రైల్లో నుంచి పడి యువకుడి మృతి
Published Sat, Aug 20 2016 12:22 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
కేసముద్రం : రైలులో నుంచి పడి గుర్తుతెలి యని యువకుడు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని రైల్వేస్టేçÙన్ సమీపంలో శుక్రవారం జరిగింది. జీఆర్‌పీ పోలీసుల కథ నం ప్రకారం.. సికింద్రాబాద్ నుంచి విజయవాడ వైపునకు డౌన్‌లైన్‌లో వెళ్లే రైల్లో ప్రయాణిస్తున్న 25 సంవత్సరాల యువకుడు డోర్ వద్ద కాలుజారడంతో కిందపడి అక్కడికక్కడే మృ తిచెందాడు. ఉదయం అటుగా వెళ్లిన రైల్వే సిబ్బంది జీఆర్‌పీ పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని వరంగల్ ఎం జీఎంకు తరలించారు. మృతుడు బ్రౌన్‌కలర్ టీషర్టు, బ్లూ కలర్ పాయింట్ ధరించాడని, కుడిచేయిపై పుట్టుమచ్చ ఉందని పోలీసులు తెలిపారు. మృతుడి వద్ద గజియాబాద్ నుంచి చెన్నైకి వెళ్లే టికెట్ ఉన్నట్లు గుర్తించారు.
గుండ్రాతిమడుగులో మరొకరు
డోర్నకల్ : గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి గుర్తు తెలి యని వ్యక్తి మృతి చెందాడు. డోర్నకల్ జీఆర్‌పీ ఎస్‌ఐ పెండ్యాల దేవేందర్ కథనం ప్రకారం.. గుండ్రాతిమడుగు రైల్వేస్టేçÙన్ సమీపంలో గురువారం రాత్రి కిలోమీటర్ నెంబర్ 445/1–5 వద్ద గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. మృతదేహం పూర్తిగా ఛిద్రమైందని, మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని ఎస్సై తెలి పారు. మృతదేహాన్ని మహబూబాబాద్ ఏరి యా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించామని, హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
Advertisement
Advertisement