house owner son
-
మహిళ స్నానం చేస్తుండగా వీడియో.. 3 నెలలుగా అదే పనిలో ఓనర్ కొడుకు..
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లో మహిళ స్నానం చేస్తుండగా కేబుల్ టెక్నిషియన్ వీడియో తీసి అడ్డంగా దొరికిన ఘటనను మరవకుండానే నగరంలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌లోని మాగంటి కాలనీలో నివసించే ఓ మహిళ(35) బాత్రూమ్లో స్నానం చేస్తుండగా ఇంటి యజమాని కొడుకు దిలీప్ సెల్ఫోన్లో వీడియోలు తీస్తున్నట్లు గమనించింది. వెంటనే ఆమె తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. చదవండి: (నర్సుని బంధించి అత్యాచారం.. అదే రోజు బస్సెక్కించి..) ఇదే విషయాన్ని ఇంటి యజమాని దృష్టికి కూడా తీసుకెళ్లగా తమ కొడుకు అలాంటి వాడు కాదంటూ వారు వెనకేసుకొచ్చారు. దీంతో బాధితురాలు భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు దిలీప్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే గత మూడు నెలల నుంచి మహిళ బాత్రూమ్లో స్నానం చేస్తున్న దృశ్యాలు వీడియో తీస్తున్నట్లుగా నిందితుడు దర్యాప్తులో వెల్లడించాడు. చదవండి: (Banjarahills: మహిళ స్నానం చేస్తుండగా వీడియో.. కేబుల్ టెక్నిషియన్ నిర్వాకం) -
ఇంటి యజమాని కుమారుడి లైంగిక వేధింపులు
-
ఇంటి యజమాని కుమారుడి లైంగిక వేధింపులు
హైదరాబాద్: మల్లేపల్లి విజయనగర్ కాలనీలో దారుణం జరిగింది. ఇంటిలో పనులు చేసుకునే మైనర్ బాలికలపై ఇంటి యజమాని కుమారుడు రిజ్వాన్ లైంగిక వేధింపులకు దిగిన ఘటన స్ధానికంగా కలకలం రేపింది. బాధితులు హుమాయున్‌నగర్ ఏసీపీని ఆశ్రయించడంతో ఇంటి యజమాని కుమారుడి దురాగతాలు వెలుగులోకి వచ్చాయి. అతడు ముగ్గురు బాలికలను వేధిస్తున్నాడని... ఇంకా ఇంటి యజమాని చెరలో మరో ఇద్డరు బాధితులు ఉన్నట్లు బాధితులు తెలిపారు. రిజ్వాన్ తల్లిదండ్రులు కూడా కుమారుడికే వత్తాసు పలుకుతున్నారని బాధితులు చెప్పారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేస్తున్నామని ఏసీపీ గౌస్ మొయినుద్దీన్ తెలిపారు. ఇంటి యజమాని అదుపులో ఉన్న బాధితులను వారి చెరనుంచి విడిపించి అతనిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఇంటి యజమాని కుమారుడి లైంగిక దాడి
విజయవాడ(పడమట): నగరంలోని రామవరప్పాడులో ఓ యువతి(24) ఇంటి యజమాని కుమారుడి చేతిలో అత్యాచారానికి గురైంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ఇంట్లో అద్దెకు ఉంటున్న ఓ యుతిపై ఏడాదికాలంగా ఇంటి ఓనర్ కుమారుడు రాఘవేంద్ర అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అత్యాచారాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించాడు. వాటిని తన స్నేహితులకు పంపించాడు. దీంతో వారు ఆ వీడియోను బాధితురాలికి చూపించి డబ్బులు ఇవ్వాలని బెదిరించే ప్రయత్నం చేశాడు. దీనిని ప్రతిఘటించేందుకు ఆమె ప్రయత్నం చేయడంతో ఆమె ఇంటిపై దాడి చేసి గాయపరిచారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు పరారీలో ఉన్నారు.