ఆస్ట్రేలియాతో మ్యాచ్‌.. పాకిస్తాన్‌ ఆటగాళ్లకు వైరల్‌ ఫీవర్‌! | Pakistan camp hit by viral infection ahead of crucial Australia clash | Sakshi
Sakshi News home page

WC 2023: ఆస్ట్రేలియాతో మ్యాచ్‌.. పాకిస్తాన్‌ ఆటగాళ్లకు వైరల్‌ ఫీవర్‌!

Published Tue, Oct 17 2023 5:25 PM | Last Updated on Tue, Oct 17 2023 6:38 PM

Pakistan camp hit by viral infection ahead of crucial Australia clash - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా చేతిలో ఘోర ఓటమిపాలైన పాకిస్తాన్‌.. మరో కీలక పోరుకు సిద్దమవుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా అక్టోబర్‌ 20న బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో పాక్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే బెంగళూరుకు పాక్‌ జట్టు చేరుకుంది. అయితే ఆదివారం బెంగళూరుకు చేరుకున్న పాక్‌ జట్టు ఇప్పటివరకు ప్రాక్టీస్‌ సెషన్స్‌లో మాత్రం పాల్గోనలేదు. 

ఎందుకంటే పాక్‌ జట్టులో నలుగురు, ఐదుగురు ఆటగాళ్లు వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారు. వారిలో  షాహీన్ అఫ్రిది, అబ్దుల్లా షఫీక్, జమాన్ ఖాన్, ఉసామా మీర్ వంటి స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు. ముందు జాగ్రత్తగా వీరికి వైద్య సిబ్బంది కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్‌గా తేలింది.

అయితే ఆసీస్‌తో మ్యాచ్‌ సమయానికి వీరు కోలుకుంటారని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. కాగా షెడ్యూల్‌ ప్రకారం పాకిస్తాన్‌ జట్టు చిన్నస్వామి స్టేడియంలో తమ తొలి ప్రాక్టీస్‌ పాల్గొనవలసింది. కానీ ఆటగాళ్లు అనారోగ్యంతో బాధపడుతున్నందన ప్రాక్టీస్‌ సెషన్స్‌ను సపోర్ట్‌ స్టాప్‌ నిర్వహించలేదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాకిస్తాన్‌ నాలుగో స్ధానంలో కొనసాగుతోంది.
చదవండి: OTD: లారా రికార్డు బద్దలు కొట్టిన సచిన్‌.. టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే..! వీడియో చూశారా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement