బాధితుడు
కోల్‌కతా : అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదని రైలులో ప్రయాణిస్తున్న ముస్లిం యువకుడిపై తోటి ప్రయాణికులు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో చోటుచేసుకుంది. మాల్దా జిల్లాకు చెందిన ఓ ముస్లిం యువకుడు హౌరాలో వలస కార్మికుడిగా పని చేస్తున్నాడు. అతడు మే14వ తేదిన హౌరా నుంచి ఇంటికి వెళ్లడానికి రైలు ఎక్కాడు. కొద్ది సేపటి తర్వాత అతని సీటు పక్కన కూర్చున్న నలుగురు వ్యక్తులు అతన్ని ప్రశ్నలు అడగటం ప్రారంభించారు.
ప్రధాని నరేంద్ర మోది, జాతీయగీతం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీల గురించిన ప్రశ్నలు అతన్ని అడిగారు. ఇందులో ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేదన్న కోపంతో అతనిపై చేయి చేసుకున్నారు. అనంతరం ఆ నలుగురు బండేల్ రైల్వే స్టేషన్‌లో దిగిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఎన్జీవో ‘‘బంగ్ల సంసృ‍్కతి మంచ’’ నిందితులపై కాలియాచక్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment