పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చేరిగారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా పాక్ బౌలర్ల దాటికి 31.5 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. షాహీన్ షా అఫ్రిది, నసీం షా తలా మూడు వికెట్లతో కంగారుల పతనాన్ని శాసించగా, హారిస్ రౌఫ్ రెండు, హస్నన్ ఒక వికెట్ సాధించారు.
ఆసీస్ బ్యాటర్లలో ఆల్‌రౌండర్ సీన్ అబాట్(30) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌కు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌తో పాటు రెగ్యూలర్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్ వుడ్ అందుబాటులో లేరు.
వీరిందరూ భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు ఎంపికైన నేపథ్యంలో ఎటువంటి గాయాల బారిన పడకుండా ఉండడానికి ఈ ఆఖరి వన్డేకు దూరమయ్యారు. కాగా ఈ సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే సిరీస్ వారి వశమవుతుంది.
చదవండి: CK Nayudu Trophy: ఊచకోత.. ఒకే ఇన్నింగ్స్‌లో 426 పరుగులు! 46 ఫోర్లు, 8 సిక్స్‌లతో
Congratulations to pakistan winning series against australia.
All World class field. Most hyped team Australia in the world 😁 #PAKvsAUSpic.twitter.com/AiwacybfvT— JassPreet (@JassPreet96) November 10, 2024
Comments
Please login to add a commentAdd a comment