
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లో మహిళ స్నానం చేస్తుండగా కేబుల్ టెక్నిషియన్ వీడియో తీసి అడ్డంగా దొరికిన ఘటనను మరవకుండానే నగరంలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌లోని మాగంటి కాలనీలో నివసించే ఓ మహిళ(35) బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా ఇంటి యజమాని కొడుకు దిలీప్ సెల్‌ఫోన్‌లో వీడియోలు తీస్తున్నట్లు గమనించింది. వెంటనే ఆమె తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది.
చదవండి: (నర్సుని బంధించి అత్యాచారం.. అదే రోజు బస్సెక్కించి..)
ఇదే విషయాన్ని ఇంటి యజమాని దృష్టికి కూడా తీసుకెళ్లగా తమ కొడుకు అలాంటి వాడు కాదంటూ వారు వెనకేసుకొచ్చారు. దీంతో బాధితురాలు భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు దిలీప్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే గత మూడు నెలల నుంచి మహిళ బాత్‌రూమ్‌లో స్నానం చేస్తున్న దృశ్యాలు వీడియో తీస్తున్నట్లుగా నిందితుడు దర్యాప్తులో వెల్లడించాడు.
చదవండి: (Banjarahills: మహిళ స్నానం చేస్తుండగా వీడియో.. కేబుల్ టెక్నిషియన్ నిర్వాకం)
Comments
Please login to add a commentAdd a comment