Man Arrested In Hyderabad for Film Woman While She Was Taking A Bath - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: స్నానం చేస్తుండగా వీడియో తీసి.. 

Published Fri, Mar 18 2022 8:37 AM | Last Updated on Fri, Mar 18 2022 10:31 AM

Hyderabad: Man Arrested for Film Woman While She Was Taking A Bath - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సోషల్‌ మీడియా ద్వారా ఓ మహిళను వేధిస్తున్న ఆకతాయిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి.. జ్యూడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌ రాము కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భూపాల్‌పల్లి కాటారం గ్రామానికి చెందిన దానం సాయి కృష్ణ ఇటీవల బంధువుల ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు హాజరయ్యాడు. అక్కడ తనకు మరదలి వరసయ్యే మహిళను చూసిన అతను ఆమెపై కోరిక పెంచుకున్నాడు. బాధితురాలు స్నానం చేస్తుండగా రహస్యంగా సెల్‌ఫోన్‌లో రికార్డ్‌ చేశాడు.

అనంతరం సదరు వీడియో, ఫొటోలను బాధితురాలి వాట్సాప్‌కు పంపించాడు. తనతో న్యూడ్‌ వీడియో కాల్‌ మాట్లాడాలని లేకపోతే ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తానని బ్లాక్‌మెయిల్‌ చేయసాగాడు. దీంతో బాధితురాలు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు సాయికృష్ణను అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి సెల్‌ఫోన్, సిమ్‌ కార్డ్‌ను స్వాధీనం చేసుకున్నారు. 
చదవండి: విడాకులు తీసుకున్నారు.. మాట్లాడాలని భార్యని హోటల్‌కి పిలిచి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement