
అరెస్టయిన ఎబేసన్
చెన్ట్నై,తిరువొత్తియూరు: యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువకుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. రామనాథపురం జిల్లా కీళకరై సమీపంలోని కన్నిరాజపురం ప్రాంతానికి చెందిన యువతి తన ఇంటిలో స్నానం చేస్తోంది. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఎబేసన్ (23) అతని స్నేహితులు ఎబిరోన్, విఘ్నేష్ చాటుగా సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. అనంతరం ఆ వీడియోను వాట్సాప్‌లో పెట్టారు. దీనిపై యువతి ఈ నెల 2న కీళ్‌కరై మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ఎబేసన్‌తో సహా ముగ్గురి కోసం తీవ్రంగా గాలించారు. ఈ క్రమంలో కన్యాకుమారి జిల్లా తేంగాయ్‌పట్టినం తీర ప్రాంతంలో దాగి ఉన్న ఎబేసన్‌ను కీళకరై పోలీసులు ఆదివారం ఉదయం అరెస్టు చేశారు. సముద్రతీర పోలీసుల సాయంతో ఎబేసన్‌ను అరెస్టు చేశారు. అతన్ని కీళకరై పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment