bathing video
-
Viral Video: సబ్బు పెట్టి మరీ పాముకు స్నానం చేయించాడు
-
హైదరాబాద్: స్నానం చేస్తుండగా వీడియో తీసి..
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా ద్వారా ఓ మహిళను వేధిస్తున్న ఆకతాయిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి.. జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ ఎన్ రాము కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భూపాల్పల్లి కాటారం గ్రామానికి చెందిన దానం సాయి కృష్ణ ఇటీవల బంధువుల ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు హాజరయ్యాడు. అక్కడ తనకు మరదలి వరసయ్యే మహిళను చూసిన అతను ఆమెపై కోరిక పెంచుకున్నాడు. బాధితురాలు స్నానం చేస్తుండగా రహస్యంగా సెల్ఫోన్లో రికార్డ్ చేశాడు. అనంతరం సదరు వీడియో, ఫొటోలను బాధితురాలి వాట్సాప్‌కు పంపించాడు. తనతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడాలని లేకపోతే ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానని బ్లాక్మెయిల్ చేయసాగాడు. దీంతో బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు సాయికృష్ణను అరెస్ట్ చేశారు. అతడి నుంచి సెల్‌ఫోన్, సిమ్ కార్డ్‌ను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: విడాకులు తీసుకున్నారు.. మాట్లాడాలని భార్యని హోటల్‌కి పిలిచి.. -
మహిళ స్నానం చేస్తుండగా వీడియో.. 3 నెలలుగా అదే పనిలో ఓనర్ కొడుకు..
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లో మహిళ స్నానం చేస్తుండగా కేబుల్ టెక్నిషియన్ వీడియో తీసి అడ్డంగా దొరికిన ఘటనను మరవకుండానే నగరంలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌లోని మాగంటి కాలనీలో నివసించే ఓ మహిళ(35) బాత్రూమ్లో స్నానం చేస్తుండగా ఇంటి యజమాని కొడుకు దిలీప్ సెల్ఫోన్లో వీడియోలు తీస్తున్నట్లు గమనించింది. వెంటనే ఆమె తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. చదవండి: (నర్సుని బంధించి అత్యాచారం.. అదే రోజు బస్సెక్కించి..) ఇదే విషయాన్ని ఇంటి యజమాని దృష్టికి కూడా తీసుకెళ్లగా తమ కొడుకు అలాంటి వాడు కాదంటూ వారు వెనకేసుకొచ్చారు. దీంతో బాధితురాలు భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు దిలీప్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే గత మూడు నెలల నుంచి మహిళ బాత్రూమ్లో స్నానం చేస్తున్న దృశ్యాలు వీడియో తీస్తున్నట్లుగా నిందితుడు దర్యాప్తులో వెల్లడించాడు. చదవండి: (Banjarahills: మహిళ స్నానం చేస్తుండగా వీడియో.. కేబుల్ టెక్నిషియన్ నిర్వాకం) -
అయ్యో ఎంత పని: బాత్ వీడియో వైరల్, యువతి ఆత్మహత్య
భోపాల్: గోప్య, వ్యక్తి గతమైన సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్న టీనేజర్లకు ఈ సైట్స్ వినియోగం ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయో తెలిపే ఘటన ఇది. తెలిసో తెలియకో, సరదాకోసమో చేసే పిచ్చి పనులు ఒక్కోసారి ప్రాణాలు మీదికి తీసుకొస్తాయి. ఇలాంటి పొరపాటు పనే ఒక యువతి ప్రాణం తీసింది. తన కాబోయే భర్తకు తనకు సంబంధించిన వ్యక్తిగత వీడియోను పంపాలనుకుంది. కానీ కాస్తా వికటించి చివరికి ప్రాణాలే పోగొట్టుకుంది. మధ్యప్రదేశ్, ఉజ్జయిని పరిధిలోని తోబ్రిఖేడా గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. వివరాలను