
తిరువళ్లూరు: తమిళనాడులోని తిరువళ్లూరు పోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. భార్య సోదరిని గర్భవతి చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్షతో పాటూ లక్ష రూపాయల జరిమాన విధిస్తూ తీర్పును వెలువరించింది. దీంతో, కోర్టు తీర్పు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాల ప్రకారం.. చెన్నై ఆండాల్ నగర్‌కు చెందిన బికారీ నాయక్ కుమారుడు రాజ్‌కుమార్ నాయక్ (35). ఇతను అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అత్తారింటిలోనే ఉంటూ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో రాజ్‌కుమార్ నాయక్.. తన భార్య ఆమె సోదరి ప్రియదర్శిని(17)ని బలవంతంగా పలుమార్లు శారీరకంగా వాడుకున్నట్టు తెలుస్తుంది. దీంతో ప్రియదర్శిని గర్భవతి కావడంతో బాధితురాలు ఎన్నూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2018లో కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు.
అనంతరం కేసు విచారణ తిరువళ్లూరు కోర్టులో సాగింది. విచారణలో ప్రియదర్శినిపై బలవంతంగా నిందితుడు పలుమార్లు అత్యాచారం చేసినట్టు రుజువు కావడంతో నిందితుడికి జీవిత ఖైదు శిక్షతో పాటూ లక్ష రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. జరిమానా చెల్లించని పక్షంలో నిందితుడు మరో మూడు సంవత్సరాల పాటూ అదనంగా శిక్షను అనుభవించాలని న్యాయమూర్తి ఆదేశించిన నేపథ్యంలో నిందితుడిని పుళల్ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment