Viral infection
-
ఆస్ట్రేలియాతో మ్యాచ్.. పాకిస్తాన్ ఆటగాళ్లకు వైరల్ ఫీవర్!
వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా చేతిలో ఘోర ఓటమిపాలైన పాకిస్తాన్.. మరో కీలక పోరుకు సిద్దమవుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా అక్టోబర్ 20న బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో పాక్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే బెంగళూరుకు పాక్ జట్టు చేరుకుంది. అయితే ఆదివారం బెంగళూరుకు చేరుకున్న పాక్ జట్టు ఇప్పటివరకు ప్రాక్టీస్ సెషన్స్‌లో మాత్రం పాల్గోనలేదు. ఎందుకంటే పాక్ జట్టులో నలుగురు, ఐదుగురు ఆటగాళ్లు వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. వారిలో షాహీన్ అఫ్రిది, అబ్దుల్లా షఫీక్, జమాన్ ఖాన్, ఉసామా మీర్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ముందు జాగ్రత్తగా వీరికి వైద్య సిబ్బంది కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్‌గా తేలింది. అయితే ఆసీస్‌తో మ్యాచ్ సమయానికి వీరు కోలుకుంటారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కాగా షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ జట్టు చిన్నస్వామి స్టేడియంలో తమ తొలి ప్రాక్టీస్ పాల్గొనవలసింది. కానీ ఆటగాళ్లు అనారోగ్యంతో బాధపడుతున్నందన ప్రాక్టీస్ సెషన్స్‌ను సపోర్ట్ స్టాప్ నిర్వహించలేదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ నాలుగో స్ధానంలో కొనసాగుతోంది. చదవండి: OTD: లారా రికార్డు బద్దలు కొట్టిన సచిన్.. టెస్టు క్రికెట్ చరిత్రలోనే..! వీడియో చూశారా -
తెలంగాణపై ఆర్ఎస్వీ పంజా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్కు సంబంధించిన రెస్పిరేటరీ సింకీషియల్ వైరస్ (ఆర్ఎస్వీ) కేసులు పెరుగుతున్నాయి. చిన్న పిల్లల ఆసుపత్రులు, ఇతర సాధారణ ఆసుపత్రుల్లోనూ ఇలాంటి కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం నమోదవుతున్న శ్వాసకోశ వ్యాధుల్లో ఆర్ఎస్వీ ఒక ప్రధాన కారణంగా ఉంటోంది. చిన్న పిల్లల్లో ఎక్కువగా ఈ కేసులు నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా రెండు వారా లుగా వైరల్ న్యుమోనియా కేసులు పెరుగుతున్నా యి. జలుబు కాస్తా న్యుమోనియాగా దారితీస్తుంది. దమ్ము కూడా వస్తుంది. 5 ఏళ్లలోపు... 60 ఏళ్లు పైబడిన లేదా దీర్ఘకాలిక జబ్బులున్న వారిపై దీని ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. ఇతర వయసువారిపైనా ప్రతాపం చూపిస్తోంది. జ్వరం, జలుబు, కఫంతో కూడిన తీవ్రమైన దగ్గు, నిమ్ము, బలహీనత రెండు వారాల వరకు ఉంటుంది. చిన్న పిల్లల్లో ఐసీయూకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. దగ్గు వచ్చిన మొదట్లోనే అప్రమత్తం కావాలని, చిన్నపిల్లలు మూడు నాలుగు రోజుల తర్వాత అది నిమ్ము దశకు చేరుకుంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఆర్‌ఎస్‌వీలో ఏ, బీ అనే రెండు రకాలున్నాయి. ఇప్పటివరకు ఇండియా 587 ఏ రకం వైరస్, 344 బీ రకం వైరస్‌లను ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషించింది. ఏడాదికి సగటున దేశంలో 3.31 కోట్ల చిన్నారులపై వైరస్ పంజా... ప్రతీ ఏడాది భారత్‌లో సగటున 3.31 కోట్ల మంది చిన్నారులు ఆర్ఎస్వీ బారిన పడుతున్నారు. వారిలో 10 శాతం మంది ఆసుపత్రుల పాలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఏడాదికి ఈ వైరస్ వల్ల దేశంలో 59,600 మంది చనిపోతున్నారు. రెండేళ్లు నిండిన ప్రతి చిన్నారి ఒక్కసారైనా ఈ వైరస్ బారినపడతారు. ఈ సంవత్సరం దాని ప్రభావం మరింత పెరిగింది. ఐదు వారాల క్రితం వరకు ఈ వైరస్ పాజిటివిటీ రేటు 5 శాతంలోపుగా ఉంటే, ప్రస్తుతం 10 శాతంగా ఉందని కేంద్రం తెలిపింది. ఐసీఎంఆర్ డ్యాష్‌బోర్డ్ ప్రకారం వైరల్ కేసుల్లో 15 శాతం ఆర్ఎస్వీ కేసులే. -
వైరల్ ఇన్ఫెక్షన్ భారిన పడిన వైద్య కళాశాల విద్యార్థులు
-
కరోనాకు ‘క్యూర్’ ఉందన్న శాస్త్రవేత్తలు
న్యూయార్క్ : మానవ శరీర జన్యువుల్లోకి ప్రాణాంతక కరోనా వైరస్‌ను ప్రవేశించకుండా అడ్డుకునే యాంటీ బాడీస్ మందును కనుగొన్నామని అమెరికా, శాండియాగో నగరంలోని సొరెంటో థెరాప్యూటిక్స్ బయోటెక్ కంపెనీ ప్రకటించింది. ఈ మందు ఉత్పత్తికి అనుమతి ఇవ్వాల్సిందిగా అమెరికా ‘ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ’కి దరఖాస్తు చేసుకున్నామని, అనుమతి రాగానే నెలకు రెండు లక్షల డోసుల చొప్పున ఉత్పత్తి చేయగలమని కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. మానవ శరీర జన్యువుల్లో కరోనా వైరస్ ప్రవేశించకుండా తాము కనిపెట్టిన మందు నూటికి నూరుపాళ్లు అడ్డుకుంటుంది కనుక ఆ మందుకు ‘క్యూర్’ అని పేరు పెట్టామని, ‘కోవిడ్–19’కు వ్యాక్సిన్ కనుగొనే వరకు తాము కనిపెట్టిన మందును వాడి కరోనా వైరస్‌ను నియంత్రించవచ్చని వారు చెప్పారు. (కరోనా విజృంభణ: ఆరోగ్యశాఖ మంత్రి రాజీనామా) తాము న్యూయార్క్‌లోని ఎంటీ సినాయ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సహకారంతో కరోనా వైరస్‌పై పలు యాంటీ బాడీస్‌ను పరీక్షిస్తూ వచ్చామని, ‘ఎస్టీఐ–1499’ యాంటీ బాడీస్‌తో తమ పరీక్ష విజయవంతమైందని శాస్త్రవేత్తలు వివరించారు. నూటికి నూరు పాళ్లు కరోనాకు మందుందని, ల్యాబ్‌లో మానవ సెల్స్‌పై యాంటీ బాడీస్‌తో నిర్వహించిన పరీక్షలు మంచి ఫలితాలు ఇచ్చాయని, మానవ ట్రయల్స్ మాత్రం ఇంకా జరపలేదని కంపెనీ సీఈవో డాక్టర్ హెన్రీ జీ తెలిపారు. అనుమతి కోసం ‘అత్యవసర కేటగిరి’ కింద దరఖాస్తు చేశామని, అప్పుడు నేరుగానే హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించవచ్చని ఆయన చెప్పారు. (ట్రంప్: డబ్ల్యూహెచ్ఓకు నిధుల కోత?) -
'లిచీ' తో ఏడుగురు చిన్నారులు మృతి
'లిచీ సిండ్రోమ్' వైరల్ ఇన్పెక్షన్ కారణం పశ్చిమ బెంగాల్ మాల్దా జిల్లాలో ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారని ఉన్నతాధికారులు శనివారం కొల్‌కత్తాలో వెల్లడించారు. మంగళవారం ఉదయం నుంచి నేటి వరకు మరణించిన ఆ మృతులంతా 2 నుంచి 4 సంవత్సరాల వయస్సులోపు చిన్నారులేనని తెలిపారు. 'లిచీ సిండ్రోమ్' అత్యంత అరుదైన వైరన్ వైరల్ ఇన్పెక్షన్ అని మాల్దా మెడికల్ కాలేజి, ఆసుపత్రి ఉపాధ్యక్షుడు ఎం.ఏ. రషీద్ వెల్లడించారు. లిచీ పళ్ల నుంచి ఇది వ్యాపిస్తుందని.. ఆ వ్యాధి సోకిన వారి మెదడు వాస్తుందని ఆయన వివరించారు. అయితే 2012లో ఈ సిండ్రోమ్ రాష్ట్రంలో ఒక్కసారి కనిపించిందని ఆయన గుర్తు చేశారు. ఈ సిండ్రోమ్ మొట్టమొదటగా చైనాలో కనుగొన్నారని విశదీకరించారు. అప్పడప్పుడు భారత్‌లో కనిపిస్తుందని చెప్పారు. మరి ముఖ్యంగా ఉత్తర భారతంలో కనిపిస్తుందని చెప్పారు. చిన్నారులకు జ్వరం, వాంతులు వస్తే వెంటనే గుర్తించి సమీపంలోని ఆసుపత్రికి తరలించాలని చిన్నారుల తల్లిదండ్రులకు సూచించారు. ఆ వైరల్ ఇన్పెక్షన్ చిన్నారులకు సోకుతుందని.. అలా సోకిన 5 నుంచి 6 గంటలోపు చిన్నారులు మరణిస్తారని చెప్పారు. చిన్నారులు మృతి చెందిన నేపథ్యంలో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, కొల్‌కత్తాలోని స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ సంస్థలకు చెందిన ప్రత్యేక బృందం ఈ రోజు మాల్దా జిల్లాలో పర్యటిస్తుందని ఎం.ఏ రషీద్ వెల్లడించారు. -
ఇది అవగాహన పెంచే మాసం
మీకు తెలుసా? అమెరికాలో మే నెలను ‘హెపటైటిస్ అవేర్నెస్ మంత్’గా వ్యవహరిస్తారు. హెపటైటిస్‌కు సంబంధించి పరీక్షలు, చికిత్స చేయించుకోవడం మీద ప్రత్యేకంగా దృష్టి పెడతారు. కాలేయం వాపుకు లోనవడాన్ని హెపటైటిస్గా వ్యవహరిస్తారు. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా కాలేయం రోగగ్రస్థం కావడం అన్నమాట. ఇందులో ‘ఎ,బి,సి, డి, ఇ’ అనే రకాలుంటాయి. వైరస్‌ను బట్టి లక్షణాలు కొద్దిగా మారుతాయి, దానిని బట్టే పేరు కూడా మారుతుంది. సాధారణంగా హెపటైటిస్ ‘ఎ,బి,సి’లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వైరస్ కారణంగా కాలేయం వాపుకు లోనవడం అనేది దీర్ఘకాలంలో కాలేయ క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉంది. అందుకే సామాన్యులను చైతన్యవంతం చేయడానికి అమెరికా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ సుమారుగా యాభై లక్షల మంది అమెరికావాసులు హెపటైటిస్‌తో బాధపడుతున్నారు. అయితే వారిలో చాలామంది తాము ఆ వ్యాధి బారిన పడ్డట్టు కూడా తెలియకనే జీవనాన్ని కొనసాగిస్తున్నారు. -
చికెన్‌పాక్స్ ఉన్న స్టూడెంట్‌తో మాట్లాడాను... నాకు సోకుతుందా?
నా వయసు 25. ఇప్పుడు నేను ఐదోనెల గర్భిణిని. టీచర్‌గా పనిచేస్తున్నాను. మా క్లాస్‌లో ఒక అబ్బాయికి చికెన్‌పాక్స్ (ఆటలమ్మ) సోకింది. తగ్గేవరకు స్కూల్‌కు రావద్దని చెప్పినా... కాసేపు అతడితో మాట్లాడాల్సి వచ్చింది. అప్పట్నుంచి చికెన్‌పాక్స్ నాకు కూడా అంటుకుంటుందేమోమోనని ఆందోళనగా ఉంది. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వగలరు. - సునందిని, హైదరాబాద్ చికెన్‌పాక్స్ అనే వైరల్ ఇన్ఫెక్షన్ వెరిస్టెల్లా హెర్పిస్ జోస్టర్ అనే వైరస్ వల్ల సోకుతుంది. చిన్నపిల్లల్లో ఇది చాలా సహజం. చిన్నప్పుడు దీని తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. కానీ పెద్దల్లో వస్తే మాత్రం దీని తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. చికెన్‌పాక్స్ వచ్చిన వారితో మాట్లాడుతున్నప్పుడు వారు శ్వాసతీసుకునే సమయంలో వెలువడే తుంపర్ల వల్ల ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించవచ్చు. సాధారణంగా ఐదు నిమిషాల పాటు ఒకరితో ఒకరు మాట్లాడటం వల్ల గాని, 15 నిమిషాల పాటు చికెన్‌పాక్స్ ఉన్నవారితో ఒకే గదిలో ఉండటం వల్ల గాని ఇది సోకే అవకాశాలు ఉంటాయి. నిజానికి మీరు చికెన్‌పాక్స్ వచ్చిన పిల్లాడితో కాసేపు మాట్లాడారు. అయితే చికెన్‌పాక్స్ వచ్చిన రెండు లేదా మూడోరోజుకుగాని అవి శరీరంపై పొక్కుల (బ్లిస్టర్స్) రూపంలో బయటపడవు. కానీ అది సోకినవారిలో శరీరంపై పొక్కులు రావడానికి రెండు రోజుల ముందునుంచే వారు దీన్ని మరొకరికి వ్యాప్తి చేయగల స్థితిలో ఉంటారు. అందుకే మనకు తెలియకుండానే దీనికి ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువే. చికెన్‌పాక్స్ సోకగానే మొదట జ్వరం, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత రెండు రోజులకు అవి తగ్గాక గానీ శరీరంపై చికెన్‌పాక్స్ పొక్కులు కనిపించవు. శరీరంపై పొక్కులు వచ్చాక అది మరింత వేగంగా వ్యాప్తిచెందడానికి అవకాశం ఎక్కువ. సాధారణంగా చికెన్‌పాక్స్ అన్నది రెండు వారాల తర్వాత దానంతట అదే తగ్గిపోతుంది. అయితే ఆ వైరస్ వారి నరాల చివర్లో నిద్రాణంగా ఉండిపోతుంది. ఆ తర్వాత వారు ఎప్పుడైనా బలహీనపడ్డా లేదా వారిలో వ్యాధినిరోధకశక్తి క్షీణించినా అది బయటపడుతుంది. ఇలా రెండోసారి పునరావృతమయ్యే చికెన్‌పాక్స్‌ను షింగిల్స్ అంటారు. షింగిల్స్లో చికెన్‌పాక్స్‌తో పోలిస్తే మరి కాస్త తీవ్రత ఎక్కువ. నిజానికి చిన్నప్పుడే చికెన్‌పాక్స్ సోకిన వారు మళ్లీ ఆ వ్యాధిగ్రస్తులతో ఎంత సన్నిహితంగా గడిపినా వారికి చికెన్‌పాక్స్ సోకదు. కాకపోతే అది చిన్నప్పుడు వచ్చిందో, రాలేదో తెలియదు కాబట్టి... గతంలో అది వచ్చి ఉందా అని నిర్ధారణ చేయడానికి ఒక రక్తపరీక్ష చేస్తారు. దానికి సంబంధించిన యాంటీబాడీస్ సహాయంతో అది గతంలో వచ్చిందా రాలేదా అన్న విషయం తెలుస్తుంది. చిన్నప్పుడే ఆ వ్యాధి వచ్చి ఉన్నవారు ఇకపై దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఒకసారి వస్తే ఇక జీవితకాలం ఇమ్యూనిటీని ఇస్తుంది. అయితే ఒకవేళ రాకపోతే వారికి వారిస్టెల్లా జోస్టర్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ అనే ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇది ప్యాసివ్ ఇమ్యూనైజేషన్ అన్నమాట. ఈ ఇంజెక్షన్ కూడా చికెన్‌పాక్స్ ఉన్నవారికి ఎక్స్పోజ్ అయిన నాటి నుంచి 10 రోజుల లోపు ఇవ్వాలి. చికెన్‌పాక్స్‌కు యాక్టివ్ ఇమ్యూనైజేషన్గానూ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అయితే అది గర్భవతులకు ఇవ్వడానికి వీలుకాదు. కాకపోతే గర్భం రాకముందు మాత్రం తీసుకోవచ్చు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఒకసారి మీరు మీ డాక్టర్‌ను సంప్రదించండి. డాక్టర్ సుశీల వావిలాల, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్