
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్ పరాజయం మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే రెండో వన్డేలో ఎలాగైనా విజయం సాధించి 1-1తో సిరీస్‌ను సమం చేయాలని పాక్ బలంగా అనుకుంటుంది. ఆ కసిని పాకిస్తాన్ బౌలర్ షాహిన్ అఫ్రిది తన బౌలింగ్‌లో చూపించాడు. తొలి ఓవర్ రెండో బంతికే ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. బులెట్ వేగంతో దూసుకొచ్చిన బంతి పించ్ కాళ్లను తాకుతూ వెళ్లింది.
దీంతో షాహిన్ అప్పీల్‌కు వెళ్లగా.. అంపైర్ వెంటనే ఔట్ ఇచ్చేశాడు. కనీసం ఫించ్‌కు రివ్యూకు వెళ్లే అవకాశం కూడా లేదంటే బంతి ఎంత కచ్చితంగా పడిందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదే షాహిన్ అఫ్రిది తొలి వన్డేకు దూరమయ్యాడు. ఎలాగైనా తన జట్టును గెలిపించాలన్న కసితో బౌలింగ్ వేసిన అఫ్రిది ఫలితం అందుకున్నాడు. పనిలో పనిగా ఫించ్‌పై తన రికార్డును నిలబెట్టుకున్నాడు. అదేంటంటే గతేడాది టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇదే ఫించ్‌ను షాహిన్ గోల్డెన్‌డక్‌గా పెవిలియన్ చేర్చాడు. తాజాగా ఫించ్‌ను షాహిన్ మరోసారి గోల్డెన్‌డక్ చేశాడు.దీనికి సంబంధించిన వీడియోను పీసీబీ ట్విటర్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
అయితే ఫించ్ వికెట్ కోల్పోయిన ఆసీసీ మళ్లీ పాకిస్తాన్‌కు ఆ అవకాశం ఇవ్వలేదు. పాక్ బౌలర్లను ఉతికారేస్తూ తొలి వన్డే తరహాలో మరోసారి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఈ దశలో మరో సెంచరీకి దగ్గరైన తరుణంలో ట్రెవిస్ హెడ్ 89 పరుగుల వద్ద జహీద్ మహమూద్ బౌలింగ్‌లో అఫ్రిదికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 31 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. బెన్ మెక్‌డెర్మొట్ 93, మార్నస్ లబుషేన్ 31 పరుగులతో ఆడుతున్నారు.
చదవండి: IPL 2022: అరె ఇషాంత్ భయ్యా.. ఇదేం కర్మ!
IPL 2022: ప్చ్.. వేలంలో పాల్గొనలేకపోయా.. మ్యాచ్‌లు చూస్తుంటే చిరాగ్గా ఉంది
Shaheen hit's the bullseye 🎯#BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/NcwtN06Ht2
— Pakistan Cricket (@TheRealPCB) March 31, 2022