మాములుగా స్నానం చేయడానికి ఎంత టైం తీసుకుంటారు. మహా అయితే 5, 10నిమిషాలు.. కాస్త అతిశుభ్రత పాటించేవారైతే ఓ అరగంట. అంతకు మించి ఎక్కువసేపు ఎవరు బాత్రూంలో ఉండరు. అలా కాకుండా ఏకంగా 16 గంటల పాటు స్నానం చేసిన వారి గురించి ఎప్పుడైనా విన్నారా.. అన్నేసి గంటలు నీటిలో నానితే ఏమవుతుందో తెలుసా.. లేదా. అయితే ఈ వార్త చదవండి..
టిక్‌టాక్ యూజర్ అయిన ఓ మహిళ ఏకంగా 16 గంటల పాటు స్నానం చేసిందట. ఫలితంగా ఆమె కాళ్లు, చేతుల మీద చర్మం ముడుచుకుపోయింది. రక్తం పీల్చేసినట్లుగా పాలిపోయాయి. దాంతో బయపడిన సదరు మహిళ.. ‘‘యాక్సిడెంటల్‌గా 16 గంటల పాటు స్నానం చేశాను. ఫలితంగా నా కాళ్లు, చేతులు ఇలా మారిపోయాయి. వీటిని పూర్వ స్థితిలోకి తీసుకు రావాలంటే ఏం చేయాలి.. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి’’ అంటూ ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.
ఈ ఫోటోలు, పోస్ట్ చూసిన వారిలో ఎక్కువ మంది అడిగిన ప్రశ్న ఒక్కటే. 16 గంటల పాటు స్నానం చేశావా.. ఎలా సాధ్యమయ్యింది.. అసలు అన్ని గంటలు బాత్రూంలో ఎలా గడిపావ్.. కొంపతీసి.. స్నానం చేయడం మర్చిపోయి నిద్రపోయావా ఏంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనికి సదరు మహిళ నుంచి ఎలాంటి సమాధానం లేదు. మరికొందరు మాత్రం తమకు తెలిసిన చిట్కాలు చెప్తుండగా.. కొందరు త్వరగా హాస్పిటల్‌కు వెళ్లు అని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment