
కోల్‌కతా : మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన వ్యక్తిపై కఠిన చర్యలు చేపట్టాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా కలైచక్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహ్మద్ ఇమ్రాయుల్ కయేస్ అనే నిందితుడు తన పొరుగున ఉండే వివాహిత మహిళ ఇంట్లోని బాత్‌రూమ్‌లో రహస్య కెమెరాను ఏర్పాటు చేశాడు.
బాధిత మహిళ స్నానం చేసే దృశ్యాలను ఈ కెమెరా రికార్డు చేయగా, సదరు దృశ్యాలను నిందితుడు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో ఘటన వెలుగుచూసింది. బాధిత మహిళ కలైచక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు నిందితుడిపై ఇంతవరకూ ఎలాంటి చర్యలూ చేపట్టలేదు.
మరోవైపు కేసు ఉపసంహరించుకోవాలని నిందితుడితో పాటు కుటుంబ సభ్యులు ఒత్తిడి తెస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. ఈ ఘటన జరగకముందు ఇరు కుటుంబాలు సన్నిహితంగా ఉండేవారని, ఈ చనువు కారణంగానే నిందితుడు బాధితురాలి వాష్‌రూమ్‌లో కెమెరా ఏర్పాటు చేశాడని పోలీసులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment