివచ్చినా... కడుపు నిండా తిన్న వెంటనే స్నానం చేయవద్దు.ఇలా చేయడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి స్నానం చేసిన తర్వాత కనీసం అర్ధగంట అయినా వ్యవధి ఉండేలా చూసుకోవడం మంచిది. నీళ్లు ఎంత చల్లగా ఉంటే... స్నానం వ్యవధి అంతగా తగ్గాలి. చన్నీళ్లతో స్నానం చేసే అలవాటు ఉన్నవారు... స్నానానికి ముందర చల్లటి నీళ్లు తాగకండి. చన్నీళ్లు గానీ లేదా వేణ్ణీళ్లు గానీ... వాటితో స్నానం చేశాక ఒకవేళ తలనొప్పి లేదా జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తే... అవి (చన్నీళ్లు / వేణ్ణీళ్లు) మీకు అంతగా సరిపడవని గుర్తించి, ఆ మేరకు గోరువెచ్చని నీటికి షిఫ్ట్ అవడం మంచిది. -
Viral Video: కార్ల సాయంతో నడి రోడ్డుపై వినూత్న స్నానం
-
Viral Video: టూత్ బ్రెష్ తో బుల్లి తాబేలుకు స్నానం
-
Winter: స్నానానికి వేణ్ణీళ్లా? చన్నీళ్లా? ఆహారం తిన్న వెంటనే స్నానం చేయొద్దా?
Winter Care Tips: స్నానానికి వేణ్ణీళ్లా? చన్నీళ్లా? ఇదేం ప్రశ్న లేదా పనికి మాలిన సందేహం? ఎవరికి ఎలా ఇష్టం అయితే అలా స్నానం చేస్తారు అని ముఖం చిట్లించకండి. ఎందుకంటే స్నానానికి ఎప్పుడూ వేడినీళ్లకే లేదా ఎప్పుడూ చన్నీళ్లకే ప్రాధాన్యత ఇవ్వడం కొందరికి అలవాటు. అది ఒకందుకు మంచిదే. అయితే, ఎంత చలికాలం అయినా, చన్నీళ్లతోనే స్నానం చేయడం లేదా ఎంత వేసవిలో అయినా వేడినీళ్లతోనే స్నానం చేయడం అంత మంచి అలవాటు కాదంటున్నారు నిపుణులు. మరయితే ఏ నీటితో స్నానం చేయడం మంచిదో తెలుసుకుందామా? రెండూ అపోహలే దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు చన్నీళ్ల స్నానమే మంచిదంటారు. మరికొందరు వేడివేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల అలసట తీరిపోయి హాయిగా అనిపిస్తుందంటారు. నిజానికి ఈ రెండూ సరయినవి కావు. రెండూ అపోహలే. స్నానానికి నీళ్లు మరీ చల్లగా ఉండకూడదు. మరీ వెచ్చగా ఉండకూడదు. గోరువెచ్చని నీళ్లతో చేసే స్నానమే ఒంటికి ఆరోగ్యకరం. ఇక బలహీనంగా ఉన్నవాళ్లు, వయసుపైబడిన వృద్ధులు మరీ ఎక్కువ చన్నీళ్ల స్నానం కాని, మరీ ఎక్కువ వేణ్ణీళ్లతో కానీ స్నానం చేయవద్దు. అవి వేణ్ణీళ్లయినా, చన్నీళ్లయినా... వీలయినంత వరకు పొద్దున్నే ఏమీ తినకముందే స్నానం చేయడం మంచిది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల స్నానానికి ముందే తినాల్సివచ్చినా... కడుపు నిండా తిన్న వెంటనే స్నానం చేయవద్దు. ఇలా చేయడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి స్నానం చేసిన తర్వాత కనీసం అర్ధగంట అయినా వ్యవధి ఉండేలా చూసుకోవడం మంచిది. ఒకవేళ మీరు చిన్నప్పట్నుంచీ చన్నీళ్ల స్నానమే చేస్తూ వస్తున్నారా? లేదా మీ వృత్తిరీత్యా వేరే ఊళ్లలో ఉండటం వల్ల వేణ్ణీళ్లు పెట్టుకోవడం సాధ్యం కావడం లేదా? ఇలా మరీ చన్నీళ్ల స్నానమే చేయడం తప్పకపోతే... స్నానం వ్యవధిని వీలైనంత కుదించండి. నీళ్లు ఎంత చల్లగా ఉంటే... స్నానం వ్యవధి అంతగా తగ్గాలన్నమాట. చన్నీళ్లతో లేదా వేణ్ణీళ్లతో స్నానం చేశాక ఒకవేళ తలనొప్పి లేదా జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తే... అవి (చన్నీళ్లు / వేణ్ణీళ్లు) మీకు అంతగా సరిపడవని గుర్తించి, ఆ మేరకు గోరువెచ్చని నీటికి షిఫ్ట్ అవ్వండి. చదవండి: Hema Malini: మొహానికి అరోమా ఆయిల్‌తో మసాజ్.. నా బ్యూటీ సీక్రెట్ అదే! Saina Nehwal: తన మొహం కూడా చూడనంటూ పెదవి విరుపులు! నాడు భోరున ఏడ్చేసిన సైనా! రూ. 2500 కూడా.. -
చన్నీటి స్నానం.. చిన్నారుల దైన్యం
అసలే చలికాలం. వేకువజామున మంచు కురుస్తూ గజగజ వణికిస్తోంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రత రోజురోజుకూ పడిపోతోంది. ఇంతటి చలిలోనూ విద్యార్థులు చన్నీటి స్నానం చేస్తూ అవస్థలు పడుతున్నారు. జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గిరిజన సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో ఒకే నల్లా ఉంది. ఈ నల్లా వద్ద శుక్రవారం ఉదయం పదుల సంఖ్యలో విద్యార్థులు చలిలో స్నానాలు చేస్తూ కనిపించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
మనుషులను ఉతికేసే వాషింగ్ మెషీన్! భయపడకండి భలే ఉంటుంది!
మీరు చదివింది నిజమే.. బట్టలు ఉతకడం కోసం కాదు. మనుషుల స్నానం కోసం వాషింగ్ మెషీన్ తయారు చేస్తోంది ఓ జపనీస్ కంపెనీ. ఒసాకాకు చెందిన ‘సైన్స్ కో లిమిటెడ్’ దీన్ని రూపొందిస్తోంది. ఫైన్ బబుల్ టెక్నాలజీతోపాటు వివిధ సెన్సర్లు, కృత్రిమ మేధ ఆధారంగా ఈ పరికరం మనుషుల శరీరాన్ని శుభ్రం చేస్తుంది. అంతేకాదు విశ్రాంతినిచ్చే సంగీతం వినిపిస్తూ, వాటర్ రెసిస్టెంట్ డిస్ప్లేలో ఫొటోలు కూడా చూపిస్తూ.. మరింత హాయిగొలిపేలా చేస్తున్నాయి. ఏదేమైనా వాషింగ్ మెషీన్‌లోకి వెళ్లి కూర్చుంటే ఇంకేమన్నా ఉందా? అని భయపడకండి. ఇందులోని సెన్సర్లు శరీరంలోని నరాల స్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటాయి. కృత్రిమ మేధతో సేకరించిన ఈ డేటా సాయంతో.. అందులో ఉన్నవారికి సౌకర్యవంతమైన వాతావరణాన్ని మెషీన్ సృష్టిస్తుందని రూపకర్తలు చెబుతున్నారు. అయితే ఇలా మనుషుల వాషింగ్ మెషీన్ తయారు చేసే ఐడియా కొత్తదేం కాదు. జపనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సాన్యో ఎలక్ట్రిక్ 1970 సమయంలోనే ‘అల్ట్రాసోనిక్ బాత్’ పరికరాన్ని తయారు చేసింది. అది 15 నిమిషాల్లోనే శరీరాన్ని శుభ్రం చేయడంతోపాటు ఆరబెట్టడం, మసాజ్ చేయడం కూడా పూర్తిచేసింది. కానీ దానిపై వెల్లువెత్తిన సందేహాలతో మార్కెట్లోకి తీసుకురాలేదు. ఇన్నేళ్ల తర్వాత సైన్స్ కో లిమిటెడ్ చైర్మన్ యసాకీ అయోమా దీనిపై దృష్టి పెట్టాడు. ఆయనకు పదేళ్ల వయసు ఉన్నప్పుడే సాన్యో తయారు చేసిన మనుషుల వాషింగ్ మెషీన్‌ను డెవలప్ చేసి.. మార్కెట్లోకి తేవాలని నిర్ణయించుకున్నాడట. ఇంతకీ ఈ మెషీన్‌ను కొనాలనుకుంటే 2025 దాకా ఆగాల్సిందే. 2024 చివరికల్లా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి, 2025లో అందరికీ అందుబాటులోకి తెస్తామని సైన్స్ కో సంస్థ చెబుతోంది. -
బాసర ట్రిపుల్ ఐటీ.. సిబ్బంది గురించి వెలుగులోకి షాకింగ్ వాస్తవాలు!
నిర్మల్: సరిగ్గా ఇరవై రోజుల క్రితం బాసర ట్రిపుల్ఐటీలోని కేంద్రీయ భండార్ మెస్‌లో తిన్న విద్యార్థులు ఫుడ్‌పాయిజన్ బారిన పడ్డారు. దాదాపు 600మంది విద్యార్థులు అనారోగ్యం పాలవగా, 20మంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఈ ఘటన తర్వాత సీరియస్ చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం, ఉన్నతాధికారులు చెబుతున్నా.. ఇవేవీ తమకు పట్టవన్నట్లు సదరు మెస్ కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ జరిగిన కేంద్రీయ భండార్ మెస్‌లోనే తాజాగా స్నానాల సీన్ బయటకు వచ్చింది. వంటగదిలోనే..: ఇరువైపులా.. విద్యార్థుల కోసం వండి, వడ్డించే వంటపాత్రలు ఉన్న గదిలోనే ఇద్దరు సిబ్బంది స్నానాలు చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. వేలమంది విద్యార్థుల కోసం వంటలు చేసేచోట స్నానాలు చేయడం ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. వరు సగా ఘటనలు చోటుచేసుకుంటూ, రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశం అవుతున్నా.. వర్సిటీ అధికారుల తీరు మారడంలేదు. ‘‘వర్సిటీని ప్రక్షాళన చేస్తున్నాం. వార్డెన్లు, మెస్ ఇన్చార్జిలను నియమిస్తున్నాం. పక్కాగా పర్యవేక్షిస్తున్నాం’’ అంటూ ఉన్నతాధికారులు తరచూ చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం మార్పు లేదు. ఇలా.. వంటగదిలో స్నానాలు, నాణ్యతలేని ఆహారం య«థావిధిగా కొనసాగుతున్నాయి. అసలు చర్యలేవి..: ఫుడ్‌పాయిజన్ అయి 20 రోజులవుతోంది. ఘటనకు కారణమైన కేంద్రీయ భండార్, ఎస్ఎస్ మెస్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కానీ.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. యథావిధిగా ఆ మెస్ కాంట్రాక్టర్లనే ఇంకా కొనసాగి స్తున్నారు. కేంద్రీయ భండార్ కాంట్రాక్టర్‌కు బడానేతలు, అధికారులతో బలమైన సంబంధాలు ఉన్నాయని, అందుకే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. -
ఏమై పోయాడో..? స్నానానికి దిగిన యువకుడు అదృశ్యం
గంట్యాడ: చెరువులో స్నానానికి దిగిన ఓ యువకుడు అదృశ్యం కాగా, మరో యువకుడిని స్నేహితులు రక్షించి ఆస్పత్రిలో చేర్పించారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బుడతనాపల్లి గ్రామానికి చెందిన కొంతమంది యువకులు బుధవారం ఉదయం మంచినీటి కొనేరులో స్నానానికి దిగారు. వారిలో వారాది సురేష్ మునిగిపోతుండడంతో స్నేహితులు గమనించి రక్షించి ఒడ్డుకు చేర్చి 108 అంబులెన్సులో విజయనగరంలోని తిరుమల ఆస్పత్రికి తరలించారు. అయితే వారితో పాటు స్నానానికి దిగిన కొంచాడ రామకృష్ణ కనిపించలేదు. చెరువులో ముగినిపోయాడమోనని గ్రామస్తులు వలల సాయంతో గాలించారు. అయినప్పటికీ జాడ తెలియరాలేదు. రామకృష్ణ చెరువులో మునిగిపోయాడా? లేదా సురేష్ మునిగిపోయాడనే భయంతో పారిపోయాడా? అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందనప్పటికీ సమాచారం మేరకు విచారణ చేపట్టారు. (చదవండి: విద్యార్థిని ఆత్మహత్య...కారణం అదేనా...) -
సాధారణ సబ్బు రూ.20 నుంచి 60 ఉంటే.. ఈ సబ్బు రూ.96 అట.. కారణం ఏంటో తెలుసా?
సాక్షి, మధిర: సాధారణంగా అందరూ స్నానానికి ఉపయోగించే సబ్బు ధర రూ.20 మొదలు రూ.60వరకు ఉంటుంది. కానీ మధిర మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం రూ.96 విలువైన సబ్బులను పంపిణీ చేశారు. ఇదేమిటి, ఇంత ఖరీదైన సబ్బును కార్మికులకు ఇచ్చారా అని ఆశ్చర్యపోతున్నారా! అయితే, సబ్బు విలువైనదేమీ కాదు సాధారణమైనదే. కానీ మధిర మున్సిపాలిటీ పాలకవర్గం, అధికారులు కలిసి సబ్బు ధరను అమాంతం పెంచేశారు. కారణమేమిటో పెద్దగా ఆలోచించాల్సిన పనేమీ లేదు కదా?! ‘గణతంత్ర’ వేడుకల్లో పంపిణీ ఈనెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా మున్సిపాలిటీలోని పారిశుద్ధ్య కార్మికులకు సబ్బులు, కొబ్బరినూనె డబ్బాలు, శానిటైజర్లతో పాటు దుస్తులు అందజేయాలని నిర్ణయించారు. ఈమేరకు కార్మికులకు మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత, కమిషనర్ అంబటి రమాదేవి చేతుల మీదుగా వీటిని ఇచ్చేశారు. ఇక వీటి కొనుగోలుకు సంబంధించి బిల్లులను కౌన్సిల్ సమావేశంలో సభ్యులతో ఆమోదించుకుంటేనే చెక్కులు జారీ చేయడం సాధ్యమవుతుంది. చదవండి: కరీంనగర్లో కారు బీభత్సం.. నలుగురు మహిళలు మృతి ఇందుకోసం 31వ తేదీన మధిర మున్సిపల్ సాధారణ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి సంబంధించి ఎజెండాలో కొన్ని అంశాలను పొందుపర్చి అధి కార, ప్రతిపక్ష కౌన్సిలర్లకు కాపీలను శనివారం అందజేశారు. ఇక ఈ కాపీలను చూడగానే సభ్యుల కళ్లు బైర్లు కమ్మాయి. ఎందుకంటారా... కార్మికులకు అందజేసిన 675 సబ్బుల కోసం రూ.96చొప్పున మొత్తం రూ.64,800 ఖర్చు చేసినట్లుగా లెక్కల్లో చూపించారు. చదవండి: తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు, కాలేజీలు కౌన్సిల్ ఎజెండా కాపీలో సబ్బుల ధర వివరాలు... ఇదేం సబ్బు? ఒక్కో సబ్బును రూ.96 చొప్పున వెచ్చించి కొనుగోలు చేసినట్లు బిల్లు ఉండడంతో సభ్యులు ఇవేం సబ్బులు అంటూ 26వ తేదీన వాట్సప్ గ్రూప్‌ల్లో షేర్ చేసిన ఫొటోలను వెనక్కి వెళ్లి మరీ ఆసక్తిగా పరిశీలించారు. తీరా చూస్తే ఆ ఫొటోలో 100గ్రాముల సంతూర్ సబ్బు కనిపించింది. ఇదే బరువు కలిగిన సబ్బు పంపిణీ చేసి ఉంటే మార్కెట్లో ఒక్కో సబ్బు ఎమ్మార్పీ రూ.33 ఉండగా హోల్‌సేల్‌గా రూ.29.50కు వస్తుంది. ఒకవేళ 125 గ్రాముల బరువు కలిగిన సబ్బు అయితే ఆఫర్ ప్యాక్‌లో నాలుగింటితో పాటు మరో సబ్బు ఉచితంగా వస్తుంది. ఈ ప్యాక్ ఎమ్మార్పీ రూ.190 ఉండగా హోల్‌సేల్‌గా రూ.173కు ఇస్తామని స్థానిక వ్యాపారుల్లో ఎవరిని అడిగినా చెబుతారు. అంటే ఒక సబ్బు ఖరీదు రూ.35లోపు ఉంటుంది. కానీ మధిర మున్సిపాలిటీ పాలకవర్గం, అధికారులు మాత్రం కౌన్సిల్ ఎజెండాలో జత చేసి బిల్లులను రూ.96గా చూపించడం గమనార్హం. కార్మికుల పేరిట దోపిడీ కరోనా విలయతాండవం చేస్తున్న వేళ కుటుంబ సభ్యులకు ఆపద ఉంటుందని తెలిసినా పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి మరీ పని చేస్తున్నారు. కరోనా మొదటి దశ నుంచి వైరస్ సోకిన వారి ఇళ్ల వద్ద, కాలనీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం మొదలు అన్ని పనుల్లో వీరే కీలకంగా నిలుస్తున్నారు. అలాంటిది అవినీతికి కాదేదీ అనర్హం అన్నట్లుగా కార్మికులకు ఇచ్చిన సబ్బులకు కూడా అసలు కంటే ఎక్కువ బిల్లులను మున్సిపల్ పాలకవర్గం, అధికారులు సిద్ధం చేయడం విమర్శలకు తావిస్తోంది. అయితే, ఈనెల 31న జరిగే కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని కౌన్సిలర్లు ప్రశ్నిస్తారా, లేక బిల్లులను ఆమోదిస్తారా అనేది వేచిచూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఒక్కో సబ్బుకు రూ.96గా బిల్లులు సిద్ధం చేయడంతో పాటు శానిటైజర్లు, కొబ్బరినూనె ధరలను కూడా ఎక్కువగానే చూపినట్లు తెలుస్తుండగా, అజెండా కాపీలు స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ అంబటి రమాదేవిని సంప్రదించేందుకు ఫోన్లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
ఆ వ్యక్తి 67 ఏళ్లుగా స్నానమే చేయలేదట!..అతని ఆహారం ఏమిటో తెలుసా?
కొంతమంది ఆరోగ్యానికి సంబంధించిన ఆహార డైట్‌ని తెగ ఫాలోవుతారు. అయినప్పటికి ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటారు. మరికొంతమంది ఎలాంటి ఆహార డైట్ ఉండదు. పైగా వాళ్లు పెద్దగా ఆరోగ్యం గురించి పట్టించుకోరు కూడా. అయినా వాళ్లు చాలా ఆరోగ్యంగా ఉంటారు. కానీ అసలు ఎలాంటి శుభ్రత లేకుండా అత్యంత హేయంగా జీవించడమే కాకుండా కనీసం స్నానం కూడా చేయకుండా ఆరోగ్యంగా జీవిస్తున్న వ్యక్తి గురించి విన్నారా!. అయితే ఈ వృద్ధుడి జీవన శైలి చూసి కచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు విషయంలోకెళ్తే...ఇరాన్‌కి చెందిన 87 ఏళ్ల వృద్ధుడు అమో జాజి 67 ఏళ్లుకు పైగా స్నానమే చేయలేదట. పైగా అతను పందికొక్కులు, కుందేళ్లను తినడం, నీటి కుంటల్లో నీరు తాగడం వంటివి అతని జీవశైలి. అయితే అతని ఆరోగ్యం చూసి శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఆశ్చర్యపోయారు. అంతేకాదు అతను ఒంటరిగానే గడుపుతాడు. చాలాకాలం అతను సోరంగంలోనే జీవించాడట. అయితే అతని విచిత్ర జీవన శైలిని చూసి ఆశ్యర్యపోయిన దేజ్గా గ్రామస్తులు ఆ వృద్ధుడు కోసం ఒక పూరి గుడిసెను నిర్మించి ఇచ్చారు. ఈ మేరకు టెహ్రాన్‌లోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కి సంబంధించిన పారాసిటాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ ఆ వృద్ధుడికి వైద్యపరీక్షలు నిర్వహించారు. అయితే అతను 67 ఏళ్లుగా స్నానం చేయకపోయినప్పటికి అతని శరీరంలో ఎలాంటి పరాన్నజీవులు, బ్యాక్టీరియాలు లేవని అతను చాలా ఆరోగ్యంగా ఉన్నాడని ధృవీకరించారు. అయితే ఆ వృద్ధుడు స్థానిక పరిపాలనాధికారుల సహాయాన్ని పొందాడు. పైగా స్థానిక గవర్నర్ అతన్ని ఇబ్బంది పెట్టవద్దని ప్రజలను కోరడం గమనార్హం. (చదవండి: ఔను! ఆ పబ్‌లో దెయ్యాలు ఉన్నాయి ! డెవిల్ వైరల్ వీడియో) -
చలికాలంలో ‘ఫన్నీ’ స్నానం.. వీడియో వైరల్
శీతాకాలంలో సాధారణంగా స్నానం చేయడానికే ఇష్టపడరు కొంతమంది! పైగా చన్నీటి స్నానం అంటే ఆమడ దూరం పరిగెడతారు. అలాంటి చలికాలంలో చలిని తప్పించకుంటూ చన్నీటి స్నానం చేసే ట్రిక్కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. అసలు విషయంలోకెళ్తే.. ఆ వీడియోలో ఒక వ్యక్తి నది లేదా చెరువులో స్నానం చేస్తున్నట్లు కనిపించింది. అయితే ఆ వ్యక్తి చలిని తప్పించుకునే నిమిత్తం ముందు ఒక పెద్దప్లేటులో చలిమంట ఏర్పాటు చేసుకున్నాడు. నదిలో ఒక మునక వేస్తూ గజగజ వణికిపోతున్నాడు. మళ్లీ తన ముందున్న చలిమంట వైపు చేతులు చాచి చలి కాచుకుంటూ మళ్లీ ఇంకో మునక.. ఇలా ఫన్నీ ఫన్నీగా స్నానం చేశాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోకి ‘మై ఇండియా ఈజ్ గ్రేట్... ప్రామిసింగ్ ఇండియా’ అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ‘ఇది చన్నీటి ట్రిక్’ అని ఒకరు, మరోకరేమో ‘భారతీయులను ట్రిక్స్‌లో ఎవరూ ఓడించలేరు’ అంటూ రకరకాలుగా ట్వీట్లు చేస్తున్నారు నెటిజన్లు. Mera Bharat Mahaan.....☺️😊 होनहार भारत.....☺️☺️😊😊😊😊 pic.twitter.com/Ixnq5H1YY3 — Rupin Sharma (@rupin1992) January 11, 2022 (చదవండి: సెల్ఫీలతో మిలీనియర్ అయిన స్టూడెంట్.. ఎలా ఎదిగాడో తెలుసా?) -
ఈ పక్షి భలే స్నానం చేస్తోంది ఎలాగో తెలుసా !!
కొన్ని పెంపుడు జంతువులను యజమానులు ప్రత్యేకంగా స్నానం చేయించడం వంటివ చేస్తారు. పైగా వాటికి మంచి జాగ్రత్తలు తీసుకుని మరీ చేయిస్తారు. అయితే పక్షులను పెంచేవాళ్లు కూడా వాళ్లే శ్రద్ధగా చేయించడం అవి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. కానీ కొన్ని పక్షులకు వాళ్ల యజమానులు స్నానం చేయించకపోయినప్పటికీ వాటంతట అవే మంచిగా ఆసక్తిగా స్నానం చేస్తాయి. (చదవండి: దగ్గు మందు అక్రమ రవాణ.. వైద్యుడితో సహా ఆరుగురు అరెస్ట్) నిజానికి సాధారణంగా పక్షులు వాటికి బాగా దాహం వేసినప్పుడో లేదా వేసవి కాలంలో వేడి తట్టుకోలేక కాసేపు నదుల వద్ద మునకలు వేస్తుంటాయి. ఆ తర్వాత ఆ నీటిని రెక్కలతో విదిలించుకోవడం వంటివి చేస్తుంటాయి. కానీ ఇక్కడొక పక్షి ఎంతో ఆసక్తిగా తనకు తానుగా స్నానం చేస్తుంది. పైగా షింక్లోని టాప్ వాటర్‌ని అది షవర్బాత్గా ఫీలవుతూ భలే ఆస్వాదిస్తూ స్నానం చేస్తుంది. ఈ మేరకు ఆ పక్షి యజమాని ఆ పక్షి చక్కగా స్నానం చేస్తున్న వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా లక్షల్లో వ్యూస్ లైక్‌లు వస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి (చదవండి: అవయవ దానంలో భారత్‌కు మూడో స్థానం) Bird taking a shower.. 😊 pic.twitter.com/ejaGBEI7PB — Buitengebieden (@buitengebieden_) November 27, 2021 -
ఈ రోజు స్నానం చేశారా? లేదా? ఈ విషయాలు తెలుసుకోండి!
మీరు ఈ రోజు స్నానం చేశారా..? రోజూ చేస్తూనే ఉంటాం, ఈ రోజు స్పెషల్ ఏంటి అంటారా.. ఈ రోజు (జూన్ 14) అంతర్జాతీయ స్నానం దినోత్సవం మరి.. స్నానానికి కాస్త ఎక్కువ టైమిస్తూ, మరికాస్త ప్రశాంతంగా ఆలోచించడానికి ప్రయత్నించండి. ఎందుకీ రోజు జరుపుకోవడం, ఏమిటీ ఆలోచించడం, అంత ప్రాధాన్యత దేనికి అనుకుంటున్నారా..? ఈ రోజు నిజంగానే స్పెషల్. అటు సైన్స్‌పరంగా కీలక ముందడుగు పడిన రోజు, మన కోసం మనం కాస్త సమయం గడపాల్సిన రోజు. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా? స్నానాల తొట్టెలో.. సూత్రం పుట్టింది ప్రఖ్యాత గ్రీకు శాస్త్రవేత్త ఆర్కిమెడిస్ గురించి, ఆయన కనిపెట్టిన భౌతిక శాస్త్ర, గణిత సూత్రాల గురించి మనం చిన్నప్పటి నుంచే చదువుకుని ఉంటాం. వస్తువు బరువు, పరిమాణం, సాంద్రత, స్క్రూలు, గేర్లు వంటి అంశాలపై క్రీస్తుపూర్వం 250వ సంవత్సరంలో ఆయన రూపొందించిన సూత్రాలు శాస్త్ర, సాంకేతిక రంగాలకు మార్గనిర్దేశం చేశాయి. ఇదంతా సరే.. ఈ స్నానాల తొట్టె (బాత్ టబ్)కు, ఆయనకు ఏం సంబంధం అనే డౌట్ వస్తోంది కదా! ఆర్కిమెడిస్ ఓ కీలక సూత్రాన్ని కనిపెట్టింది స్నానం చేస్తున్నప్పుడే. ఓ రోజు స్నానం కోసం బాత్‌టబ్‌లోకి దిగినప్పుడు నీళ్లు పైకి రావడాన్ని చూసిన ఆయన.. బాత్రూమ్లోనే కూర్చుని లెక్కలు వేయడం మొదలుపెట్టాడు. కొన్ని కీలక అంశాలను గుర్తించాడు.ఈ ఆనందం పట్టలేక.. బాత్రూమ్లోంచి అలా బట్టల్లేకుండానే ‘యురేకా’ అని అరుస్తూ వీధుల్లోకి పరుగెత్తాడట. ఏం కనిపెట్టాడు.. లాభమేంటి? బాత్‌టబ్‌లో పరిశీలనతో.. నీళ్లలో ఏదైనా వస్తువు ఎంత మేర మునిగితే, అంతే పరిమాణం లో నీళ్లు పక్కకు తొలగుతున్నట్టు ఆర్కిమెడిస్ గుర్తించాడు. వస్తువు వల్ల పక్కకు తొలగిన నీళ్ల బరువు.. ఆ వస్తువు బరువు కంటే ఎక్కువుంటే అది నీళ్లలో తేలుతుందని, తక్కువుంటే మునిగిపోతుందని తేల్చాడు. దీనికి వస్తువుల సాంద్రతతో లింకు ఉంటుందని గుర్తించాడు. ఏదైనా వస్తువు తొలగించిన నీటి బరువుతో సమాన బలంతో నీళ్లు ఆ వస్తువును పైకినెట్టడానికి ప్ర యత్నిస్తాయని (ఊర్ధ్వ పీడనం) తేల్చాడు. ఎన్నో ఆవిష్కరణలకు ఈ సూత్రాలు తోడ్పడ్డాయి. ఉదాహరణకు పడవలు, ఓడలు.. ఇనుము, ఉక్కు, కలప కలిపి భారీగా నిర్మించినా, వాటిల్లో భారీగా సామగ్రి తీసుకెళ్లినా మునగకుండా ఉంటాయి. ఆర్కిమెడిస్ సూత్రం ఆధారంగానే.. వాటి బరువు కంటే, ఎక్కువ నీటిని పక్కకు నెట్టేలా ఓడలను డిజైన్ చేస్తారు. మన కోసం.. టైం ఇచ్చుకోవాలని.. నిజానికి ఆర్కిమెడిస్ పుట్టినరోజును ప్రత్యేక దినంగా నిర్ణయించాలని అనుకున్నారు. కానీ ఆ తేదీ ఏమిటనేది ఎవరికీ తెలియదు. అయితే ఆయన ఈ సూత్రాన్ని కనిపెట్టిన రోజును మాత్రం కొన్ని అంశాల ఆధారంగా జూన్ 14వ తేదీగా అంచనా వేశారు. అది బాత్‌టబ్‌లో కనిపెట్టాడు కాబట్టి.. ‘ఇంటర్నేషనల్ బాత్ డే’గా ప్రకటించారు. ఇలా స్నానాల రోజుగా ప్రకటించడం వెనుక ఇంకొన్ని కారణాలు కూడా ఉన్నాయి. స్నానం చేసేప్పుడు మనం పూర్తి ఒంటరిగా, ప్రశాంతంగా ఉంటామని వైద్య నిపుణులు చెప్తున్నారు. గోరువెచ్చని నీటిలో స్నానం చేస్తూ, శరీరం పూర్తిగా రిలాక్స్ అయినప్పుడు మెదడు చురుగ్గా పనిచేస్తుందని, ఆలోచనలు మెరుగుపడతాయని.. ఆర్కిమెడిస్ కూడా ఇలాంటి సమయంలోనే గొప్ప ఆవిష్కరణ చేశాడని అంటున్నారు. అందుకే ఈ రోజు ప్రత్యేకంగా స్నానానికి కేటాయించి, మనపై మనం దృష్టి సారించుకోవాలని సూచిస్తున్నారు. పిల్లల్లో సైన్స్‌పై.. ఆసక్తి పెంచేందుకు.. పిల్లలకు స్నానం చేయడం, నీళ్లలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ఇదే సమయంలో వారికి సైన్స్ పట్ల ఆసక్తి, అవగాహన కల్పించేందుకు ప్రయత్నించవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఇంటర్నేషనల్ బాత్ డే వెనుక ఇదీ ఓ కారణమని స్పష్టం చేస్తున్నారు. పిల్లలకు బాత్‌టబ్‌లో పలురకాల బొమ్మలు ఇచ్చి.. నీళ్లు నిండి ఉండడం, ఖాళీగా ఉండటం, నీటిపై తేలడం, మునగడం, తేలికగా ఉంటే ఏమవుతుంది, బరువుగా ఉంటే ఏమవుతుంది, వంటి ఫిజిక్స్ సూత్రాలపై అవగాహన కల్పించవచ్చని అంటున్నారు. కొన్ని యూరప్ దేశాల్లో ఈ రోజున పిల్లలకు బాత్‌టబ్ నిండా బొమ్మలతో బహుమతులు ఇస్తుండటం ఆనవాయితీ కూడా.. ఈ లెక్కలతోనే.. ఏనుగును కాపాడారు గత ఏడాది జనవరి 30న జార్ఖండ్‌లోని ఓ గ్రామంలో గున్న ఏనుగు బావిలో పడిపోయింది. దానిని ఎలా బయటికి తీయాలా అన్న ఆలోచన చేసిన అటవీశాఖ అధికారులు.. బావిలోకి బురద నీటిని పంపారు. గున్న ఏనుగు ఆ నీటిలో తేలుతూ పైకి రాగానే బయటికి లాగి కాపాడారు. ఈ విషయంలో ఆర్కిమెడిస్ సూత్రాన్ని పాటించామంటూ ఐఎఫ్ఎస్ అధికారి రమేశ్ పాండే.. ట్విట్టర్లో ట్వీట్ కూడా చేశారు. బురద నీటి సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల.. దానికంటే తక్కువ సాంద్రత ఉండే ఏనుగు ఆ నీటిలో తేలుతుందన్న ఆలోచనతోనే అధికారులు ఇలా చేశారని చెప్పడం గమనార్హం. –సాక్షి సెంట్రల్ డెస్క్ చదవండి: ఒత్తిడి తగ్గించుకోవడానికి 365 రోజులుగా అదే పనిలో ఉన్నాడు -
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు : హీరోయిన్
Parineeti Chopra: సినిమా నటులు అంటేనే పాత్రకు తగ్గట్లుగా ఒదిగిపోవాలి. ఏ క్యారెక్టర్ చేసినా శక్తి వంచన లేకుండా ఫర్ఫామెన్స్ చూపించాలి. అప్పుడే తమ పాత్రలకు న్యాయం చేయగలుగుతారు. నేటితరం హీరో, హీరోయిన్లకు ఈ విషయం బాగా అర్థమైంది. అందుకే పాత్రలకు తగ్గట్లుగా తమ శరీరాన్ని, మైండ్‌సెట్‌ని మార్చుకుంటున్నారు. లావు పెరగాలని, తగ్గాలని నెలల పాటు డైటింగ్ చేస్తున్నారు. నల్లగా కనిపించడానికి రోజుల తరబడి ఎండలో నిలబడినవాళ్లు కూడా ఉన్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా కూడా ఓ పాత్ర కోసం రెండు రోజుల పాటు స్నానం చేయకుండా ఉన్నారట. పరిణీతి చోప్రా, అర్జున్ కపూర్ నటించిన సందీప్ ఔర్ పింకీ పరార్ సినిమా ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఇందులో పరిణీతి నటనకు ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి. కాగా, ఇందులో ఓ సీన్ కోసం తాను రెండు రోజులు స్నానం చేయలేదని పరిణీతి చెప్పింది. సినిమాలోని కథ ప్రకారం తన పాత్రకి అనుకోకుండా అబార్షన్ జరగటం.. కొన్ని రోజులు అదే షాక్ లో ఉండే సీన్లను అత్యంత సహజంగా తెరకెక్కించటం కోసం తానీ పని చేసినట్లు చెప్పారు. ఒక మారుమూల కొండ ప్రాంతంలోని గుడిసెలో ఈ సీన్లు మూడు రోజులు షూట్ చేశారని చెప్పారు. ఆ ప్రాంతం మొత్తం మరికిగా ఉండేదని.. షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లినా..స్నానం చేయకుండా నేరుగా షూటింగ్ కు వచ్చానని.. సీన్ బాగా రావాలన్న ఉద్దేశంతో ఇలా చేశానని పరిణీతి చెప్పుకొచ్చింది. చదవండి: కిస్ సీన్.. కట్ అంటే కట్ అంతే: హీరోయిన్ -
16 గంటల పాటు స్నానం:. బాత్రూంలో నిద్రపోయావా ఏంటి?
మాములుగా స్నానం చేయడానికి ఎంత టైం తీసుకుంటారు. మహా అయితే 5, 10నిమిషాలు.. కాస్త అతిశుభ్రత పాటించేవారైతే ఓ అరగంట. అంతకు మించి ఎక్కువసేపు ఎవరు బాత్రూంలో ఉండరు. అలా కాకుండా ఏకంగా 16 గంటల పాటు స్నానం చేసిన వారి గురించి ఎప్పుడైనా విన్నారా.. అన్నేసి గంటలు నీటిలో నానితే ఏమవుతుందో తెలుసా.. లేదా. అయితే ఈ వార్త చదవండి.. టిక్‌టాక్ యూజర్ అయిన ఓ మహిళ ఏకంగా 16 గంటల పాటు స్నానం చేసిందట. ఫలితంగా ఆమె కాళ్లు, చేతుల మీద చర్మం ముడుచుకుపోయింది. రక్తం పీల్చేసినట్లుగా పాలిపోయాయి. దాంతో బయపడిన సదరు మహిళ.. ‘‘యాక్సిడెంటల్‌గా 16 గంటల పాటు స్నానం చేశాను. ఫలితంగా నా కాళ్లు, చేతులు ఇలా మారిపోయాయి. వీటిని పూర్వ స్థితిలోకి తీసుకు రావాలంటే ఏం చేయాలి.. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి’’ అంటూ ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు, పోస్ట్ చూసిన వారిలో ఎక్కువ మంది అడిగిన ప్రశ్న ఒక్కటే. 16 గంటల పాటు స్నానం చేశావా.. ఎలా సాధ్యమయ్యింది.. అసలు అన్ని గంటలు బాత్రూంలో ఎలా గడిపావ్.. కొంపతీసి.. స్నానం చేయడం మర్చిపోయి నిద్రపోయావా ఏంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనికి సదరు మహిళ నుంచి ఎలాంటి సమాధానం లేదు. మరికొందరు మాత్రం తమకు తెలిసిన చిట్కాలు చెప్తుండగా.. కొందరు త్వరగా హాస్పిటల్‌కు వెళ్లు అని సూచిస్తున్నారు. చదవండి: బాత్‌టబ్‌లో ఐఫోన్ చార్జింగ్.. షాకింగ్ -
వైరల్: నడి రోడ్డు మీద తలస్నానం!
జకర్తా: వాహనదారులు ఏ చిన్న పొరపాటు చేసినా చలానా వేయకుండా వదిలిపెట్టరు ట్రాఫిక్ పోలీసులు. ఆ చలానా డబ్బును కూడా ముక్కు పిండి మరీ వసూలు చేసుకుంటారు. రూల్స్ విషయంలో ఇంత స్ట్రిక్ట్‌గా ఉండే పోలీసులు రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉన్నా అస్సలు పట్టించుకోరు. ఈ తీరుకు చిర్రెత్తిపోయాడు ఇండోనేషియాకు చెందిన అమక్ ఓహాన్ అనే వ్యక్తి. వర్షపు చుక్క పడితే చాలు కాలువను తలపిస్తోన్న రోడ్డును బాగు చేయించే ఉద్దేశ్యమే లేదా? అని ఆలోచించాడు. ఎలాగైనా అధికారుల కళ్లు తెరిపించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వినూత్న నిరసనకు దిగాడు. నడి రోడ్డు మీద బురద నీళ్లలో కూర్చుని స్నానం చేశాడు. అందులోనే పడుకుని అటూఇటూ బొర్లాడు. షాంపూ పెట్టుకుని ఆ బురద నీళ్లతోనే తల శుభ్రం చేసుకున్నాడు. దారిన పోయేవాళ్లు అతడి విన్యాసాలను విడ్డూరంగా చూడగా మరికొందరు ఈ తతంగాన్ని కెమెరాల్లో బంధించారు. ఇలా స్నానం చేయడానికి ముందు ఫొటోషూట్‌తో పాటు చేపలు కూడా పట్టాడట. మొత్తానికి ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో స్పందించిన అధికారులు మరమ్మత్తులు చేసేందుకు సిద్ధమయ్యారట. అక్కడి మీడియా వెలువరించిన కథనాల ప్రకారం ఈ విచిత్ర నిరసన ఇండోనేషియాలోని వెస్ట్ నుసా టెంగారాలోని ప్రయ నగరంలో జరిగింది. దీని గురించి ఓహాన్ మాట్లాడుతూ.. "ఈ గుంతలమయమైన రోడ్ల వల్ల చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రహదారి దుస్థితిని అధికారులకు తెలియజేసేందుకు, రోడ్డు మీద డ్రైనేజీ పొంగి పొర్లడాన్ని నిరసిస్తూ అక్కడ స్నానం చేశాను" అని చెప్పుకొచ్చాడు. చదవండి: వైరల్: నా రూటే సపరేటు అన్నట్లు..! రెండు శునకాల బెలూన్ ఆట.. చూస్తే వావ్ అనాల్సిందే! -
జలపాతంలో ఏనుగుల సైన్యం
-
వైరల్: జలకాలాటల్లో ఏమీ హాయిలే..
పచ్చని ప్రకృతి మధ్య నదిలో సరాదాగా గడిపితే వచ్చే ఆ కిక్కే వేరు. ఇరుకైన బాతురూమ్‌లో మితమైన నీటితో స్నానం చేయడం కంటే సెలయేటిలో, జాలువారుతున్న జలపాతంలో చేస్తే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేము. ఇది జంతువులకు పుట్టుకతో ఉన్న అదృష్టం. అలా ఓ గుంపులగా కదిలిన ఏనుగుల సైన్యం దారి మధ్యలో ఉన్న నదిలో జలకాలు ఆడాయి. ఏనుగు కుటుంబం నీటిలో అటు ఇటు తిరుగుతూ వాటి శరీరాన్ని శుభ్రం చేసుకుంటూ ఆనందంగా గడిపాయి. ఈ దృశ్యాలను భారత అటవీశాఖ అధికారి పర్వీన్ కశ్యప్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. (సింహం సింగిల్‌గా రాదు.. మీరే చూడండి) ‘ఏనుగుల కుటుంబం సాయత్రం స్నానం చేస్తుంది. పరిశుభ్రంగా ఎలా ఉండాలో వీటిని చూసిన నేర్చుకోండి’ అంటూ ట్వీట్ చేశారు. ఏనుగులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తరుచూ దర్శనమిస్తూనే ఉంటాయి. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ వీడియో ప్రాధాన్యత సంతరించుకుంది. వైరస్ నుంచి రక్షించుకోడం కోసం భైతిక దూరం, పరిశుభ్రత పాటించడం, చేతులు కడుక్కోవడం తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో గజ రాజులు శుభ్రత పాటిస్తూ స్నానం చేస్తున్న ఈ వీడియోపై నెటిజన్లు వేగంగా స్పందిస్తున్నారు. ‘మనుషుల కంటే జంతువులే మంచివి. జంతువుల నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. కొన్నిసార్లు మనకు సరైన మార్గంలో నడిపే విషయాలను బోధిస్తాయి’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక వీడియో షేర్ చేసిన కొంత సమయంలోనే వైరల్‌గా మారింది. (భయానకం: తెలివిగా తప్పించుకున్నాడు) ఈశ్వర్, అల్లా, జీసస్‌లపై ఒట్టు: వర్మ -
భర్త స్నానం చేయడం లేదంటూ..
బెంగళూరు : కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో దేశంలో గృహ హింస కేసులు పెరిగిపోతున్నాయి. భార్య భర్తలు 24 గంటలు ఇంట్లోనే ఉండడంతో వారి మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. భర్తలు పెట్టే హింసలు భరించలేక చాలా మంది మహిళలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటననే కర్ణాటకలోని బెంగళూరులో చోటు చేసుకుంది. తన భర్త స్నానం చేయకుండా తనను ఇబ్బంది పెడుతున్నారని ఓ మహిళ జయనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్నానం చేయకపోవడంతో అతని నుంచి దుర్వాసన వస్తుందని, అలాగే తన గదిలోనే నిద్రించాలని బలవంతం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి కిరాణ షాపు తెరవకుండా ఇంటి దగ్గరే ఉంటూ హింసిస్తున్నాడని వాపోయారు. అంతే కాదు తండ్రిని చూసి తొమ్మిదేళ్ల కూతురు కూడా వారం రోజులుగా స్నానం చేయడం లేదని ఆమె పోలీసులకు వివరించారు. వ్యక్తి గత శుభ్రత గురించి ఎంత వివరించినా ఆయన పాటించడం లేదని, పైగా గదిలోకి వెళ్లకపోవడంతో తనపై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతన్ని పిలిపించి వ్యక్తిగత శుభ్రత గురించి కౌన్సిలింగ్ ఇచ్చామని పోలీసులు పేర్కొన్నారు. -
నీటితో మసాజ్
మనిషిని ఆరోగ్యంగా ఉంచే ప్రధానమైన దినచర్య స్నానం. రోజంతా వేడి, కాలుష్యం గల వాతావరణంలో ఉండే వాళ్లు రోజూ రెండుసార్లు స్నానం చేయడం తప్పనిసరి. అయితే స్నానం అంటే బకెట్లో ఉన్న నీటిని ఒంటి మీద కుమ్మరించుకోవడం కాదు. దేహమంతటినీ శుభ్రపరుస్తూ మర్దన చేయడమే స్నానం. మంచి స్నానం అంటే ఏమిటో తెలుసుకుందాం. ►స్నానానికి ఉపయోగించే నీరు మరీ వేడిగా ఉండకూడదు, చల్లగానూ ఉండకూడదు. గోరువెచ్చగా లేదా ఒంటికి హాయి కలిగించేటంత వేడి ఉండాలి. చర్మం మీద ఉండే సెబేషియస్ గ్రంథులు ఉత్తేజితమై చర్మసంరక్షణకు అవసరమైన నూనెలను స్రవించడానికి తగినంత వేడి మాత్రమే ఉండాలి. నీటి వేడి మరీ ఎక్కువైనా, మరీ తక్కువైనా చర్మం పొడిబారిపోతుంది. ►ఎక్స్ఫోలియేషన్ కోసం స్నానం చేసేటప్పుడు స్క్రబ్ వాడాలి. అయితే రోజూ స్క్రబ్ ఉపయోగిస్తే చర్మకణాలు దెబ్బతింటాయి కాబట్టి స్క్రబ్ వారానికి రెండుసార్లకు మించకూడదు. ఇందుకోసం మార్కెట్లో దొరికే రెడీమేడ్ స్క్రబ్‌లను వాడవచ్చు లేదా గరుకుగా ఉన్న సున్నిపిండిని వాడవచ్చు. ►వారంలో రెండుసార్లు ఒంటికి నూనె లేదా మీగడ రాసి మర్దన చేసి స్నానం చేయాలి. తగిన సమయం లేకపోతే కనీసం ఒక్కసారయినా అలా చేయాలి. ►ఒంటిని రుద్దేటప్పుడు మురికి త్వరగా వదలడం కోసం గోళ్లతో గీకకూడదు. అలాగే ఒంటికి సబ్బు పట్టించిన తరవాత వలయాకారపు స్ట్రోక్స్‌తో మర్దన చేస్తూ రుద్దాలి. ఇలా చేస్తే... స్నానంతో దేహం సేదదీరుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. -
కుంభమేళాతో రూ 1.2 లక్షల కోట్ల రాబడి
లక్నో : జనవరి 15న ప్రారంభమై మార్చి 4న ముగిసే మహా కుంభమేళా యూపీ ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించనుంది. ఈ చారిత్రక అతిపెద్ద ఆథ్యాత్మిక మేళా ద్వారా యూపీ సర్కార్‌కు రూ 1.2 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రముఖ పరిశ్రమ సంస్థ సీఐఐ అంచనా వేసింది. పలు రంగాలకు చెందిన ఆరు లక్షల మందికి పైగా ఈ ఉత్సవాలతో ఉపాధి లభిస్తుందని పేర్కొంది. మహా కుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం రూ 4200 కోట్లు కేటాయించి పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇక సీఐఐ అంచనా ప్రకారం దేశ, విదేశీ టూరిస్టుల రాకతో ఆతిథ్య రంగంలో కొత్తగా 2,50,000 మందికి, టూర్ ఆపరేటర్లుగా 45,000 మంది ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్ట్స్‌లో దాదాపు 1,50,000 మందికి ఉపాధి సమకూరుతుందని, మెడికల్, ఎకో టూరిజంలో 85,000 మందికి ఉపాధి లభిస్తుందని సీఐఐ అథ్యయనం అంచనా వేసింది. వీటితో పాటు టూర్ గైడ్స్, ట్యాక్సీ డ్రైవర్లు, వాలంటీర్లు వంటి అసంఘటిత ఉద్యోగాలు పెద్దసంఖ్యలో అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. కుంభమేళాకు ఆస్ర్టేలియా, బ్రిటన్, కెనడా, మలేషియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, మారిషస్, జింబాబ్వే, శ్రీలంక సహా పలు దేశాలకు చెందిన టూరిస్టులు తరలిరానున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా కుంభమేళాను నిర్వహించేందుకు యూపీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టిందని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. కాగా మార్చి 4న మహాశివరాత్రి రోజున ముగిసే మహా కుంభమేళాకు దాదాపు 12 కోట్ల మంది హాజరై ప్రయాగరాజ్‌లో పవిత్ర నదీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారని అధికారులు భావిస్తున్నారు. -
హోలీలో అపశ్రుతి
పుల్కల్(అందోల్): రెండు కుటుంబాల్లో హోలీ పండగ విషాదాన్ని నింపింది. ఇద్దరు విద్యార్థులు నదిలో నీట మునిగి దుర్మరణం పాలైన సంఘటన పుల్కల్ మండలం కొర్పోల్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కొర్పోల్ గ్రామానికి చెందిన కిషన్, మంజుల దంపతుల కొడుకు సాయికిరణ్, యాదయ్య, వీరమణి దంపతుల కొడుకు సాయికుమార్లు మధ్యాహ్నం వరకు హోలీ ఆడారు. అనంతరం వారిద్దరూ మరో ఐదుగురితో కలిసి స్నానానికని మంజీర నదికి వెళ్లారు. ఇందులో ఈత రాని ఐదుగురు నది ఒడ్డున స్నానం చేస్తున్నారు. ఈ క్రమంలో సాయికిరణ్, సాయికుమార్‌లతోపాటు మరో ఇద్దరు నీట మునగడాన్ని ఇంటర్ విద్యార్థి మల్లేశం గమనించాడు. వెంటనే నీట మనుగుతున్న ఇద్దరిని కాపాడి బయటకు తీశాడు. కానీ సాయికిరణ్, సాయికుమార్‌లను కాపాడేంత శక్తి లేకపోవడంతో గ్రామానికి చెందిన పలువురికి సమాచారం ఇచ్చాడు. కానీ అంతలోపే సాయికుమార్, సాయికిరణ్‌లు నీటిలో మునిగి దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన వారిద్దరూ 10వ తరగతి విద్యార్థులే. వీరి మృతి విషయం తెలుసుకున్న స్థానికులు మంజీర నదికి వెళ్లి వారి మృతదేహాలను బయటకు తీశారు. వెంటనే పుల్కల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఏఎస్ఐ ప్రభాకర్ సంఘటన స్థలానికి చెరేకున్నారు. ఇద్దరూ ప్రాణ స్నేహితులే.. మంజీర నదిలో స్నానం చేయడం కోసం వెళ్లి మృతి చెందిన సాయికుమార్, సాయికిరణ్‌లు ఇద్దరూ ప్రాణస్నేహితులని తోటి విద్యార్థులు తెలిపారు. ఐదవ తరగతి నుంచి 10వ తరగతి వరకు కలిసి చదువుకుంటున్నారని, ఎప్పుడూ వారు కలిసే ఉండే వారన్నారు. ఇద్దరూ తల్లిదండ్రులకు ఒక్కగానొక్కరే.. సాయికుమార్, సాయికిరన్లు ఇద్దరు కూడా వారి తల్లిదండ్రులకు ఒక్కొక్కరే కావడంతో ఆ కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన సాయికుమార్ తండ్రి యాదయ్య ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. తల్లి వీరమణి కూలీ పని చేస్తూ తన కొడుకును చదివిస్తోంది. మరో విద్యార్థి సాయికిరణ్ సైతం వారి తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. గ్రామంలో విషాదం.. అందరూ ఆనందోత్సాహాల మధ్య హోలీ వేడుకలు జరుపుకుంటుంటే ఆ గ్రామంలోని రెండు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం గ్రామస్తులను కలచివేసింది. ఇదిలా ఉంటే ఇద్దరు విద్యార్థులు మంజీర నదిలోనే పడి మృతి చెందారని, వారికి పోస్టుమార్టం నిర్వహించవద్దని స్థానికులు పోలీసులకు మొరపెట్టుకున్నారు. కానీ స్థానికంగా నెలకొన్న పరిస్థితి దృష్ట్యా కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం కోసం మృతదేహాలను జోగిపేట ఆస్పత్రికి తరలించామని ఏఎస్ఐ ప్రభాకర్ తెలిపారు. -
గౌతమి గోదావరిలో ఇద్దరు గల్లంతు
సాక్షి, ఆలమూరు: స్నానం కోసం గౌతమి గోదావరి నదిలో దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలో జరిగింది. మండలంలోని జొన్నాడ గ్రామానికి చెందిన తలారి ధర్మేంద్ర, గంటా వికాస్ అనే యువకులు గౌతమి గోదావరి నదిలో స్నానానికి దిగారు. అయితే లోతు ఎక్కువ ఉండడం, ఈత రాకపోవడంతో వారు గల్లంతయ్యారు. వీరి కోసం స్థానికులు, పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలిస్తున్నారు. -
‘ఏడాదికోసారి స్నానం.. ఆమెతో ఉండలేను’
మన జీవితాల్లో వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. దేహశుభ్రత గురించి పట్టించుకోకుంటే సంబంధాలు దెబ్బతినే అవకాశముంది. తైవాన్‌లో వెలుగుచూసిన ఉదంతమే దీనికి తాజా రుజువు. తైపీ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం.. తన భార్య మానసికంగా వేధిస్తోందని ఆరోపిస్తూ తైవాన్ పౌరుడొకరు విడాకుల కోసం కోర్టుకెక్కాడు. భార్య నుంచి విడిపోవడానికి అతడు చెప్పిన కారణాలు విని న్యాయమూర్తులు అవాక్కయ్యారు. తన భార్య ఏడాదికి ఒకసారి మాత్రమే స్నానం చేస్తుందని చెప్పి తన గోడు వెళ్లబోసుకున్నాడు. అంతేకాదు ఉదయాన్నే పళ్లు తోముకోదని, శిరోజాలను కూడా శుభ్రంగా ఉంచుకోదని తెలిపాడు. తాము ప్రేమించుకునేటప్పడు వారానికి ఒకసారి స్నానం చేసేదని, పెళ్లైన తర్వాత పరిస్థితి దారుణంగా మారిందన్నాడు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే స్నానమాడేదని, దీని కోసం 6 గంటల సమయం తీసుకునేదని వివరించాడు. ఉద్యోగం చేయొద్దని ఆమె పెట్టే బాధ భరించలేక కొన్నాళ్లు జాబ్ మానేసి, అత్తారింట్లో ఉన్నానని చెప్పాడు. 2015 చివర్లో తన భార్యకు చెప్పకుండా ఇళ్లు విడిచి వెళ్లిపోయి సించు అనే ప్రాంతంలో ఉద్యోగంలో చేరానని తెలిపాడు. అయితే నెల రోజుల తర్వాత తన ఆచూకీ తెలుసుకుని వచ్చిన ఆమె ఉద్యోగం మానేయాలని మళ్లీ ఒత్తిడి చేయడంతో భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నానన్నాడు. తనపై భర్త చేసిన ఆరోపణలను ఆమె తోసిపుచ్చింది. అతడిని తన తల్లిదండ్రులు సొంత కొడుకులా చూసుకున్నారని తెలిపింది. -
అమరావతిలో భక్తులకు జల్లు స్నానాలే..!
-
స్నానం చేస్తుండగా చూశాడని..
జైపూర్: స్నానం చేస్తుండా ఆకతాయి బాత్ రూమ్ లోకి తొంగిచూసిన ఘటనలో అవమానాన్ని భరించలేక ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన రాజస్థాన్ లో సంచలనం రేపింది. భిల్వారా జిల్లా ఎస్పీ ప్రదీప్ మోహన్ శర్మ కథనం ప్రకారం.. దేలాన్ గ్రామానికి చెందిన యువతి(20) బుధవారం సాయంత్రం స్నానం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన యువకుడు(18) బాత్ రూమ్ లోకి తొంగిచూసే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన యువతి కేకలు వేయడంతో కుటుంబసభ్యులు పరుగునవచ్చి ఆకతాయిని పట్టుకుని చితగొట్టి కట్టేశారు. కొద్ది సేపటికి యువకుడి కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి యువతి బంధువులతో గొడవకు దిగారు. కట్లు ఊడదీసి యువకుణ్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాలకు మధ్య తోపులాట జరిగింది. తన కారణంగానే ఇంత ఘర్షణ జరిగిందనే అవమానంతో బాధిత యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇదే అదనుగా ఆ ఆకతాయి అక్కణ్నుంచి పారిపోయాడు. 70 శాతం కాలిన గాయలతో ప్రస్తుతం యువతి ఉదయ్ పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి వాగ్మూలం మేరకు యువకుడితోపాటు అతని కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదుచేసినట్లు ఎస్పీ తెలిపారు. కాగా, ఆ యువతీయువకులు ప్రేమికులని, వాళ్లిద్దరూ బాత్ రూమ్ లో కలిసి ఉండటాన్ని యువతి మావయ్య చూశాడని, అమ్మాయి తప్పును కప్పి పుచ్చేందుకే బాత్ రూమ్ లోకి తొంగిచూసినట్లు చెబుతున్నరని యువకుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. యువతిపై అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లేవని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి దోషులకు శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. ప్రస్తుతం యువకుడు పరారీలో ఉన్నాడని, యువతి ఇంటికి వెళ్లి గొడవ చేసిన అతని బంధువులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. -
గోదావరిలో ఈతకెళ్లి ఇద్దరు విద్యార్థుల గల్లంతు
పోలవరం: పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. పోలవరం మండలం రామయ్యపేట వద్ద గోదావరి నదిలో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థులు ఎం. వీరాబాబు(19), కె. అశోక్(19)గా గుర్తించారు. వీరిద్దరూ కొయ్యలగూడెంలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతున్నారు. అశోక్ స్వగ్రామం పొంగుటూరు కాగా..వీరబాబుది కన్నాపురం గ్రామం. అశోక్ మృతదేహాన్ని వెలికి తీయగా..వీరబాబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థుల మృతితో ఆ గ్రామాల్లో విషాదం నెలకొంది. -
స్నానానికి వెళ్లి.. ఇద్దరు చిన్నారుల గల్లంతు
వరంగల్ : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో నీటికుంటలో స్నానానికి దిగి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. పరకాల మండలం అక్కంపేటకు చెందిన రాజ్‌కుమార్ (11), గంగదేవిపల్లికి చెందిన శ్రీశాంత్ (12) పండగ సెలవుల్లో నాగాపురంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చారు. బుధవారం మధ్యాహ్నం ఐనవోలు శివారులోని కుంటలో స్నానానికి దిగి మునిగిపోయారు. ఎంతకీ బయటకు రాకపోవడంతో స్థానికులు గాలింపు చేపట్టడంతో కుంటలో మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనతో చిన్నారుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. -
స్నానం చేస్తుండగా మహిళను వీడియోతీశారు..
అమలాపురం: తూర్పుగోదావరి జిల్లాలో మరో కీచకపర్వం చోటుచేసుకుంది. కన్నూమిన్నూకానని ముగ్గురు యువకులు.. ఓ వివాహిత స్నానం చేస్తుండగా మొబైల్ ఫోన్ లో వీడియో తీసేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని ఆమె గుర్తించి కేకలు వేయడంతో పరారయ్యాయి. అయితే మరో వ్యక్తి ఆ దుండగులను గుర్తించడంతో వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదయింది. అమలాపురం పట్టణంలోని వానపల్లివారి వీధిలో శనివారం జరిగిన ఈ సంఘటనలో నిందితులను బాధితురాలి సోదరి గుర్తించంది. బాత్ రూమ్ లో తన సోదరి కేకలు వేయగానే తాను పరుగున వెళ్లానని.. అప్పుడే తమ కాలనీకే చెందిన యెరుబండి బాలాజి, వెంకటగిరి బాబు, బుదిరెడ్డి రాజశేఖర్ లు పారిపోతూ కనిపించారని పోలీసులకు చెప్పింది. స్థానికుల సహాయంతో పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ యువకులు పారిపోయారు. ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించిన పట్టణ సీఐ వైఆర్కే. శ్రీనివాస్.. నిందితులపై నిర్భయ కేసు (సెక్షన్-451, 509, 354(సీ), 354(డీ)) నమోదు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం వారికోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. -
మన జాతీయాలు
పేడకుప్పకు దిష్టి మంత్రమా? దిష్టి ఎప్పుడు తీస్తారు? ఎందుకు తీస్తారు? అందం, ఐశ్వర్యం, విజయం కలిగిన వారికి నరదిష్టి తగులుతుందని ఒక నమ్మకం. అందుకే దిష్టి తీస్తుంటారు. ఒక కొత్త భవనానికో, అందమైన భవనానికో దిష్టిబొమ్మ తగిలిస్తే అదేమీ వింత కాదు. అదే ఒక పాడుబడిన భవంతికి దిష్టిబొమ్మ కడితే అందరూ నవ్వుకుంటారు. ఎందుకంటే ఆ పాడుబడిన భవంతికి దిష్టి తీయాల్సిన అవసరం ఏముంటుంది అని! కొందరు అవసరం లేని పనులు చేసి నలుగురూ నవ్వుకునేలా చేస్తారు. ‘‘మావాడు కార్యశూరుడు. ఎంత పెద్ద కార్యశూర్యుడు అంటే పేడకుప్పకు దిష్టి మంత్రం వేసే రకం’’ అని ఒకరు అంటారు. ‘‘చేయక చేయక ఒక పని చేస్తాడు. తీరా చూస్తే ఆ పని పేడకుప్పకు దిష్టిమంత్రం వేసినట్లుగా ఉంటుంది’’ అని ఇంకొకరు అంటారు. ఇలా రకరకాల సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. పేడకుప్పను చూడగానే ముక్కు మూసుకోవా లనుకుంటాంగానీ, ‘ఆహా ఏమి సౌందర్యం’ అని అనుకోము కదా! మరి పేడకుప్పకు దిష్టి మంత్రం వేస్తే ఎంత నవ్వులాటగా ఉంటుంది! ఈ నేపథ్యంలో నుంచి పుట్టిన జాతీయమే ‘పేడకుప్పకు దిష్టిమంత్రం వేసినట్లు’ అన్నది! కాక స్నానం ‘‘పనైతే చేస్తాడుగానీ... అది కాక స్నానంలా ఉంటుంది’’ అన్నమాట చాలాసార్లు వింటుంటాం. పనులు చేసేవాళ్లు రెండు రకాలుగా ఉంటారు. మొదటి రకం వారు చిత్తశుద్ధితో చేస్తారు. సంపూర్ణంగా చేస్తారు. రెండో రకం వారు నామమాత్రంగా చేస్తారు. అందులో లోపాలు, పరిమితులు బోలెడు కనిపిస్తాయి. ఈ రెండో కోవకు చెందిన వారి విషయంలోనే పై జాతీయాన్ని ఉపయోగిస్తారు. కాకి స్నానం ఎలా చేస్తుందో ఎప్పుడైనా చూశారా? తన రెండు రెక్కలనూ నీళ్లలో ఆడించి స్నానం పూర్తి చేశాను అనుకుంటుంది. మనుషుల్లో కూడా కొందరు ఏదైనా పని చేసేటప్పుడు ఏదో చేశాం అన్న పేరుకి చేసేసి, అద్భుతంగా చేసేశాం అని బిల్డప్ ఇస్తూ ఉంటారు. అలాంటివారి పనిని కాకస్నానంతో పోలుస్తారన్నమాట! శనివారపు జడి వాన! శనివారం ఏ పని చేయాలన్నా వెనకడుగు వేస్తుంటారు. కారణం మంచి పనులు చేయడానికి శనివారాన్ని ఎంచుకోవడం కరెక్ట్ కాదన్న నమ్మకం. ఇక వాన గురించి. వాన పడితే చేయాల్సిన పనులు చేయలేము. ఆ జల్లులో, బురదలో పనికి రకరకాల ఆటంకాలు కలుగుతాయి. పని వాయిదా పడక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. ఇక జడివాన మొదలైతే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. ఇక ఈ రెండూ కలిస్తే?! శనివారం పూట పని చేయడానికే సంకోచిస్తుంటే ఇక వాన కూడా పడిందనుకోండి, ఇక అంతే సంగతులు కదా! అందుకే శనివారపు జడివాన అన్న జాతీయం పుట్టుకొచ్చింది. కొందరు మాట్లాడ్డం మొదలు పెడితే ఆపరు. అలాంటి ‘ఆగని నస’ని శనివారపు జడివాన అంటారు. ‘అయ్యబాబోయ్... అతను ఉపన్యాసం మొదలు పెట్టాడు... ఇక శనివారపు జడివానే!’ అని చమత్కరిస్తారు. ఎలుక చావుకు పిల్లి మూర్ఛ పోయిందట! అసమంజసమైన, పొంతన లేని, అసంబద్ధమైన విషయాలను విన్నప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే ఇద్దరిలో ఒకడికి ఏమైనా అయితే, రెండోవాడు బాధ పడుతున్నట్లు నటించినా, సానుభూతి చూపించినా... జనాలు నమ్మకపోగా ‘వీడి వాలకం చూస్తే ఎలుక చావుకు పిల్లి మూర్ఛపోయినట్లుగా ఉంది’ అంటారు. ఎలుక, పిల్లుల మధ్య జాతివైరం ఉంటుంది. పిల్లి నుంచి ఎలా తప్పించుకొని ప్రాణాలు కాపాడుకోవాలా అని ఎలుక ఆలోచిస్తుంది. ఎలుక ప్రాణాలు ఎలా తీయాలా అని పిల్లి ఆలోచిస్తుంది. కాబట్టి వాటి మధ్య స్నేహానికి, బంధుత్వానికి చాన్సే లేదు కదా! ఈ వాస్తవంలో నుంచి పుట్టిన జాతీయమే ఇది. -
ప్రేతసౌధం
మిస్టరీ * అది ఓ ప్రఖ్యాతి చెందిన సౌథం * అందులో అడుగడుగునా భయం * ఆ భయానికి ఏమిటి కారణం? వాషింగ్టన్ డీసీ... కిటికీ దగ్గర నిలబడి తదేకంగా బయటకు చూస్తున్నాడా వ్యక్తి. వేసవి కావడంతో వెన్నెల విరబూసింది. చీకటిని దూరంగా తరిమి కొడుతోంది. ఆకాశమంతా అందంగా పరుచుకున్న నక్షత్రాలు, వాటి మధ్యలో హుందాగా నిలబడిన చందమామ... చూడటానికే ఎంతో మనోహరంగా ఉందా దృశ్యం. అందుకే తదేకంగా చూసి పరవశిస్తున్నాడా వ్యక్తి. అంతలో పనివాడు వచ్చాడు. ‘‘సర్... స్నానానికి నీళ్లు రెడీగా ఉన్నాయి’’ అని వినయంగా అన్నాడు. సరే అన్నట్టు తలూపి కిటికీ దగ్గర్నుంచి ఇవతలకు వచ్చాడాయన. పనివాడు అందించిన టవల్‌ను తీసుకుని బాత్రూమ్లోకి నడిచాడు. పది నిమిషాల్లో స్నానం ముగించి బయటకు వచ్చాడు. తడి ఒంటిని మెత్తని టర్కీ టవల్‌తో తుడుచుకుని నైట్ గౌన్ వేసుకున్నాడు. ఒంటికి పౌడర్ పూసుకున్నాడు. అద్దం ముందు నిలబడి దువ్వెనతో తల దువ్వుకుంటున్నాడు. ఇంతలో వెనుక ఏదో అలికిడి అయినట్టనిపించింది. గదిలో తను తప్ప ఎవరో లేరే, మరి ఆ అలికిడి ఏమిటి అనుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు. మంచం మీద కూర్చున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. చేతిలోని దువ్వెనను డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి ‘‘నమస్తే మిస్టర్ ప్రెసిడెంట్. మిమ్మల్ని ఇక్కడ ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది’’ అన్నాడు సౌమ్యంగా. అవతలి వ్యక్తి మాట్లాడలేదు. హుందాగా తల పంకించాడు. అందంగా నవ్వాడు. మరుక్షణంలో అక్కడ్నుంచి మాయమయ్యాడు. ఉలిక్కిపడ్డాడాయన. ఏదో ట్రాన్స్ లోంచి బయట పడినట్టుగా ఈ లోకంలోకి వచ్చాడు. గదంతా పరికించి చూశాడు. ఎక్కడా ఆయన లేడు. జరిగిందేమిటో అర్థమైంది. వెంటనే వెన్నులో వణుకు పుట్టింది. క్షణాల్లో ఆ వణుకు ఒళ్లంతా పాకింది. నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుని గబగబా బయటకు పరుగుదీశాడు. ‘‘ఏం జరిగింది సర్... ఎందుకలా కంగారు పడుతున్నారు?’’... ఎదురు వచ్చిన మేనేజర్ అడిగాడు. ఆ వ్యక్తి కాసేపు మాట్లాడలేకపోయాడు. వణుకుతూ నిలబడిపోయాడు. తర్వాత ఎప్పటికో తడారిపోయిన గొంతును సవరించుకుని అన్నాడు... ‘‘నేను ఈ గదిలో పడుకోను. వేరే గది ఏర్పాటు చేయండి.’’ మేనేజర్‌కి అర్థం కాలేదు. ‘‘ఏం సర్. ఇక్కడ ఏర్పాట్లు బాలేదా? క్షమించండి. ఇప్పుడే అన్నీ సరి చేయిస్తాను’’ బతిమాలు తున్నట్టుగా అన్నాడు. ఆయన వద్దన్నట్టు తల అడ్డంగా ఊపాడు. ‘‘అవసరం లేదు. వేరే రూమ్ ఇవ్వండి’’ అంటూ వడివడిగా హాల్లోకి వెళ్లిపోయాడు. ఏం జరిగిందో, ఆయన ఎందుకలా వణుకుతున్నాడో ఎంతకీ అంతు పట్టలేదు మేనేజర్‌కి. కానీ గుచ్చిగుచ్చి అడగలేడు. ఎందుకంటే ఎదురుగా ఉన్నది మామూలు వ్యక్తి కాదు... బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్. అతిగా ప్రశ్నలు వేస్తే అతిథిగా వచ్చిన ఆయన్ని అవమానించినట్టు అవుతుంది. అందుకే మౌనంగా ఉండిపోయాడు. ఆయన కోసం వేరే గది ఏర్పాటు చేశాడు. కానీ నిజానికి ఏం జరిగిందో అర్థమై ఉంటే అతడు కూడా అవాక్కయ్యేవాడు. భయంతో బిక్కచచ్చేవాడు. అసలు ఇంతకీ ఏం జరిగింది? చర్చిల్ అంతగా ఎందుకు భయపడ్డారు? ఎందుకంటే... అక్కడ గదిలో, ఆయన మంచం మీద కూర్చుని ఉన్న వ్యక్తి ఎవరో కాదు... అబ్రహాం లింకన్. కాదు కాదు... ఆయన ఆత్మ. లింకన్ చనిపోయి అప్పటికే చాలాకాలం అయ్యింది. కానీ ఆ విషయం చర్చిల్‌కి స్ఫురించలేదు. ఓ గొప్ప వ్యక్తిని చూసిన ఆనందంలో అనాలోచితంగా ఆయన్ని పలకరించారు. తర్వాతగానీ వాస్తవం బోధపడలేదు. లింకన్ మరణం గుర్తుకొచ్చాక ఇక కాలు నిలబడలేదు. గుండె దడ ఆగలేదు. నిజానికీ అనుభవం చర్చిల్‌కు మాత్రమే ఎదురు కాలేదు. అమెరికా అధ్యక్షుడి నివాసగృహంగా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వైట్ హౌస్... ఎంతోమందికి భయానక అనుభవాలను రుచి చూపించింది. ఎందరో ప్రముఖులకు నిద్రలేని రాతుల్ని మిగిల్చింది. కారణం... ఆ భవంతి నిండా ఉన్న ఆత్మలు. వ్యవహారిక భాషలో చెప్పాలంటే... దెయ్యాలు! ధవళకాంతులతో, అత్యాధునిక సౌకర్యాలతో విలసిల్లుతుంది వైట్ హౌస్. అమెరికా అధ్యక్షుడు నివసించడానికని ఈ భవంతిని అత్యంత అందంగా తీర్చి దిద్దారు డిజైనర్లు. అధ్యక్షుడి హోదాలో ఇక్కడ యేళ్ల పాటు నివసించారు ఎంతో మంది ప్రముఖులు. అయితే ఎవరూ ఊహించిన విధంగా వైట్ హౌస్ కాస్తా ఘోస్ట్ హౌస్‌గా మారింది. ఆ భవంతి నిండా దెయ్యాలు తిరుగుతున్నాయంటూ పలువురు చెప్పసాగారు. చెప్పినవారు మామూలు వాళ్లయితే ఎవరూ పట్టించుకునేవారు కాదేమో. కానీ అతిథులుగా వచ్చిన ఇతర దేశాల నేతలు, ప్రముఖులు సైతం దెయ్యాల్ని చూసి జడుసుకున్నారు. కొందరు భయంతో వణికారు. కొందరైతే కళ్లు తిరిగి పడిపోయారు. దానికి తోడు అక్కడ నివసిస్తోన్న అధ్యక్షులు, వారి కుటుంబ సభ్యులకు కూడా తరచూ దెయ్యాలు హాయ్ చెబుతూ ఉండటంతో వైట్ హౌస్ ఘోస్ట్ హౌస్ అయ్యిందన్న విషయం ప్రపంచానికి తెలిసింది. ఇంతకీ అక్కడ దెయ్యాలు నిజంగానే ఉన్నాయా??? వైట్ హౌస్‌లో అత్యంత ఫేమస్ దెయ్యం... అబ్రహాం లింకన్‌ది. ఆయన ఆత్మను తొలిసారి చూసింది... అమెరికా మాజీ అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్ భార్య గ్రేస్. ఆ తర్వాత రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఒకసారి అతిథిగా వచ్చిన నెదర్లాండ్స్ రాణి కూడా లింకన్ ఆత్మను చూసి హడలిపోయింది. కళ్లు తిరిగి పడిపోయింది. రూజ్వెల్ట్ భార్యకి వ్యక్తిగత పరిచారిక అయిన మేరీ ఈబన్ అయితే లింకన్ ఆత్మను చూసి జడుసుకుని మంచం పట్టింది. విన్స్టన్ చర్చిల్‌కి కూడా లింకన్ దర్శనమివ్వడంతో ఆయన ఆ విషయాన్ని అందరికీ తెలియజేశారు. ఇలా ఇంతమంది తమ అనుభవాలు చెప్పడంతో... లింకన్ దెయ్యమయ్యారన్న విషయం రూఢి అయిపోయింది. అది మాత్రమే కాదు. లింకన్ మృతదేహాన్ని ఊరేగించిన రైలు కూడా దెయ్యమైందని చాలామంది అంటుంటారు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం లింకన్ శవయాత్ర జరిగిన రోజున ఆ రైలు కనిపిస్తూ ఉంటుందని, అది ఆ రోజులాగే అలంకరించి ఉంటుందని, యాత్ర మధ్యలో ఆగిన ఒక స్టేషన్లో కొద్ది క్షణాలు కనిపించి మాయమైపోతూ ఉంటుందని దాన్ని చూసిన ఎంతోమంది చెప్పారు. దాంతో లింకన్ ఘోస్ట్ గురించి ప్రపంచమంతా తెలిసిపోయింది. నిజానికి లింకన్ మాత్రమే కాదు... టైఫాయిడ్‌తో చనిపోయిన లింకన్ పదకొండేళ్ల కొడుకు విల్లీ కూడా దెయ్యమయ్యాడని అంటుంటారు. అతని ఆత్మ కూడా వైట్ హౌస్‌లో చాలామందికి కనిపించిందట! ఇక తర్వాతి స్థానం అబిగలీ ఆడమ్స్ది. అమెరికా రెండో అధ్యక్షుడైన జాన్ ఆడమ్స్ భార్య అబిగలీ. ఆమెకు తూర్పువైపున ఉన్న గది అంటే చాలా ఇష్టం. ఆ గదిలో ఇప్పటికీ ఆమె ఆత్మ ఎంతోమందికి కనిపిస్తూనే ఉంటుందట. అప్పటిలాగే తలపై క్యాప్ పెట్టుకుని, లేస్ శాలువా కప్పుకుని ఉంటారట అబిగలీ. ఆమె ఇంట్లో తిరుగుతూ ఉండటం చాలామంది అధ్యక్షులు సైతం చూశారు. అమెరికాను పాలించిన జేమ్స్ మ్యాడిసన్ భార్య డాలీ కూడా దెయ్యమై వైట్ హౌస్‌లో సంచరిస్తున్నారని ఎంతోమంది చెప్పారు. డాలీకి గులాబీలంటే చాలా ఇష్టం. దాంతో వైట్ హౌస్‌లో ఓ అందమైన గులాబీ తోటను నాటారామె. ఎక్కువగా దానిలోనే గడిపేవారు. చనిపోయాక కూడా అదే తోటలో తెల్లని గౌను వేసుకుని తిరగసాగారు. ఆమె చనిపోయిన వంద సంవత్సరాల తర్వాత నాటి అధ్యక్షుడి భార్య ఎలెన్ విల్సన్ పాడయిన గులాబీ తోటను తవ్వించేయా లని అనుకున్నారు. తీరా పనివాళ్లు తవ్వడం ప్రారంభించేసరికి డాలీ ఆత్మ అడ్డుపడింది. తోట జోలికి రావొద్దని, దాన్ని తవ్వితే ఊరుకోనని భయ పెట్టడంతో పనివాళ్లు వణికిపోయి పారిపోయారట! అలాగే అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్, లింకన్ భార్య మేరీ టాడ్, మరో అధ్యక్షుడికి అత్తగారైన మేరీ తదితరుల ఆత్మలు కూడా తరచుగా వైట్ హౌస్‌లో కనిపిస్తుంటాయని వినికిడి. ఇవన్నీ నిజమేనా అంటే నిజమే అనేవాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లంతా వైట్ హౌస్‌లో దెయ్యాలను చూశారు. భయానక అనుభవాలతో బెదిరిపోయారు. అందుకే బల్ల గుద్ది చెప్తున్నారు అది నిజమేనని. కానీ ఆధునిక భావాలు కలవారు మాత్రం ఆ మాటల్ని కొట్టి పారేస్తున్నారు. ఎన్నో యేళ్ల ఘన చరిత్ర ఉన్న వైట్ హౌస్ ప్రతిష్టని దెయ్యాల పేరుతో దిగజార్చడం సబబు కాదు అని ఆగ్రహిస్తున్నారు. మరి ఈ రెండు వాదనల్లో ఏది వాస్తవం? వైట్ హౌస్‌లో దెయ్యాలు ఉన్నాయా? లేవా?? అది శ్వేత సౌధమా? ప్రేతసౌధమా?? - మీరా -
స్నానం చేస్తుండగా వీడియో తీసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
* సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఘనకార్యం * నిందితుడి అరెస్టు సాక్షి,హైదరాబాద్: బాత్రూంలో యువ తి స్నానం చేస్తుండగా ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ దొంగచాటుగా తన సెల్‌ఫోన్‌తో వీడియో తీశాడు. ఇది గమనించిన యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆ ప్రబుద్ధుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మెహిదీపట్నం సమీపంలోని హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి లో ఈ ఘటన జరిగింది. ఎస్ఐ ఆనంద్ కథనం ప్రకారం... గచ్చిబౌలిలో నివాసముండే సాఫ్ట్వేర్ ఇంజినీర్ దినేష్ (29) రెండు రోజుల క్రితం హుమాయూన్‌నగర్‌లో తన బంధువుల ఇంటికి వచ్చాడు. సోమవారం అతను తన ఇంటి పరిసరాల్లో వాకింగ్ చేస్తుండగా.. ఎదురింట్లోని బాత్రూమ్లో స్నానం చేస్తున్న శబ్దం వినిపించింది. వెంటనే అతను బాత్రూమ్ వెంటిలేటర్లోంచి చూడగా యువతి స్నానం చేస్తూ కనిపించింది. అతను తన సెల్‌ఫోన్ ద్వారా ఆ దృశ్యాలు చిత్రీకరించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో అలికిడి రావడంతో ఉలిక్కిపడ్డ యువతి వెంటిలేటర్ వైపు చూడగా.. సెల్‌ఫోన్‌తో ఎవరో చిత్రీకరిస్తున్నట్టు కనిపించింది. ఆమె పెద్దగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి దినేష్‌ను పట్టుకున్నారు. అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దినేష్‌ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.