'లిచీ' తో ఏడుగురు చిన్నారులు మృతి | Seven children die of viral infection in Bengal | Sakshi
Sakshi News home page

'లిచీ' తో ఏడుగురు చిన్నారులు మృతి

Published Sat, Jun 7 2014 1:17 PM | Last Updated on Sat, Sep 2 2017 8:27 AM

'లిచీ' తో ఏడుగురు చిన్నారులు మృతి

'లిచీ' తో ఏడుగురు చిన్నారులు మృతి

'లిచీ సిండ్రోమ్' వైరల్ ఇన్పెక్షన్ కారణం పశ్చిమ బెంగాల్ మాల్దా జిల్లాలో ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారని ఉన్నతాధికారులు శనివారం కొల్కత్తాలో వెల్లడించారు. మంగళవారం ఉదయం నుంచి నేటి వరకు మరణించిన ఆ మృతులంతా 2 నుంచి 4 సంవత్సరాల వయస్సులోపు చిన్నారులేనని తెలిపారు. 'లిచీ సిండ్రోమ్' అత్యంత అరుదైన వైరన్ వైరల్ ఇన్పెక్షన్ అని మాల్దా మెడికల్ కాలేజి, ఆసుపత్రి ఉపాధ్యక్షుడు ఎం.ఏ. రషీద్ వెల్లడించారు. లిచీ పళ్ల నుంచి ఇది వ్యాపిస్తుందని.. ఆ వ్యాధి సోకిన వారి మెదడు వాస్తుందని ఆయన వివరించారు. అయితే 2012లో ఈ సిండ్రోమ్ రాష్ట్రంలో ఒక్కసారి కనిపించిందని ఆయన గుర్తు చేశారు.

 

ఈ సిండ్రోమ్ మొట్టమొదటగా చైనాలో కనుగొన్నారని విశదీకరించారు. అప్పడప్పుడు భారత్లో కనిపిస్తుందని చెప్పారు. మరి ముఖ్యంగా ఉత్తర భారతంలో కనిపిస్తుందని చెప్పారు. చిన్నారులకు జ్వరం, వాంతులు వస్తే వెంటనే గుర్తించి సమీపంలోని ఆసుపత్రికి తరలించాలని చిన్నారుల తల్లిదండ్రులకు సూచించారు. ఆ వైరల్ ఇన్పెక్షన్ చిన్నారులకు సోకుతుందని.. అలా సోకిన 5 నుంచి 6 గంటలోపు చిన్నారులు మరణిస్తారని చెప్పారు. చిన్నారులు మృతి చెందిన నేపథ్యంలో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, కొల్కత్తాలోని స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ సంస్థలకు చెందిన ప్రత్యేక బృందం  ఈ రోజు మాల్దా జిల్లాలో పర్యటిస్తుందని ఎం.ఏ రషీద్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement