మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఘటన హయత్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ : మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఘటన హయత్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లో వెళ్తే.. కవాడిపల్లికి చెందిన ఓ మహిళ పట్ల నర్సింహ అనే వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు.
మహిళ పొలంలో పనులు చేస్తుండగా అక్కడకు వచ్చిన నర్సింహ ఆమె చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సదరు మహిళ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.