అసభ్యకర ఫోటోలు తీసిన వ్యక్తి అరెస్ట్ | Man detained for taking snaps of a bathing woman | Sakshi
Sakshi News home page

అసభ్యకర ఫోటోలు తీసిన వ్యక్తి అరెస్ట్

Published Sun, Dec 21 2014 5:41 PM | Last Updated on Tue, Oct 9 2018 5:43 PM

అసభ్యకర ఫోటోలు తీసిన వ్యక్తి అరెస్ట్ - Sakshi

అసభ్యకర ఫోటోలు తీసిన వ్యక్తి అరెస్ట్

గౌహతి: మహిళలపై, టీనేజ్ బాలికలపై మృగాళ్లు ఏదో ఒక రూపంలో ఆకృత్యాలకు పాల్పడుతున్న ఘటనలు తరచు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.  ఓ మహిళ బాత్ రూంలో స్నానం చేస్తుండగా ఓ వ్యక్తి ఫోటోలు తీసిన ఘటన గౌహతిలో తాజాగా వెలుగు చూసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

గత కొన్ని రోజులుగా తాను స్నానం చేయడానికి బాత్ రూంలోకి వెళ్లే క్రమంలో అతను ఫోటోలు తీస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు నగర ఎస్పీ ఏపీ తివారీ తెలిపారు. ప్రస్తుతం అతనిపై కేసు నమోదు చేశామన్నారు. అతను ఫోటోలు తీయడానికి ఉపయోగించే సెల్ ను కూడా స్వాధీనం చేసుకున్నామని తివారీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement