Malda district
-
మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి..
కోల్‌కతా : మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన వ్యక్తిపై కఠిన చర్యలు చేపట్టాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా కలైచక్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహ్మద్ ఇమ్రాయుల్ కయేస్ అనే నిందితుడు తన పొరుగున ఉండే వివాహిత మహిళ ఇంట్లోని బాత్రూమ్లో రహస్య కెమెరాను ఏర్పాటు చేశాడు. బాధిత మహిళ స్నానం చేసే దృశ్యాలను ఈ కెమెరా రికార్డు చేయగా, సదరు దృశ్యాలను నిందితుడు ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ఘటన వెలుగుచూసింది. బాధిత మహిళ కలైచక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు నిందితుడిపై ఇంతవరకూ ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. మరోవైపు కేసు ఉపసంహరించుకోవాలని నిందితుడితో పాటు కుటుంబ సభ్యులు ఒత్తిడి తెస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. ఈ ఘటన జరగకముందు ఇరు కుటుంబాలు సన్నిహితంగా ఉండేవారని, ఈ చనువు కారణంగానే నిందితుడు బాధితురాలి వాష్‌రూమ్‌లో కెమెరా ఏర్పాటు చేశాడని పోలీసులు చెబుతున్నారు. -
సమాధానాలు చెప్పలేదని ముస్లిం యువకుడిపై..
కోల్‌కతా : అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదని రైలులో ప్రయాణిస్తున్న ముస్లిం యువకుడిపై తోటి ప్రయాణికులు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో చోటుచేసుకుంది. మాల్దా జిల్లాకు చెందిన ఓ ముస్లిం యువకుడు హౌరాలో వలస కార్మికుడిగా పని చేస్తున్నాడు. అతడు మే14వ తేదిన హౌరా నుంచి ఇంటికి వెళ్లడానికి రైలు ఎక్కాడు. కొద్ది సేపటి తర్వాత అతని సీటు పక్కన కూర్చున్న నలుగురు వ్యక్తులు అతన్ని ప్రశ్నలు అడగటం ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోది, జాతీయగీతం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీల గురించిన ప్రశ్నలు అతన్ని అడిగారు. ఇందులో ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేదన్న కోపంతో అతనిపై చేయి చేసుకున్నారు. అనంతరం ఆ నలుగురు బండేల్ రైల్వే స్టేషన్లో దిగిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఎన్జీవో ‘‘బంగ్ల సంసృ్కతి మంచ’’ నిందితులపై కాలియాచక్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. -
'లిచీ' తో ఏడుగురు చిన్నారులు మృతి
'లిచీ సిండ్రోమ్' వైరల్ ఇన్పెక్షన్ కారణం పశ్చిమ బెంగాల్ మాల్దా జిల్లాలో ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారని ఉన్నతాధికారులు శనివారం కొల్‌కత్తాలో వెల్లడించారు. మంగళవారం ఉదయం నుంచి నేటి వరకు మరణించిన ఆ మృతులంతా 2 నుంచి 4 సంవత్సరాల వయస్సులోపు చిన్నారులేనని తెలిపారు. 'లిచీ సిండ్రోమ్' అత్యంత అరుదైన వైరన్ వైరల్ ఇన్పెక్షన్ అని మాల్దా మెడికల్ కాలేజి, ఆసుపత్రి ఉపాధ్యక్షుడు ఎం.ఏ. రషీద్ వెల్లడించారు. లిచీ పళ్ల నుంచి ఇది వ్యాపిస్తుందని.. ఆ వ్యాధి సోకిన వారి మెదడు వాస్తుందని ఆయన వివరించారు. అయితే 2012లో ఈ సిండ్రోమ్ రాష్ట్రంలో ఒక్కసారి కనిపించిందని ఆయన గుర్తు చేశారు. ఈ సిండ్రోమ్ మొట్టమొదటగా చైనాలో కనుగొన్నారని విశదీకరించారు. అప్పడప్పుడు భారత్‌లో కనిపిస్తుందని చెప్పారు. మరి ముఖ్యంగా ఉత్తర భారతంలో కనిపిస్తుందని చెప్పారు. చిన్నారులకు జ్వరం, వాంతులు వస్తే వెంటనే గుర్తించి సమీపంలోని ఆసుపత్రికి తరలించాలని చిన్నారుల తల్లిదండ్రులకు సూచించారు. ఆ వైరల్ ఇన్పెక్షన్ చిన్నారులకు సోకుతుందని.. అలా సోకిన 5 నుంచి 6 గంటలోపు చిన్నారులు మరణిస్తారని చెప్పారు. చిన్నారులు మృతి చెందిన నేపథ్యంలో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, కొల్‌కత్తాలోని స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ సంస్థలకు చెందిన ప్రత్యేక బృందం ఈ రోజు మాల్దా జిల్లాలో పర్యటిస్తుందని ఎం.ఏ రషీద్ వెల్లడించారు.