Malda Medical College and Hospital
-
మాల్దాలో 11 మంది శిశువులు మృతి
కోల్కతా: పశ్చిమ బెంగాల్ లోని మాల్దా జిల్లాలో గత మూడు రోజుల్లో 11 మంది శిశువులు మృతి చెందారు. మాల్దా ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో మూడు రోజుల్లో 11 మంది శిశువులు ప్రాణాలు కోల్పోయారు. బరువు తక్కువగా ఉండడం, శ్వాసకోస సంబంధ సమస్యలే శిశువుల మరణానికి కారణమని ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎంఏ రషీద్ తెలిపారు. మాల్దా జిల్లాలో శిశువుల మరణాలు సాధారణంగా మారాయి. మెదడువాపుతో జూలైలో 12 మంది, జూన్ లో 9 మంది శిశువులు మరణించారు. -
'లిచీ' తో ఏడుగురు చిన్నారులు మృతి
'లిచీ సిండ్రోమ్' వైరల్ ఇన్పెక్షన్ కారణం పశ్చిమ బెంగాల్ మాల్దా జిల్లాలో ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారని ఉన్నతాధికారులు శనివారం కొల్కత్తాలో వెల్లడించారు. మంగళవారం ఉదయం నుంచి నేటి వరకు మరణించిన ఆ మృతులంతా 2 నుంచి 4 సంవత్సరాల వయస్సులోపు చిన్నారులేనని తెలిపారు. 'లిచీ సిండ్రోమ్' అత్యంత అరుదైన వైరన్ వైరల్ ఇన్పెక్షన్ అని మాల్దా మెడికల్ కాలేజి, ఆసుపత్రి ఉపాధ్యక్షుడు ఎం.ఏ. రషీద్ వెల్లడించారు. లిచీ పళ్ల నుంచి ఇది వ్యాపిస్తుందని.. ఆ వ్యాధి సోకిన వారి మెదడు వాస్తుందని ఆయన వివరించారు. అయితే 2012లో ఈ సిండ్రోమ్ రాష్ట్రంలో ఒక్కసారి కనిపించిందని ఆయన గుర్తు చేశారు. ఈ సిండ్రోమ్ మొట్టమొదటగా చైనాలో కనుగొన్నారని విశదీకరించారు. అప్పడప్పుడు భారత్లో కనిపిస్తుందని చెప్పారు. మరి ముఖ్యంగా ఉత్తర భారతంలో కనిపిస్తుందని చెప్పారు. చిన్నారులకు జ్వరం, వాంతులు వస్తే వెంటనే గుర్తించి సమీపంలోని ఆసుపత్రికి తరలించాలని చిన్నారుల తల్లిదండ్రులకు సూచించారు. ఆ వైరల్ ఇన్పెక్షన్ చిన్నారులకు సోకుతుందని.. అలా సోకిన 5 నుంచి 6 గంటలోపు చిన్నారులు మరణిస్తారని చెప్పారు. చిన్నారులు మృతి చెందిన నేపథ్యంలో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, కొల్కత్తాలోని స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ సంస్థలకు చెందిన ప్రత్యేక బృందం ఈ రోజు మాల్దా జిల్లాలో పర్యటిస్తుందని ఎం.ఏ రషీద్ వెల్లడించారు.