bathing woman
-
హైదరాబాద్: స్నానం చేస్తుండగా వీడియో తీసి..
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా ద్వారా ఓ మహిళను వేధిస్తున్న ఆకతాయిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి.. జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ ఎన్ రాము కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భూపాల్పల్లి కాటారం గ్రామానికి చెందిన దానం సాయి కృష్ణ ఇటీవల బంధువుల ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు హాజరయ్యాడు. అక్కడ తనకు మరదలి వరసయ్యే మహిళను చూసిన అతను ఆమెపై కోరిక పెంచుకున్నాడు. బాధితురాలు స్నానం చేస్తుండగా రహస్యంగా సెల్ఫోన్లో రికార్డ్ చేశాడు. అనంతరం సదరు వీడియో, ఫొటోలను బాధితురాలి వాట్సాప్‌కు పంపించాడు. తనతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడాలని లేకపోతే ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానని బ్లాక్మెయిల్ చేయసాగాడు. దీంతో బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు సాయికృష్ణను అరెస్ట్ చేశారు. అతడి నుంచి సెల్‌ఫోన్, సిమ్ కార్డ్‌ను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: విడాకులు తీసుకున్నారు.. మాట్లాడాలని భార్యని హోటల్‌కి పిలిచి.. -
16 గంటల పాటు స్నానం:. బాత్రూంలో నిద్రపోయావా ఏంటి?
మాములుగా స్నానం చేయడానికి ఎంత టైం తీసుకుంటారు. మహా అయితే 5, 10నిమిషాలు.. కాస్త అతిశుభ్రత పాటించేవారైతే ఓ అరగంట. అంతకు మించి ఎక్కువసేపు ఎవరు బాత్రూంలో ఉండరు. అలా కాకుండా ఏకంగా 16 గంటల పాటు స్నానం చేసిన వారి గురించి ఎప్పుడైనా విన్నారా.. అన్నేసి గంటలు నీటిలో నానితే ఏమవుతుందో తెలుసా.. లేదా. అయితే ఈ వార్త చదవండి.. టిక్‌టాక్ యూజర్ అయిన ఓ మహిళ ఏకంగా 16 గంటల పాటు స్నానం చేసిందట. ఫలితంగా ఆమె కాళ్లు, చేతుల మీద చర్మం ముడుచుకుపోయింది. రక్తం పీల్చేసినట్లుగా పాలిపోయాయి. దాంతో బయపడిన సదరు మహిళ.. ‘‘యాక్సిడెంటల్‌గా 16 గంటల పాటు స్నానం చేశాను. ఫలితంగా నా కాళ్లు, చేతులు ఇలా మారిపోయాయి. వీటిని పూర్వ స్థితిలోకి తీసుకు రావాలంటే ఏం చేయాలి.. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి’’ అంటూ ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు, పోస్ట్ చూసిన వారిలో ఎక్కువ మంది అడిగిన ప్రశ్న ఒక్కటే. 16 గంటల పాటు స్నానం చేశావా.. ఎలా సాధ్యమయ్యింది.. అసలు అన్ని గంటలు బాత్రూంలో ఎలా గడిపావ్.. కొంపతీసి.. స్నానం చేయడం మర్చిపోయి నిద్రపోయావా ఏంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనికి సదరు మహిళ నుంచి ఎలాంటి సమాధానం లేదు. మరికొందరు మాత్రం తమకు తెలిసిన చిట్కాలు చెప్తుండగా.. కొందరు త్వరగా హాస్పిటల్‌కు వెళ్లు అని సూచిస్తున్నారు. చదవండి: బాత్‌టబ్‌లో ఐఫోన్ చార్జింగ్.. షాకింగ్ -
స్నానం చేస్తున్న అమ్మాయిల ఫోటోలు తీసి..
సాక్షి, వికారాబాద్ : జిల్లాలోని కులకచర్ల మండలం లాల్ సింగ్ తండాలో దారుణం చోటుచేసుకుంది. స్నానం చేస్తున్న అమ్మాయిలు, వివాహిత ఫోటోలను తీసి ఓ కామాంధుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. నగ్న పోటోలు బయటపెడతానంటూ బ్లాక్మెయిల్ చేసి లోబర్చుకుంటున్నాడు. అనంతరం ఆ ప్రైవేట్ వీడియోలను స్నేహితులకు పంపి పైశాచికానందం పొందుతున్నాడు. ఓ మహిళా బాధితురాలి ఫిర్యాదు మేరకు గత నెల 18న శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నాలుగు రోజుల క్రితం బెయిల్‌పై తిరిగి వచ్చిన శ్రీనివాస్, అతని సోదరుడితో కలిసి బాధితురాలి కుటుంబ సభ్యులపై దాడికి దిగాడు. అంతటి ఆగకుండా తిరికి వారిపైనే అక్రమ కేసులు పెట్టించారు. శ్రీనివాస్‌ను పోలీసులకు అండగా నిలుస్తున్నారని మహిళా బాధితురాలు ఆరోపించారు. శ్రీనివాస్‌పై కాగా ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. శ్రీనివాస్ వల్ల గ్రామంలో అశాంతి నెలకొందని, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు లంచం తీసుకొని నిందితులకు వత్తాసు పలుకుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
స్నానం చేస్తున్న మహిళను వీడియో తీసి వాట్సాప్‌లో..
మంచిర్యాల,వేమనపల్లి: బాత్రూంలో స్నానం చేస్తున్న వివాహితను వీడియో తీసి వాట్సాప్‌లో పోస్టు చేసిన ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రహీంపాషా తెలిపారు. ఆయన వివరాల ప్రకారం... సూరారం గ్రామానికి చెందిన రస్పెల్లి మధు ఆటోనడుపుకుంటూ చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడు. అదే గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌గా పని చేసే వ్యక్తి భార్యతో చ నువుగా ఉంటూ రెండు రోజుల క్రితం ఆ బాత్రూంలో స్నానం చేస్తుండగా వీడియో తీశాడు. ఆ వీడియో క్లిప్పింగ్‌లను అడ్డు పెట్టుకొని అందరికి చూపిస్తానంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. వివాహితను శారీరకంగా లొంగదీసుకొని అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా స్నానం చేస్తుండగా తీసిన విడియోను వాట్సప్‌లో పెట్టడంతో బా ధితురాలు మంగళవారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
యువతి స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరణ
చెన్ట్నై,తిరువొత్తియూరు: యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువకుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. రామనాథపురం జిల్లా కీళకరై సమీపంలోని కన్నిరాజపురం ప్రాంతానికి చెందిన యువతి తన ఇంటిలో స్నానం చేస్తోంది. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఎబేసన్ (23) అతని స్నేహితులు ఎబిరోన్, విఘ్నేష్ చాటుగా సెల్ఫోన్లో వీడియో తీశారు. అనంతరం ఆ వీడియోను వాట్సాప్‌లో పెట్టారు. దీనిపై యువతి ఈ నెల 2న కీళ్కరై మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ఎబేసన్తో సహా ముగ్గురి కోసం తీవ్రంగా గాలించారు. ఈ క్రమంలో కన్యాకుమారి జిల్లా తేంగాయ్పట్టినం తీర ప్రాంతంలో దాగి ఉన్న ఎబేసన్ను కీళకరై పోలీసులు ఆదివారం ఉదయం అరెస్టు చేశారు. సముద్రతీర పోలీసుల సాయంతో ఎబేసన్ను అరెస్టు చేశారు. అతన్ని కీళకరై పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. -
ప్రాణం తీసిన వాటర్‌హీటర్
ధర్మపురి: వాటర్ హీటర్ ఓ వివాహిత ప్రాణం తీసింది. పెళ్లయిన తర్వాత కూడా చదువుకొనసాగిస్తున్న ఆమె బీఈడీ పరీక్షలు రాసేందుకు సన్నద్ధమైంది. శనివారం పరీక్షకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. స్నానానికి వేడినీళ్ల కోసం వాటర్‌హీట్ పెట్టుకోగా నీటికి విద్యుత్ సరఫరా కావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపాల్‌పూర్‌లో జరిగింది. ఎస్సై మధుకర్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గోపాల్పూర్ గ్రామానికి చెందిన నగేశ్– జల(26) దంపతులకు నాలుగేళ్లలోపు ఇద్దరు కూతుళ్లు శ్రీనిధి, అశ్విని ఉన్నారు. ఉపాధ్యాయురాలు కావాల న్న ఆశయంలో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఈడీ చదువుతోంది. జల భర్త నగేశ్ ఉపాధి నిమిత్తం ఏడాది క్రితం దుబయ్ వెళ్లాడు. ఈ క్రమంలో బీఈడీ పరీక్షల శనివారం నుంచి ప్రారంభమయ్యా యి. పరీక్షలకు సిద్ధమైన జల పరీక్ష రాసేందుకు వెళ్లేందుకు స్నానానికి వేడినీళ్ల కోసం ఇత్తడి పాత్రలో వాటర్‌హీటర్ పెట్టుకుంది. ఈ క్రమంలో వాటర్‌హీటర్‌కు ఉన్న తీగ బయటకు వచ్చి పాత్రకు తగిలింది. పాత్రను తాకుతూ కొద్ది దూరంలో ఉన్న నీటికి కూడా విద్యుత్ సరఫరా అయింది. అటుగా వచ్చిన జల నీటిలో అడుగుపెట్టడంతో షాక్‌కుగురై అక్కడికక్కడే మృతిచెందింది. ఏం జరిగిందో తెలియక జల ఇద్దరు కూతుళ్లు అమ్మా అంటూ ఏడుస్తున్న తీరు అందరినీ కలచివేసింది. సమాచారం అందుకున్న ఎస్సై ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దుబాయ్ వెళ్లిన భర్త నగేశ్‌కు జల మరణ వార్త అందించారు. వెంటనే అతడు స్వగ్రామానికి బయల్దేరాడు. -
అసభ్యకర ఫోటోలు తీసిన వ్యక్తి అరెస్ట్
గౌహతి: మహిళలపై, టీనేజ్ బాలికలపై మృగాళ్లు ఏదో ఒక రూపంలో ఆకృత్యాలకు పాల్పడుతున్న ఘటనలు తరచు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఓ మహిళ బాత్ రూంలో స్నానం చేస్తుండగా ఓ వ్యక్తి ఫోటోలు తీసిన ఘటన గౌహతిలో తాజాగా వెలుగు చూసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత కొన్ని రోజులుగా తాను స్నానం చేయడానికి బాత్ రూంలోకి వెళ్లే క్రమంలో అతను ఫోటోలు తీస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు నగర ఎస్పీ ఏపీ తివారీ తెలిపారు. ప్రస్తుతం అతనిపై కేసు నమోదు చేశామన్నారు. అతను ఫోటోలు తీయడానికి ఉపయోగించే సెల్ ను కూడా స్వాధీనం చేసుకున్నామని తివారీ తెలిపారు.