పరిశీలిస్తే.. తోబ్రిఖేడాకు చెందిన యువతికి 15 రోజుల క్రితం ఇండోర్‌కు చెందిన ఒక యువకుడితో నిశ్చితార్థం జరిగింది. కాబోయే భర్తతో సరదాగా ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఈ క్రమంలో ఏమైందో తెలియదుగానీ స్నానం చేస్తున్న వీడియోను భర్తకు పంపాలనుకుంది. అనుకున్నట్టుగా వీడియోను తీసుకుంది. కానీ ఇక్కడే దారుణం జరిగిపోయింది. వాట్సాప్ ద్వారా తన కాబోయే భర్తకు పంపాల్సిన వీడియోను, పొరపాటున తన మరో ఫ్రెండ్‌కి పంపేసింది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడానికి బదులుగా మిగిలిన వాట్సాప్ గ్రూపులో షేర్ చేశాడు. అంతే అది క్షణాల్లో వైరల్ అయింది. చివరికి ఈ విషయం బాధిత యువతి తల్లిదండ్రులకు, ఇతర కుటుంబ సభ్యులకు తెలియడంతో తీవ్రంగా మందలించారు. దీంతో జరిగిన పొరపాటును సరిదిద్దుకునే మార్గం తోచక, పరువు పోతుందనే భయంతో ఆమె విషం తాగేసింది. వెంటనే ఆమెను స్థానికంగా ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆ యువతి మరణించింది. దీంతో త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన తమ బిడ్డ శ్మశానానికి తరలి పోవడంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇప్పటివరకు ఈ విషయంలో పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. -
వైరల్ వీడియో: దీని నటనకు ఆస్కార్ ఇచ్చినా తక్కువే..
జంతువులు మనుషుల జీవితాల్లో భాగమైపోయాయి. చాలామంది పెంపుడు జంతువులను ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటారు. వాటికి ఏ లోటు రాకుండా ప్రేమగా పెంచుకుంటారు.. అయితే సెలబ్రిటీల నుంచి సాధారణ ప్రజల వరకు కుక్కలనే ఎక్కువగా పెంచుకోవడానికి ఆసక్తి చూపుతారు. శునకాలు, మనుషుల మధ్య సంబంధం ప్రత్యేకంగా ఉంటుంది. దాని సపర్యలన్ని వాళ్లే దగ్గరుండి చూస్తారు. వాటికి స్నానం చేయించడం మొదలు తినిపించడం వరకు ఎంతో ఇష్టంగా చేస్తుంటారు. అయితే అతి చనువు కారణంగా యాజమానులపై పెంపుడు కుక్కలు కొన్ని సార్లు మారం చేస్తుంటాయి. శునకాలు ఎంత విశ్వాసంగా ఉంటాయో నటించడంలోనూ అంతే ఆరితేరి ఉంటాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అదేంటంటే.. ఎంతో ప్రేమగా చూసుకుంటున్న ఓ కుక్క తన యాజమాని దగ్గర అద్భుత ప్లాన్ వేసింది. స్నానం నుంచి తప్పించుకునేందుకు తెలివిగా నటించింది. యాజమాని దాన్ని స్నానం చేయించడానికి ప్రయత్నించినప్పుడు కుక్క చనిపోయినట్లు పన్నాగం పన్నింది. దాన్ని లేపడానికి ఎంత ప్రయత్నించినా కుక్క ఉలుకు పలుకు లేకుండా నేలపై అలాగే పడుకొని ఉంది. ఇక చివరికి యజమాని.. కుక్క నోటి దగ్గర పట్టుకొని పైకి ఎత్తినప్పుడు దాని దొంగ తెలివి బయట పడింది. అయ్యో నా నాటకం తెలిసిపోయిందా అంటూ ఓర చూపుతో ఓ లుక్కిచ్చింది. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన నెటిజన్లు కుక్క తెలివితేటలను ప్రశంసిస్తున్నారు. నటించడంలో డాక్టరేట్ తీసుకుందని, యాక్టింగ్‌కు ఆస్కార్ ఇవ్వచ్చు అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. మరి దీన్ని మీరు చూడండి.. చదవండి: కుక్కకు ఉద్యోగం.. నెలకు 15 లక్షల జీతం! ఇలాంటి లడ్డు నెవర్ బిఫోర్ .. ఎవర్ ఆఫ్టర్! View this post on Instagram A post shared by Hera is live (@dgherraa) -
సహోద్యోగిని స్నానం చేస్తుండగా వీడియో తీసి..
సాక్షి, బెంగళూరు: సహ ఉద్యోగిని బాత్రూమ్లో స్నానం చేస్తున్న దృశ్యాలను వీడియో తీసి ప్రియుడికి అప్లోడ్ చేసిన నర్సును ఆదివారం వైట్‌ఫీల్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హాస్టల్ ఇన్చార్జ్ ఫిర్యాదు మేరకు పోలీసులు నర్సు అశ్వినినీ అరెస్ట్ చేశారు. ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు. వైట్‌ఫీల్డ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అశ్విని నర్సుగా పనిచేస్తోంది. అత్యవసర సేవల విభాగంలోని నర్సులకు హాస్టల్ వసతి కల్పించారు. ఈనెల 5న సాయంత్రం ఓ నర్సు తన గదిలో స్నానం చేస్తుండగా బాత్రూమ్లో మొబైల్ కనిపించడంతో భయపడిన సదరు నర్సు దాన్ని పరిశీలించగా వీడియో రికార్డు అయినట్లు గుర్తించి హాస్టల్ ఇన్చార్జ్కు ఫిర్యాదు చేసింది. ఫోన్ అశ్వినిది కావడంతో ఆమెను విచారించడంతో అసలు విషయం బయటపడింది. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: (దారుణం: మైనర్‌పై అత్యాచారం చేసిన ఏఎస్సై) (గుడికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు..) -
వైరల్: గున్న ఏనుగు చిలిపి స్నానం
జంతువులకు నీళ్లు కనిపిస్తే చాలు అందులోకి దూకి హాయిగా మునుగుతూ, తేలుతూ సేదతీరుతాయి. ఇక స్నానం చేయించే సమయంలో అయితే అవి మరింత ఉత్సాహంతో జలకాలాటలు ఆడుతాయి. తాజాగా ఓ గున్న ఏనుగు స్నానం చేసే సమయంలో వాటర్ టబ్‌లోకి దిగి జలకాలాటలు ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను సైమన్ బీఆర్ఎఫ్సీ హాప్కిన్స్ అనే ట్విటర్ ఖాతా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దానికి ‘ఏనుగు స్నానం చేసే సమయం’ అని కాప్షన్ కూడా జతచేసింది. చదవండి: (వైరల్: రెండు ఏనుగులు ప్రేమతో సరదాగా..) బురదలో తిరిగి వచ్చిన తల్లి ఏనుగు, గున్న ఏనుగుకు వాటి కీపర్ నీటి పైపుతో స్నానం చేయిస్తాడు. నీటి వైపుతో వాటిపై నీళ్లు పడుతున్న సమయంలో గున్న ఏనుగు అక్కడే ఉన్న ఒక నీటి తొట్టి దగ్గరకు వెళ్లి దానిలోకి దిగుతుంది. ఆ నీటిలో ఫన్నీగా మునుగుతూ, తేలుతూ ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం గున్న ఏనుగు చేసిన చిలిపి స్నానం వీడియోను సోషల్ మీడియాలో అధిక సంఖ్యలో నెటిజన్లు వీక్షిస్తూ లైక్ చేస్తున్నారు. చిన్న ఏనుగు బాత్ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘దీని కంటే ఏదైనా ఆహ్లాదం ఉంటుందా? అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. -
నగ్నచిత్రాల కేసులో ఇరుపక్షాల రాజీ!
తెనాలి రూరల్: తనతో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి తన కుమార్తె స్నానం చేస్తుండగా దొంగచాటుగా వీడియో చిత్రీకరించాడని పట్టణంలోని ఇందిరా కాలనీకి చెందిన మహిళ రూరల్ ఎస్పీకి స్పందన కార్యక్రమంలో సోమవారం ఫిర్యాదు చేసింది. కేసు తెనాలి త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు ఎస్పీ కార్యాలయం పంపగా, ఫిర్యాది, నిందితుడిని పోలీసు అధికారులు పిలిపించి మాట్లాడారు. ఇరు పక్షాలు రాజీ పడినట్టు తెలిసింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన ఓ మహిళ భర్త నుంచి విడాకులు తీసుకోకుండానే కూతురితో కలసి అప్పటికే వివాహమై పిల్లలు ఉన్న వ్యక్తితో 2009 నుంచి సహజీవనం చేస్తోంది. సదరు వ్యక్తి కూడా భార్య నుంచి విడాకులు పొందలేదు. మహిళ కుమార్తె, తన కుమార్తెను అతనే బీటెక్ చదివించాడు. ఇరువురు కుమార్తెల పెంపకం విషయంలో ఘర్షణలు జరుగుతున్నాయి. అప్పటి వరకు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివశించిన వీరు మూడేళ్ల క్రితం త్రీ టౌన్ పరిధిలోని ఇందిరా కాలనీకి వచ్చారు. ఇరువురి మధ్య వివాదం నడుస్తున్న క్రమంలో తన కుమార్తె స్నానం చేస్తుండగా వీడియోలు తీశాడంటూ మహిళ ఫిర్యాదు చేసింది. అయితే సీఐ బి.హరికృష్ణ ఇరువురినీ పిలిపించి మాట్లాడారు. ఇరు పక్షాలు రాజీ అయ్యాయని, కేసు ఉద్దేశపూర్వకంగానే పెట్టినట్టు భావిస్తున్నామని సీఐ వివరించారు. -
మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి..
కోల్‌కతా : మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన వ్యక్తిపై కఠిన చర్యలు చేపట్టాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా కలైచక్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహ్మద్ ఇమ్రాయుల్ కయేస్ అనే నిందితుడు తన పొరుగున ఉండే వివాహిత మహిళ ఇంట్లోని బాత్రూమ్లో రహస్య కెమెరాను ఏర్పాటు చేశాడు. బాధిత మహిళ స్నానం చేసే దృశ్యాలను ఈ కెమెరా రికార్డు చేయగా, సదరు దృశ్యాలను నిందితుడు ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ఘటన వెలుగుచూసింది. బాధిత మహిళ కలైచక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు నిందితుడిపై ఇంతవరకూ ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. మరోవైపు కేసు ఉపసంహరించుకోవాలని నిందితుడితో పాటు కుటుంబ సభ్యులు ఒత్తిడి తెస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. ఈ ఘటన జరగకముందు ఇరు కుటుంబాలు సన్నిహితంగా ఉండేవారని, ఈ చనువు కారణంగానే నిందితుడు బాధితురాలి వాష్‌రూమ్‌లో కెమెరా ఏర్పాటు చేశాడని పోలీసులు చెబుతున్నారు. -
పాపం లక్ష్మీ మీనన్!
మార్ఫింగ్ మాయాజాలం సినీతారలను వదలడం లేదు. ఆకతాయిల చేష్టలకు హీరోయిన్లు సిగ్గుతో చచ్చిపోతున్నారు. నిన్నమొన్నటి వరకు శాండల్‌వుడ్ గుమ్మలు రాయ్‌లక్ష్మీ, కావ్యామాధవన్, హన్సికాహసన్ తుంటరోళ్ల పనులకు ఇబ్బందులు పడ్డారు. చివరకు వారే స్వయంగా మీడియా ముందుకు వచ్చి అవి తమవి కావని స్టేట్మెంట్స్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాజాగా లక్ష్మీ మీనన్ కూడా ఆ బాధితురాళ్ల జాబితాలో చేరిపోయింది. మార్ఫింగ్ చేసిన లక్ష్మీ మీనన్ బాతింగ్ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మొబైల్ కెమెరాతో తీసిన ఈ వీడియోలో ఓ మహిళకు లక్ష్మి ముఖాన్ని అతికించి వాట్సాప్, ఫేస్‌బుక్‌ల్లో అప్లోడ్ చేశారని సమాచారం!