
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బెంగళూరు: సహ ఉద్యోగిని బాత్‌రూమ్‌లో స్నానం చేస్తున్న దృశ్యాలను వీడియో తీసి ప్రియుడికి అప్‌లోడ్ చేసిన నర్సును ఆదివారం వైట్‌ఫీల్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హాస్టల్ ఇన్‌చార్జ్ ఫిర్యాదు మేరకు పోలీసులు నర్సు అశ్వినినీ అరెస్ట్ చేశారు. ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు. వైట్‌ఫీల్డ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అశ్విని నర్సుగా పనిచేస్తోంది.
అత్యవసర సేవల విభాగంలోని నర్సులకు హాస్టల్ వసతి కల్పించారు. ఈనెల 5న సాయంత్రం ఓ నర్సు తన గదిలో స్నానం చేస్తుండగా బాత్‌రూమ్‌లో మొబైల్ కనిపించడంతో భయపడిన సదరు నర్సు దాన్ని పరిశీలించగా వీడియో రికార్డు అయినట్లు గుర్తించి హాస్టల్ ఇన్‌చార్జ్‌కు ఫిర్యాదు చేసింది. ఫోన్ అశ్వినిది కావడంతో ఆమెను విచారించడంతో అసలు విషయం బయటపడింది. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: (దారుణం: మైనర్‌పై అత్యాచారం చేసిన ఏఎస్సై)
Comments
Please login to add a commentAdd a comment