ఇంటి యజమాని కుమారుడి లైంగిక వేధింపులు | house owner son harassment in hyderabad | Sakshi
Sakshi News home page

ఇంటి యజమాని కుమారుడి లైంగిక వేధింపులు

Published Thu, Oct 29 2015 11:51 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

house owner son harassment in hyderabad

హైదరాబాద్: మల్లేపల్లి విజయనగర్ కాలనీలో దారుణం జరిగింది. ఇంటిలో పనులు చేసుకునే మైనర్ బాలికలపై ఇంటి యజమాని కుమారుడు రిజ్వాన్ లైంగిక వేధింపులకు దిగిన ఘటన స్ధానికంగా కలకలం రేపింది.

బాధితులు హుమాయున్నగర్ ఏసీపీని ఆశ్రయించడంతో ఇంటి యజమాని కుమారుడి దురాగతాలు వెలుగులోకి వచ్చాయి. అతడు ముగ్గురు బాలికలను వేధిస్తున్నాడని... ఇంకా ఇంటి యజమాని చెరలో మరో ఇద్డరు బాధితులు ఉన్నట్లు బాధితులు తెలిపారు. రిజ్వాన్ తల్లిదండ్రులు కూడా కుమారుడికే వత్తాసు పలుకుతున్నారని బాధితులు చెప్పారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేస్తున్నామని ఏసీపీ గౌస్ మొయినుద్దీన్ తెలిపారు. ఇంటి యజమాని అదుపులో ఉన్న బాధితులను వారి చెరనుంచి విడిపించి అతనిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement